Bhagavat Gita
8.7
సర్వద్వారాణి సంయమ్య మనో హృది విరుధ్య చ
{8.12}
మూర్ద్న్యాధాయాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరన్
{8.13}
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్
ఎవడు సకల ఇంద్రియ వ్యాపారములను నియమించి, మనస్సును హృదయము నందు నిలిపి, ప్రాణమును సహస్రారమునందు జేర్చి యోగయుక్తుడగుచు, బ్రహ్మవాచకమగు ఓంకారము నుచ్ఛరించుచు, నన్నే స్మరించుచు దేహమును విడిచి పోవుచున్నాడో వాడు సర్వోత్కృష్టమైన మోక్షమును పొందుచున్నాడు
ప్రతి ఒక్కరికీ మరణం గురించి తెలుసు. కానీ అందరికీ దాని మీద అవగాహన ఉండదు. చివరకు తీవ్ర అస్వస్థలో ఉన్నవారు కూడా. మన౦ మరణిస్తామని నిజంగా తెలిసుంటే దాని గురించ ఏదో ఒకటి చేస్తాము. అందుకే గీత ఉన్నది.
కొందరు రచయితలు ఇంద్రియాలను సంతృప్తి పరిచి దేహాన్ని వదలమని చెప్తారు. అనగా ఇంద్రియాలు అనుభవం లో ఉండగా దేహాన్ని వదలమని. గీత వేరొక విధం చెపుతుంది. మంచి విందుభోజనం చేసి, ఇంద్రియాలను ఆనందింపజేసి, మరణించడం పెద్ద విషయమేమీ కాదు. మన లక్ష్యం మరణానికి ముందు, మరణానికి తరువాత చేతనము అఖండితమై ఉండాలి. అందుకే మనం దశాబ్దాల తరబడి సాధన చేసేది.
ఉపనిషత్తులు ఈ విధంగా మరణాన్ని వివరించేయి: మొదట ఇంద్రియ శక్తి మనస్సులో లయమవుతుంది; తరువాత మనస్సు, ప్రాణ శక్తితో పాటు హృదయంలో లయమవుతుంది. అవి అన్నీ లోతైన చేతనములోకి ప్రవేశిస్తాయి. చివరికి ఆత్మ, మనస్సు యొక్క సంస్కారాలతో, గుండె నాడులలోంచి నిష్క్రమిస్తుంది. కొందరు యోగులలో ఆత్మ తల మీద ఉన్న సహస్రార చక్రం ద్వారా నిష్క్రమిస్తుంది.
మరణ సమయంలో ఇంద్రియాలు పనిచేయవు. మనకు ఆత్మ యొక్క ఎరుక ఉండాలంటే, మన ఏకాగ్రతను ఏదీ పాడు చేయకూడదు. వినడం, చూడడం చేయకుండా, అట్టి కోర్కెలు లేకుండా ఉండాలి. ప్రతీదీ ఆత్మ మీద ఏకాగ్రతతో ఉండాలి. మనలో చాలా మంది మరణము ఆసన్నమైనప్పుడు ఇంద్రియ లోలత్వం కోరి, మనస్సులో తీవ్ర అసంతృప్తికి గురి అవతారు. అప్పుడు మరణముపై తీవ్ర వేదన చెందుతారు. వారి అనుబంధాలు, అహంకారం మనస్సులో పాతుకు పోయి, వారిని విడనాడవు. అప్పుడు యమ ధర్మ రాజు వారిని బలవంతంగా ఈడ్చుకు పోవాలి. అది ఒక కదులుతున్న వాహనం యొక్క అద్దం లోంచి దూసుకు వెళ్లినంత కష్టం. ఇదే మరణం గూర్చి భయంకరమైన వేదన.
నేను మందులతో మరణాన్ని వేదనలేక పొందవద్దని చెప్పను. కానీ అవి కొంత వరకే పనికి వస్తాయి. మన వేదనను పూర్తిగా తొలగించలేవు. మనస్సును నిశ్చలంగా ఉంచాలంటే దానికి తర్ఫీదు మొదట్నించీ ఇవ్వాలి. అంటే దేవుని యందు ప్రేమ, సర్వ జీవులలో దేవుని గాంచుట మొదలగునవి. అనుబంధాలు, అహంకారం, స్పర్థ, క్రోధం, భయం లేకుండా ఉండాలి. దేహం బాధని అనుభవించినా, చేతన మనస్సులో ఏ బాధా లేక భగవన్నామస్మరణం చేస్తూ ఉండాలి.
ఎప్పుడైతే చైతన్యం మనస్సులోకి, మనస్సు హృదయం లోకి ప్రవేశించాయో మనం మనస్సును దాటి పోయేం. అంటే జ్ఞాపక శక్తి ఉండదు. ఇది చలా ముఖ్యాంశం. ఆ సమయంలో మన౦ గ్రంధాల్లో చదువుకున్న ఆధ్యాత్మిక విషయాలు గుర్తుకు రావు. అపజపమైన మంత్రమును -- అనగా మంత్రము అచేతనముగా జపించ బడుతుంది -- మన ప్రేరణ లేకుండా, జ్ఞాపక శక్తి అవసరం లేకుండా మననం చేయాలి. మనం మంత్రం జపించాలని జ్ఞాపకం పెట్టుకోనక్కరలేదు. దానంతట అదే సాగిపోతుంది.
ముండకోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడినది:
పవిత్రమైన శాస్త్రాలు అనబడే ధనుస్సును చేత బూను
దాని మీద భక్తి అనే బాణమును సంధించు
ధ్యానం అనే విల్లు తీగను ముందుకు లాగు
ప్రేమ పూరితుడైన దేవుని లక్ష్యంగా పెట్టుకో
ధనుస్సు మంత్రము, సాధకుడు బాణం,
దేవుడు లక్ష్యం; ధ్యానం అనే విల్లు తీగను
వెనక్కి లాగి, దేవుడనే లక్ష్యాన్ని గురిపెట్టి
కొట్టి, వానితో ఐక్యమవ్వు
గొప్ప యోగులకు మంత్రము సర్వకాల సర్వావస్థల యందు అచేతనంగా జపించ బడుతుంది. కాబట్టి వారికి మరణం అంటే భయం లేదు. మరణం ఆసన్నమైనప్పుడు, వారి చేతనము అఖండమై యుండును.
పై శ్లోకాల్లో చెప్పబడిన మంత్రము ఓంకారము. అది బాహ్య శబ్దం కాక, అంతర్గతంగా ఉండేది. గాఢ ధ్యానంలో దానిని వినవచ్చు. మన శాస్త్రాలలో దానిని కొట్టబడని ధ్వని అందురు. జెన్ యోగులు ఒక చేతితో చప్పట్లు అందురు. మన శాస్త్రాలలో ఓంకారము విశ్వవ్యాప్తమైన స్పందన అని చెప్తారు. యోగులకు ఓంకారము చేతన మనస్సులో వచ్చి పోతూ ఉంటుంది. కానీ మరణ సమయంలో చేతనము దేవునిపై ప్రేమతో నిండి ఉండి, వారిలో ఓంకారము హృదయంలో స్పందిస్తూ, వారికి తక్కిన శబ్దాలు వినబడవు.