Bhagavat Gita
7.8
పుణ్యో గంధః పృథివ్యా౦చ తేజశ్చాస్మి విభావసా
{7.9}
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు
భూమి యందలి పవిత్రమైన సువాసనయు, అగ్ని యందలి తేజమును, సర్వ భూతముల యందలి జీవనమును, తపోధనుల యందలి తపస్సును నేనే
వేసవిలో ఋతుపవనాలకై ఎదురు చూస్తాము. అవి లేకున్న లేదా భూమి మీద కాక సముద్రం మీద వర్షం పడినా పంటలు పండవు, మన దాహం తీరదు. తొలకరి వాన పడినప్పుడు భూమి నుండి సువాసన వస్తుంది. శాస్త్రజ్ఞులు అది ఓజోన్ వలననంటారు. శ్రీకృష్ణుడు అట్టి సుగంధము నేనే అంటున్నాడు.
బ్రజిల్ లోని అడవులను నరికేస్తే వాళ్ళకే కాక మనకు కూడా చేటు. ఆ అడవులలోని చెట్లు పర్యావరణం లోని హానికరమైన బొగ్గుపులుసు వాయువుని పీల్చి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకుండా చేస్తాయి.
మనకి జ్ఞానముంటే సరిపోదు, దానిని దైనిందన కార్యాలలో వాడాలి. మనము పర్యావరణ విషయంలో భూమికి రక్షక భటులుగా ఉండాలి. మన ఇంట్లో చెత్త ఉండనీయం. ఇంట్లో ఏదైనా వస్తువు పాడయితే దాన్ని సరి చేస్తాం. కానీ నోరులేని జంతువులు తమ ఇంటిని మన లాగ కాపాడుకోలేవు. మనం వాటికి సహాయపడటానికి వాటికి ఇల్లువంటి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచాలి.
శ్రీకృష్ణుడు చెప్పేది జీవులు పవిత్రమైనవి. అందుకే మనం వాటిని చంపరాదు. ఇది వాని యందలి గౌరవమునకు చిహ్నము. ఇంకా పరమాత్మ వారిలోనూ ఉన్నాడు.
పై శ్లోకాలలో తపస్సు, తేజస్సు గూర్చి కూడా చెప్పబడినది. అవి బహిర్గతములనే కాదు, అంతర్గతములు కూడా.
మనలో కుండలిని శక్తి ఉందని యోగులు నమ్ముతారు. కుండలిని పరిణామానికి సంబంధించిన గొప్ప శక్తి. మనలో అపరిమితమైన కుండలిని శక్తి ఉన్నది. చాలామందికి అది తెలీదు. ధ్యానం వలన పరోకారమునకై, ఉన్నత లక్ష్యానికై, కర్మలు చేస్తే కుండలిని శక్తి క్రమంగా వెలుపలకు వస్తుంది. దాని వలన మనం ఆహ్లాదంగా ఉంటాము. ఓర్పు పెరుగుతుంది. మనను వారాల తరబడి వెంటాడే చేతన మనస్సులోని దురాలోచనలు బాధించవు. మన చుట్టు ప్రక్కల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కనుగొంటాము. ఒక పాత ఆలోచన మనను తప్పు ద్రోవ పట్టించడానికి వస్తే దానిని నియంత్రించగలము. యోగులు చెప్పేది ధ్యానంతో కుండలిని శక్తి విడుదలై, మన పరిణామాన్ని మనమే నిర్ణయించుకొ౦టాము.
ఒక శక్తివంతమైన కోరికను అణచుకోవడం కష్టమే. ఎలాగంటే మన చెయ్యి విరిగి దానికి కట్టు కడితే, ఆ చేతిని ఉపయోగించడం ఎంతో కష్టతరమైన పని. కట్టు విప్పినా, చెయ్యి నయమైనా, దానిని తిరిగి వాడడానికి శ్రమపడాలి. దానిలో నొప్పి ఉంది. అటువంటిదే తపస్సు. మనము ఆధ్యాత్మిక సాధనకై ఒక స్వార్థపూరిత ఆలోచనకు ఎదురు తిరిగేమంటే పరమాత్మ "నేను నీ ప్రయత్నం; నేను నీ బాధ; నేను నీతోనే ఉంటాను" అని అంటాడు.