Posts

Showing posts from January, 2024

Vidura Neeti Part 1

Telugu English All సంజయుడు పాండవ శిబిరం నుండి తిరిగి వచ్చిన అనంతరం ధృతరాష్ట్రుడు వాని ముఖాన పాండవుల అభిమతం (గహించి వికలచిత్తుడైనాడు. ఆ క్షణంలోనే ద్వారపాలకుని పిలిచి తక్షణం వెళ్ళి విద్వాంసుడైన విదురుని తీసుకొనిరమ్మన్నా డు. ద్వార పాలకుడు ఆమాత్యమందిరానికి వెళ్ళి విదురుని వెంట బెట్టుకుని వచ్చాడు. సింహద్వారంలో విదురుడు నిలబడ్డాడు. పరిచారకుడు లోపలకుపోయి ఆవార్త నివేదించాడు, ధృతరాష్ట్రుడు విదురుని లోపలకు ప్రవేశపెట్టమన్నాడు, రాజాజ్ఞానుసారం విదురుడు అ౦తఃపురంలో అడుగుపెట్టి, "ప్రభూ! నేను విదురు డను, మీ ఆజ్ఞానుసారం మీ సమ్ముఖానికి వచ్చాను. ఇప్పుడు నేను చెయ్యవలసిన పనేమిటో ఆజ్ఞా పించగోరుతున్నాను" అని చేతులు దోయిలించాడు. The Kaurava King Dhrutarashtra was in a forlorn state because of Pandavas. He ordered that his minister Vidura be brought to his presence. Accordingly, Vidura was brought to his abode. విదురా! ధీమంతుడైన సంజయుడు ఉప ప్రాప్యంనుండి తిరిగి నచ్చి నాకు విశేషాలన్నీ వివ రించాడు. తూర్పు తెల్లవారుతుండగా మన సభా భవనంలో సంజయుడు విషయాలన్నీ వివరిస్తాడు, నా మనస్సు ఎంతగానో వ

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 36)

Image
రెండవ ప్రకరణము 36 విశోకావా జ్యోతిష్మతీ విశోకా = శోకములేనిది వా = లేక జ్యోతిష్మతీ = వెలుగుతోనిండినది మనస్సునందు జ్యోతిని నింపుటనే దుఃఖమును తొలగించ వచ్చును. మనస్సుకు దుఃఖము మొదలైనవి కలుగడం అభ్యాసము చేత జరుగుతుంది. అలాగే కొన్నికొన్ని పరినరములు మనస్సుపై ప్రభావము కలిగిస్తాయి. ఉదాహరణకు, ఒక దుఃఖిస్తున్న వ్యక్తిని చూస్తే, సానుభూతిచే, తనకుకూడా దుఃఖము పుడుతుంది. అలాగే ఒంటరిగా చీకటిలోను౦టే భయము కలుగుతుంది. అంతేకాక అలాంటి సంఘటనలు స్మరణకు వచ్చినపుడల్లా, ఆా అనుభూతులు మనస్సుకు కలుగుతాయి. అలాగే ఒక గాలి వెలుతురు లేని గుహను కాని, సొరంగమునుగానీ ఊహించుకొ౦టే తనకు ఉక్కిరిబిక్కిరిగానున్నట్టు అనిపిస్తుంది. తనకు తీవ్రహాని చేసినవారు జ్ఞప్తికి వస్తే ఆవేశముతో ముఖ మెఱ్ఱబడుట, చేతులు బిగిసికొనుట గుండెవేగముగా కొట్టుకొనుట మొదలైనవి కలుగుతాయి. అ౦టే ఇక్కడ వస్తువు ఎదురుగా లేకున్నా, కేవలము స్మరణ చేతనే మనస్సును ప్రభావితము చేయవచ్చునని తెలుస్తోంది. అంతేకాక సంపెంగ, మంచిగంధము మొదలైనవి స్మరిస్తే, వాటి సువాసనతో మనస్సు నిండుతుంది. కనుక మనస

Bhagavata Origin Melancholy Of Vyasa

Image
Telugu English All వ్యాసుని నెరాశ్యము ద్వాపర యుగము ముగియు సమయ మాసన్నమాయెను. సత్యవతీ నందనుడగు వ్యాసుడు ఒకనాడు సరస్వతీ నదీజలములలో స్నానాది కర్మములను ముగించి, నిర్మలమై పవిత్రమై నొప్పారు బదరికాశ్రమమున ధ్యానచిత్తముతో కూర్చొని యుండెను. వ్యాసుడు వేదములను సంస్కరించిన మహనీయుడు. అష్టాదశపురాణములకు కర్తయైనవాడు. (బహ్మసూత్రములను రచించినవాడు. వేదవ్యాసుడని క్రీర్తింపబడెను. వ్యాసుడు అశ్రుపూర్ణవదనుడై విచారముతో గూర్చొని యుండెను. ఆ దారిన అదే సమయానికి వెడుచుండిన నారదమహర్షి వ్యాసుని గాంచెను. వ్యాసుని ముఖారవిందమున గోచరమయ్యే బాధను గ్రహించెను. వ్యాసుని ప్రశ్నించెను. “పరాశరాత్మజా! మీ వదనమున విషాదఛాయలు అలుము కొనుటకు కారణమేమి? సర్వశాస్త్ర పారంగతులెన మీకు అశాంతి ఎలా ఏర్పడినది?" ఉ|| ధాతవు భారతశృతి విధాతవు వేదపదార్థజాల వి జ్ఞాతవు కామ ముఖ్యరిపు షట్క విజేతవు (బహ్మ తత్త్వ ని ర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చలించి చెల్లరే కాతరు కైవడిన్‌ వగవ గారణవేమి పరాశరాత్మ జా నారదుని మాటల నాలకించిన వ్యాసుడు ఇలా పలికెను.“నారదమునీంద్రా! అదియే నాకును అవగత మగుటలేదు. నీవు త్రిలోక సంచా