Posts

Showing posts from March, 2022

Book3-Index

Image
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13.1 13.2 13.3 13.4 13.5-13.6 13.6 13.7 13.8 13.9 13.10-13.11 13.12 13.13-13.15 13.16-13.17 13.18-13.19 13.20-13.21 13.22-13.23 13.24-13.25 13.26 13.27-13.28 13.29-13.30 13.31-13.34 గుణత్రయ విభాగ యోగము 14.1-14.2 14.3-14.4 14.5 14.6 14.7 14.8 14.9 14.10 14.11 14.12 14.13 14.14-14.15 14.16 14.17 14.18 14.19-14.20 14.21 14.22-14.23 14.24 14.25 14.26 14.27 పురుషోత్తమ ప్రాప్తి యోగము 15.1 15.2 15.3-15.4 15.5 15.6 15.7-15.8 15.9 15.10 15.11 15.12 15.13-15.14 15.15 15.16 15.17-15.19 15.20 దైవాసుర సంపద్విభాగ యోగము 16.1-16.3 16.4 16.5 16.6 16.7-16.9 16.10 16.11 16.12 16.13 16.14-16.15 16.16 16.17-16.20 16.21-16.22 16.23-16.24 శ్రద్ధాత్రయ విభాగ యోగము 17.1 17.2 17.3 17.4 17.5-17.6 17.7-17.10 17.11-17.13 17.14-17.16 17.17-17.19 17.20-17.22 17.23-17.26 17.27-17.28 మోక్ష

Chapter 18 Section 32

Bhagavat Gita 18.32 సంజయ ఉవాచ: ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః {18.74} సంవాద మిమ మశ్రౌష౦ అద్బుతం రో మహర్షణమ్ ఈ విధముగ ఆశ్చర్యకరమైనదియు, గగుర్పాటును కలిగించునదియు, మహాత్ముడైన అర్జుననుకును, శ్రీ కృష్ణునకు మధ్య జరిగిన ఈ సంవాదనమును వింటిని వ్యాసప్రసాదా చ్చృతవాన్ ఏతద్గుహ్యమహం పరం {18.75} యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్కథయత స్స్వయమ్ వ్యాస భగవానుని అనుగ్రహము వలన గుహ్యమైనట్టియు, ఉత్తమమైనట్టియు నగు ఈ యోగ్యశాస్త్రమును యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వినగలిగితిని రాజన్ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య సంవాద మిను మద్భుతం {18.76} కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ధృత రాష్ట్ర మహారాజా! శ్రీ కృష్ణార్జునుల కళ్యాణకరమైన, అద్భుతమైన ఈ సంవాదమును భావించుకొలదియు నేను పరవశించి పోతున్నాను తచ్చ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య రూపమత్యద్భుతం హరేః {18.77} విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః రాజా! శ్రీహరి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విశ్వరూపమును తలచిన కొలదియు నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుచున్నది. ఆన

Chapter 18 Section 31

Bhagavat Gita 18.31 కచ్చి దేత చ్చృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా {18.72} కచ్చి దజ్ఞానసమ్మోహః ప్రణష్ట స్తే ధనంజయ అర్జునా! నిశ్చల చిత్తముతో నీవు గీతా శాస్త్రమును ఆలకించితివా! అజ్ఞానము వలన కలిగిన నీ మోహము నశించినదా? అర్జున ఉవాచ : నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయా అచ్యుత స్థితో అస్మి గతసందేహః కరిషే వచనం తవ కృష్ణా! నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది. {18.73} సంశయ రహితుడ నైతిని. నీ ఆజ్ఞను శిరసావహింతును ఀ గీత చెప్పేది: యుద్ధం మరియు భక్తి. సంస్కారాలతో, ఎప్పుడూ విడువకుండా, పోరు సల్పి తక్కిన వాటికై భక్తి సల్ప౦డి. అర్జునుడు "నాకు గత స్మృతి కలిగింది. నేనెవరినో తెలిసికొన్నాను" అని చెప్పెను. మన ప్రస్తుత పరిస్థితి మతిమరుపుతో కూడినది. మన దైవత్వాన్ని మరిచిపోయేం. ఒకరికి మతిమరుపు కలిగితే వాని బంధుమిత్రులు వచ్చి వానికి ఎరుక కల్పించరూ? మన౦ ఆధ్యాత్మిక మరపు నుండి లేచి ఇలా గుర్తు తెచ్చుకుంటాము: మనమొక విడిపడిన జీవి కాదు. మనం ఒక రాజ కుమారులం. మన కర్తవ్యం స్వరాజ్యానికి తిరిగి వెళ్ళడం. శ్రీకృష్ణుడు మనకొక సవాలు ఇచ్చేడు: మీరు క్షమిస్తే, నిర్

