Bhagavat Gita
8.13
పురుష స్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా
{8.22}
యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం
పార్థా ! ఈ చరాచర భూతము లన్నియు ఎవని యందున్నవో, ఈ సమస్త ప్రపంచము ఎవని చేత పరివ్యాప్తమై యున్నదో, అట్టి పరమాత్మ అనన్య భక్తి వలననే లభ్యము కాగలడు ఀ
పరమాత్మ ఆలోచనలకు అందడు. అతన్ని పట్టుకోవాలంటే అది ప్రేమతోనే సాధ్యము. అట్లే ఎంత తర్కం ఉపయోగించినా పరమాత్మని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే అతడు అఖండమైనవాడు, ద్వంద్వాలకు అతీతుడు. అతన్ని ప్రేమించే వారు ఇప్పుడే ఇక్కడే మరణాన్ని జయించగలరు. కానీ ఆ ప్రేమ సంపూర్ణంగా ఉండాలి. సెయింట్ జాన్ ఆఫ్ ది క్రాస్ "మనము ఆలోచనలలో బ్రతకం. ప్రేమలో బ్రతుకుతాము" అని చెప్పెను.
పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు కాబట్టి ఆయనను ప్రేమించడమంటే మన బంధు మిత్రులను, ఇతరులను ప్రేమించడం. కానీ ఎలా? సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ సేల్స్ 16 వ శతాబ్దివాడు. ఆయన శిష్యుడు పరిపూర్ణత ఎలా పొందాలి అని గురువుని అడిగేడు. "దేవుని హృదయపూర్వకంగా ప్రేమించు; నీ పొరుగువాడ్ని అంతకన్నా ఎక్కువ ప్రేమించు" అని గురువు చెప్పెను.
శిష్యుడు కొంత నిరాశ చెంది తిరిగి ఇలా ప్రశ్నించేడు: "నేను పరిపూర్ణత అంటే ఏమిటని ఆడగటంలేదు. దానిని ఎలా పొందాలి అని అడుగుతున్నాను?" సెయింట్ ఫ్రాన్సిస్ ఇంతక ముందు ఇచ్చిన సమాధానమే ఇచ్చాడు.
కానీ అ శిష్యుడు పట్టువదలక మరల మరల ప్రశ్నించగా గురువు ఈ విధంగా చెప్పెను: "చాలా మంది ఈ ప్రశ్నను అడిగేరు. దాని రహస్యం దేవునియందు పూర్తి ప్రేమ కలిగి యుండడం. అది ఎలా సాధ్యమంటే ఇతరులను ప్రేమించడం వలన. నువ్వెలా చదవడం చదువు వలన, పరిగెత్తడం పరిగెత్తడం వలన, నేర్చుకొన్నావో అలాగ ఇతరులను ప్రేమిస్తూ ఉంటే, ఆ భగవంతుడిని ప్రేమించగలవు".
ప్రేమ తెచ్చుకోవడానికి సాధన అవసరం. మన స్వంత విషయాన్ని త్యజించి, ఇతరులకై మన సమయం వెచ్చిస్తే, మనం ప్రేమించడానికి సామర్థ్యం వస్తుంది. సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా "ప్రేమ ప్రేమను వెలికి తీస్తుంది" అని చెప్పెను. మన౦ ఇతరులను మన కన్నా ముందు పెట్టుకొంటే, మన ప్రేమ వారియందే కాక, భగవంతుని దృష్టిలో అందరూ సమాన మైనప్పటికీ, భగవంతుని యందు కూడా పెరుగుతుంది.