Bhagavat Gita
19.19
పత్రం పుష్పం ఫలం తోయం తదహం యే మే భక్ష్యా ప్రయచ్ఛతి
{9.26}
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః
నిష్కాముడైన భక్తుడు భక్తితో సమర్పించునట్టి పత్రమునైనను, పుష్పమునైనను, ఫలము నైనను, జలమునైనను నేను ఆరగింతును
ఆకులు, పువ్వులు, పళ్ళు, నీరు దేవుని పూజించడానికి ఉపయోగిస్తాం. అర్చన చేస్తున్నప్పుడు దేవుని నామాలు చదువుతూ వాటిని దేవునికి సమర్పిస్తా౦. శ్రీరామకృష్ణ ఇలాగే ఆదిశక్తిని పూజించేవారు. ఆయన ఆవిడ నామాలు చదువుతూ కలువ పువ్వులు ఆమె పాదాలమీద వేసేవారు. అలాగ ధ్యానంలో ఉండి, కొంతసేపటికి భక్తి పరవశుడై, ఆ పువ్వులను తన తలమీద వేసుకునేవారు. అటువంటి అనన్య భక్తితో ఆమెతో లీనమయ్యేరు.
మనము చేస్తున్న ప్రతీ క్రియ, ఎంత చిన్న దైనప్పటికీ, దేవునికి సమర్పించాలి. మనము మన కుటుంబానికై తోటలో కూరగాయలు పండిస్తే, అది దేవునికి నైవేద్యంగా భావించాలి. ఇతరులకై కొంత ఎక్కువ పనిచేసినా అది దైవార్పణముగా తలచాలి. ప్రతి రోజూ, క్రియ చిన్నదైనా లేదా పెద్దదైనా, దైవార్పణం చెయ్యాలి. అది పరిమాణం లేదా ఖర్చుతో సంబంధించినది కాదు. మన ఆనందం, ఉత్సాహం బట్టి ఉంటుంది. మన౦ పరోపకారముచేస్తూ మనను మరచిపోవాలి.