Chapter 18 Section 30

Bhagavat Gita 18.30 అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్య౦ సంవాదవయోః {18.70} జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః మన ఈ ధర్మరూపమైన సంవాదమును ఎవరు చదువునో వాడు జ్ఞాన యజ్ఞముతో నన్ను పూజించిన వాడగుచున్నాడు. ఇది నా అభిప్రాయము శ్రద్ధావాననసూయశ్చ శృణుయోదపి యో నరః {18.71} సో అపి ముక్తశ్శుభాన్ లోకాన్ప్రాప్నుయా త్పుణ్యకర్మణామ్ ఈ గీతాజ్ఞానమును శ్రద్ధావంతుడై, అసూయా రహితుడై ఆలకించెడి మనుజుడు పాపరహితుడై పుణ్యాత్ములు పొందెడి లోకములను పొందుచున్నాడు ఀ సంప్రదాయం ప్రకారం సంతోషమైన ప్రపంచం అనగా స్వర్గం, మరణించిన తరువాత పొందేదని చెప్పబడుచున్నది. గీతా పారాయణం చేసినంత మాత్రాన స్వర్గం వస్తుందని నమ్మేవారిని చూసి పండితులు నవ్వుతారు. ధ్యానం చేయక పోయినా ఒక శాస్త్రాన్ని ఔపాసన భక్తితో, శ్రద్ధతో చేస్తే మనస్సు శుద్ధి చెందుతుంది. ఆ విధంగా మన కర్మలు కూడా శుద్ధమవుతాయి. శ్రీకృష్ణుడు "ఎవరైతే గీతని భక్తితో, శ్రద్ధతో చదువుతారో, వాళ్ళు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు" అని చెప్పెను. ఇది మూఢ నమ్మకము కాదు. శ్రద్ధ గలవారు--అనగా తమను భౌతికంగా కాక, ఒక రసాయన సముదాయము కాక చూచ

Chapter 18 Section 29

Bhagavat Gita 18.29 య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వ భిధాస్యతి {18.68} భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః పరమ రహస్యమైన గీతా జ్ఞానమును నా భక్తులకు ఎవ్వడు చెప్పుచున్నాడో వాడు నాయందు ఉత్తమమైన భక్తిని కలిగి, సంశయ రహితుడై నన్నే పొందగలడు న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః {18.69} భవితా న చమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి మనుష్యులలో అతని కంటెను నాకు ప్రియమైనవాడు మరొకడు లేడు. అతని కంటెను మిక్కిలి ప్రియ మొనర్చువాడు మరి యొకడు ఉండబోడు ఀ ప్రపంచంలో పేదరికం, కాలుష్యం, అణ్వాశ్త్రములు ఉండగా, మంచివారు కూడా, ధ్యానం అవసరమా అని అడుగుతారు. భౌతిక సమస్యలు కళ్ళకు కనబడతాయి. ధ్యానం నిశ్శబ్దంగా ఉండి దైనిందన కార్యములతో ఎటువంటి సంబంధం లేనట్టు ఉంటుంది. "ధ్యానం రక్తపు పోటును తగ్గించవచ్చు, కానీ అది ప్రపంచ సమస్యలకు ఎలా పరిష్కారం ఇస్తుంది?" అని అడిగేవారున్నారు. ధ్యానం ఒక పనిముట్టు వంటిది. ఎవ్వరైనా దానిని ఉపయోగించి తమలోని గొప్ప శక్తిని వెలికి తీసి ఇతరుల సేవకై వినియోగించవచ్చు. గీత చెప్పే జ్ఞానం మనలో గుప్తంగా ఉన్న శక్తిని నిస్వార్థమైన కర్మలు, చాక

