Friday, November 21, 2025

Wendy Doniger Rig Veda on Creation - II




Table Of Contents

CREATION

విషయసూచిక

సృష్టి

10.81-2   The All-Maker (Visvakarman)

10.81-2   విశ్వకర్మ

These two hymns to the artisan of the gods speculate on the mysterious period of the ancient past, now veiled from the priests of the present (10.81.1 and 10.82.7). The Creator is imagined concretely as a sculptor (10.81.2), a smith (10.81.3), or as a woodcutter or carpenter (10.81.4), but also as the primeval sacrificer and victim of the sacrifice (10.81.1, 10.81.5-6, 10.82.1), assisted by the seven sages (10.81.4, 10.82.2 and 10.82.4). Finally, he is identified with the one who propped apart sky and earth (10.81.2- 4, 10.82), the one who inspires thought (10.81.7) and answers questions (10.82) but is himself beyond understanding (10.82.5 and 7).

ఋక్కులు 10.811-10.81.2 దేవతల విశ్వకర్మను ఉద్దేశించి చెప్పబడినవి. వీటిలోని నిఘూడమైన విషయాలు ప్రస్తుత కాలంలోని వేద పండితులను కూడా అబ్బురపరుస్తాయి. (10.81 మరియు 10.82.7 ). విశ్వకర్మ ఒక శిల్పిగా (10.81.2) , కళాకారుడిగా (10.81.3) , వడ్రంగిగా (10.81.4) ఊహించబడెను. అలాగే అతడు సప్త ఋషుల సహాయముతో (10.81.4, 10.82.2, 10.82.4). యజ్ఞము చేసి తనను తాను అర్పించుకున్నట్లుగా (10.81.1, 10.85.5-6, 10.82.1). కూడా అభివర్ణించబడెను. చివరికి అతడు భూమ్యాకాశాలకి ఆధారంగా (10.81.2-4, 10.82.4) , ఆలోచనలకు ప్రేరణగా (10.81.7), ప్రశ్నలకు జవాబుదారిగా (10.82), కానీ ఊహాతీతంగా, తటస్తంగా (10.82.5 మరియు 7) ఉండేవాడని తెలియజేయబడెను.

10.81

1 The sage, our father, who took his place as priest of the oblation and offered all these worlds as oblation, seeking riches through prayer, he entered those who were to come later, concealing those who went before.1

1. మా తండ్రియైన ఋషి యజ్ఞమొనర్చే అధ్వర్యుగా నుండి విశ్వాన్ని ఆహుతి చేసెను. అతడు మిక్కిలి ఐశ్వర్యాన్ని కోరుతూ, పరమపదించిన పితృదేవతలకు, రాబోయే సంతతికై ప్రార్థించెను.1

2 What was the base,2 what sort of raw matter was there, and precisely how was it done, when the All-Maker, casting his eye on all, created the earth and revealed the sky in its glory?

2.విశ్వకర్మ, అందరినీ తన కను సన్నలతో గమనిస్తూ, భూమిని సృష్టించి, ఆకాశాన్ని దాని మీద నిలబెట్టే కార్యము చేయునపుడు తనకి ఆధారమేమి? 2 ముడి పదార్థములేవి? ఆచరించిన క్రమమేమి?

3 With eyes on all sides and mouths on all sides, with arms on all sides and feet on all sides, the One God created the sky and the earth, fanning them with his arms.3

3. తన కన్నులు, కర్మేంద్రియాలు అన్ని దిశలలో వ్యాపింపజేసి భూమ్యాకాశాలను చుట్టూ తన హస్తములతో ఆధరువాయెను . 3

4 What was the wood and what was the tree from which they4 carved the sky and the earth? You deep thinkers, ask yourselves in your own hearts, what base did he stand on when he set up the worlds?

