Bhagavat Gita
8.11
పర స్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తో అవ్యక్తా త్సనాతనః
{8.20}
యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి
ఏ పరబ్రహ్మము అవ్యక్తము కంటెను వేరైనదియు, శ్రేష్ఠమైనదియు, తెలియరానిదియు, శాశ్వతమైనదియు, నగునో అట్టిది సర్వ ప్రాణులు నశించినను నశింప నేరదు
కల్పాంతరమున విశ్వం అంతరిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు "నేను నిత్యము ఉండేవాడిని" అని చెప్తున్నాడు. అంటే మనమూ అమరులమే. మన సూర్య నక్షత్రము అంతరించినప్పుడు, మన పాల పుంత కృష్ణ బిలంలో అంతర్ధాన మైనప్పుడు "నేను ఉంటాను. అట్లే నీవు కూడా ఉంటావు" అని శ్రీకృష్ణుడు అభయం ఇస్తున్నాడు. కఠ ఉపనిషత్తులో ఈ అంశ౦ ఇలా వివరింపబడినది:
పరమాత్మ నామరూపాలకు అతీతం
ఇంద్రియాలు గ్రహింపజాలవు, ఎప్పటికీ తరగనిది
ఆద్యంతాలు లేనిది
దేశకాల మానాలకు, కార్య-కారణమునకు అతీతము
మార్పు చెందనిది
ఇట్లు పరమాత్మను ఎవరు భావిస్తారో
వారు మరణ౦నుండి విడుదలవుతారు
భగవంతుడు ఇచ్చే మోక్షము అన్ని సంపదలకన్నా, పేరుప్రతిష్ఠల కన్నా, ఎటువంటి సుఖాలకన్నా ఉత్కృష్టమైనది, వెలకట్టలేనిది.
మనకు జ్ఞానం కలగాలంటే ధరను అడగ కూడదు. దేవుడు మననుండి దేన్ని వేరుచేసినా తిరగబడక, విశ్వాసం వీడక ఉండాలి. జ్ఞానము ఎవరైతే ఎక్కువ త్యాగం చేస్తారో, దేవునితో మంతనాలాడకుండా ఉంటారో వారికే ఇది సాధ్యం. మనం ఎప్పుడైతే నోరును కట్టుకోలేక కనబడినిది తింటామో, ధ్యానానకి ప్రొద్దునే లేవలేమో అప్పుడు మనము బేరసారము చేస్తున్నామని అర్థం. మనం అహంకారంతో, దేవునితో బేరం పెట్టుకున్నామో, మన మెప్పటికీ గెలవలేం.