Chapter 18 Section 28

Bhagavat Gita 18.28 ఇదం తే నాట్యపస్కాయ నా భక్తాయ కదాచన {18.67} న చాశుశ్రూషవే వాచ్యం న చమా౦ యో అభ్యసూయతి నేను నీకు బోధించిన ఈ గీతామృతమును తపస్వి కాని వానికి, భక్తుడు కానివానికి, శుశ్రూష చేయని వానికి, నన్ను ద్వేషించినవానికి చెప్పగూడదు గీత ఎవరైతే శ్రద్ధతో విని, పాటిస్తారో వారి గురించై చెప్పబడినది. గీత జీవితం, మరణం గురించి చెప్పిన జ్ఞానము అనిర్వచనీయము. కాని ఆ జ్ఞానము అక్కరలేదు అనే వారికి గీత బోధించుట వ్యర్థము. మనము ప్రపంచాన్ని చేతన మనస్సుతో అనుభవిస్తాము. జీవితాన్ని మనమెలా ఉన్నామో అలాగ చూస్తాము. అది మన నడవడికకు మూలము. నిర్దయ, తప్పుగా అర్థం చేసికోవడం, అసహనం మన తప్పుడు అవగాహన వలన కలుగుతాయి. నా పెంపుడు కుక్క మూకాకు ఆకాశం నీలంగా ఉంది, మొక్కలు పచ్చగా ఉన్నాయి అని చెపితే అంగీకరించదు. ఎందుకంటే అది నలుపు, తెలుపు తప్ప మిగతా రంగులు చూడలేదు. అలాగే ఒక కళాకారుడు, నేను నీలం అనుకునే వస్తువులో, అనేక నీలి ఛాయలు చూస్తాడు. ఎవరి ప్రపంచం నిజం? నేను, మూకా, ఉండే ప్రపంచాలు వేర్వేరు. నేను సాన్ ఫ్రాన్సిస్ కో వెళితే, నేను చూసే ప్రపంచం, పర్యాటకులు చూసే ప్రపంచం వేర్

Chapter 18 Section 27

Bhagavat Gita 18.27 మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు {18.65} మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసిమే నా యందు మనస్సు నుంచుము. నా భక్తుడవు కమ్ము. నన్ను అర్చించుము. నాకు నమస్కరింపుము . అట్లు కావించెద వేని నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టుడవు. అందువలన సత్యమును ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ {18.66} అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మములను త్యజించి నన్నొక్కనినే శరణు పొందుము. నేను నిన్ను సకల పాపములనుండి విడిపించెదను. నీవు శోకింపకుము గాంధీ మహాత్ముని ఒకరడిగేరు: "దేవుడు మనని ఎందుకు సంతృప్తి పరచడు?" ఆయన జవాబు: "అది ప్రేమకాదు. ఒప్పందం." నిజమైన దైవ భక్తుడు తనకున్నదంతా ఇతరులకై దారపోస్తాడు. బదులుగా ప్రేమ తప్ప ఏమీ అడగడు. అతి తక్కువ యోగులు ఒకేమారు తమ కున్నదంతా త్యజిస్తారు. తక్కినవాళ్ళు ఇంద్రియ సుఖములను ఆశిస్తారు. ధ్యానంలో మనము అచేతన మనస్సు లోతులకు వెళతాము. అక్కడ అనేక శక్తులు ఉంటాయి. మనస్సులో ఒక చేతనం నుంచి ఉంకొకదానికి వంతెనలు లేవు. మనము చేతనముగా ఉండి, అచేతన మనస్సు

Chapter 18 Section 26

Bhagavat Gita 18.26 ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా {18.63} విమృశ్త్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు ఈ విధముగ రహస్యము లన్నిటి కంటెను అతి రహస్యమైన జ్ఞానమును నేను నీకు బోధించితిని. దీనిని బాగా విచారించి, ఆ తరువాత నీకు తోచినట్లు చేయుము సర్వగుహ్యతమం భూయః శృణు మే సరమ౦ వచః {18.64} ఇష్టో అసి మే ధృడమితి తతో వక్ష్యామి తే హితమ్ రహస్యము లన్నిటి కంటెను రహస్యమైనదయు, ఉత్తమ మైనదియు నగు నా వచనములను మరల ఆలకింపుము. నీవు నాకు మిగుల ఇష్టుడవు. అందువలన నీ మేలు గోరి చెప్పుచున్నాను శ్రీకృష్ణుడు చెప్పేది "నేను నీకు ఎక్కడా దొరకని జ్ఞానమును ఇచ్చేను. దానిని విచారించుము. దానిగురించి లోతుగా ఆలోచింపుము. దానిని అన్ని చోట్ల, ప్రతి పరిస్థితిలోనూ పరీక్ష చేయుము. నీకు తోచినది చేయుము". కానీ అతడు "నేను చెప్పినది చేయకపోతే వెయ్యేళ్ళు నరకమనుభవిస్తావు" అనలేదు. "మీరు హేతుబద్ధమైన వారు, శ్రధ్ధ గలవారు. మీకు మంచి చెడు, ఆరోగ్యం రోగం, ప్రేమ అసహ్యం గురించి తెలుసు. కాబట్టి మీరు ఎన్నిక చేసుకోండి" అని మనకి అతిగొప్ప నివాళి చేసేడు. ఇది గీత యొక్క గొప్