4. అతడు చెక్కతో భూమ్యాకాశాలను చెక్కితే అది ఏ వృక్షాన్ను౦చి వచ్చింది4 ? జ్ఞానులు తమ హృదయాంతరంగాలలో అతడు దేని మీద నిలబడి ఆ కార్యం చేసేడో దర్శించగలరా?

5 Those forms of yours that are highest, those that are lowest, and those that are in the middle, O All-Maker, help your friends to recognize them in the oblation. You who follow your own laws, sacrifice your body yourself, making it grow great.5

5. ఉత్తముల, మధ్యముల, నీచుల రూపములు ధరించి యున్న విశ్వకర్మా, మీ సాంగత్యము కోరే మిత్రులకు వారిని ఎలా గుర్తించాలో తెలుపమని ఘృతాన్ని ఆహుతినీయుచున్నాను. నీవు స్వధర్మాన్ని పాటిస్తూ, నీ దేహాన్ని బలి చేసి, సృష్టిని పెంపొందించేవు. 5

6 All-Maker, grown great through the oblation, sacrifice the earth and sky yourself. Let other men go astray all around;6 let us here have a rich and generous patron.

6. విశ్వకర్మా ! ఈ ఆహుతి ద్వారా నీ పెరుగుదలను కోరి, భూమిని, ఆకాశాన్ని నీవే యజ్ఞ సామాగ్రిగా వాడమని కోరుతున్నాను. తక్కిన (యజ్ఞము చెయ్యని) పురుషులు ఎలా ఉన్నా 6, మాకు ఐశ్వర్యవంతుడైన, ఉదారుడైన యాజమానిని ప్రసాదించు.

7 The All-Maker, the lord of sacred speech, swift as thought – we will call to him today to help us in the contest. Let him who is the maker of good things and is gentle to everyone rejoice in all our invocations and help us.

7. వాక్శుద్ధికి అధిష్ఠానమైన, మనస్సు కంటే వేగంగా కదిలే విశ్వకర్మని నా ఈ చిన్న ప్రయత్నానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను.

10.82

1 The Father of the Eye,7 who is wise in his heart, created as butter8 these two worlds that bent low. As soon as their ends had been made fast in the east, at that moment sky and earth moved far apart.

1. కంటికి అధిష్ఠానమైన 7, మిక్కిలి ప్రజ్ఞావంతుడు ఈ రెండు ప్రపంచాలను (భువి, దివి) ఘృతముతో 8 చేసెను. తూర్పు దిక్కున వాటి అంచులను జత చేయగా భూమి, ఆకాశము వేరు పడెను.

2 The All-Maker is vast in mind and vast in strength. He is the one who forms, who sets in order, and who is the highest image. Their9 prayers together with the drink they have offered give them joy there where, they say, the One dwells beyond the seven sages.

2. విశ్వకర్మ మిక్కిలి మనోవైశాల్యము కలిగిన అతి శక్తిమంతుడు. అతడే ఆకారము, ఋతము నిర్ణయించే ఉన్నత స్వరూపుడు. వారి ప్రార్థనలు9, ప్రసాదము స్వీకరించి వారికి మిక్కిలి ఆనందము నొసగే అతడు సప్త ఋషులను మించినవాడు.

3 Our father, who created and set in order and knows all forms, all worlds, who all alone gave names to the gods, he is the one to whom all other creatures come to ask questions.

3. విశ్వాన్ని సృష్టించి, ఋతము కలిగించిన మా తండ్రి అన్ని రూపములు, జగత్తులు తెలిసినవాడు. అతడు దేవతలకు కూడా నామకరణము చేసేవాడు. జీవుల ప్రశ్నలకు జవాబు చెప్పగలవాడు

4 To him the ancient sages together sacrificed riches, like the throngs of singers who together made these things that have been created, when the realm of light was still immersed in the realm without light.10

4. ఎప్పడు వెలుగు చీకటినుండి బయటకు వెలువడి లేదో 10, గాయకులవంటి కళాకారుల సమూహములు వెంటరాగా సనాతనమైన ఋషులు తమ ఐశ్వర్యాన్ని అర్పించి సృష్టిలోని వస్తువులను తయారు చేసేరు.

