Bhagavat Gita
9.3
అశ్రద్దధానాః పురుషా ధర్మ స్యాస్య పరంతప
{9.3}
అ ప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసార వర్త్మని
పరంతపా! ఈ ధర్మమునందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేక మరల జనన మరణ రూప సంసారమునందు అల్లాడుచుందురు
శ్రద్ద అనగా హృదయమునందు ఉంచబడినది. మన నమ్మకం శ్రద్ధ మనము కోరుకున్నది ఫలింప జేస్తుందని -- అంటే మనము ఆలోచించినది కాక, మన హృదయంలో నమ్మునది. కాబట్టి ప్రతి ఒక్కనికి ఏదో ఒక దానిమీద నమ్మకం ఉంటుంది. స్కీఇంగ్ చేసేవారు మంచు కొండమీద, క్రిందికి రెండు కాళ్ళ క్రింద పలచటి కర్ర లేదా ఫైబర్ గ్లాస్ ముక్కలు పెట్టుకొని, పయనిస్తారు. వారికి అమితమైన శక్తి, ఉత్సాహం ఉండి సాహసాలు చేస్తారు. కానీ వాళ్ళు నమ్మేది స్కీఇంగ్ వలన వాళ్ళకు మిక్కిలి సంతోషం కలుగుతుందని. మనందరం ఏదో ఒకటి స్కీఇంగ్ లాగే శాశ్వత సుఖం ఇస్తుందని నమ్ముతా౦. కానీ కొందరు తమ నమ్మకాన్ని చెడు కార్యాలకై వినియోగిస్తారు. వారికి త్రాగుడు, మారక ద్రవ్యాల అలవాట్లు, లేదా అపాయకరమైన సాహసాలు చేయాలనే కాంక్ష ఉండి, చివరికి సమసిపోతారు.
గీత అటువంటి సమస్యలకు ఒక ఉత్తేజపరిచే సూచన ఇస్తుంది. మన నమ్మకం జీవితానికి తోడ్పడే దానిపై లేకున్నా, మనకు నమ్మకమంటూ ఒకటుండడమువలన ఆశ మిగిలి ఉంది. మన నమ్మకము చెడు నుంచి మంచికి మారితే మనం స్కీఇంగ్ చేసే వారిలాగ లేదా ప్రపంచాన్ని చుట్టి వచ్చే వారిలాగ, ఆధ్యాత్మిక సాధన ఉత్సాహంగా చెయ్యచ్చు. నేను స్కీఇంగ్ చేసేవారికి చెప్పేది: "మీలాంటి స్కీఇంగ్, కొండమీదనుంచి క్రిందకు వెళ్ళడం, నా నమ్మకానికి తగినది కాదు. మీరు కొండ క్రిందనుంచి మీదకు స్కీఇంగ్ చేసుకొంటూ వెళ్లగలరా?" ధ్యానం ఎదురీత లేదా కొండ ఎక్కడం లాంటిది. ఎవరైతే అట్టి సవాలును స్వీకరిస్తారో వారు తమ శ్రద్ధను ఉపయోగించి క్లిష్టమైన ధ్యానం చేస్తారు. అటువంటి సవాలు స్వీకరిస్తే, మద్యానికి బానిస అయినవాడు మద్యం సేవించని వానికన్న దృఢమైన వ్యక్తిగా మారుతాడు.