Chapter 18 Section 25

Bhagavat Gita 18.25 ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి {18.61} భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అర్జునా! ఈశ్వరుడు యంత్రము నారోహించిన వారివలె యున్న సకల ప్రాణులను తన మాయచేత త్రిప్పుచు, సమస్త జీవుల హృదయముల యందు వెల్గొందుచున్నాడు తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత {18.62} తత్ప్రసాదాత్పరాం శా౦తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ భారతా! సమస్త భావముల చేత అట్టి పరమేశ్వరునే శరణు పొందుము. అతని అనుగ్రహము వలన ఉత్తమమైన శాంతి, శాశ్వతమైన మోక్షమును పొందగలవు నా గ్రామంలో ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు, అతని కొడుకులు అనేక వస్తువులు: కుండలు, ప్రమిదలు మొదలైనవి చేస్తూ ఉండేవారు. రోజూ ఉదయాన్నే అతడు నది దగ్గరకు వెళ్ళి బంక మన్నును సేకరించేవాడు. అతని కొడుకు చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఆ మట్టితో వస్తువులు చేసేవాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు జీవుడు అనేక మార్లు పుట్టి, మరణించి, పరిణామ౦ చెంది కాలమనే చక్రములో తిరిగి, కర్మను పోగుచేసుకొని, తద్వారా మలచబడ్డాడు. అలా తిరగడం, మలచబడడం మాయ వలన జరుగుతుంది. మానవ జీవితం బంక మన్నుతో ఏ గుణాలూ --మంచి చెడు లేదా స్వార్థం నిస్వార్థం--

Chapter 18 Section 24

Bhagavat Gita 18.24 యదహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే {18.59} మిథ్త్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి నీవు అహంకారమును ఆశ్రయించి, యుద్ధము చేయనని తలంచెదవేని నీ ప్రయత్నము వ్యర్థమగును. నీ స్వభావము నీ చేత ఆ పనిని చేయించును స్వభావజేన కౌన్తేయ నిబద్ధ స్స్వేన కర్మణా {18.60} కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్యవశో అపి తత్ అర్జునా! నీవు అవివేకము వలన నీ కర్మను ఆచరించ నిచ్చగింపకపోయినను, స్వభావసిద్ధమైన నీ కర్మ చేత బంధింపబడిన వాడవై, పరవశుడవై చేయుదువు రెండు శక్తులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి: రాబోయే పరిణామం మరియు మన గతం. కాని ప్రతి అనుభవంలోనూ, స్వభావములోనూ ఒక ముఖ్యమైన పరిణామ కారణం ఉన్నది: మన జీవిత గమ్యానికి దగ్గర చేయడం. మన౦ అనుభవించే ప్రతి సమస్య, లక్ష్యం దగ్గరకు తీసికెళ్ళే అవకాశం ఇస్తుంది. గాంధీకి 20 ఏళ్ల వయస్సులో, స్వదేశంలో ఉద్యోగం దొరకక, ఉద్యోగమునకై తక్కువ జీతానికి ఒప్పుకొని సౌత్ ఆఫ్రికా కి వలస వెళ్ళడం, ఆయన వ్యక్తిత్వం, స్వభావం మార్పు చెందిడానికి, అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశం ఒక అపజయాన్ని, నిరాశను కల్పించవచ్చు. దేవుడు ఆయ