5 That which is beyond the sky and beyond this earth, beyond the gods and the Asuras11 – what was that first embryo that the waters received, where all the gods together saw it?12

5. ఏదైతే భూమ్యాకాశాలకు, దేవాసురులకు 11 అతీతమై- సృష్టి జలాలలో ప్రవేశబెట్టిన, దేవతలందరూ దర్శించిన, మొదటి పిండము అయిఉన్నదో అది ఏమిటి12?

6 He was the one whom the waters received as the first embryo, when all the gods came together. On the navel of the Unborn was set the One on whom all creatures rest.13

6. దేవతలు ఏకమై వచ్చినపుడు, అతడే సృష్టి జలములలో ఉన్న మొదటి పిండము. జన్మించని వాని నాభి నుండి సమస్త జీవుల ఆధారము 13 సృష్టింపబడెను.

7 You cannot find him who created these creatures; another14 has come between you.

7.సమస్త జీవులను సృష్టించిన వానిని దర్శించలేము. మరొకరు 14 మధ్యన ఉన్నారు.

Those who recite the hymns are glutted with the pleasures of life ;15 they wander about wrapped up in mist and stammering nonsense.

ఎవరైతే ఈ ఋక్కులను పాడుతారో వారికి సమస్త సుఖములు 15 ప్రాప్తించి, మంచు పొగలో తెలివి తక్కువ మాటలాడే వారిలాగ ఉంటారు.

NOTES

1. The early stages of creation remain in shadow, perhaps because the All-Maker destroyed them by sacrificing them and then prayed anew for the materials of creation.

1. ప్రప్రథమ సృష్టి తెలియబడనిది. బహుశా విశ్వకర్మ వాటిని యజ్ఞంలో ఆహుతి చేసి, మరల సృష్టికి కావలసిన పదార్థాలను తయారు చేసెను.

2. The question, to which verse 4 returns, is the problem of what the primeval sculptor stood on before there was anything created.

2. విశ్వాన్ని శిల్పంలా చెక్కిన విశ్వకర్మ దేని మీద నిలబడి ఆ కార్యం చేసేడు?

3. Though he has arms on all sides, here the anthropomorphic smith has two arms and ‘wings’, probably the feathers used to fan the forge. Cf. 9.112.2.

3. విశ్వకర్మకి లెక్క బెట్టలేని బాహువులు ఉన్నా, ఇక్కడ మానవుని వలె రెండు బాహువులున్నట్లుగా వర్ణించబడినది. (9.112.2.)

4. The assistants of the Creator, perhaps the seven sages (cf. 10.82.2 and 10.82.4).

4. విశ్వకర్మ యొక్క సహాయకులు సప్త ఋషులై యున్నారు. (10.82.2 and 10.82.4).

5. Here and in the next verse, the Creator is both the sacrificer and the sacrificial victim, as Purusa is in 10.90.16.

5. విశ్వకర్మ యజ్ఞము నాచరించిన వాడు మాత్రమే కాక , యజ్ఞంలో బలి చేయబడిన పురుషుడు కూడా. (10.90.16)

6. Here, and in 10.82.7, the enemies of the poet in the contest are mocked.

6. ఇక్కడ ద్రష్ట యొక్క శత్రువులు హేళన చేయబడెను. (10.82.7)

7. That is, creator of the sun.

7. సూర్యుని సృష్టించిన విశ్వకర్మ

8. Butter is symbolic of primeval chaotic matter, the seed of the creator, and the sacrificial oblation. The creator churns chaos. Cf. 4.58 for butter.

