Bhagavat Gita
9.16
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
{9.22}
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్
ఎవరు అనన్య చిత్తముతో నన్నే స్మరించుచు ఉపాసించు చుందురో, నా యందే మనస్సు నిలిపియు౦డు అట్టివారల యోగక్షేమములను నేనే వహించుచుందును
కొన్ని సంవత్సరాల క్రితం, బ్లూ మౌంటేన్ ధ్యాన మందిరము బెర్క్లీ లో ప్రారంభించక ముందు, మా వద్ద ధనమూ లేదు, సహాయం చేయగలిగే మిత్రులూ లేరు. నేను ఆహారదినుసులను తెచ్చేవాడిని, తోట పనిని చేసేవాడిని. నా భార్య క్రిస్టీన్ తక్కిన పనులన్నీ చూసుకొనేది: అంటే సెక్రెటరీ, పద్దులు వ్రాయడం, పత్రిక సంపాదకం, వంట చేయడం, నన్ను కారులో తిప్పడం, మొదలైనవి. చాలా మంది మేము మూర్ఖత్వంతో ఉన్నామని చెప్పేరు. కొంతమంది మిత్రులు మాకు బ్యాంక్ లో ఎంత డబ్బు౦దని అడిగేవారు. నాకు బ్యాంక్ అకౌంటు లేదని చెపితే నిరాశపడేవారు. "మీకు తగినంత సొమ్ము౦టేకాని మీరనుకున్నట్టు ఏదీ సాధ్యము కాదు" అని చెప్పేవారు.
"అవును. మేము ఒక్కరమే దీన్ని నిర్మాణించటం లేదు"
"అలా అయితే మీకు ఒక ప్రాయోజిత (sponsor) ఉన్నారా?"
"అవును. అందరికన్నా ఉత్తముడు"
"ఎవరు ఫోర్డ్ లేదా రాకిఫెల్లర్ సంబంధితులా?"
"అంతకన్నా ఉత్తముడు, శ్రీకృష్ణ భగవానుడు"
వారికది నమ్మశక్యంగా ఉండేది కాదు. కానీ నేను హాస్యం ఆడటంలేదు. భగవంతుడిచ్చిన అభయం ఈ శ్లోకంలోనే ఉంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో సంపూర్ణమైన భక్తితో నడిస్తే భగవంతుడు "నేను నీ ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధికి బాధ్యత వహించడమే కాదు, నీకు అవసరమైన వాటికి కూడా బాధ్యత వహిస్తాను" అని అంటాడు. అదే యోగక్షేమం వహామ్యహం అనేదానికి అర్థం.
ఏ యోగీ భగవంతుని అభయం పొంది నిరాశ చెందలేదు. మా ధ్యాన మందిరంలో ఒక హుండీ ఉండేది. మా వద్ద ఉన్న డబ్బు అయిపోతే దానిని అప్పుడప్పుడు తెరిచేవారం. ఒకానొకప్పుడు పెద్ద దాత హుండీలో పెద్ద మొత్తం వేసేడు. క్రిస్టీనా అమిత౦గా ఆశ్చర్యపోయింది. కానీ నేను ఆశ్చర్యపడలేదు. నేను అప్పటికే దేవుడు తన అభయాన్ని నెరవేర్చుతున్నాడని నమ్మేను. ఇంకొకమారు హు౦డీలోని డబ్బుతో కొన్ని కుర్చీలు కొన్నాము. అవి ఇప్పటికీ మా ఆశ్రమంలో ఉన్నాయి. మా ధ్యాన మందిరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. నేను ఆ పెరుగుదల పై శ్లోకంలోని దేవుని అభయం వలననే అని నమ్ముతాను.