Chapter 18 Section 23

Bhagavat Gita 18.23 మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా త్తరిష్యసి {18.58} అథ చేత్త్వమహంకారాత్ స శ్రోష్యసి వినంక్ష్యసి నా యందు చిత్తము గల నీవు నా అనుగ్రహము వలన సర్వ సంకటములను దాటగలవు. ఒకవేళ నీవు అహంకారము వలన వినని యెడల చెడిపోయెదవు మనం జీవిత అంచులలో బ్రతుకుతూ ఉంటే మన సమస్యలు కూడా చిన్నవై ఉంటాయి. అవి పెద్దవి అనిపిస్తే, మన౦ చేతన మనస్సు లోతులకు వెళ్లలేదని అర్థం. మన౦ లోతుకు వెళితే, ఇంకా ఎన్నో సమస్యలు ఎదురవ్వవచ్చు. కాని అవి మనం భరించలేనంతగా ఉండవు. మనం ఆధ్యాత్మికత వలన కలిగే కష్టాలను ఎదుర్కోలేమని అనుకోవడం శ్రద్ధ లేకపోవటం వలన. ఆ కష్టాలు సహజం, మరియు అవసరం కూడా. ప్రతి ఒక్కరూ వాటిని ఎదుర్కోగలరు. నా సాధనలో లోతుగా వెళ్ళే వేగం ఎక్కువైతే, నేనెంత క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్నా అంతర్ముఖుడినై, ఇంకా లోతుకు వెళ్ళి వాటిని పరిష్కరించే మార్గం వెతకుతాను. ఇటువంటి సాధన ప్రయత్నం చేసే వారందరికీ వర్తిస్తుంది. అలా చేయగలిగితే ఓటమివాదం పోతుంది. మనము మానవాతీత శక్తి ఉంటే తప్ప సాధన చేయలేమని అనుకోవడం అపోహ. యోగులు కూడా ఏ ఒక్కడూ ఆత్మ జ్ఞానాన్ని తనంతట తానే కలుగజేసికోడు అని అంటార

Chapter 18 Section 22

Bhagavat Gita 18.22 చేతసా సర్వకర్మాణ్యపి మయి సన్న్యస్య మత్పరః {18.57} బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ చిత్తముచే సర్వ కర్మలను నాయందు సమర్పించి మత్పరాయనుడవై, బుద్ధి యోగమును ఆశ్రయించి, సదా నా యందే చిత్తము గలవాడవు కమ్ము శ్రీకృష్ణుడు చివరగా అర్జునినికి బోధ చేయుచున్నాడు. "నీ మనస్సులో ఎటువంటి సంశయాలు ఉండకూడదు" అని పదే పదే చెప్పుచున్నాడు. ఒక పేరుపొందిన గాయకుడు "నాకు ప్రేమలో పడడం చాలా ఇష్టం. కాని అది 6 నెలల ముచ్చట" అన్నాడు. బంధాలు భౌతికమైనవి అయితే 6 నెలలే ఎక్కువ. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ చెప్పేది: "నీవు నన్ను నీ హృదయంతో, బలముతో, ఆత్మతో ప్రేమించ గలిగితే నీవు సదా ప్రేమతో ఉంటావు". కొంతమంది అడుగుతారు "పరమాత్మని సదా స్మరించడం అంటే ఏమిటి?" దానికి బదులుగా మనం ఆడగవలసింది పరమాత్మని స్మరించక పోతే ఏమవుతుంది? క్రోధం, శతృత్వం, చికాకు, అసహనం మొదలైన వాటితో కూడిన మానసిక స్థితి కలుగుతుంది. మన హృదయంలో దేవుని స్మరిస్తే, నిర్దయ రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ. మీరు నాలాగ ఇళ్లలోనూ, బస్సు ల్లోనూ, ద

Chapter 18 Section 21

Bhagavat Gita 18.21 బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి {18.54} సమస్సర్వేషు భూతేషు మద్భక్తి౦ లభతే పరామ్ బ్రహ్మభూతుడైన ప్రసన్నాత్ముడు దేనిని గూర్చి దుఃఖి౦పడు. దేనిని కోరడు. సమస్త ప్రాణుల యందును సముడై ఉత్తమమైన నా భక్తిని పొందుచున్నాడు భక్త్యా మామభిజానాతి యావాన్యశ్శ్చాస్మి తత్త్వతః {18.55} తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ అతడు భక్తిచేత నేనెవడనో, నా ప్రభావమెట్టిదో తెలిసికొను చున్నాడు. నన్ను ఈ విధముగ వాస్తవముగ గ్రహించినవాడై అనంతరము నా యందే ప్రవేశించుచున్నాడు సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్ప్యపాశ్రయః {18.56} మత్ప్రాసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ సర్వ కర్మములను సదా ఆచరించుచున్నను ఎవడైతే నన్ను శరణు పొంది యున్నాడో అట్టివాడు నా అనుగ్రహము వలన నాశరహితమైన మోక్షమును పొందుచున్నాడు శాశ్వతమైన జీవితం గూర్చి గురువులు చెప్పెదరు. అది అతిశయోక్తి కాదు. కొన్ని సంస్కృతులలో మరణం గురించి మాట్లాడరు. హిందూ మతములో మరణం ఒక తలుపు లాంటిది. ఇక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఒక సొరంగం ఉంది. దానిలోనుండి ఒక రహదారి వుంది. దాని లోకి

