Posts

Showing posts from November, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 33-34 )

Image
33 వితర్క బాధనే ప్రతిపక్షభావనమ్‌ వితర్కబాధనే = వితర్కముచే బాధింపపడినపుడు ప్రతిపక్షభావనమ్‌ = ప్రతిషక్షభావము (అవలంబింపవలెను) (ఈ చెప్పబడిన మంచి గుణముల అభ్యాసము) వితర్క ముచే బాధింపబడినపుడు, ప్రతిపక్షభావనచే దానిని తొలగింపవలెను. పైన చెప్పబడిన మంచి గుణములు అభ్యసంచుట ప్రారంభించిన కొంతకాలము వరకు అనగా కొన్ని సం॥ల వరకు మనలో అనేక ప్రశ్నలుపుడతాయి. మనము దీనిని దేనికి చేయవలెను? ఇతరులు కూడా ఇలా చేస్తున్నారా? అందరూ చేయనప్పుడు మన మెందుకు చేయవలెను? మనమొక్కరమే చేసినందువల్ల ప్రయోజనమేమి? అర్హతగలవారికే మంచి విషయములు చెప్పవలెనుగాని ప్రతి పాపొత్మునికి చెప్పవచ్చునా? బ్రహ్మచర్యము ప్రతివారును అవలంబిస్తే సృష్టి ఏమవుతుంది? భూమి అంతా ఖాళీ అయి పోవునుకదా, అని, ఇటువంటి చొప్పదంటు ప్రశృలు మనస్సున పుడతాయి. అలాంటి ప్రశ్నలను మనస్సులో వ్యతిరేకించుటకుగాని, పరిహరించుటకుగాని ప్రయత్నింపకూడదు. వాటికి సమాధానము చెప్పుకొన్నకొలది ప్రశ్నలెక్కువై ఆచరణపోతుంది. వీటినన్నిటికి వ్యతిరేకపద్దతిలో ఆలోచించాలి. వ్యతిరేకపద్దతి అంటే పైన చెస్పినవాటికి వ్యతిరేకముగా వాదించుట

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 31-32)

Image
రెండవ ప్రకరణము: అప్రజ్ఞాతము 31 దుఃఖ దౌర్మనస్యంగ మేజయత్వ శ్వాస ప్రశ్వసాః విక్షేప సహభువః దుఃఖః = దుఃఖము దౌర్మనస్య = నిస్పృహ అంగమేజయత్వ = అంగవికలము శ్వాస ప్రశ్వాసాః = ఉచ్చ్వాస నిశ్స్వా సములు నిక్షేపసహభువః = మానసిక విక్షేపమువలన కలుగునవి. మానసిక విక్షేపము వలన దుఃఖము, నిస్పృహ, అంగవైకల్యము, శ్వాసక్రమ భేదములు కలుగును. పైన చెప్పబడినవికాక మరికొన్ని మార్పులు కూడా కలుగవచ్చు. వాటి వలన యోగసాధనకు భ౦గము కలుగవచ్చు. వీనిలో కొన్ని పరిసరములవలన కలిగేవి. 1. దుఃఖము ఒక్కొక్కసారి పరిసరముల వలన దుఃఖము తప్పనిసరి కావచ్చును. మృత్యువు, పోగొట్టుకొనుట , ఎడబాటు, లేదా వియోగము మొదలైనవి, మన ప్రమేయము లేకనే సంభవించి దుఃఖము కలిగించును. 2. నిస్పృహ నిరాశా, నిస్పృహలతో కూడిన వాతావరణము కూడా మనస్సును కలత పెట్టును. రాజకీయ, సామాజిక పరిస్థితుల వలన మతాలవల్ల, ఒక్కొక్కసారి వ్యక్తులకు సాంఘిక భద్రత లోపించవచ్చు. వీనికి సాధారణముగా లోపము వ్యక్తియందు వుండదు. కనుక నిస్పృహ చెందడం తప్ప సాధారణ మానవుడు వ్యక్తి గతముగా చేయగలిగినది ఏమీ లేదు. 3. అంగవైకల్య

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 35-36)