8. ఘృతము సృష్టికి ముందు అవ్యక్తంగా నున్న బీజముగా వర్ణింపబడినది. అందుకే నెయ్యని యజ్ఞంలో ఆహుతి చేస్తారు. విశ్వకర్మ ఋతము లేని పదార్థము నుండి క్రమబద్దమైన సృష్టిని చేసేడు.

9. The wishes and sacrifices of the first sacrificers, the pious dead, are fulfilled in heaven.

9. ప్రప్రథమ యజ్ఞము చేసిన వారల, గతించిన పుణ్య పురుషుల మనోరథములు స్వర్గలోకంలో తీర్చబడును.

10. Day and night separated, like sky and earth.

10. వెలుగు మరియు చీకటి, భూమి మరియు ఆకాశము వలె విడదీయబడినవి.

11. The Asuras are the ancient dark divinities, at first the elder brothers and then the enemies of the gods (Devas).

11. అసురులు చీకటిని తలపించేవారు. వారు దేవతులకు అన్నలు అయినప్పటికీ, వారికి శత్రువులు.

12. For the embryo, cf. 10.121.1 and 10.121.7.

12. పిండాన్ని సూచిస్తుంది ( 10.121.1 మరియు 10.121.7.)

13. The navel is the centre of the wheel; cf. 1.164.13, 1.164.48.

13. నాభి చక్రము యొక్క ఇరుసుల కేంద్రము (1.164.13, 1.164.48)

14. Another creator has come between you, or, more likely (for the noun is neuter), another thing – ignorance – has come inside you as an obstacle; or a bad priest (such as are mentioned in the second half of the verse) has obscured the way to the gods.

14. మరొక సృష్టి కర్త నీకు, మరొక దానికి -- అనగా అజ్ఞానమునకు -- మధ్య అడ్డుగా వచ్చి ఉండవచ్చు. లేదా సజ్జనుడు కాని ఆధ్వర్యుడు దేవతల వద్దకు తీసికొని వెళ్ళే మార్గాన్ని నిరోధించేడు.

15. A double meaning here: the priests are glutted with the life they have stolen from the sacrificial beast and with the high life of luxury they have bought with their undeserved fees. Here the poet speaks of his priestly enemies, who do not understand the meaning of the sacrifice. The mist is both the miasma of their clouded minds and the smoke from the useless sacrifice.

15. ఇక్కడ రెండు విషయాలు సూచించడమైనది: (1) ఆధ్వర్యులు యజ్ఞముచేయుటకు తీసికొనే వేతనముతో విలాసవంతమైన జీవితము గడుపుతారు (2) యజ్ఞము గూర్చి తెలియని మూర్ఖులు లేదా శత్రువులు. పొగ మంచు అట్టివారి మనోఫలకములపై ఆవరించిన అజ్ఞానము లేదా యజ్ఞము నుంచి జనించే పొగను సూచించవచ్చు.

10.72 Aditi and the Birth of the Gods

10.72 దేవతల జననము

This creation hymn poses several different and paradoxical answers to the riddle of origins. It is evident from the tone of the very first verse that the poet regards creation as a mysterious subject, and a desperate series of eclectic hypotheses (perhaps quoted from various sources) tumbles out right away: the ‘craftsman’ image (the priest, Brahmanaspati or Brhaspati, lord of inspired speech); the philosophical paradox of non-existence;1 or the paradox of mutual creation (Aditi and Daksa, the female principle of creation or infinity and the male principle of virile efficacy, creating one another) 2 or contradiction (the earth born from the crouching divinity and then said to be born from the quarters of the sky).