Chapter 18 Section 20

Bhagavat Gita 18.20 అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం {18.53} విముచ్య నిర్మమశ్శా౦తో బ్రహ్మభూయాయ కల్పతే విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధైర్యముతో మనో నిగ్రహమును పొంది, శబ్దాది విషయములను మరచి, రాగ ద్వేషములకు దూరుడై, ఏకాంత వాసియు, మితాహారియు, స్వాధీనమైన మనో వాక్కాయములు కలవాడు, సదా ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు, మమకార రహితుడు, శాంతుడు నగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు. ఇద్దరు ఎంత అన్యోన్య౦గా ఉన్నా వారు వాళ్ళ ఏకాంతం కోరుకొంటారు. గాంధీగారు బ్రతికున్నప్పుడు ఆయన ఇంటికి ఎవరైనా వెళ్ళవచ్చు; ఆయన ఎలా జీవిస్తారో, ఆలోచిస్తారో, ఆయన ప్రేరణ ఏమిటో తెలిసికోవచ్చు. సాధారణ మానవులు అలా కారు. మనం ఒకర్ని ప్రేమిస్తే, కొంత నిస్వార్థత ఉన్నా, మేము ఏకం అనడంతో, మన ప్రేమను భౌతిక శరీరానికే పరిమితం చేసేము. శ్రీకృష్ణుడు అటువంటి భౌతిక బంధాలలోని ప్రమాదాలను సూచించెను. అన్ని భౌతికమైన వస్తువుల లాగే భౌతిక బంధాలు మార్పు చెందుతాయి. కోరికలు క

Chapter 18 Section 19

Bhagavat Gita 18.19 బుద్ధ్యా విశుద్దయా యుక్తో ధృత్యా ఆత్మానాం నియమ్య చ {18.51} శబ్దాదీన్ విషయా౦ స్తక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః {18.52} ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధైర్యముతో మనో నిగ్రహమును పొంది, శబ్దాది విషయములను మరచి, రాగ ద్వేషములకు దూరుడై, ఏకాంత వాసియు, మితాహారియు, స్వాధీనమైన మనో వాక్కాయములు కలవాడు, సదా ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు, మమకార రహితుడు, శాంతుడు నగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు. ఆత్మ జ్ఞానం పొందటానికి నాలుగు అవరోధాలు ఉన్నాయి: శరీరము మరియు ఇంద్రియములతో తాదాత్మ్యము, మనస్సు, బుద్ధి, అహంకారం. వీటిని ఆత్మను కప్పి పుచ్చిన 4 పొరలులాగ ఊహించవచ్చును. ఇంద్రియములు భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకున్న పై పొర. దాని తరువాత మనస్సు: భావోద్వేగం, భావాలు. అటు తరువాత బుద్ధి: అభిప్రాయాలు, ఎన్నికలు. చివరిగా అహంకారం. అది నేను, నాది అనే భా

Chapter 18 Section 18

Bhagavat Gita 18.18 అసక్తబుద్ధి స్సర్వత్ర జితాత్మా విగతస్పృహః {18.49} నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి సర్వ విషయములందు ఆసక్తి లేనివాడు, మనో నిగ్రహము కలవాడు, కోరికలు లేనివాడును నగు మనుజుడు కర్మఫల త్యాగముచే నైష్కర్మ్య సిద్ధిని పొందుచున్నాడు సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధ మే {18.50} నమాసేనైన కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా అర్జునా! సిద్ధిని బొందినవాడు బ్రహ్మమును ఎట్లు పొందగలుగుచున్నాడో, అలాగుననే ఉత్తమమైన జ్ఞాననిష్ఠ ఏదియో దానిని సంక్షేపముగ తెలిపెదను వినుము దేవుని చేతిలో మనమొక పనిముట్టు. మనము ఆత్మకు కూడా ఒక పనిముట్టు. అనగా మనము భౌతిక లేదా మానసిక ప్రవృత్తులతో కాక ప్రేమతో కర్మ చెయ్యచ్చు. దానికై మన మనస్సును నియంత్రించాలి. మనం మనస్సు తప్ప ఏమీ లేదనుకొంటాము. కానీ ఆత్మ మనస్సుకన్న విశాలమైనది. అదే ప్రేమ పూరితమైనది. ఆత్మ జ్ఞానము కలుగవలెనన్న మన భావాలను, అభిప్రాయాలను దాటి వెళ్ళాలి. మనం భావాలు, ఆలోచనల సముదాయం కాకపోతే మరి మన మెవ్వరము? మన సహజ స్వరూపము ప్రేమ. ప్రేమ అతి ముఖ్యమైన భావము కాదా? యోగులు కాదు అందురు. ఎందుకనగా అది ఒక మ

