Bhagavat Gita
9.4
మయా తతమిదం సర్వం జగ దవ్యక్తమూర్తినా
{9.4}
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః
ఈ సమస్తమైన విశ్వము అవ్యక్త రూపుడైనను నా చేత పరివ్యాప్తమై యున్నది. సమస్త ప్రాణికోట్లు నా యందు యున్నవి. నేను వానియందు లేను
న చ మత్ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం
{9.5}
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః
మరియు భూతములు నా యందు లేవు. ఈశ్వర సంబంధమగు నా ఈ యోగమహిమను గా౦చుము. నా స్వరూపము భూతములను భరించునదియు, రక్షించు నదియు అయినను భూతములయందు ఉండునది కాదు
యథా ఆకాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్
{9.6}
తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ
సర్వ సంచారియు, గొప్పదియు నైన వాయువు ఏ విధముగ ఆకాశమునందు నిత్యమై యున్నదో, అలాగుననే సకల భూతములు నా యందున్నవని గ్రహించుము
ఇక్కడ ఒక సందిగ్దము కలుగజేసే అంశము చెప్పబడినది: పరమాత్మ అన్ని జీవులలో, కణాలలో ఉన్నాడు, కాని వాటివలన పరిమితుడు కాలేదు. సమాధిలో మనము పరమాత్మలో ఐక్యము అయినప్పుడు, నక్షర వీధులకు, సమస్త సృష్టికి పరిమితము కాని పరమాత్మ మన హృదయంలో పరిమితుడై ఎలా ఉన్నాడు?
ఇది మాయ యొక్క ప్రభావము. నా చెయ్యి ఘన పదార్థముగా, చామన ఛాయగా ఎలా కనబడుతున్నది? భౌతిక శాస్త్రవేత్తలు చెయ్యి ఘన పదార్థమూ కాదు, ఒకానొక రంగున్నదీ కాదు అని చెప్తారు. ఇంకా అనేక కణముల సముదాయము, శక్తి తో కూడినది అని చెప్తారు. నేను దానిని ఒక స్థిరమైన రూపాముతో, రంగుతో చూడడానికి కారణము నా పరిమితమైన అవగాహన వలన. అంటే దాని ఆకారము, లక్షణములు చుట్టూ ఉన్న ప్రపంచంలో లేవు. నా ఆలోచనలో, దృక్పథంలో ఉన్నాయి. సమాధిని సాధించిన యోగులు ప్రపంచము నామరూపాత్మకమని చెప్పుదురు. ఆది శంకరులు "నామరూపాలు బంగారు గొలుసులు, గాజులు లాంటివి; పరమాత్మ బంగారము లాంటి వాడు" అని చెప్పును.
ఆల్డస్ హక్లీ ఇట్లు చెప్పెను: ప్రపంచము ఒక భ్రాంతి. దానిని మనము ఏకాగ్రతతో విశ్లేషించాలి. దానంతట అది నిజము. దానిని మన మనస్సుతో పట్టుకోగలం. మనం దానిలో మేల్కొనగలగాలి. మనము సదా మన చేతనమును పెంపొందించుకొనుటకు ప్రయత్నము చెయ్యాలి. మనము మనకివ్వబడిన ప్రపంచానికి ఆవల బ్రతకడానికి ప్రయత్నించ కూడదు. కానీ ప్రపంచమును మనకు అనుగుణముగా మార్చుకోవాలి. మనము ప్రపంచంలో ఉండి, దానికే పరిమితమవ్వకూడదు. మనము కాలంలో బ్రతుకుచు, దానిచే కబళింపబడక ఉండాలి".
నేను సరదాకి నా మిత్రుడు జిమ్ ని నువ్వు నీ దేహముకాదు, జిమ్ అనబడే వ్యక్తి లేడు, అది రోడ్డు మీద నడుస్తున్న ఒక శక్తి కూటమి అని అనేవాడిని. నిజానికి నాకు ప్రత్యక్ష ప్రమాణం జిమ్ యొక్క ఆత్మ, దానిని మాయ చేత ఆవహింపబడిన దేహము. మనము మాయలో బ్రతుకుతున్నంత సేపూ నామ రూపాములు నిజమని నమ్మాలి. కానీ మన మెన్నటికీ మారువరానిది: అన్ని రూపాలలో యున్నది ఒకే పరమాత్మ