Bhagavat Gita
19.17
యే అప్యన్యదేవతా భక్తా యజా౦తేశ్రద్ధయా అవ్వితాః
{9.23}
తే అపి మామేవ కౌ౦తేయ యజ౦ త్యవిధిపూర్వకమ్
అర్జునా! ఎవరయితే అన్యదేవతారాధకులై శ్రద్ధతో వారిని ఉపాసించుచున్నారో వారునూ దారి తప్పి నన్నే ఉపాసించుచున్నారు
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ
{9.24}
న తు మామభిజానంతి తత్త్వేనాత శ్చ్యవంతి తే
సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే. అట్టి నన్ను వారు వాస్తవముగ గ్రహించుటలేదు. అందుచేత వారు పతనమగుచున్నారు
మేము భారత దేశంలోని బ్ల్యూ మౌంటైన్ దగ్గర నివసిస్తున్నప్పుడు, నేను ఒక అమెరికన్ ని కలిసేను. అతడు క్రిస్టియన్ కుటుంబంలో పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించినవాడు. అతనికి ఆధ్యాత్మికత కలిగి, తన జీవిత లక్ష్యం ఏమిటా అని వేదుక్కోవడానికి ఒక బెంగాలీ గురువు వద్ద 12 ఏళ్లు శిక్షణ పొందేడు. అతను అత్యంత ఆశ్చర్యంతో ఇలా చెప్పెను: "నేను బోస్టన్ నుంచి బెంగాల్ కి పయనమై వచ్చి, కాళీ మాతను, పరమ శివుడిని ధ్యానించేను. నా హిందూ గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఉపాసన చేసేను. కానీ నా చేతన మనసు లోతులలో కనిపించేది కృష్ణుడు కాదు శివుడు కాదు. జీసస్ క్రైస్ట్!"
మన విషయాల్లో కూడా ఒక అవతారాన్ని ఇంకొక అవతారంతో పోల్చనక్కరలేదు. ఆ ఎన్నిక భగవంతునికే వదిలివేయడం మంచిది. ఒకరు జీసస్ మీద, మరొకరు శ్రీకృష్ణుని మీద, వేరొకరు బుద్ధుని మీద ధ్యానం చేయవచ్చు. వారిలో ఎటువంటి తేడా లేదు. మనం ప్రతి దినము చిత్త శుద్ధితో, ఏకాగ్రతతో, అహంకారాన్ని వదిలి ధ్యానం చేస్తే చివరకు ఆ భగవంతునిలో లీనమవుతాము. మనము జీసస్ ని లేదా బుద్ధుని పిలిస్తే, శ్రీకృష్ణుని కూడా పిలిచినట్లే. అలాగే మనము శ్రీకృష్ణుని పిలిస్తే, జీసస్ ని లేదా అల్లాని పిలిచినట్లే. నా విద్యార్థి ఒకని పేరు శివరామకృష్ణ. నేను వానికి చెప్పేవాడిని: "స్వర్గం ఎక్కడున్నా, నీవు దానిని చేరుకొంటావు. ఏ ఒక్క నామమైనా నిన్ను తరింపజేస్తుంది"
ధ్యానం అభ్యసించే మొదట్లో మనము ఏ దేవతనూ ధ్యానించకపోయినా, అది పరిపక్వమవుతున్న కొద్దీ ఒక ఇష్ట దేవతను ఆలంబనముగా చేసికొని దానిపై మనస్సు నిలపుతాము. మనకు ఏ అవతారాన్ని ఎంచుకోవలో తెలియకపోవచ్చు. ఒక ప్రక్క అహింసా పరుడైన జీసస్, ఇంకొక ప్రక్క సర్వ జీవులయందు కరుణామూర్తి బుద్ధుడు ఉండవచ్చు. అలాటప్పుడు ఎన్నికను దేవునికి వదిలి వేయడం ఉత్తమం. ఒక్కొక్కప్పుడు కలలో మీకు ఒక దేవత కనిపించవచ్చు లేదా దైవ నామము వినిపించవచ్చు. జీసస్ ఒక మేక పిల్లను ఎత్తుకొని ఉన్నట్లు కల రావచ్చు. లేదా ఓం మని పద్మే హం అనే బుద్ధుని మంత్రము కలలో వినపడవచ్చు. అప్పుడు మీ హృదయపు లోతులలో స్పందించి మీ సంశయాలన్నీ తీరిపోతాయి.