Posts

Showing posts from February, 2023

Ramana Maharshi Aatma Vichaarana

Image
నే నెవరిని? ఆత్మ విచారణ ప్రతి జీవి ఆనందాన్నే కోరుతుంది. అలాగే తనయందు మిక్కిలి ప్రేమ కలిగి ఉంటుంది. ఎందుకంటే జీవి స్వతహాగా ఆనంద స్వభావము గలది. గాఢ నిద్రలో ఉండే ఆనందం వేకువలో కూడా పొందాలంటే జీవి తన గురించి తాను తెలిసికోవాలి. దానికై "నే నెవరిని?" అని తనను తాను ప్రశ్నించుకొని ఆత్మ జ్ఞానము పొందాలి. "నే నెవరిని?" నేను దేహము కాదు; పంచేంద్రియాలు, కర్మే౦ద్రియాలు; పంచ ప్రాణాలు; మనస్సు కాదు. అలాగే అజ్ఞానములో కేవలము పూర్వ సంస్కారముల ననుసరించి కర్మలు నిర్వహించి, మనస్సు, కర్మే౦ద్రియాలను౦డి మరియు జ్ఞానేంద్రియాల గ్రాహకములనుండి విడిపడి ఉండేవాడిని కాదు. ఈ విధంగా విచారణ చేస్తే మిగిలేది, అద్వితీయమైనది, శుద్ధమైనది అయిన ఆత్మ. అదే మన స్వస్వరూపము. అది సత్ చిత్ ఆనందము. జ్ఞానమును పొందడానికి , కర్మలు చేయడానికి ఉపయోగపడే మనస్సు ఉపశమిస్తే గాని ప్రపంచము మిథ్య అనే భావము కలుగదు. ఎలాగంటే రజ్జు-సర్పము భ్రాంతి ననుసరించి, సర్ప భావనను తొలగిస్తే గాని, అది రజ్జు అనే జ్ఞానము కలగదు. ఆత్మ మీద ఆరోపింపబడిన ప్రపంచము మిథ్య, అసత్యము అనే జ్ఞానము కలగనంత కాలమ

Ramana Maharshi QuestionAnswers Part 2

Image
అనుభవము చైతన్య ప్రకాశమంటే ఏమిటి? ద్రష్టకి నామరూపాత్మక ప్రపంచాన్ని దర్శింపజేసేదే స్వయం ప్రకాశకమైన చైతన్యము. దానిని అది ప్రకాశింప చేసే వస్తువులద్వారా తెలిసికొనవచ్చు. కానీ అది స్పృహకి అందనిది. విజ్ఞానమంటే ఏమిటి? జీవ చైతన్యము సమముగా ఉన్నప్పుడు జీవుడు అనుభవించే స్థితి. అది అలలులేని సముద్రము లేదా కదలికలేని ఆకాశమువలె నుండును. ఆనందమంటే ఏమిటి? అది విజ్ఞాన స్థితిలో అనుభవించేది. ఆ అనుభవము సుషుప్తి వలె నుండును. దాన్నే కేవల నిర్వికల్ప స్థితి (ఎటువంటి ఆలోచనలు లేకపోవుట) అనవచ్చు. ఆనందాన్ని అధిగమించే స్థితి ఏమిటి? అది మనస్సు అంతరాయములేని శాంతిని అనుభవించే స్థితి. అది జాగ్రత్ సుషుప్తి వలె నుండును. ఈ స్థితిలో చిన్న పిల్లవాడు పరుండినట్లు, శరీరము, ఇంద్రియాలు, కర్మలు చేస్తున్నా ఎటువంటి బాహ్య ఎరుక ఉండదు. ఈ స్థితిలో యోగి కర్మలు చేస్తున్నా చేయనట్లే ఉంటాడు. దీనినే సహజ నిర్వికల్ప సమాధి అంటారు. స్థిరచరాదులు ఒకని ఆలోచన బట్టి ఉంటాయని చెప్పడానికి ఏది ఆధారం? ఆత్మ దేహమును కప్పి ఉంటుంది. సుషుప్తిలో నిఘూడంగా ఉండే శక్తి మేల్కొన్నప్పుడు "నేను"

Ramana Maharshi QuestionAnswers Part 1

Image
అభ్యాసము సాధన చేసే పద్దతి ఏమిటి? ఆత్మజ్ఞానమును పొందదలిచే వాని ఆత్మ స్వస్వరూపముకన్నా వేరుగా లేదు. ఆత్మ కన్నా గొప్ప విషయము లేదు. ఎందుకంటే ముక్తి కోరువాడు ఆత్మ జ్ఞానము వాని సహజ స్థితిని తెలపేదని తెలిసికొ౦టాడు. దానిపై ఎటువంటి సంశయాలు, అనుమానములు ఉండవు. అతడు క్షణికమైన, శాశ్వతమైన వాటి మధ్య భేదము ఏమిటో తెలిసికొని తన సహజ స్థితియందు నిలిచి ఉంటాడు. దీనినే జ్ఞాన సాధన అనికూడా అంటారు. ఈ విధంగా ఆత్మ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఇతర పద్దతులు ఏమిటి? అవి: స్తుతి : భక్తితో దేవుని కీర్తించుట లేదా గానము చేయుట జపం : దేవుని మంత్రాలు లేదా నామాలు మనస్సులో గాని, బయటకు గాని వల్లించుట ధ్యానము : జపం లాగే దేవుని మంత్రాలు లేదా నామాలు భక్తితో వల్లిస్తూ, మనస్సుని బాహ్య విషయాలనుండి మరల్చి అంతర్ముఖమవుట యోగ : మనస్సు, శ్వాస యొక్క మూలము ఒక్కటే. కాబట్టి శ్వాస నియంత్రణ ద్వారా -- ప్రాణాయామము ద్వారా-- మనస్సుని ధ్యానం యందు కేంద్రీకరించుటను యోగ అంటారు సహస్రారమందు, చక్రాలయందు మనస్సుని నిలిపి యోగి ఆనందంతో ఎంతో సమయం ఉంటాడు. కానీ మనస్సు లేచినప్పుడు మళ్ళీ ఆలోచనలతో సతమతమవుత