Bhagavat Gita
7.5
అపరేయ మిత స్త్వన్యా౦ ప్రకృతిం విద్ధి మే పరాం
{7.5}
జీవ భూతా౦ మహాబాహో య యేద౦ ధార్యతే జగత్
అర్జునా! ఇది అపరా ప్రకృతి. దీనికంటె ఉత్తమమైన నా పరా ప్రకృతి కలదు. ఇది ప్రాణులకు జీవరూపమైనది. దీని చేతనే జగత్తు ధరింపబడి యున్నది
ఆది శంకరులు మనము ఆశాశ్వతమైన, మార్పు చెందుతున్న వస్తువులపై మనను గుర్తించుకుంటామని చెప్పిరి. దానిని అధ్యారోపమని అంటారు. అనగా మన పరిమితమైన, ఆశాశ్వతమైన అహంకారమే ఆత్మ లాగ ఎల్లప్పుడూ ఉండేదని తలుస్తాము. "నేను క్రికెట్ ఆడుతాను", లేదా "నేను 6 అడుగుల ఎత్తు" అని అన్నప్పుడు మనము ప్రకృతిని --దేహం మరియు మనస్సు -- చూస్తూ పురుషుడిన చూస్తున్నామనుకొంటాం. ఇటువంటి తికమక ఉన్నంత కాలం జీవితాన్ని నిజంగా దర్శించలేము. ప్రతీదీ మన అహంకారం తో దర్శిస్తాము.
ఈ తికమక మనకే పరిమితం కాదు. అది ఇతరుల మీద కూడా వర్తింపజేస్తాం. మనకు అవసరాలు, అంచనాలు ఉండి వాటిని ఇతరులపై అధ్యారోపము చేస్తాము. ఇది ఎలాగంటే మన అవసరాల, అంచనాల బట్టి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు గల అచ్చులు (mold) చేసి, వాటిని మోసుకు తిరుగుతున్నాం. వాటిని మన తలిదండ్రుల, బంధువుల, మిత్రుల మీద పెడుతున్నాం. మనం పెట్టిన అచ్చుల వలె వాళ్ళ నడవడిక మార్చుకోవాలని చెప్తున్నా౦. హిందువుల పెళ్ళిళ్ళలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారి పూల మాలలను మార్చుకొంటారు. కానీ విదేశాల్లో పూల మాలలకు బదులు అచ్చులతో అధ్యారోపము చేస్తారు. పెళ్లికుమారుడు తనకు కావలసిన అచ్చును పెళ్లికుమారి తల మీద కప్పుతాడు. అలాగే పెళ్లికుమారి తనకు కావలసిన అచ్చును పెళ్లి కుమారుని తలమీద పెడుతుంది. మన దగ్గర అటువంటి అచ్చులు ఎన్నో ఉండి, మనకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద మనకు కావలసిన అచ్చును తల మీద పెడతాం. మన మిత్రుడు తనకు కావలసిన విధంగా చేస్తే, మనము ఆగ్రహము చెందుతాం. ఎందుకంటే అతడు మనం పెట్టిన అచ్చును పాటించటంలేదు. ఆ తరువాత మన మైత్రి చెడిపోయిందని విచారిస్తాం. శంకరులు చెప్పేది అది మన మిత్రుని తప్పు కాదు. అతనిపై మనము చేసిన అధ్యారోపము.
మన బంధాలు సక్రమంగా ఉండాలంటే అధ్యారోపము మాని, మన అచ్చులను కట్టిపెట్టాలి. దానికి ఒకటే మార్గము: మనమీద వేసికొన్న అచ్చును తీసెయ్యాలి. అది ఇతరుల అచ్చులను తీసివేసినంత సులభం కాదు. ఎందుకంటే మన అచ్చులు మనకి బాగా అబ్బేయనే నమ్మకం. మనం మన స్వస్వరూపాన్ని చూసుకొని, ప్రపంచానికి ఎడంగా కాకుండా, విశ్వంలో మనమొక భాగమని తెలిసికొ౦టే, మనం వేసికొన్న అచ్చుకు బీటలు కలుగుతాయి. దీనికి అనేక సంవత్సరాలు పట్టవచ్చు. దీనిని మన దైనిందన జీవితంలో పాటిస్తే, మన అచ్చు ముక్కలై క్రింద పడుతుంది. అప్పుడు మన, మిగతా వాళ్ళ అసలు స్వరూపం చూస్తాం. అదే పరిశుద్ధమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన ఆత్మ లేదా పురుషుడు.