Showing posts with label Eknath Gita Book 2. Show all posts
Showing posts with label Eknath Gita Book 2. Show all posts

Sunday, April 10, 2022

Eknath Gita Chapter 12 Section 16

Bhagavat Gita

12.16

యే తు ధర్మ్యుమృతమిదం యథోక్త౦ పర్యుపాసతే {12.20}

శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే అతీవ మే ప్రియాః

ఎవరయితే శ్రద్ధావంతులై, నేనే పరమగతియని భావించిన వారై, నేను ఇంతవరకు తెలిపిన విధముగ ఈ ధర్మ స్వరూపమైన అమృతమును సేవించుచున్నారో వారు నా కత్యంత ప్రియులు ఀ

ఋగ్వేదంలో ఒక మంత్రం చెప్తారు

నన్ను అవాస్తవం లోనుంచి వాస్తవంలోకి తీసికెళ్ళు

నన్ను అంధకారం నుండి కాంతి పథంలోకి నడిపించు

నన్ను మరణం నుంచి అమృతత్వానికి తీసికెళ్లు

ఇదే అన్ని మతాలలోనీ సందేశం. నేను ధ్యానం మొదలు పెట్టే ముందు, అమృతత్వం అంటే కవులు వాడే ఒక పదమనుకునేవాడిని. మరణం మీద నా అమ్మమ్మ యొక్క దృక్పథం తెలిసికొన్న తరువాత అమృతత్వం వాస్తవమని తెలిసికొన్నాను. దానికై ఉత్సాహం, సాహసం ఉన్న వారు ప్రయత్నించవచ్చు-- మరణం తరువాత కాదు, ఇప్పుడే, ఇక్కడే. అనేక యోగులు ఇది తెలిసికొని దేశకాలాలకి అతీతంగా బ్రతికేరు. అటువంటివారికి మరణం లేదు. వారి దేహం పడిపోవచ్చు. కానీ వారి చేతనం ఖండింపబడదు. ఎందుకంటే వారు దేహంతో తాదాత్మ్యం చెందలేదు.

గాఢమైన ధ్యానంలో చేతన మనస్సును దేహేంద్రియాల నుండి వెనక్కి తీసుకొంటే, మనం దేహాన్ని దాటి వెళ్తాం. ఇదే బ్రతికుండగానే అమృతత్వం పొందటం. దానిలో అమితమైన ఆనందం, శాంతి ఉంది. అది కొన్ని క్షణాల మాత్రమే ఉంటుంది. మనం దాన్ని నిరంతరం పొందటానికి ప్రయత్నించాలని కోరుతాం.

అలా అయితే మనము దేహంనుండి విడిపోతాం. మనకు మనస్సు లోతులలో ఆత్మ జ్ఞానం ఉంటుంది. మరణం దేహానికే. ఆత్మకు కాదు.

యోగులు "అది నిద్రనుండి మేల్కొన్నట్లు ఉంటుంది" అని చెప్తారు. దైవ భక్తి కలుగక ముందు మనం నిద్రలో ఉన్నాము. మనం కల కంటున్నంత సేపూ అది నిజం అనిపించదా? మనము మేల్కొన్న తరువాత, అది కల అని గ్రహిస్తాము. యోగులు "కల నుంచి మేల్కొన్నప్పుడు, నీవు కలలోని పాత్రను వేకువలో ధరిస్తావా?" అని అడుగుతారు.

కఠోపనిషత్తులోని నాచికేతుడు యమధర్మరాజుని "నేను నువ్వు వెళ్లని చోటులో అనేక ఋషులు ఆనందంతో అమృతత్వం పొందియున్నారని విన్నాను. అది నిజమా?" అని ప్రశ్నిస్తాడు. నిజానికి అటువంటి ప్రదేశం మన దేహంలోనే ఉంది. చిన్న వయస్సులో మన ఇంద్రియముల చేత ప్రేరేపింపబడి ఆనందం కొరకు అన్ని చోట్లా వెదుకుతా౦. అలా తిరిగి ప్రపంచ సుఖాలు క్షణికమని తెలిసికొని, అమృతత్వాన్ని తెలిసికొని, దానికై ప్రయత్నిస్తాం.

