Bhagavat Gita
9.5
సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాంతి మామికాం
{9.7}
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విశృజామ్యహమ్
అర్జునా! ప్రళయ కాలమున సమస్త ప్రాణులు నా ప్రకృతిని చేరుచున్నవి. తిరిగి సృష్ట్యారంభమున నేను వానిని సృజించుచున్నాను
ప్రకృతిం స్వామనష్టభ్య విశృజామి పునః పునః
{9.8}
భూత గ్రామమిమ౦ కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్
స్వీయమైన ప్రకృతిని అనుసరించి అస్వతంత్రమైన సర్వభూతములను ప్రకృతి వశమున మరల మరల పుట్టించుచున్నాను
న చ మాం తాని కర్మాణి నిబధ్న౦తి ధనంజయ
{9.9}
ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు
ధనంజయా! కర్మల యందు సంగము లేక తటస్థుని వలె నున్న నన్ను ఆ కర్మలు బంధింపవు ఀ
మన శాస్త్రాలు ప్రపంచము అనేక మార్లు సృష్టి , స్థితి, లయము చెందుతూ ఉంటుందని చెప్పును. లయమునకు సృష్టికి మధ్య దేశకాలాలు ఉండవు. ఎప్పుడైతే ఆ స్థితిలో చిన్న మార్పు వస్తుందో సృష్టి ఆరంభం కారణ-కార్య ప్రక్రియ ద్వారా జరుగుతుంది.
ప్రతిమారు సృష్టి ఆవిర్భవించినపుడు పరిణామ సిద్ధాంతము ననుసరించి జీవులు ఐకమత్యమే లక్ష్యంగా జనన-మరణాలు పొందుతూ ఉంటాయి. మనలోని జంతు లక్షణాలు సమసిపోయేవారకూ పుట్టుక-చావు కలుగుతూనే ఉంటుంది.
అంటే మనలోని ప్రతిఒక్కరూ, ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టినా, చేతనము యొక్క ఉత్కృష్ట స్థితిని చేరే వరకూ ప్రయత్నించాలి. మనం ఉపేక్షిస్తే మనము చేసే తప్పులు నేర్పే పాఠాల వలన మనలో మార్పులు వస్తాయి. ఎలాగైతే జంతువులు తమ పరిసరాలను బట్టి పరిణామము చెందుతూ ఉంటాయో, మనం కూడా మన క్రియల యొక్క పర్యవసానము వలన పరిణామం పొందుతూ ఉంటాము. ఇదే కర్మ సిద్ధాంతం. మనం ఇతరులను బాధిస్తే, మనము ఎప్పుడో ఒకప్పుడు బాధను అనుభవిస్తాం.
కర్మలు మూడు విధములుగా ఉంటాయి. మొదటిది తక్షణమే జరిగేది. ఉదాహరణకి రాముడు కృష్ణుని కొడితే, కృష్ణుడు రాముని తిరిగి కొట్టేడు. ఇందిలో ఎటువంటి మాయా మర్మం లేదు. రెండవది, మనం గతంలో చేసిన కర్మ ఫలం. సూఫీ యోగి అన్సారీ హెరాట్ "అందరూ రేపు ఏం జరుగుతుందో అని భయపడతారు. నేను భయపడేది నిన్న ఏమి జరిగిందో" అని చెప్పెను. బుద్ధుడు ఇటువంటి కర్మ విల్లు నుండి గతంలో విడువబడిన బాణం వలె నుండి, దాని ఫలితమును అనుభవించి, మరల బాణాన్ని ప్రయోగించకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పెను.
మూడవది ప్రస్తుతము లేదా వర్తమాన కాలంలో చేసే కర్మ. ఈ కర్మను మనం నియంత్రించ వచ్చు. మనము గతంలో ప్రయోగించిన బాణాలను ఉపసంహరించుకో లేక పోయినా, ప్రస్తుతము క్రొత్త బాణాలను ప్రయోగించకుండా ఉండవచ్చు. మనము క్రోధము, పగ తీర్చుకోవాలనే భావనతో ఉంటే, అనగా బాణము విల్లులో సంధింపబడి ఉన్నా, మనము ఆ బాణాన్ని ప్రయోగించనక్కరలేదు. ఇదియే ధ్యానం చేసే మహోపకారము.
