Bhagavat Gita
8.16
వైతే సృతీ పార్థ జానాన్ యోగీ ముహ్యతి కశ్చన
{8.27}
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున
ఈ రెండు మార్గములను తెలిసిన యోగి ఎవడును మోహము నొందడు. కావున సర్వకాలముల యందును నీవు యోగివి కమ్ము
మన౦ వేరుగా నుండి, చీకటి మార్గంలో పయని౦చడం ఒక లీల. ఈ ప్రపంచమంతా లీల. భగవంతుడు అనేక రూపులు దాల్చి అనేక పాత్రలను పోషిస్తున్నాడు.
మనం ఒక వేషం వేసుకున్నామని మరచిపోయేం. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నటిస్తూ మనమెవరమో మరచిపోయేం. క్రమంగా మనం నటిస్తున్న పాత్రలో లీనమైపోయేం. ఈ భ్రమ మాయ వలన కలిగెను. మన అహంకారాన్ని వీడితే మనమంతా ప్రపంచమనే వేదిక మీద నటిస్తూ, అనేక పాత్రలు పోషిస్తూ ఉన్నామనే జ్ఞానం కలుగుతుంది.
భార్యా భర్తల మధ్య చికాకులు రావచ్చు. భోజనం మధ్యలో ఒక అమాయక ప్రశ్న కలగవచ్చు. మనకది నచ్చక భాగస్వామితో వాదిస్తాము. మనం భాగస్వామి ఏమందో, ఏ భావనతో అ౦దో, అర్థంచేసికోక, మన దృష్టి కోణంలో ఏమని అ౦దో అని ఆలోచిస్తాము. అందుకే బుద్ధుడు చెప్పెను: అవతలి మనిషి సమస్య కాదు. చిక్క౦తా మన మనస్సులోనే ఉంది. మన మనస్సు నిర్మలంగా ఉంటే మన పాత్రలు సక్రమంగా పోషించగలము.
ఒకమారు నేను లీలను అర్థంచేసికొన్నాక, నా తరగతి గదికి ఒక రంగస్థలము మీదకి వెళ్ళినట్టు వెళ్ళేవాడను. నేను తగిన దుస్తులు ధరించి, ఒక మేధావిలా తయారయ్యి, "నువ్వు ఆంగ్ల ప్రొఫెసర్ ఏకనాథ్ ఈశ్వరన్" అని అనుకుని, పాఠం మొదలుపెట్టేవాడిని. అలాగే పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు దానికి అలాంటి వేషం వేసేవాడిని. కానీ ఇంటికెళ్ళేటప్పుడు అన్ని పనికి సంబంధించిన వేషాలూ తీసి సర్కస్ లో పాత్ర ధారిలా ఇంటి వేషంలోకి మారిపోతాను. ఇలా చేయడం బాగా వంట పడితే, దాని వలన చాలా సంతృప్తి కలిగి, జీవితం ఒక కళ అనే అవగాహన కలుగుతుంది.