Chapter 18 Section 17

Bhagavat Gita 18.17 స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః {18.45} స్వ కర్మ నిరత స్సిద్ధం యథా విందతి తచ్చృణు మనుజుడు తనది యైన కర్మము నందు శ్రద్ధ గలవాడై సిద్ధిని పొందుచున్నాడు. తన సహజ కర్మమునందు నిరతుడైనవాడు సిద్ధిని ఎలా పొందుచున్నాడో దానిని ఆలకింపుము యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం {18.46} స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ఎవని వలన ప్రాణులకు ఉత్పత్త్యాదులు కలుగుచున్నవో, ఎవని చేత ఈ సకల ప్రపంచము పరివ్యాప్తమై యున్నదో, వానిని మానవుడు తన స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందుచున్నాడు శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ {18.47} స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ చక్కగా ఆచరింపబడిన పర ధర్మము కంటెను, గుణము లేనిదైనను స్వధర్మానుష్ఠానము శ్రేయోదాయకము. మనుజుడు స్వభావ సిద్ధమైన కర్మమును చేయుచు పాపము నొందడు సహజం కర్మ కౌ౦తేయ సదోషమపి న త్యజేత్ {18.48} సర్వారంభా హి దోషణ ధూమేనాగ్ని రివావృతాః అర్జునా! పొగచేత నిప్పు కప్పబడినట్లు సర్వ కర్మములు దోషము చేత కప్పబడి యున్నవి. అందుచేత స్వభావ సిద్ధమైన కర్మను వదల

Chapter 18 Section 16

Bhagavat Gita 18.16 న తదస్తి పృథివ్యా౦ వా దివి దేవేషు వా పునః {18.40} సత్త్వ౦ ప్రకృతిజైర్ముఖం యదేభిస్స్యా త్త్రి భిర్గుణ్ఐః ప్రకృతి నుండి జనించిన ఈ మూడు గుణముల నుండి విడిపడిన వస్తువు భూలోకము నందు గాని, స్వర్గలోకము నందు గాని, దేవతలయందు గాని గోచరించదు బ్రాహ్మణ క్షత్రియవిశా౦ శూద్రాణాం చ పరంతప {18.41} కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవై ర్గణ్ఐః అర్జునా! బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకును వారివారి స్వభావము వలన కలిగిన గుణములచేత వారివారి కర్మములు ప్రత్యేకించబడినవి శమో దమ శ్శౌచం క్షాంతి రార్జనమేవ చ {18.42} జ్ఞానం విజ్ఞానమాస్తిక్య౦ బ్రహ్మకర్మ స్వభావజమ్ మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుభ్రత , ఋజుత్వము, సహనము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము, బ్రాహ్మణులకు నియమిత కర్మమై యున్నది శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్వ౦ యుద్ధే చాప్యపలాయనం {18.43} దానమీశ్వరభావశ్చ క్షాత్ర౦ కర్మ స్వభావజమ్ శూరత్వము, తేజస్సు, ధీరత్వము, యుద్ధమున పారిపోకుండా పోరుట, దానము, స్వామి భావము క్షత్రియునకు నియమితమైన కర్మము కృషి గోరక్ష వాణిజ్యం వశ

