|
|
|
|
Table Of Contents
CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
THE ELEMENTS OF SACRIFICE
ALL the hymns of the Rig Veda are ritual hymns in some sense, since all were sung as part of the Vedic ceremony, but some are self-consciously devoted to the meaning of the ritual.1 Even here, pride of place is given to the verbal rather than to the physical aspect of the sacrifice, the origins of sacred speech (10.71) and the powers of sacred speech (10.125). The personal concerns of the priests also inspire considerable interest in the authors of the hymns (priests themselves): the priest whose patron is the king (10.173) laments the loss of his royal friend (10.33) and praises faith and generosity (10.151 and (10.117), while other priests, more securely employed, express their happiness in a hymn that is lively to the point of bawdiness (10.101; cf. 7.103 and 9.112). The meaning of the sacrifice is explored in a hymn that unites all of these themes and expresses them in the form of a series of riddles about the meaning of life (1.164).
యజ్ఞ భాగములు
సాధారణంగా ఋగ్వేద మంత్రాలు వైదిక విధులకు సంభందించినవి అయినప్పటికీ , కొన్ని మాత్రము ఆ విధులను గూర్చి చెప్పబడినవి1. ఈ నేపథ్యంలో కర్మలకన్నా మంత్రోచ్ఛారణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడినది. అనగా వాక్కుయొక్క ఆవిర్భావము (10.71), వాక్చ్చక్తి యొక్క ప్రాముఖ్యత మీద ఋక్కులు చెప్పబడినవి (10.125). పురోహితుల యొక్క పరిస్థితుల ఆధారంగా, ఒకప్పటి పురోహితులైన మంత్ర ద్రష్టల గూర్చి ఆసక్తి కలుగజేయడమైనది. ఒక రాజాశ్రయితుడైన పురోహితుడు (10.173) , తన మిత్రుడైన రాజు మరణించగా (10.33) వాని యొక్క ఉదారత, దైవభక్తి గూర్చి విలపించెను (10.151; 10.117). తక్కిన స్వయం ఉపాది కలిగిన వారు తమ సంతోషమును బాహాటంగా తెలియచేసేరు (10.101, 7.103, 9.112). యజ్ఞము ఎందుకొరకు చేయాలో ఒక ఋక్కులో తెలుపుతూ జీవితము గూర్చి అనేక చిక్కు ప్రశ్నలతో అన్నిటినీ కూలంకషముగా తెలియజేయడమైనది (1.164).
NOTES
1. Cf. especially 10.90, 10.130, 9.112, and the hymns to Agni and Soma.
వివరణ
1. (10.90; 10.130; 9.112) అగ్ని మరియు సోముని గూర్చి ఋక్కులు
10.71 The Origins of Sacred Speech
This hymn speaks of the origins of the sacred word, speech or language (goddess), and of its ritual recreation through the verbal contests of the Vedic sacrifice.
The social nature of speech is emphasized, the birth of speech in friendship and its use by all of the assembly (v. 10) and by the four priests with their individual functions (v. 11). The enemy of true speech is represented as the rival of the author of this hymn (vv. 4-6,9).
10.71 వాక్కు ఆవిర్భావము
ఈ ఋక్కు యజ్ఞములో ఉచ్ఛరించే మంత్రాలు, పవిత్రమైన వాక్కు , దేవతల భాషలతో గల సంభందాన్ని వివరిస్తుంది. వాక్కు యొక్క సామాజిక విలువ, మైత్రితో కూడిన వాక్కు యొక్క ఆవిర్భావము, యజ్ఞ వాటికలో నున్న ప్రేక్షకుల పద ప్రయోగములు (10), నాల్గు పురోహితుల మంత్ర పఠనము (11) వివరింపబడినది. సత్య వాక్కు యొక్క శత్రువు, ఈ ఋక్కును దర్శించిన ద్రష్ట యొక్క శత్రువుగా పరిగణించబడినది. (4-6; 9)
1. Brhaspati1 When they2 set in motion the beginning of speech, giving names, their most pure and perfectly guarded secret was revealed through love.
1. బృహస్పతి1: వాక్కు ఆవిర్భావము, పదముల సముదాయము, వాటి యొక్క రహస్య ప్రకరణము ప్రేమ పూర్వకముగా చెప్పబడినవి.
2. When the wise ones2 fashioned speech with their thought, sifting it as grain is sifted through a sieve3 then friends recognized their friendships. A good sign was placed on their speech.
2. ఋషులు2 వాక్కుని తమ మనస్సులో, ధాన్యమును జల్లెడ3 పట్టినట్టుగా, దర్శించిగా వారి మిత్రులు తమ మైత్రిని గుర్తించేరు. ఋషి వాక్కు సత్య వాక్కుగా పరిగణించబడినది.
3. Through the sacrifice they traced the path of speech and found it inside the sages. They held it and portioned it out to many; together the seven singers2 praised it.
3. యజ్ఞమూలాచారించి వాక్కు ఋషులలో ఆవిర్భవించినదని గుర్తించేరు. ఋషులు అందరికి వాక్కును పంచి పెట్టేరు. ఏడు గాయకులు2 వారిని పొగిడేరు.
