Bhagavat Gita
9.7
అవజావంతి మాం మూఢా మానుషీ౦ తమ మాశ్రితాం
{9.11}
పరం భావ మజానంతో మమ భూతమహేస్వరమ్
సర్వ భూత మహేశ్వరుడగు నా వైభవమును తెలియని మూఢులు మానవ దేహమును ఆశ్రయించిన నన్ను అలక్ష్యము చేయుచున్నారు
మోఘాశా మోఘకర్మణో మోఘజ్ఞానా విచేతనః
{9.12}
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీ౦ శ్రితాః
వ్యర్థములైన కోరికలు గలవారు, వ్యర్థమైన కర్మల నాచరించువారు, అజ్ఞానులు, అవివేకులు మోహ సంబంధమైన ఆసురీ ప్రకృతిని పొందుచున్నారు ఀ
ఇక్కడ శ్రీకృష్ణుడు కొందరిని మూఢులని చెప్పుచున్నాడు. అట్టివారు జీవితమును పైపైనే చూసి, సుఖానుభవమునకై వస్తువులను కాంక్షిస్తారు. వారు మేధతో ఆలోచించలేరు. జీవితమంతా ఇంద్రియ సుఖాలకి, వస్తువులను పోగుచేసుకోవటానికి వ్యచ్చి౦చి దేహంతో తాదాత్మ్యం చెంది, జీవితాన్ని వ్యర్థం చేసుకొంటారు. దాని వలన ఎటువంటి సంతృప్తి ఉండదు. భౌతిక ప్రపంచం పరిమితమైనది; సదా మార్పు చెందునది. జీవితాన్ని పైపైనే బ్రతుకుతే ఇతరుల మేలుకై పాటుపడరు. ఇటువంటివారు, వారి ఉద్దేశాలు మంచివైనప్పటికీ, ఇతరులకు హాని కలిగించే కర్మలు చేయవచ్చు.
ఉదాహరణకి కొందరు ఎక్కువ ఉత్పత్తి చేసి, దానిని వినియోగించి తమ గమ్యాన్ని చేరాలని తలుస్తారు. శ్రీకృష్ణుడు దానిని మోఘాశా మోఘకర్మణో అంటాడు. అనగా "వ్యర్థమైన ఆశలు, వ్యర్థమైన కర్మలు". ఎవరైతే లాభానికై ఉత్పత్తి చేస్తూ, ఆనందానికై వస్తువులను వినియోగిస్తూ ఉంటారో వారు చివరకు నిరాశా నిస్పృహలు పొందుతారు. పెద్ద పెద్ద సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక వస్తువులను తయారు చేస్తూ, గ్రహించినదేమిటంటే మన భూమికున్న వనరులు పరిమితమైనవని. యోగులు వనరుల గురించి కాక, వాటిని ఉపయోగించు విధానము వ్యర్థమని చెప్పుచున్నారు.
సామాన్య జీవితము ఆనందదాయకము. సామాన్య జీవితమనగా పూర్వ కాలం లాగా విద్యుత్తు లేక, మోటార్ వాహనాలులేక బ్రతకడం కాదు. సామాన్య జీవితం ఎక్కువ సృజనాత్మకత, ఆచారణాత్మకత కూడి ఉంటుంది. అది వ్యక్తుల లక్షణాలను ముఖ్యముగా చూసి, కుటుంబంతోనూ, మిత్రులతోనూ, సమాజంతోనూ దృఢమైన బంధాలు ఏర్పరిస్తుంది.
నేటికాలంలో నివసిస్తున్న దంపతులకు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. వాళ్ళకు రెండు వాహనాలు, వేర్వేరు పడక గదులు మొదలగునవి ఉండాలి. ఎందుకంటే వారి మధ్య సామరస్యం లేదు. అలాగే వారు తమ జీవితంలో మంచి ఎన్నిక చేసికోలేరు. ఇంటికి ప్రతీ సంవత్సరం క్రొత్త హంగులు చేయాలి; క్రిందటేడు కొన్న వాహనాన్ని అమ్మి క్రొత్త వాహనాన్ని కొనాలి వగైరా. కొన్నేళ్లలో వాళ్ళు తెలిసికొనేది జీవితం క్లిష్టమైనదని; దానివలన సంతృప్తి లేదని.
కొన్ని జాపనీస్ ఇళ్ళు చాలా సామాన్యంగా ఉంటాయి. అవి చాలా అందంగాకూడా ఉంటాయి. మనమెంత వస్తువులను పోగుచేసుకొంటామో, అంత వ్యధ ఉంటుంది. ఎందుకంటే అవి మనకి, మన సంతృప్తికి మధ్య అవరోధంగా ఉంటాయి.
మన ఇష్టాలకై, విధేయతకై, క్రియలకై సమయాన్ని ఎంత ఎక్కువ వెచ్చిస్తే బ్రతకడానికి అంత తక్కువ సమయం ఉంటుంది. సామాన్య జీవన మనగా నిరాశగా బ్రతకడం కాదు; మన సమయాన్ని, ఏకాగ్రతను ముఖ్యమైన పనులు చేయడానికే వ్యచ్చి౦చడం. అలాగే తలిదండ్రులు పిల్లలతో ఎక్కువ కాలం గడిపి వాళ్ళను సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా తీర్చి దిద్దాలి. మిత్రులతో అభిమానంగా, విశ్వాసంతో ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. మనకు బాగా తెలిసిన మిత్రుడు మనకు తీరని నష్టం కలిగిస్తూ ఉంటే వానిని నేర్పుతో హెచ్చరించాలి. అటువంటి బంధాలు చాలా సమయాన్ని తీసికొంటాయి. మనం ఒక వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఒక్క రోజులో పొందలేము. దానికై కృషి చెయ్యాలి. రోజులో 8 గంటలు పనిచేసి, మిగతా సమయం టివి దగ్గర, వంటయింట్లో లేదా షాప్ లలో గడుపుతే మైత్రికి సమయం ఎక్కడ? కానీ మన జీవితాన్ని సామాన్యంగా మార్చుకొంటే, మన౦ బంధు మిత్రులతో ఎక్కువ కాలం గడిపి, నిత్యం ఉత్సాహంగా ఉంటాము.