అది చాలా కష్టాలతో కూడినది. మనము దానికై అచేతన మనస్సుని శోధించాలి. అది బయట ప్రపంచమంత విశాలమైనది. దానికి దేశకాల పరిమితులు లేవు. గెరార్డ్ మ్యాన్లీ హాప్కిన్స్ ఇలా వ్రాసేరు:

మనస్సులో పర్వతాలు, శిఖరాలు

క్రింద పడతామేమో అనే భయము కలిగించేవి

ఉన్నాయి. ఏ మానవుడూ వాటిగురించి తెలిసికోలేడు

వాటిని చూడకుండా, వాటిని చేరకుండా ఉండండి

కొందరికి అచేతన మనస్సు అల్పమైనదిగా తలుస్తారు. కానీ దాని గురించి తెలుసుకుంటే మనకు ఊపిరాడదు. సముద్రపుటడుగున ఎలాగైతే పర్వతాలు ఉన్నాయో మన చేతన మనస్సులో అనేక విషయాలు ఉన్నాయి. దానిలో పయనించాలంటే ధైర్యం, పట్టుదల ఉంటే సరిపోదు. మన గమ్యమేమిటో కూడా తెలియాలి.

మనకు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. ఒక నావికునికి ధృవ నక్షత్రం ఎలాగ మార్గదర్శకంగా ఉంటుందో, ఒక ఉన్నత లక్ష్యం మనల్ని సరియైన ద్రోవలో నడిపిస్తుంది.

అలాగే మనం గీతలో శ్రీకృష్ణుడు చెప్పే బోధను కంఠతా పెడితే సర్వకాల, సర్వావస్థల యందు అది మనకు మార్గదర్శకంగా ఉంటుంది. మొదట్లో అది మనకు స్పూర్తి మాత్రమే ఇస్తుంది. కానీ ధ్యానం ద్వారా దానిని చేతన మనస్సులోతులకు చేర్చి, మార్పు చెంది, పునర్జన్మ ఎత్తి ఆ ఆదర్శాలను ఆచరణలో పెట్టగలము.

మీరాబాయి ఇలా చెప్పేరు:

దేవుని చూడడానికి ఇంకెంత కాలం వేచి ఉండాలి

సూర్యోదయ మైనప్పుడు అతని గురించ వెదకుతాను

అలాగే ప్రతి రోజూ ధ్యానంలో వెదకుతాను

అతనిని కళ్ళతో చూస్తేగాని నాకు నిద్ర పట్టదు

అనేక జన్మలలో నీ నుండి వేర్పడ్డాను

నువ్వు ఎప్పుడు వస్తావు?

ఇలా ఒక రోజే ఆ అనుభవం ఉండదు. అది అనేక రోజులు, నెలలు, సంవత్సరాలు ఉంటుంది. ఇదే సాధన అంటే. ఏ యోగికీ ఆ కష్టం తప్పదు. సూఫీలు సాధనలోనే అంత ఆనందం ఉంటే దేవునిలో ఐక్యమవుతే ఇంకెంత ఆనందం ఉంటుందో అంటారు. జఫర్ ఇలా అన్నారు:

నా హృదయాన్ని నీతో విలీనం చేసేను; ఉండేదంతా నువ్వే

పరమాత్మా, నా ఆరాధ్య దైవమా, నీవే అన్ని జీవులకు నిలయం

నీవు నివసించని హృదయం ఎక్కడుంది

భూమ్యాకాశలో సర్వత్రా ఉన్నావు

నేను నిన్ను అన్నిట్లో చూసేను; ఉండేదంతా నువ్వే

మనము దేవునిలో ఐక్యమైతే ఒక సూక్ష్మ క్రిమినుండి అనంత విశ్వంలోని పదార్థాలు మన బంధువులు. నా అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నప్పుడు, నా దృష్టి ఆంగ్ల సాహిత్యం మీద ఉండేది. నా అమ్మమ్మ తన జీవితాన్ని సెయింట్ ఏంజిలా చెప్పినట్లు --"ప్రపంచమంతా దేవునితో నిండి ఉన్నది"-- గడిపింది.

మన జ్ఞానానికి అడ్డంకు మన స్వచ్ఛంద భావాలు. వాటివలన మనము పూర్ణానికి వేరుగా ఒక శకలమై ఉన్నామని అనుకొంటాము. స్వచ్ఛంద భావాలను తగ్గించుకొంటే మనము కాలాన్ని, మరణాన్ని జయించవచ్చు. మనమందరి అనుభవంలో పరోపకారము చేస్తున్నప్పుడు కాలం స్థ౦భిస్తుంది. మనము వేరుకామనే భావన కొన్ని ఘడియలు ఉంటుంది. అవే అమృత ఘడియలు. వాటిని రోజంతటికీ పెంపొందించుకుంటే, మన౦ మన గురించే కాక, ఇతరులకై కూడా బ్రతుకుతున్నామనే భావన కలుగుతుంది. సెయింట్ జాన్ ఆఫ్ క్రాస్ చెప్పినట్లు: మనము దేనిని ప్రేమిస్తామో అందులో జీవిస్తాము. మనము అందరిలోనీ ఉన్న దేవుని ప్రేమిస్తూ, అందరి హృదయాలలోనూ ఉన్న దేవునితో కలసి ఉంటే, దేహం పడిపోతే, ఇంక మరణమెక్కడిది?

