Bhagavat Gita
9.12
పితా అహమస్య జగతో మాతా ధాతా పితామహః
{9.17}
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ
ఈ జగత్తునకు తండ్రిని తల్లిని నేనే, తాతయు నేనే. నేనే ఓంకారమును, ఋక్సామ యజుర్వేదములును నేనే.
మన పిల్లలు ఎదిగి మన బంధువున్న వూరులో కాలేజీలో ప్రవేశము లభిస్తే, వారు ఆ బంధువు ఇంట్లో ఉండి చదువుకుంటారు. దీనిని బంధువులు బరువుగా చూడరు. ఎందుకంటే మన పిల్లలు కాలేజీనుంచి ఉత్తీర్ణులై, ఉద్యోగాలు చేసి, సంసారం మొదలుపెడితే వారూ అలాగే చేస్తారు. ఈ విధంగా డబ్బు ఆదా కన్నా ముఖ్యాంశం మన పిల్లలు కుటుంబ వ్యవస్థలో పెరుగుతారు. మన బంధువులు వారి బాధ్యతను తీసుకొంటారు.
ఈ శ్లోకంలో భగవంతుడు మన బాధ్యతను వహిస్తున్నానని చెప్పుచున్నాడు. మనం ఎంత వయస్సున్నవారమైనా, ఎన్ని తప్పులు చేసినా, ఆయన మనని కాపాడుతాడు. చెప్పక చెపుతున్నదేమిటంటే మనము స్వార్థముతో, తప్పుడు పనులు చేస్తే, అతడు మనము నిస్వార్థముగా మారనంతవరకూ, పశ్చాత్తాపము పడనంతవరకూ జన్మరాహిత్యము ఇవ్వడు.
నేటి శాస్త్రజ్ఞులు చెప్పే విషయమేమిటంటే విశ్వంలోని అన్ని శక్తులూ ఒకే చోట కేంద్రీకరింపబడినవి అని. ఆ కేంద్రాన్ని మనము భగవంతుడంటాము. విశ్వమంతా ఒకే సిద్ధాంతముతో నడుస్తోంది. భూమి మీది కణాలు, శక్తి విశ్వమంతా కనిపిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు "నేను సంపూర్ణమైన జ్ఞానాన్ని. నన్ను తెలుసుకొంటే, జీవులకు ఆధారమైన శక్తిని తెలిసికొన్నట్టే" అని చెప్పెను. ఛాందోగ్య ఉపనిషత్తులో ఇట్లు చెప్పబడినది: "ఎలాగైతే మట్టి గూర్చి తెలిసికొంటే, దానిలోంచి ఆవిర్భవించిన నామ రూపాత్మకమైన ప్రతి వస్తువు -- కుండ, ముంత మొదలగునవి-- తెలియబడతాయో, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవులన్నీ ఒకటే నని తెలిసికొంటాము".