Bhagavat Gita
7.7
రసో అహమప్సు కౌన్తేయ ప్రభా అస్మి శశిసూర్యయోః
{7.8}
ప్రణవ స్సర్వదేవేషు శబ్దః ఖే పౌరుషం నృషు
కౌన్తేయా! నీటియందలి సారమును నేనే. చంద్ర సూర్యుల యందు ప్రకాశమును నేనే. నేనే వేదముల యందు ఓంకారమును. ఆకాశము నందు శబ్దమును, మనుష్యుల యందు పరాక్రమమును నేనే ఀ
చిన్నప్పుడు ఎండా కాలంలో బయట ఆడితే, అమితంగా దాహం వేసేది. మా ఇంటి దగ్గర పెద్ద కుండల్లో దారిన పోతున్నవారికై నీళ్ళు పెట్టే వారు. నేను దాహంతో ఆ నీరునే తాగేవాడిని. అప్పుడు తెలిసింది నీరు యొక్క మహిమ.
బుద్ధుడు అహంకారం యొక్క తీవ్రమైన కోరికలను తన్హ -- అనగా మిక్కిలి దాహము కలిగించేవి--అనెను. మన కోర్కెల అనేకం. మనము దేహమునకే పరిమితమని తలచి ఆశాశ్వతమైన వస్తువుల యందు అభిమానమును పెంచుకొన్న మన దాహము ఇంకా ఎక్కువ అవుతుంది.
కఠ ఉపనిషత్తు లో ఇలా చెప్పబడింది:
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తమంతట తాము ప్రకాశించుటలేదు
అలాగే మెరుపులు, భూమి మీద అగ్ని
పరమాత్మ యొక్క తేజం వాటిచే ప్రతిబింబి౦చబడినది
పరమాత్మ ప్రకాశిస్తే, సృష్టి అంతా ప్రకాశంతో నిండినది
చంద్రుడు ఎలాగైతే సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తాడో, సూర్యుడు పరమాత్మ కాంతిని ప్రతిబింబిస్తాడు. భౌతిక శాస్త్రవేత్తలు సృష్టి లోని ప్రతి పదార్థమునకు మూలము కాంతి అని చెప్తారు. కాంతి నుంచే పదార్థములు ఆవిర్భవించి, తిరిగి కాంతిలోనే కలిసిపోతాయి.
కాంతిలాగే, పరమాత్మ శబ్దాలకు కూడా మూలం. హిందువులు ఓంకార౦ పవిత్రమైనదని భావిస్తారు. అది భౌతికమైనది కాదు. కానీ ఎన్నో ఏళ్లు ధ్యానం చేస్తే బయట శబ్దాలు వినబడక ఓంకారం చేతన మనస్సులో వినబడుతుంది.
హిందువులకు లాగే తక్కిన మతాలకు కూడా మూల మంత్రాలు ఉన్నాయి. క్రిస్టియన్ లకు జీసస్ మూల మంత్రము. యూదులకు బరూఖ్ అత్తాహ్ అదోనై, మరియు షేమా: "ఇశ్రాఎల్ విను; మీ దేవుడు మాదేవుడు ఒక్కటే". ముస్లింలు అల్లాను స్మరిస్తారు. బిస్మిల్లాహ్ "దయామయుడైన, కరుణామయుడైన దేవుని పేరు మీద" అనికూడా స్మరిస్తారు. భౌద్ధులు వాడే మంత్రం: ఓం మణి పద్మే హమ్ అనగా హృదయంలోని పద్మంగా ఉన్న మణుల హారం. హిందువులు సాధారణంగా రామ జపం చేస్తారు. మంత్రాలు వినడానికి సామాన్యంగా ఉన్నా, కొన్నేళ్ళ జపం తరువాత వాటివలన అమితమైన శక్తి కలుగుతుంది. మంత్రం క్రోధాన్ని సానుభూతిగా, అసహనాన్ని ఓర్పుగా, శతృత్వాన్ని ప్రేమగా మార్చ గలదు.
కొన్నేళ్ళు మంత్ర జపం చేస్తే అది మన చేతన మనస్సులో స్థిరస్థాపితం అవుతుంది. దీన్ని అజపజపం -- జపం కాని జపం--అందురు. దాన్ని పాటించే వ్యక్తి ఎక్కడకు వెళ్ళినా భగవంతుడు వెంట ఉంటాడు. శ్రీ రామకృష్ణ ఒక ఫించను మీద బ్రతికే వ్యక్తితో పోలుస్తారు. జీవితాంతం కష్టపడి పనిచేసి, చివరకు పదవీ విరమణ చేసి, ఫించన్ తో ఎలా బ్రతుకుతారో అలాగే మంత్రం జపం చేయడానికి అనేక ప్రయత్నములు చేసి చివరకు అది మన శ్వాస లాగ, గుండె కొట్టుకోవడం లాగా అప్రయత్నంగా జరుగుతుంది.