సెయింట్ తెరెసా ఆఫ్ లిసీ మరణ శయ్యపై ఉన్నప్పుడు ఆమె స్వర్గం గురించి ఏమనుకుంటున్నాదని అడిగితే ఆమె ఇలా స్పందించేరు: "అది అంత వేరేగా ఉండదు. నాకు తెలుసు దేవుడ్ని చూస్తానని. ఇక్కడి కన్నా ఎక్కువగా చూస్తానని అనుకోను"

మన అహంకారాన్ని వీడితే ఇది, అది అనే తేడా ఉండదు. మనము ఒక శకలంలా ఎడంగా బ్రతకం. ఆది శంకరులు చెప్పినట్లు ఈ విశ్వమంతా మన ఇల్లు. శ్రీరామకృష్ణ దివంగతుడైనప్పుడు ఆయన భార్య శ్రీశారదా దేవి దుఃఖిస్తూ ఉంటే ఆయన ఆమె చేతన మనస్సులో ప్రత్యక్షమై ఇలా అన్నారు: "నేను నిజంగా మరణించేనని నువ్వు అనుకుంటున్నావా? నేను ఒక గదిలోంచి ఉంకో గదికి మారేనంతే"

బుద్ధుడు ఇలా అన్నాడు:

నేను ఈ ఇల్లుని కట్టినవాడి గురించి తెలిసికోవడానికి ఎన్నో జననమరణాలు వృధా చేసేను. జనన మరణాలు ఎంత అలసట కలిగిస్తాయో తెలుసు కదా. ఇప్పుడు నిన్ను ఇల్లు కట్టినవానిగా తెలిసికొన్నాను. నా ఇల్లు ఇంకా ఎడంగా కట్ట లేవు. నేను స్వార్థాన్ని వదులుకొన్నాను. నేను సర్వ క్లేశాలు వదిలిపెట్టి నిర్వాణం పొందేను. 420

Eknath Gita Chapter 12 Section 15

Bhagavat Gita

12.15

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో {12.18}

శీతోష్ణసుఖదుఃఖేషు సమ స్స౦గ వివర్జితః

తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ {12.19}

అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః

శత్రుమిత్రుల యందును, మానావ మానముల యందును, శీతోష్ణ సుఖ దుఃఖముల యందును, నిందాస్తుతుల యందును సమబుద్ధి గలవాడై, సంగరహితుడై, మనన శీలుడై, లభించిన దానితో తృప్తి చెందువాడై, ఇల్లు లేనివాడై స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవడో వాడు నాకు ఇష్టుడు

గాంధీ మహాత్ముడు "నేను ఇంట్లో మిత్రులొక్కరితోనే కాదు, శత్రువులతోనూ కలసి ఉంటాను" అని చెప్పేరు. మనకు ఒకరితో స్పర్థ కలిగినప్పుడు, వానిని శత్రువుగా చూడక, సమస్యను పరిష్కరి౦చే మార్గాన్ని కలిసి వెదకాలి . గాంధీ పరిష్కరించలేని సమస్య ఏదీ లేదని అనేవారు. ఎందుకంటే ఆయన నిరాడంబరముగా నుండి తన ప్రత్యర్థి గౌరవాన్ని చూరుగొంటారు. బేదాభిప్రాయాలు కలిగినప్పుడు, ఉన్న సమస్య మన ప్రత్యర్థి.

ఒక సమస్య కలిగినప్పుడు ఎవరిని నిందించాలి అని చూడకోడదు. "వివాదంలో పెళ్ళిలాగే ఇద్దరు౦టారు" అనే నానుడి ఉంది. ఎటువంటి పరిస్థితులోనైనా ఒక్కరే తగవుకు పూర్తి కారణం కాదు. ఇద్దరూ కారణం కాబట్టి ఇద్దరూ సమస్యకు పరిష్కారాన్ని వెదకాలి. అలాగని రాజీ పడనక్కరలేదు. శాంతియుతంగా తగవు లేకుండా చూసుకోవాలి.

దానికై మన ప్రత్యర్థులు యందు గౌరవంతో ఉండాలి. వారు చెప్పేది గౌరవంతో వినాలి. క్రోధంతో ఉన్న వ్యక్తి తన చుట్టూ ఏమవుతున్నాదో గ్రహించలేడు. ఉన్మాదంతో కూడుకున్న వ్యక్తి తనకేమవుతున్నాదో కూడా తెలిసికోలేడు. అతడు ఒక అంధుడిలా ప్రవర్తిస్తాడు. మనము అంధులను గౌరవంతో చూసి, వారికి సహాయం చేస్తాము. అలాగే ఒక ఉన్మాదిని కూడా గౌరవించి వానికి, మనకి మధ్యనున్న పొత్తును పెంపొందించుకోవాలి.