ఈ ఋక్కు సృష్టిని గూర్చి జనించే ప్రశ్నలకు అనేక క్లిష్టమైన సమాధానాలను చెపుతుంది. ఈ మండలం మొదటి నుంచీ ద్రష్ట సృష్టిని ఒక విప్పలేని చిక్కుముడి లాగ అనేక ప్రమాణాలతో ప్రస్తావించేడు: విశ్వకర్మ (హోత, బ్రహ్మనస్పతి లేదా బృహస్పతి, వాక్ యొక్క అధిష్ఠాన దేవత); ఆస్తిత్వము లేని స్థితి1; పరస్పర జన్మ (అదితి మరియు దక్ష, స్త్రీ మరియు పురుష తత్త్వములు కలిగియుండి పరస్పరము సృష్టి చేసికొనుట)2; భూమి ఒకచోట పరమాత్మ సృష్టించినట్లుగా, మరొక చోట ఆకాశము నుండి విడిపడినట్లుగా చెప్పబడుట.

At this point, the speculations give way to a more anthropomorphic creation myth centring upon the image of the goddess who crouches with legs spread (Uttanapad); this term, often taken as a proper name, designates a position associated both with yoga and with a woman giving birth, as the mother goddess is often depicted in early sculptures: literally, with feet stretched forward, more particularly with knees drawn up and legs spread wide. Since she is identified with Aditi, the hymn moves quickly to the myth of Aditi and Daksa (in which the paradox of mutual creation is given incestuous overtones) and the creation of gods and men.

ఇప్పుడు ఊహాలన్నిటినీ ప్రక్కనుంచి, మానవుల వలె నున్న శరీరుల చేతనే సృష్టి అవతరించినట్లుగా చెప్పబడుచున్నది. ఒక యోగి ఆసనము వేసినట్లుగా లేక ఒక గర్భవతి ప్రసవము చేయునపుడు దాల్చే ఆకారము, లేదా పురాతన గ్రంధాలలో శక్తి స్వరూపిణి (ఉత్తానపాద) కాళ్ళను ముందుకు పెట్టి, ముణుకులను తన ఉదరము వద్దకు చేర్చి అగుపించే రూపము, ద్రష్ట అదితి అనే స్త్రీకి ఆపాదించుచున్నాడు. అదితి మరియు దక్ష తమను తాము సృష్టించుకొని, అంటే అంతర్గత లైంగిక సంభందముతో, దేవతలను, మనుష్యులను సృష్టి గావించి నట్లుగా తెలియజేయడమైనది.

The creation of the universe out of water (vv. 6-7) and the rescuing of the sun from the ocean (v. 7) are well-known Vedic images that move the hymn back to the cosmic level, from which it then returns to anthropomorphism and to the myth of Aditi, when the sun reappears as Martanda’, whose birth from Aditi is the subject of the final two verses.

జలము నుండి విశ్వము యొక్క ఆవిర్భావము (6-7) , సూర్యుని సముద్రము నుండి రక్షించుట (7) మొదలైన వైదిక పరమైన అంశాల నుండి, మానవ ప్రేరిత విశ్వ సృష్టిని, వ్యాప్తిని చెప్పడము జరిగినది. సూర్యుడు ఒక జడ పదార్థముగా గాక అదితి గర్భాన మార్తాండ అనబడే దేవతగా అవతరించినట్లు చెప్పడమైనది.

1 Let us now speak with wonder of the births of the gods – so that some one may see them when the hymns are chanted in this later age.3

1. ఇప్పుడు చిత్రవిచిత్రమైన దేవతల జన్మల గురించి విచారిద్దాం. ఎంతో కాలము క్రిందట జరిగిన ఈ విషయాలు ఈ ఋక్కులు పాడటము ద్వారా భవిష్య తరాలకు తెలియజేయడ మయినట్లు ఉంటుంది3.

2 The lord of sacred speech, like a smith, fanned them together.4 In the earliest age of the gods, existence was born from non-existence.5

2. వాగ్దేవత, ఒక కళాకారుని వలె, కూర్పు చేసెను4. దేవతల పూర్వము ఆస్తిత్వము అవ్యక్త స్థితి 5 నుండి ఉద్భవించింది.

3 In the first age of the gods, existence was born from non-existence. After this the quarters of the sky were born from her who crouched with legs spread.