మనము కోట్లాది సంవత్సరాలు పరిణామము చెంది భగవంతుని సాన్నిధ్యము పొందేకన్నా, మన పరిణామము స్వాధీనంలో పెట్టుకుంటే ఉత్తమము. దీనికి ధ్యానం చాలా సహకరిస్తుంది. శ్రీరామకృష్ణ, సెయింట్ కాథరీన్ ఆఫ్ సిఎనా వంటి వారు మానవాళి ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా అనేక మెట్లు మీద ఉన్నారు. యోగ గురువు పతంజలి అది అందరికీ సాధ్యమని చెప్పెను. మనకందరికి మొదట్లో శక్తి సమానంగా ఉంటుంది. కొంతమంది తమ శక్తిని పూర్తిగా లక్ష్యాన్ని చేరేందుకు వినియోగించకుండా, సామాన్య కోర్కెలకై వ్యచ్చిస్తారు. మహాత్మా గాంధీ, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ అలాకాక తమ లక్ష్యానికై శక్తిని పూర్తిగా ధారపోసేరు. వారు ఆ శక్తితో ఆధ్యాత్మిక జీవనం అవలంబించి, చేసిన తప్పులను మరల చేయలేదు. మనమందరము ఇటువంటి ఎన్నిక చేసుకోవచ్చు. ఎంత కష్ట పడితే, ఆధ్యాత్మికంగా అంత ఎత్తుకు ఎదుగుతాం.
మార్కా౦డేయుడు శివ భక్తుడు. అతని 16 వ యేట శివుని వలన మరణమును జయించెను. అతడు ఒకమారు శ్రీకృష్ణుని మాయ అంటే ఏమిటని అడిగెను. శ్రీకృష్ణుడు అంతర్ధాన మైన తడవు సప్త సముద్రాలూ మార్కా౦డేయుని ఆవహించేయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీటిలో కనుమరుగయ్యాయి. మార్కా౦డేయుడు నీటిపై కోట్ల సంవత్సరాలు తేలియాడేడు. ఆ సమయంలో జీవంలేని పదార్థము నుండి పరిణామం చెంది మనిషి రూపు దాలుస్తాడు.
మనిషి జన్మలో స్వార్థ పూరితంగా బ్రతుకుతాడు. అనేక జన్మలెత్తి నిస్స్వార్థుడై దేవునియందు అనన్య భక్తిని పొందుతాడు. ఒకమారు నీటి మధ్యలో ఒక మర్రి ఆకుపై మేఘ వర్ణములో నున్న పసి కందును చూస్తాడు. మార్కా౦డేయుడు ఆ పసివాడిని కృష్ణుడని గుర్తు పడతాడు.
ప్రపంచమే తన క్రీడా స్థలమైన శ్రీకృష్ణుని తన చేతులతో ఎత్తే భాగ్యం కలిగింది కదా అని పరవశిస్తాడు. కానీ ఇన్నేళ్ళూ బ్రహ్మ కి ఒక పగలు, శ్రీకృష్ణునికి నిశ్వాస. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఉచ్ఛ్వాస చేస్తాడో మార్కా౦డేయుడు శ్రీకృష్ణుని శరీరంలోకి లాగబడతాడు. శరీరం లోపల అనేక నక్షత్ర వీధులు, సమస్త సృష్టి నిశ్చలంగా ఉండడం చూస్తాడు.
అలాగ మార్కా౦డేయుడు కొన్ని కోట్ల సంవత్సరాలు శ్రీకృష్ణునిలో ఉంటాడు. అటు తరువాత శ్రీకృష్ణుడు నిశ్వాసలో మార్కా౦డేయుడు బయట పడి, మొదట చూసిన పసికందును తనకు మాయ అనుభవం ఇచ్చినందుకు కౌగలించుకొంటాడు. ఆ పసికందు తక్షణమే అంతర్ధానమై, మార్కా౦డేయుడు తన పూర్వ స్థితిలో ఆశ్రమం లో ధ్యానం చేసికొ౦టూ ఉంటాడు. ఇది అంతా అతడు సమాధిలో అనభవించినది. దీనివలన తెలిసినదేమిటంటే సృష్టి, జీవుల పరిణామం, అంతా భగవంతుని లీల.