Bhagavat Gita
9.15
త్రైవిద్యా మాం సోమపాః పూత పాపా యజ్ఞ్ఐరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే
{9.20}
తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్
వేదాధ్యయనము చేసినవారు యజ్ఞములచేత నన్ను పూజించి, సోమపానము చేసి, పాప విముక్తులై స్వర్గస్థితిని అభ్యర్థి౦తురు. వారు పుణ్యప్రదమగు ఇంద్రలోకమును పొంది అచ్చట దివ్య భోగముల ననుభవించుచున్నారు
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ౦తి
{9.21}
ఏవం త్రయీధర్మ మనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే
వారు విశాలమగు స్వర్గలోక భోగముల ననుభవించి పుణ్యము క్షీణించగనే తిరిగి మానవ లోకమున జన్మించుచున్నారు. ఈ రీతిగ కామ్య కర్మల ననుష్ఠి౦చెడి వారు జనన మరణములను పొందుచున్నారు ఀ
స్వార్థ పూరితమైన కర్మలుచేసి, స్వర్గలోక సుఖాలను కాంక్షించువారు మరణానంతరము దానిని పొందుచున్నారు. కానీ వారు స్వర్గలోకంలో ఎప్పటికీ ఉండిపోరు. వారి పుణ్యానుసారం, పుణ్యము క్షీణించిన తరువాత, భూలోక౦లో తిరిగి జన్మిస్తారు.
ఇంద్రియములను నియంత్రించుకోక, పరోపకారానికై కాక, స్వార్థమునకై చేసిన ధ్యానము వలన దుష్ఫలితాలు రావచ్చు. ధ్యానంలో వారి చేతనపు లోతులలోంచి ఆలోచనలు ఉద్భవించి తద్వారా కోర్కెలను తీర్చికొనవచ్చు. కానీ వారు కోర్కెలను నియంత్రించుకోలేరు. వారికి మిక్కిలి ధనము, గొప్ప పేరు ప్రతిష్ఠలు, ఆయుష్షు కలుగవచ్చు. కాని వారి జీవితమునకు ఒక దిశ లేదు.
నాకు విలాసవంతంగా జీవించేవారు కొందరు తెలుసు. వారు తమ స్వంత విమానాల్లో తాము తలచుకొన్న ప్రదేశానికి వెళ్తారు. ఖరీదైన హోటల్ లలో నివసిస్తారు. వారిని వెంబడి పత్రికా విలేఖరులు ప్రశ్నలు అడగడానికి వెళ్తారు. అయినప్పటికీ కొంత కాలం తరువాత వారికి అట్టి జీవనం మీద మోజు పోతుంది. మళ్ళీ సామాన్యులుగా బ్రతకాలని కాంక్షిస్తారు. మార్లో ఫౌస్టస్ అనే నాటకంలో తన పతనాన్ని తనే తెచ్చుకొని ఫౌస్టస్ ఇలా రోదిస్తాడు:
పర్వతాల్లారా, కొండల్లారా వచ్చి నా మీద పడండి
ఆత్మా చిన్న నీటి బిందువులుగా మారి ఎప్పటికీ కనిపించకుండా సముద్రంలో పడు
కొంతమంది గురువులు ధ్యానం నేర్చుకొని ఇతరులను వశం చేసుకోండి, మీకు కావలసిన సంపదను పొందండి, అని ప్రకటనలను చేస్తారు. అవి మనను తప్పుదారి పట్టించుటకే.
ధ్యానము వలన కలిగిన శక్తిని దురుపయోగము చేసిన మిక్కిలి అపాయము కలుగును. కాబట్టి మన ఇంద్రియ నిగ్రహమును, చుట్టూ ఉన్నవారి ఆనందమును కాంక్షించి ధ్యానము చేయుట ఉత్తమం. ఇది మన రక్షణ కొరకే.