Posts

Showing posts from December, 2023

Vishnu Index

Image
Prologue/పూర్వ పీఠిక (English/Telugu) 1000 Names/సహస్ర నామములు (English/Telugu) Epilogue/ఉత్తర పీఠిక (ఫల శృతి) (English/Telugu)

Vishnu1000 Prelude

Vishnu Sahasranama In English With Meaning: INVOCATION Shuklam Baradaram Vishnum, Sasi Varnam Chatur Bhujam, Prasanna Vadanan Dyayet, Sarva Vignoba Sandaye. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥ Dressed in white you are, Oh, all pervading one, And glowing with the color of the moon. With four arms, you are, the all-knowing one, I meditate on your ever-smiling face, And pray,” Remove all obstacles on my way”. శ్వేత వర్ణము గల వస్త్రములు ధరించినవాడా, సర్వాంతర్యామి, చంద్రుని వర్ణము గలవాడా, చతుర్ భుజములతో సర్వము తెలిసినవాడా, నేను మందహాసముతో నున్న ముఖము గల నిన్ను పూజిస్తున్నాను. నా మార్గములోని విఘ్నములు తొలగించు. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతం । విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥ 2 ॥ Vyasam Vasishtanaptharam, Sakthe Poutramakalmasham, Parasarathmajam vande, Shukathatham Taponidhim. I bow before you Vyasa, The treasure house of penance, The great-grandson of Vasishta, The grandson of Shakthi, The son of

Vishnu1000 Phalam

ఉత్తర పీఠిక ఫలశ్రుతిః ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః । నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం। ॥ 1 ॥ Bhishma said: Thus was told, all the holy thousand names of Kesava, who is great. భీష్మ ఉవాచ ఈ విధముగా కేశవుని సహస్ర నామములు చెప్పబడినవి య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్॥ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోఽముత్రేహ చ మానవః ॥ 2 ॥ He who hears this daily and whoever recites it shall not attain to any evil, he shall be protected in this world and in the next. ఈ నామాలను నిత్యము చదివిన వానికి శుభములు కలుగును; అతడు ఈ లోకమునందు, రాబోవు లోకములయందు సంరక్షింప బడతాడు వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ । వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥ 3 ॥ The Brahmin will get knowledge, the Kshatriya will get victory, the Vaisya will get wealth, the Shudra will get pleasures by reading these. బ్రాహ్మణులకు జ్ఞానము, క్షత్రియులకు జయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సంతోషము కల్గును ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ । కామానవాప్నుయాత్ కామీ ప్

Vishnu1000 Namams

Image
Telugu English All VISHNU STOTRAM — 1000 NAMES viśvaṁ viṣṇurvaṣaṭkārō bhūtabhavyabhavatprabhuḥ, bhūtakṛdbhūtabhṛdbhāvō bhūtātmā bhūtabhāvanaḥ. (1) 1. Viśvaṁ: The all or the Universe. 1 ఓం విశ్వం - అతడు సృష్టి సమన్వయము: ఉన్నదంతా విష్ణువే. కొందరు అతన్ని బ్రహ్మన్ అని పిలుస్తారు. బ్రహ్మన్ అద్వితీయుడు అంటే తనకంటే వేరే వస్తువుగానీ, జీవిగానీ లేదు. ఎలాగైతే సాలె పురుగు తన లాలాజలంతో గూడు కట్టుకుందో బ్రహ్మన్ కూడా తన మాయా శక్తితో విశ్వం సృష్టించేడు. అది అతనికన్నా వేరు కాదు. కొందరంటారు, సృష్టి అతని క్రీడ అని. అతను ఒక పద్దతిలో విశ్వాన్ని సృష్టించి విష్ణువుని దాన్ని సంరక్షింపడానికి సృష్టించేడు. కాబట్టి బ్రహ్మన్ విష్ణు రూపములో వ్యవహరించేవాడు 2. Viṣṇuḥ: He who pervades everything. 2 ఓం విష్ణుః - అతడు సర్వాంతర్యామి సమన్వయము: అతడు లేని ప్రదేశములేదు. శూన్యం కూడా శక్తితో కూడినదని నేటి భౌతిక శాస్త్రజ్ఞులు ప్రతిపాదించేరు. అంటే శక్తి (energy), పదార్థము (matter) రెండూ లేని ప్రదేశమే లేదు 3. Vaṣaṭkāraḥ: For whom the sacrificial versus are uttered in the yajnas.