Bhagavat Gita
8.4
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా
{8.8}
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్
పార్థా! అభ్యాసయోగము నవలంబించి, అన్య విషయముల మీదికి వెళ్ళక యుండు మనస్సు చేత శ్రేష్ఠుడైన పురుషుని స్మరించు మనుజుడు అతనినే పొందుచున్నాడు
ఒక కోతి కల్లుతాగి, తేలుచే కుట్టబడి, దయ్యముచే ఆవహింపబడితే ఎలా ఉంటుందో మనస్సు అలాగ ఉంటుందని మన పూర్వీకులు చెప్పిరి. అనగా మనస్సును నియంత్రించుట అతి కష్టం. కానీ మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే అది చేయుట తప్పనిసరి.
నేను, నా భార్య భారత దేశం వెళ్ళినప్పుడు ఒక కోతి ప్రదర్శన చూసేం. ఒక కోతిని ఆడించేవాడు ఆ కోతిచే ఒక పిల్లవాడు బడికి కాళ్లీడ్చుకొ౦టూ వెళ్ళడం, బడినుంచి ఎగిరి గంతేసి తిరిగి రావడం చేయించేడు. ఆ కోతికి శిక్షణ ఒక రోజులో చేయబడినదికాదు. దాని యజమాని కొన్ని వారాలు కృషి చేసి దానికి నేర్పేడు. అలాగే మన మనస్సును నిశ్చలం చేయడానికి ఒక వారం, ఒక సంవత్సరం కూడా , సరిపోదు. నిజానికి ఒక జీవిత కాలం పట్టినా మన సమయం, ఏకాగ్రత వృధా కానట్టే.
మనము దక్షత అనేక విధములుగా ప్రదర్శిస్తాము. ఒక బాలుడు ఒంటి చక్రము సైకిల్ లో మా ఇంటి దగ్గరకు రోజూ దినపత్రికను తీసికివస్తాడు. కొందరు తమ వస్త్రాల పై (జీన్స్) పువ్వులను కుట్టుకొంటారు. వీటన్నిటికీ చాలా సమయం, ఏకాగ్రత కావాలి. నేను తమ దక్షతను పెంపొందించుకొని -- అది చిత్రలేఖనమైనా, మోటార్ సైకిల్ తో విన్యాసాలాయినా -- దానితోనే సంతృప్తి పడక ధ్యాన మార్గంలోకి వస్తే బాగుంటుందని తలుస్తాను.
ఒకనికి ఏకాగ్రత ఉందని చెప్పడానికి వాడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వేరే ధ్యాస ఉండకపోవడం నిదర్శనం. ఇది ఒక కళ కాబట్టి మనం ధ్యానానికి, లేదా సంబంధాలు గట్టి పరుచుకోడానికి పనికి వస్తుంది. సామ్యూయల్ టేలర్ కోల్ రిడ్జ్ అనబడే ఆంగ్ల కవి వాగ్ధాటి కలవాడు. అతడు ఒక రోజు తన మిత్రుడు చార్లెస్ లాంబ్ ఎక్కడికో వెళ్తుండగా ఆపి తన కవిత్వాన్ని వినమని కోరేడు. చార్లెస్ లాంబ్ తనకు పని ఉన్నదని చెప్పినా వినక, కోల్ రిడ్జ్ అతని కోటు బొత్తాయిని పట్టుకొని అనర్గళంగా కవిత్వాన్ని చదవడం మొదలు పెట్టేడు. అలాగ కొన్ని గంటలు గడిచేయి. చార్లెస్ లాంబ్ అదే దారిన తిరిగివచ్చి చూస్తే కోల్ రిడ్జ్ తన కోటు బొత్తాయిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నాడు. జరిగిందేమిటంటే చార్లెస్ లాంబ్ కోటు బత్తాయిని కత్తెరతో తెంపేసి తన దారిని వెళ్ళేడు. కోల్ రిడ్జ్ కి తనకున్న ఏకాగ్రతవలన అది గ్రహించలేదు. ఇది అతిశయోక్తి అయినప్పటికీ ఒక మేధావి తనకు కావలసిన ఏకాగ్రతకై కోల్ రిడ్జ్ లాగా మందులు వాడే బదులు ధ్యానం అవలంబిస్తే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతాడు.