Saturday, January 31, 2026

Wendy Doniger Rig Veda Departing Spirit




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము

10.58   ఆత్మ పయనాన్ని నివర్తించుట

10.58   A Spell to Turn Back the Departing Spirit

This imprecation to the mafias – heart, mind, and life-spirit -may have been spoken over a dead man or to a man on the brink of death, to keep the spirit within the body. The central verses refer alternately to earth (3, 5, 7, 9) and sky (4, 6, 8).

ఈ ఋక్కు హృదయము, మనస్సు, ఆత్మను ఉద్దేశించి చేసిన నిందలు, మరణించినవాని లేదా మరణ దశలో ఉన్నవాని, ఆత్మని శరీరములో నిర్భందించుటకై, చెప్పి ఉండవచ్చు.

1 If your spirit has gone to Yama the son of Vivasvan far away, we turn it back to you here to dwell and to live.

1. నీ ఆత్మ వివస్వనుని పుత్రుడైన యముని చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

2 If your spirit has gone to the sky or to the earth far away, we turn it back to you here to dwell and to live.

2. నీ ఆత్మ అంతరిక్షము లేదా దూర లోకాలకు చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

3 If your spirit has gone to the four-cornered earth far away, we turn it back to you here to dwell and to live.

3. నీ ఆత్మ దూరపు చతుర్భుజ లోకమును చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

4 If your spirit has gone to the four quarters of the sky far away, we turn it back to you here to dwell and to live.

4. నీ ఆత్మ చతుర్భుజములు గల బహుదూరపు ఆకాశము చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

5 If your spirit has gone to the billowy ocean far away, we turn it back to you here to dwell and to live.

5. నీ ఆత్మ దూరంగా నున్న పొంగే సముద్రము చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

6 If your spirit has gone to the flowing streams of light far away, we turn it back to you here to dwell and to live.

6. నీ ఆత్మ బహు దూరంగా నున్న ప్రవహించే నదులు లేదా కాంతిని చేరినచో , అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

7 If your spirit has gone to the waters, or to the plants, far away, we turn it back to you here to dwell and to live.

7. నీ ఆత్మ బహు దూరంగా నున్న జలములు లేదా వృక్షములు చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

8 If your spirit has gone to the sun, or to the dawns far away, we turn it back to you here to dwell and to live.

8. నీ ఆత్మ బహుదూరంగా నున్న సూర్యుడు లేదా సూర్యోదయములు చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

9 If your spirit has gone to the high mountains far away, we turn it back to you here to dwell and to live.

9. నీ ఆత్మ దూరంగా నున్న ఎత్తైన పర్వతాలను చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

10 If your spirit has gone to this whole moving universe far away, we turn it back to you to dwell and to live.

10. నీ ఆత్మ దూరంగా నున్న కదిలే ప్రపంచము చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

11 If your spirit has gone to distances beyond the beyond, far away, we turn it back to you to dwell and to live.

11. నీ ఆత్మ ప్రపంచపు అంచులు దాటిన అంచును చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

12 If your spirit has gone to what has been and what is to be, far away, we turn it back to you to dwell and to live.

12. నీ ఆత్మ భూత, భవిష్యత్ కాలములను చేరినచో, అది ఇక్కడ నివసించి, జీవించుటకై నివర్తించుగాక

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Departing Spirit

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...