4. One who looked did not see speech, and another who listens does not hear it. It reveals itself to someone as a loving wife, beautifully dressed, reveals her body to her husband.
4. ఒకడు ఎంత వెతికినా వాక్కును దర్శించలేదు. మరొకడు విన్నా, అర్థం చేసుకోలేదు. ఒక ప్రేమపూరితమైన భార్య అందమైన దుస్తులు ధరించి భర్తకు తన మేనును చూపించినట్లుగా, వాక్కు తన స్వస్వరూపము తెలియజేస్తుంది.
5. One person, they said, has grown awkward and heavy in this friendship; they no longer urge him forward in the contests. He lives with falsehood like a milkless cow, for the speech that he has heard has no fruit no flower.
5. ఒకడు మైత్రిలో ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే, మిత్రులు వానిని వాగ్వాదములకు పిలువరు. వాని వాక్కుకు గొడ్డు పోయిన పశువులాగ ఫలవంతము గాదు.
6. A man that abandons a friend who has learned with him no longer has a share in speech. What he does hear he hears in vain, for he does not know the path of good action.
6. ఒకడు తనతో చదువుకున్న మిత్రుని వదిలివేస్తే, వాని వాక్కుకు విలువ లేదు. అతడు సత్య వాక్కు విన్నా అది వృధా; ఎందుకంటే వానికి సత్కర్మ చేయు జ్ఞానము లేదు.
7. Friends have eyes and ears, but their ashes of insight are not equal. Some are like ponds that reach only to the mouth or shoulder; others are like ponds that one could bathe in.
7. మిత్రులకు కళ్ళు, చెవులు ఉన్నా వారి విచారణ పలు విధములుగా నుండును. కొందరు భుజాల వరకు నీరు తగిలే సరస్సుల వంటి వారు కాగా, మరి కొందరు స్నాన మాచరించ గల్గిన లోతైన సరస్సుల వలె నుందురు.
8. When the intuitions of the mind are shaped in the heart, when Brahmins perform sacrifices together as friends, some are left behind for lack of knowledge, while others surpass them with the power to praise.
8. మనస్సులోని ఆలోచనలు హృదయముతో మేళవించి, బ్రాహ్మణులు సఖ్యతతో యజ్ఞములు ఆచరించగా, కొందరు జ్ఞాన శూన్యులు వెనుక బడగా, ఇతరులు వారిని పొగడ్తలతో అధిగమించెదరు.
9. Those who move neither near nor far, who are not real Brahmins nor pressers of the Soma; using speech in a bad way, they weave on a weft of rags, without understanding.
9. బ్రాహ్మణులు కాని వారు మరియు సోమ రసమును తయారు చేసేవారు కొందరు వాక్కుని దుర్వినియోగము చేసి, చినిగిన గుడ్డలను నేత నేసే వారలులాగ జ్ఞాన శూన్యులు.
10. All his friends rejoice in the friend who emerges with fame and victory in the contest. He saves them from error and gives them food. He is worthy to be pushed forward to win the prize.
10. వాగ్వివాదములలో జయించి, పేరు ప్రఖ్యాతులు గడించిన వానిని మిత్రులు ఆనందముతో ఆహ్వానించెదరు. అతడు వారి తప్పులు సవరించి, ఆహారమును ప్రసాదిస్తాడు. అతడు బహుమతి పొందుటకు అర్హుడుగా తీర్మాణిస్తారు.
11. One sits bringing to blossom the flower of the verses. Another sings a song in the Sakvari metre. One, the Brahmin, proclaims the knowledge of the ancient ways. Another lays out the measure of the sacrifice.
11. ఒకడు ఋక్కులు పువ్వులు వికసించునట్లుగా అల్లెదడు. మరొకడు శక్వారి ఛందస్సులో పాటను కూర్చి పాడెదడు. ఒక బ్రాహ్మణుడు సనాతన ధర్మమును తెలిపెదడు. మరొకడు యజ్ఞము యొక్క ఫలమును వివరించెదడు.
NOTES
వివరణ
1. This epithet, that literally means ‘lord of sacred speech’, is particularly appropriate here as Brihaspati is the patron of speakers and inspired poets.
1. వాగ్గేయకారులు, కవులు వాక్కుకు అధిపతియైన బృహస్పతిని ఆరాధిస్తారు.
2. The first poets and seers.
2. మొట్ట మొదటి కవులు మరియు ద్రష్టలు.
3. The Soma juice is purified by being filtered through a sieve.
3. సోమ రసము జల్లెడతో శుభ్రము చేస్తారు.
4. The Hotha priest sits motionless and invokes the gods; the Udgätr sings; the Brahmin must make sure that no mistakes are committed, and the Adhvaryu is responsible for ritual activities like pressing the Soma (as in v. 9) and measuring the sacrificial area.
4. హోత కదలక, దేవతలను ఆహ్వానిస్తాడు; ఉద్ఘాత గానము చేస్తాడు; బ్రాహ్మణుడు తప్పులు చెయ్యకుండునట్లుగా చూస్తాడు; అధ్వర్యు సోమ రసమను తయారు చేయుట మరియు యజ్ఞ వాటికను కొలత వేయుట చేస్తాడు.
No comments:
Post a Comment