Image
35 అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః అహింసాప్రతిష్టాయాం =అహింసనిలబడియున్నపుడు తత్‌ + సన్నిధౌ = దాని ముందు వైరత్యాగః = వైరము నశించును అహింస స్టిరమైనప్పుడు, దాని సాన్నిధ్యమువలన వైరము నశించును ఇచ్చట గ్రంధకర్త యమముయొక్క లక్షణములలోనొకటియగు అహింసను గూర్చి చెప్పుచు ప్రతిపక్ష భావనమును గూర్చి నిరూపిస్తున్నాడు. మొట్ట మొదట అహింసయనునది కేవలము మన ఆలోచన గానే ఉంటుంది. అది మనకున్న అన్ని ఊహలలో నొక్కటియేగాని దానికి ప్రత్యేకతలేదు, క్రమేణా అది మన మనస్సు నాక్రమించు కొ౦టుంది. ఇది మనస్సునందు స్థిరముగా నిలుచున్నంతవరకు, మనము దానిని గూర్చి కొంత అభ్యాసము చేయవలసివస్తుంది. అట్లు స్థిరత్వము పొందినవెనుక, మనస్సులో అహింస నిరంతరము నిలచియుంటుంది. అప్పుడు మనయందు శతృత్వము అనునది పూర్తిగా తొలగిపోతుంది. అట్లు తొలగిపోవుటకు ముందు మనము మన శత్రువులను గూర్చి ఎంతో అలోచిస్తూ ఉంటాము. అహింసకు మనస్సునందు స్టిరత్వము కలిగిన తరువాత, శతృత్వము అను భావము మనస్సు నుండి తొలగిపోతుంది. నిజానికి శతృత్వము అనునది మన ఆలోచనే గాని సత్యముకాదు. ప్రపంచములో నిజమునకు శతృవులనువ

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 26-32)

Image
26 సమాన వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః వివేకఖ్యాతిః = వివేకసామర్థ్యముచేత అవిప్లవా = తలక్రిందులుకానట్టి హానోపాయః = అదృశ్యకారణము వివేకము ప్రాధాన్యత వహించుటచేత మాత్రమే ఇట్టి సంయోగము అదృశ్యమగును. వివేకము వలన తనయందలి ఆలోచనలు తన గమనికకు వచ్చును. అది ఎలా సాధింపబడుననగా అ) తనయందు సాక్షిగా నున్న వానిని అ౦టే పశ్యకుని, వాని స్వభావమును గమనించుట. అంటే తాను తన చుట్టునున్న ప్రకృతిని గమనింపగలుగుట. ఆ) తరువాత, తానెవరో, తానేమి చూచుచున్నాడో, తనయందేమియున్నది, మొదలైన ప్రశ్నలను వేసుకొనవలెను. ఇందు శాశ్వతమైనది ఏది? తాత్కాలికమైనది ఏది? మార్పు చెందేది ఏది? చెందనిది ఏది? అని గమనించాలి. ఇలా గమనించడంవలన తాను సత్యముగానూ, మార్పులేని వానిగానూ తెలియబడుచున్నాడు. దీనినే కైవల్యము అంటారు. 27 తస్య సవ్తధా ప్రాన్తభూమిః ప్రజ్ఞా తస్య = వానికి సప్తధా = ఏడు విధములెన ప్రాంతభూమిః = విహారభూమి ప్రజ్ఞా = ప్రజ్ఞ అప్పుడు వాని ప్రజ్ఞయే వానికి క్షేత్రమగును. అది ఏడు పొరలు కలిగియుండును. సంయోగము నశించిన తరువాత వాని ప్రజ్ఞయే విహ

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 23-25)

Image
23 స్వస్వామిశక్త్యోః స్వరూపోపలబ్ది హేతుః సంయోగః స్వస్వామిశక్ష్యోః = తన శక్తి మరియు పరమాత్మ శక్తి అనువానిమధ్య స్వస్వరూప = తన యొక్క స్వరూపము ఉపలబ్ది హేతుః; = పొందుటకు హేతువైనది సంయోగః = కలయిక యోగమనగా, తన శక్తి మరియు పరమాత్మ శక్తి యొక్క కలయిక వలన నిజస్వరూపము సాధించుకొనుట. ప్రకృతి మరియు పరమాత్మ వేరుకాదు. స్వశక్తి అంటే ప్రకృతిశక్తి. ప్రకృతియొక్క శక్తి మరియు పరమాత్మ యొక్క శక్తి రెండునూ ఒక్కటే. కాని రెండునూ వేరుగానున్నట్లు కనిపించును. అది అట్లు రెండుగానున్నట్లు కనిపించుటవలననే యోగవిద్య సాధ్యమగును. అంతయూ నొక్కటియేయైనచో, యోగ సాధన ఎట్లుుండును? కనుక యోగసాధనయనగా, తాను సాధన చేయుచున్నట్లు కలుగు భావము. చివరకు అంతర్యామి యందు లీనమగుట. అప్పుడు తాను నిజమయిన స్థితియందుండును. 24 తస్య హేతురవిద్యా తస్య హేతుః = దానికారణము ఆవిద్య = తెలియకుండుటయే దానికి కారణము అజ్ఞానమే ఇచ్చటి ప్రకృతి, పరమాత్మల యొక్క కలయికకు కారణము అజ్ఞ్జానమేయని చెప్పబడుతోంది. అజ్ఞానము వల్లనే, ఈ భేద మేర్పడుతోంది. నిజమునకు సత్య మొక్కటైనప్పుడు, ప్