3. దేవతల మొదటి దశలో అవ్యక్తము నుండి ఆస్తిత్వము జనించింది. అటు పిమ్మట ఆకాశం ఆమె యోని నుండి జనించింది.

4 The earth was born from her who crouched with legs spread, and from the earth the quarters of the sky were born. From Aditi, Daksa was born, and from Daksa Aditi was born.6

4. ఆమె యోని నుండి భూమి, భూమి నుండి ఆకాశము జన్మించేయి. అదితి నుండి దక్షుడు, దక్షుడు నుండి అదితి జన్మించేరు. 6

5 For Aditi was born as your daughter, O Daksa, and after her were born the blessed gods, the kinsmen of immortality.

5. ఓ దాక్షా! అదితి నీ కూతురుగా జన్మించిన తరువాత, దేవతలు, అమరులు జన్మించేరు.

6 When you gods took your places there in the water with your hands joined together, a thick cloud of mist7 arose from you like dust from dancers.

6. దేవతలు జలములలో చేతులు జోడించి తమ యధా స్థానములు తీసికొన్నప్పుడు, నాట్యామణుల చరణముల నుండి పైకెగసే ధూళి వలె పొగమంచు 7 ఏర్పడింది.

7 When you gods like magicians8 caused the worlds to swell,9 you drew forth the sun that was hidden in the ocean.

7. ఐంద్రజాలికుల 8 వలె దేవతలు సృష్టిని వ్యాప్తి 9 చేయగా, నీవు సముద్రజలాలలో దాచబడిన సూర్యుని వెలికి తీసావు.

8 Eight sons are there of Aditi, who were born of her body. With seven she went forth among the gods, but she threw Martand’,10 the sun, aside.

8. అదితి ప్రసవించిన ఎనిమిది శిశువులలో ఏడుగురు దేవతలు కాగా, మార్తాండుడనబడే 10 సూర్యుడు వేరు చేయ బడ్డాడు.

9 With seven sons Aditi went forth into the earliest age. But she bore Martand’ so that he would in turn beget off spring and then soon die.

9. ఏడుగురు పుత్రులతో అదితి సృష్టిని విస్తారింపజేసింది. ఆమె మార్తాండుడిని ప్రసవించుటకు ఉద్దేశ్యము అతడు త్వరగా పుత్రులను కని అకాల మృత్యువుతో మరణిస్తాడని.

NOTES

వివరణ

1. Cf. 10.129.1.

1. 10.129.1

2. Cf. Purusa and Viraj in 10.90.5.

2. పురుషుడు మరియు విరాట్ (10.90.5.)

3. The idea of ‘seeing’ the births of the gods may refer not to being actually present at that early time but rather to the poet’s gift of ‘seeing’ mythic events by means of his inspired vision.

3. ద్రష్ట దేవతల జననము ప్రత్యక్షంగా చూడలేక పోయినా, దివ్య దృష్టితో గాంచ గలిగేడని సూచింపబడినది.

4. ‘Them’ must refer to the two worlds, heaven and earth, rather than to the gods; the lord of sacred speech is here regarded as responsible for manual rather than spiritual creation.

4. ఇచ్చట దేవతలకు బదులుగా స్వర్గము మరియు భూమి సూచింపబడినవి. వాగ్దేవత మనుష్యుల ఆవిర్భావమునకు కారకుడని చెప్పబడుచున్నది.

5. Cf. 10.129.1.

5. 10.129.1

6. Sayana remarks that Yaska’s Nirukta 11.23 states that by the dharma of the gods, two births can be mutually productive of one another.

6. శయనుడు ఇట్లనెను: యాస్క నిరుక్తము 11.23 లో దేవతల ధర్మములో రెండు జీవులు ఒకరిని మరొకరు జనింప జేయవచ్చునని తెలపబడినది.

