Bhagavat Gita
9.18
యాంతి దేవ వ్రతా దేవాన్ పిత్రూన్ యాంతి పితృవ్రతాః
{9.25}
భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినో అపి మామ్
దేవతలనారాధించువారు దేవతలను, పితృదేవతల నుపాసించు వారు పితృదేవతలను, భూతముల నారాధించువారు భూతములను పొందుచున్నారు. నన్ను సేవించెడివారు నన్నే పొందుచున్నారు ఀ
ఈ శ్లోకం యొక్క అంతరార్థ౦ మనము దేనిపై ధ్యానము చేస్తామో మనమదే అవుతాము. మనం ఒక భౌతికమైన సమస్యపై ధ్యానము చేస్తే, దానిని పరిష్కరించగలము. అలాగే ఒక మానసికమైన సమస్యను కూడా. కానీ మనం చిత్తశుద్ధి కలిగి, ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలి. శ్రీకృష్ణుడు "నీవు నాపై ధ్యానం చేస్తే నీ సమస్యలన్నిటినీ దాటగలవు" అని చెప్తున్నాడు.
రామాయణంలో రావణుడు స్వార్థానికి ప్రతీక. అతడు ఆసురులకు రాజు. అతని తమ్ముడు కుంభకర్ణుడు సోమరిపోతు. అతడు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతాడు. మనము చతికిలబడి, క్రింద కూర్చుంటే మనని కుంభకర్ణుడితో పోలుస్తారు. మనము స్వార్థపరులమైతే రావణుని తన రాజ్యానికి తీసికెళ్లమని ప్రార్థిస్తాము. మనము బ్రతికుండగానే ఏ రాజ్యానికి వెళ్లాలో నిర్ణయించుకోగలం. అలాగే మంచి మార్గములో జీవించి స్వర్గాన్ని పొందవచ్చు.
పితృదేవతలను పూజించేవారు గతంలో మునిగి ఉంటారు. మన ఇళ్ళలో అనేక తరాల వారి పటాలు వేలాడగట్టి వచ్చిన వాళ్ళ కందరికీ వారిని పరిచయం చేస్తాం. మనం బుద్ధిని ఉపయోగించి గత౦లో ఏది ఉపయోగకరమో దానిని ప్రస్తుతానికి అన్వయించి గ్రహించాలి.
శ్రీకృష్ణుడు చెప్పే భూతాలు మనలో యున్న క్రోధము, లోభము మొదలగునవి. మనమెంత చెడ్డ భావాలను కలిగియుంటే, అంత ఆ భూతాల ప్రపంచంలోకి వెళ్తాము. చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటే భయం వేస్తుంది. జుత్తును మరమ్మత్తు చేసే అనేక సంస్థలు కూడా వెలిసాయి. జుత్తు రాలిపోతూ ఉంటే, మన భద్రత తక్కువవుతుంది. నా జుత్తు కూడా రాలిపోతూ ఉంటే "పోనీ.. అంతా పోనీ" అనుకొన్నాను. కాలం నా జుత్తుని తగ్గించి ఉంటుందికాని, నన్ను కాదు.
చాలామంది భావోద్వేగంతో కూడి భయానకమైన ప్రపంచంలో బ్రతుకుతారు. వారు అనేకమైన మానసిక-శారీరిక సంబంధిత వ్యాధులచే బాధ పడుతూ ఉంటారు. వారు తాము ప్రేమించు కొనదలచిన వారి యందు కూడా పూర్తి నమ్మకం ఉంచుకోరు. అందువలన వారికి అనుబంధాలు ఉండవు. అట్టి వారు ధ్యానం వలన మంచి ఫలితాలను పొందుతారు. ధ్యానంలో దృష్టి మన సమస్యలనుండి మళ్లించి, ఇతరుల సేవకై వినియోగింపబడుతుంది. అలా సాధన చేస్తే మనం చక్కగా జీవించి, అపోహలకు దూరమవుతాము