Bhagavat Gita
9.13
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్
{9.18}
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్
ఈ జగత్తునకు గతియు, భర్తయు, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, ఆశ్రయమును, మిత్రుడును, సృష్టిస్థితి లయ కర్తయు, నిక్షేపమును, అవ్యయ బీజమును నేనే
భగవంతుడు జీవులన్నీటికీ ఆధారము. మనము భగవంతుని మీద భక్తితో ఉంటే మన అవసరాలు, కోరికలు, తీరి స్వస్థతతో ఉంటాము. శ్రీకృష్ణుడు చెప్పేది: "నేను నీ జీవిత లక్ష్యం; నీ జీవనాధారం; నేను తప్ప వేరే యజమాని లేడు. నిన్ను అందరూ వదలి వెళ్తే నేను నీ సాక్షిని, నిజమైన గృహమును, ఆశ్రయాన్ని. నేను నీ నిజమైన మిత్రుడిని". జీసస్ "నన్ను అనుసరించు. నేనే మార్గము, జీవితము, సత్యము" అని చెప్పెను.
సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా వ్రాసెను:
ఏదీ నిన్ను కష్టపెట్ట కూడదు
ఏదీ నిన్ను భయపెట్ట కూడదు
ప్రతీదీ మారుతోంది
దేవుడొక్కడే మారనిది
సహనం గమ్యానికి చేరుస్తుంది
దేవుడ్ని నమ్మిన వానికి లేమి లేదు
దేవుడే అన్ని అవసరాలనూ తీరుస్తాడు
ఏదీ నిన్ను కష్టపెట్ట కూడదు: అంటే మనము ఎన్నటికీ చికాకు పడం. మన శక్తి వృధా కాక జీవితాంతము దేవుని సేవకై దానిని వినియోగిస్తాము
ఏదీ నిన్ను భయపెట్ట కూడదు: ప్రతి ఒక్కరి జీవితంలో విషాదం ఉంటుంది: డబ్బు, పరువు, ప్రియమైన వారిని పోగొట్టుకోవడం వంటివి. చివరకు జీవితమే అంతం అవుతుంది. మనం దుఃఖించవచ్చు, కానీ అది మనలను అణచివేయదు. ఎందుకంటే మనకు దేవునిమీద నమ్మకమున్నది.
ప్రతీదీ మారుతోంది: మనము నడి వయస్సు దాటితే, మన మిత్రుల, పెద్దల మరణ వార్తలను వింటూ ఉంటాం. కఠోపనిషత్తు "జొన్న గింజ వలె మానవుడు వృద్ధాప్యంలో రాలిపోతాడు" అని చెప్తుంది. ప్రతీదీ మార్పు చెందుతోంది. మారేది ఎప్పటికైనా మరుగున పడేదే.
దేవుడొక్కడే మారనిది: మారే ప్రపంచంలో ఒక్క భగవంతుడే మారనిది. అతనిని ఆశ్రయించి, ప్రేమించి సేవిస్తే మనము ఎప్పటికీ భద్రంగా ఉండి, ఎక్కడికి వెళ్ళినా ఆహ్లాదంగా ఉంటాము.
సహనం గమ్యానికి చేరుస్తుంది: పరిస్థితులు ఎంత విషమించినా, జీవితం ఎంత క్లిష్టమైనప్పటికీ, సహనానికి అందరూ తల వంచ వలసిందే. అది అన్ని అవరోధాలను దాటిస్తుంది. ప్రతి తుఫాను మధ్యలో మార్పులేనట్లు, మన జీవితంలో కలిగే తుఫాను వంటి క్లేశాల మధ్యలో ఎన్నటికీ మారని భగవంతుడున్నాడు. మనమెప్పుడు మనపై క్రోధము పెంచుకున్నవారియందు క్రోధము పెంచుకోకుండా వారిని నమ్మితే, వారిలో నమ్మకం పెరిగి ఆత్మ వైపు దృష్టి మరలుతుంది. మనని ఎదిరించేవారు, మనతో విభేదాలున్నవారు, మన జీవితాన్ని బరువు చేసిన వారు, ఎప్పటికైనా మనతో స్పందిస్తారు.
దేవుడ్ని నమ్మిన వానికి లేమి లేదు : భగవంతుని నమ్మిన వాని దగ్గర అందరూ నిర్భయంగా ప్రవర్తిస్తారు. వారికి లేమి ఏమీ లేదు, కాబట్టి ఇతరుల వద్దనుంచి ఏమీ ఆశించరు. వారు పరోపకారానికై బ్రతుకుతారు. మనము వారి దగ్గరనుంచి ఏమి తీసుకొన్నా వారిలో వెలితి లేదు. వారు ఇతరులకు ఏమిచ్చినా సంపూర్ణంగా ఉంటారు. వారికి ఎటువంటి కష్టం కలిగించినా వారు నిండుగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు వారి అవసరాలను తీరుస్తాడు.