7. ‘Mist’ or ‘dust’ refers to the atomic particles of water, a mist that plays an important part in creation by virtue of its ambivalence, half water and half air, mediating between matter and spirit. Thus the steam rising from the asceticism of the Brahmacharin in the water (cf. 10.129.3-4) or the foam that appears when Prajapati heats the waters is the source of matter for creation.

7. పొగ మంచు నీటి అణువుల సముదాయము. అది కొంత భాగము నీరు, తక్కినది వాయువు కలిగి, పదార్థాన్ని చైతన్యముతో అనుసంధానము చేస్తుంది. కావున బ్రహ్మచర్యము నుండి వెలువడే తేజస్సు జలమును ఆవిరిగా మార్చగలదు. ప్రజాపతి జలములను ఉష్ణముతో మరిగించి నపుడు ఏర్పడిన నురుగు సృష్టికి కారణ మయింది.

8. These are Yatis, who may be a class of sages or ascetics; more likely, however, they are magicians, among whose traditional bag of tricks in ancient India was the ability to make plants suddenly grow. They may be linked with the dancers in verse 6, another aspect of creative shamanism.

8. వీరు యతులు, అనగా ఋషులు లేదా సన్యాసులు కావచ్చు. వారు ఐంద్రజాలకులు. వారు ఇంద్రజాలముతో బీజముల నుండి క్షణాలలో చెట్టును ఉత్పన్నము చేయగలరు. వారిని ఆరవ పాదంలో నాట్యకళాకారులతో జోడించి మనుష్యులను దేవతలతో అనుసంధానము చేసే షామాన్ వంటి వారలని చూపబడినది.

9. The verb (pinv) implies swelling up as with milk from the breast.

9. ఇచ్చట సృష్టి వ్యాప్తి చనుబాలతో కలిగే వ్యాపకము అనే ఉపమానముతో చూపబడినది.

10. Martatanda’s name originally meant ‘born of an egg’, i.e. a bird, and is an epithet of the sun-bird or fire-bird of Indo-Euro pean mythology. The verb describing what his mother did to him may mean either to throw aside or to miscarry, and a later etymology of Martand’ is ‘dead in the egg’, i.e. a miscarriage. The story of Martanda’s still-birth is well known in Hindu mythology: Aditi bore eight sons, but only seven were the Adityas ; the eighth was unformed, unshaped; the Adityas shaped him and made him into the sun. On another level, Martanda’ is an epithet of man, born from the ‘ dead egg ‘ that is the embryo ; he is thus the ancestor of man, like Yama or Manu (both regarded as his sons), born to die.

10. మార్తాండ అనగా ఒక పక్షిలాగ అండము లేదా గ్రుడ్డు నుండి జన్మించినది. ఇది సూర్య పక్షి లేదా అగ్ని పక్షి కావచ్చు. ఇచ్చట పద ప్రయోగమును బట్టి మార్తాండ అనగా అండములో మృతుడైన వాడు, అనగా గర్భశ్రావము కలిగినదని సూచిస్తున్నది. మార్తాండ యొక్క గర్భస్థ మృతి మన పురాణాలలో ఉన్నది. అదితికి జన్మించిన ఎనిమిది మంది పుత్రులలో, ఏడుగురు మాత్రమే ఆదిత్యులు అనబడేవారు. ఎనిమిదవ పుత్రుడు రూపరహితుడు, అసంపూర్ణుడు. ఆదిత్యులు వానికి ఆకారమునిచ్చి సూర్యునిగా జేసిరి. వేరే విధంగా చూస్తే: మార్తాండ అనగా మృతమైన గ్రుడ్డు లేదా పిండమునుంచి జన్మించినవాడు. కాబట్టి అతడు యముడు లేదా మనువు ( అతని అమరులు కాని పుత్రులు) లకు పూర్వీకుడు.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda on Creation - II

Telugu English All Table Of Contents CREATION విషయసూచిక సృష్టి 10.81-2   The All-Maker (Visvakarman) 10.8...