Bhagavat Gita
9.14
తపామ్యహమ్యహం వర్షం నిగృహ్లామ్యుత్సృజామి చ
{9.19}
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున
అర్జునా! నేను తపింప జేయుచున్నాను. వర్షమును కురిపించు చున్నాను. నిలుపుచున్నాను, మృత్యువును నేనే, సత్తు, అసత్తుయు నేనే
భగవంతుడు జీవితాన్ని ఇచ్చి మళ్ళీ మరణరూపేనా వెనక్కి తీసుకొంటాడు. అతడు జీవులును ఆవిర్భవించు శక్తియే గాక, వాటిలో మార్పులు, మరణము కల్పించువాడు. చివరకు మనలను మరణానికి ఆవల తీసికెళ్ళి అమరత్వాన్ని ఇవ్వగల శక్తిమంతుడు. స్వామీ వివేకానంద "మనము మరణము గూర్చి తెలిసికోగలిగితే, జీవితంయొక్క అర్థమేమిటో తెలిసికోగలం" అనెను.
ఉపనిషత్తులు బయట ప్రపంచంలో ఏది ఉందో, అది మన చేతనములో కూడా ఉంది అని చెప్పినవి. భగవంతుడు తాను కాంతి, ఉష్ణము అని చెప్పడం సూర్యుని ఒక్కని గురించేకాదు. యోగులు ధ్యానం చివరిలో అత్యంత ప్రకాశమును చూస్తాం అని చెప్పేరు. మనము నిత్యము ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉంటే ఒకానొకప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి పుంజాన్ని చూస్తాం. అది సూర్య ప్రకాశమువలె నుండి, మనలోన దాగి ఉన్న శక్తికి చిహ్నం. మన అహంకారాన్ని, మన ఇష్టం వచ్చినట్లు చేద్దామనే భావనను విడనాడితే భగవంతుడు కోటి సూర్యుల ప్రకాశంతో మనకు దర్శనమిస్తాడు. ఎవరైతే భగవంతునితో ఏకమౌతారో వారు అత్యంత ప్రకాశవంతులై, అమితమైన ఆనందంతో ఉంటారు.
ధ్యానంలో పరిపక్వత పొందుతున్న కొద్దీ భగవంతుని రాక యొక్క సూచనలు అనేకము వస్తాయ. నేను అటువంటివాటిని పట్టించుకోవద్దంటాను. ఎపుడైతే ధ్యానంలో ఒకటి జరగాలని వేచిచూస్తే, అది మనం లోతుకు వెళ్ళడానికి అడ్డంకు కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక నల్లని మేఘమును శ్రీకృష్ణునికి చిహ్నమని తలచి, దానిని ధ్యానంలో చూడడానికై "భగవంతుడా నన్ను నీ ఉపకరణముగా తీసికో. ఏది ఆ నల్లని మేఘము?" అనుకుంటే, అది నిజమైన ధ్యానము కాదు. ధ్యానంలో అనుభవించేవన్నీ నిజ జీవితంలో చూడలేము. ఒక వేళ ఒక అనుభవం ఫలిస్తే, సాధారణంగా అదే రోజు ఫలిస్తుంది. కానీ అదే పనిగా దేవుని సంకేతానికై ఎదురు చూస్తూవుంటే నిరాశ కలిగి, ధ్యానం నిరోధింపబడుతుంది.
శ్రీకృష్ణుడు నేను మీకు వర్షం ఇవ్వగలను, ఆపగలను అంటాడు. ఈ నేపథ్యంలో సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిల ఆత్మ తోట వలె నుండి, దానిపై ప్రతి రోజూ నీళ్ళు సరఫరా చెయ్యాలి అని చెప్పెను:
నాకైతే తోటని నీళ్ళతో తడపడానికి నాలుగు విధానాలు ఉన్నాయని అనిపిస్తుంది. మనము చేదతో ఒక బావినుంచి నీళ్ళు తోడవచ్చు. లేదా ఒక పుంపు పెట్టి నీళ్ళను తోటకు సరఫరా చేయవచ్చు. లేదా ఒక నదీ కాల్వలో నీరుని మళ్లించి తోటకు రప్పించవచ్చు. ఇలా చేయడం వలన తోట౦తటికీ నీరు సులభంగా అంది, మనకు శ్రమ తక్కువ అవుతుంది. కానీ అన్నిటికన్నా ఉత్తమం దేవుడు ఒక పెద్ద వర్షం కలిగి౦చి మనకు శ్రమలేకుండా తోటకి నీళ్ళు అందివ్వడం.
కొన్ని పల్లెటూర్లలో నూతినుండి చేదతో నీళ్ళు తోడుకొంటారు. ఆ చేదకి కన్నాలుంటే, నీరు నూతి అట్టడుగున ఉంటే, చేదలో ఉన్న నీరు కన్నాలలోంచి కారిన తరువాత మిగిలినది మనకందుతుంది. ధ్యానంలో ప్రవేశించేటప్పుడు మన చేదలో చాలా కన్నాలుంటాయి. దానిని క్షమతో కూడిన జలంతో నింపి తోడితే, అసహనం, చికాకు, క్రోధం, బద్దకం వంటి కన్నాల నుండి నీరు కారిపోతుంది. అది మన పట్టుదలను సడలిస్తుంది. ఎప్పటికైనా చేద నిండుగా నీళ్ళను తెస్తుందా అని అనుమానం కలుగుతుంది. ఒక్కొక్క రోజు ఆ చేదలో నీరే ఉండదు. అప్పుడు "నూతిలో నీరు లేదు" అని భావిస్తాము. తెరెసా "నూతిలో చాలా నీరు౦ది; చేదలోని కన్నాలను పూడ్చండి" అని అంటారు.
ఇలా కొన్నాళ్ళు సాధన చేస్తే తెరెసా చెప్పినట్లు, నీటిని పంపు ద్వారా వెలికితెస్తాము. ఈ రెండవ దశలో పరిశ్రమ ఉంది కాని అది కన్నాలున్న చేదకన్నా నయం. ఇలాగ మన తోట౦తటికీ అతి తక్కువ శ్రమతో నీరు తడపవచ్చు. ధ్యానం వలన లభించే మనశ్శాంతి ఆతృత లేదా కోపం వలన తరగిపోదు.
మూడవ దశలో, తెరెసా చెప్పేది, ఒక నది పాయను తోటవైపు మళ్ళిస్తే, చేద అవసరం లేదు. మనస్సు ధ్యానంలో నిశ్చలంగా చెయ్యడానికి శ్రమలేదు. నిస్వార్థమనబడే నీళ్ళు ఒక ధారగా వస్తాయి. సెయింట్ తెరెసా "ఈ స్థితిలో దేవుడు తోటమాలికి తానే తోటకి నీళ్ళుపోసి సహాయం చేయదలచుకొంటాడు. ఎలా అనగా భగవంతుడే అన్నీ చేస్తాడు". మన అవసరాలను మరచి జీవుల సమస్యలను పరిష్కరించడానికై పూనుకుంటే దేవుడు మనలోనుండి పనులు చేయిస్తాడు. మనము దేవున చేతిలో పనిముట్లమవుతాము. చివరికి తెరెసా చెప్పినట్లు దేవుని దయ వర్షం వలె కురిసి, మన తోట౦తటికీ నీరు అందుతుంది.