Bhagavat Gita
8.8
అనన్యచేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః
{8.14}
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః
పార్థా! ఎవడు అనన్య చిత్తముతో అనుదినము నన్నే స్మరించుచున్నాడో అట్టి నిత్య యుక్తు డగు యోగికి నేను సులభముగ, సుఖముగ లభింతును
బాల్యంలో మా ఇంటి ముందునుంచి ఆదివాసులు పందేలాడడానికి వెళ్ళేవారు. ఉదయాన్నే బస్సు ఎక్కి వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. సాయంత్రం మాత్రం బస్సులో వాళ్ళు నిశ్శబ్దంగా ఉండేవారు. నా అమ్మ వాళ్ళను చూసి జాలి పడేది.
మనం ఆహ్లాదనికి ప్రయత్నించాలని, లాభాన్ని జేబులో పెట్టుకోవాలని అనుకొంటూ ఉంటాం. కానీ మనమనుకున్నట్టు అవి ప్రతీసారీ జరగవు. భగవంతుడు మన ప్రయోగాలను కొంత వరకు చేయనిస్తాడు. కొంత కాలం తరువాత తన సిద్ధాంతాన్ని అమలు చేయిస్తాడు: అనగా మన ఇంద్రియ సుఖాల ద్వారా లేదా ఆస్తి, డబ్బు ద్వారా మనకు శాశ్వత సుఖము లభించదు. కేవలం ఇంద్రియ సుఖం కొరకే జీవిస్తే దాని వలన కలిగేది నిరాశ. ఆధ్యాత్మిక సాధనలో కొన్నాళ్ళు గడిపితే "అలాంటి జీవితాన్ని ఎవడికి సుఖమనిపిస్తుంది?" అని అడుగుతాము. మనచుట్టూ స్వార్థంతో, డబ్బుకై, ఆస్తులకై, అందరికన్న ముందుండాలనే భావంతో, బంధు మిత్రులతో పోటీ పడుతూ ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. వారికి చివరికి కలిగేది నిరాశే. ఒక యోగికి అది జీవితమే కాదు. శ్రీకృష్ణుడు "ఎవరైతే పగలు అంటారో, అది యోగికి అజ్ఞానంతో కూడిన అంధకారం" అని ముందు చెప్పెను.
ధ్యానంలో పరిపక్వత పొందుతున్న కొద్దీ మనము ఇంద్రియాల ప్రపంచంనుండి విడిబడతాము. ఆ స్థితిలో చేతనము క్షణికమైన సుఖాలను, స్వాధీనంలో ఉన్న వస్తువులను, వేర్పాటును వీడుతుంది. మన చైతన్యము స్వాధీనంలో ఉండి, ఇంద్రియాలు అంతర్గతమౌతాయి. చేతనము మనస్సులోనూ, మనస్సు ఆత్మలోనూ, మరణంలో లాగా లయమవుతాయి. తేడా ఎక్కడంటే మనము ధ్యానంలో చేతనముతో ఉండి ఉద్దేశ్యపూర్వకంగా చేసి మెలకువగా ఉంటూ, పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తాము. మరణంలో మన బంధాలాన్నిటినీ బలవంతంగా లాక్కోబడతాయి. కాని ధ్యానంలో వాటిని మనంతట మనమే వదిలేస్తాము. అటు తరువాత ఇంద్రియాలు మేల్కొ౦టే మనము ఇతరుల సంతోషాన్ని పంచుకొని, వాళ్ళతో సామరస్యంగా ఉంటాము. జీవితంలో మళ్ళీ తప్పు దారి పట్టం. ఎందుకంటే మన ఆత్మను పరమాత్మతో అనుసంధానము చేసేము. సెయింట్ పాల్ ఇట్లు చెప్పెను "నా అహంకారము మరణించినది. కాబటీ నాకు ఉంకో మరణం లేదు. జీసస్ క్రైస్ట్ ఇప్పుడు నాలో ఉన్నాడు."
ప్రతీ సాంప్రదాయంలో అటువంటి వ్యక్తులు ఉన్నారు: బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, శ్రీకృష్ణుడు, పరా శక్తి, మొదలగువారు. మనం ప్రజ్వలమైన సౌందర్యాన్ని చూడాలంటే ఎవరైతే తమ నిత్య జీవితాన్ని భగవంతునితో అనుసంధానము చేసి గడుపుతారో వాళ్ళను చూడాలి. ఒకరోజు నేను ధ్యానం చేస్తున్న బుద్ధుని విగ్రహాన్ని చూసి ఇలా అనుకొన్నాను: "నేను అతనిలా ఉండటానికి ఏమైనా చేస్తాను. ఇతరులు నా గురించి ఏమనుకున్నా ఫరవాలేదు. నేను బుద్ధుడి లాగే ఉండాలి".