Chapter 18 Section 15

Bhagavat Gita 18.15 సుఖం త్విదానీ౦ త్రివిధం శృణు మే భరతర్షభ {18.36} అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి అర్జునా! దేని అభ్యాసము చేత మనుజుడు దుఃఖ నాశమును, సుఖానుభవమును, పొందుచున్నాడో అట్టి సుఖమిపుడు నా చేత మూడు విధములుగ తెలుపబడుచున్నది. ఆలకింపుము యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం {18.37} తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్ తన యొక్క బుద్ధి ప్రసన్నత వలన కలిగిన ఏ సుఖము ఆదియందు విషము వలెను, అనంతరము అమృతము గను యుండునో అట్టి సుఖము సాత్త్విక సుఖ మనుబడును విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం {18.38} పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ విషయేంద్రియ సంయోగము వలన కలిగెడి ఏ సుఖము ఆరంభము నందు అమృత తుల్యము గను, అనంతరము విషతుల్యముగను ఉండునో అట్టి సుఖము రాజస సుఖ మనబడును. యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః {18.39} నిద్రాలస్య ప్రమాదోత్థ౦ తత్తామస ముదాహృతమ్ ఆద్య౦తముల యందు మనుజునకు మోహమును కలుగ జేయునదియు, నిద్ర, అలసత్వము, ప్రమాదము వలన కలుగునదియైన సుఖము తామస సుఖ మనబడును ఀ ఈ శ్లోకములు ఆనందం గూర్చి చెప్పుచున్

Chapter 18 Section 14

18.14 ధృత్యా యయా ధారయతే మనః ప్రాణే౦ద్రియక్రియాః {18.33} యోగేనా వ్యభిచారిణ్యా ధృతి స్సా పార్థ సాత్త్వికీ పార్థా! ఏ ధైర్యముచేత మనస్సు, ప్రాణము, ఇంద్రియ చేష్టలను మనుజుడు చెదరకుండా నిలుపు చున్నాడో అట్టి దానిని సాత్త్విక ధృతి అందురు యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున {18.34} ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ రాజసీ ఫలము నాశి౦చువాడు దేనిచేత ధర్మార్థకామములను ఆసక్తితో ఆశ్రయించుచున్నాడో, పార్థా! అది రాజస ధృతి యగును యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ {18.35} న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసీ పార్థా! ఏ ధైర్యము చేత దుర్బుద్ధి గలవాడు స్వప్నమును, భయమును, శోకమును, విషాదమును, మదమును విడువకున్నాడో అట్టి ధృతి తామసిక ధృతి యగుచున్నది ఀ వ్యక్తులను మేధస్సు లేదా తెలివితేటలతో కాక పట్టుదల గలవారుగా చూడవచ్చు. ప్రతిచోటా ఐ క్యు అనగా ఇంటెలిజన్స్ కోష౦ట్ నే చూస్తారు. అది ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. కాని పట్టుదల మేధ అంతటి ఉన్నత లక్షణము. పట్టుదల తక్కువగా ఉంటే దానివలన మనం తీసికొనే నిర్ణయాలు కూడా అస్పష్టంగా ఉంటాయి. సంస్కృతంలో పట్టుదలను ధృతి

Chapter 18 Section 13

Bhagavad Gita 18.13 బుద్ధేర్భేదం దృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు {18.29} ప్రోచ్యమాన మసేషేణ పృథక్త్వేన ధనంజయ ధనంజయా! గుణముల ననుసరించి బుద్ధి యొక్కయు, ధైర్యము యొక్కయు భేదము మూడువిధములుగ చెప్పబడినది. సంపూర్ణముగ, వేర్వేరుగ చెప్పబడు ఈ విషయమును ఆలకింపుము ప్రవృత్తి౦ చ నివృత్తి౦ చ కార్యా కార్యే భయాభయే {18.30} బంధం మోక్షం చ యావేత్తి బుధ్ధి స్సా పార్థః సాత్త్వికీ అర్జునా! ప్రవృత్తి నివృత్తి విషయములను, కార్యాకార్యములను, భయాభయములను ఏదయితే తెలిసికొనుచున్నదో ఆ బుద్ధి సాత్త్వికమైనది యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ {18.31} అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థః రాజసీ అర్జునా! ధర్మాధర్మములను, కార్యాకార్యములను ఉన్న దున్నట్లుగాక భిన్నముగ గ్రహించెడి బుద్ధి రాజస బుద్ధి యనబడును అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా ఆవృతా {18.32} సర్వార్థాన్ విపరీతా౦శ్చ బుద్ధి స్సా పార్థ తామసీ పార్థా! ఏ బుద్ధి అజ్ఞానముచేత కప్పబడి అధర్మమును ధర్మముగను, సమస్త విషయములను విపరీతముగను గ్రహించుచున్నదో అది తామసిక బధ్ధి యనబడును ఀ ఈ పై శ్లోకాలు బుద్ధి గూర్చి చెపుతున్నా