యోగులు ఇలా ప్రశ్నిస్తారు: ఒక తగవు దేని గురించో తెలియకపోతే, దాన్ని పరిష్కరించే మార్గాన్ని ఎలా వెతకగలం? మనం ప్రత్యర్థులు చెప్పే విషయాన్ని పూర్తిగా వినక పోతే సమస్యను ఎలా పరిష్కరించగలం? మనము ప్రత్యర్థులతో నిర్లిప్తంగా ఉండాలి. లేకపోతే మనము మన పక్షాన ఉన్న సమస్యనుకూడా పూర్తిగా అర్థం చేసికోలేము. అందుకే ప్రత్యర్థులు చెప్పేది, ఎంత విసుగు కలిగించినా, గౌరవంగా వినాలి.

క్రమంగా "నా దృక్పథం" లేదా "నీ దృక్పథం" అన్న తేడా ఉండదు. మన ఇద్దరం ఒప్పుకునే విషయాలను గుర్తిస్తాం. అలా చేస్తే తగవు ఇకలేదు. మనము సమస్యను పరిష్కరించాలంటే కలసి పని చేయాలి. అప్పుడు తగవు లేకుండా చేస్తాము. అవసరమైతే మనం ప్రత్యర్థుల పక్షంలో చేరి మన ఇరువర్గాలకు అనుగుణమైన పరిష్కారాన్ని వెదకాలి.

జాతులు, దేశాలు మధ్య సంఘీభావం లేకపోతే మిగిలేది ఓడిపోయినవారే. మనము పూనుకొని కలసి పని చేస్తే పరిష్కరించలేని సమస్య ఏమీ లేదు. అది అంత సులువుగా ఉండకపోవచ్చు. అలాగే అది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ ఎక్కడైతే పూర్తి వైరం ఉందో, అక్కడ ప్రేమను కలిగించవచ్చు. ఎక్కడైతే స్పర్థ ఉందో అక్కడ ఐకమత్య౦ చిగురించవచ్చు.

సెయింట్ తెరెసా ఆఫ్ లిసియూ ఇలా వ్రాసేరు:

నా పరిధిలో ఒక వ్యక్తి ఉండేది. ఆమె ఇతరులతో దురుసుగా ఉండేది. నాకూ మొదట్లో ఆమె నచ్చలేదు. కానీ దానిని పైకి ప్రదర్శించకుండా ఆమెను కలిసినప్పుడల్లా చిరు నవ్వు చూపేదాన్ని. ఆమెకి నా నిజభావన తెలియక నన్ను "మీరు నాయందు ఎప్పుడూ ప్రేమ చూపిస్తారు. మీరు నాలో ఏ లక్షణం చూసి అలా చేస్తారు?" అని అడిగింది. "నీలో ఉాన్న జీసస్ ని చూసి"అని సమాధానమిచ్చేను.

నేను ఒకరికి దూరంగా ఉండాలనుకుంటే, అతనూ నాతో ఎడంగా ఉంటే, నా పళ్ళు బిగించుకొని అతన్ని నా వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించేవాడిని. మొదట్లో అది చాలా ఇబ్బంది కలిగించేది. కానీ నేను నిరాశ పడక ప్రయత్నించేవాడిని. అలా అనేక ప్రయత్నాలు చేసి కొంతమందిని నా స్నేహితులుగా మార్చేను. కానీ కొన్ని సార్లు మైత్రి సాధించలేకపోయేను. అప్పుడు "నేను కష్టంతో చేసిన ప్రయత్నం వృధా ఎందుకు అయింది?" అని అడగలేదు. వానితో మాట్లాడడానికి, కలిసి నడవడానికి వెచ్చించిన సమయం వృధా కదా అని అనిపించేది. కానీ నేను నిజంగా దేన్నీ పోగొట్టుకోలేదు. అటుతరువాత నేను ఎటువంటి బంధంలోనైనా నెగ్గగలననే ధైర్యం వచ్చేది.

మనం రోజూ మనల్ని ఎలా మంచివానిగా తీర్చిదిద్దుకోవాలని కొన్ని నిమిషాలు ఆలోచించాలి. ఉదాహరణకి మనం ఆఫీసులో ఒకరిని ఒకరోజు ఎడంగా పెట్టి ఉండవచ్చు. మరుసటి రోజు వానిని మందహాసంతో పలకరించండి. ఇది చాలా చిన్న విషయం. ఇలా ప్రతిరోజూ ఇతరుల కొరకై ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకు మనము ఇతరులపై ప్రేమ సంపూర్ణంగా చూపగలము.

కొందరు అద్దంలో తమ ముఖంలోని ముడతలు చూసుకుంటూ ఉంటారు. నేను ఆ అద్దాన్ని అంతర్గతంగా చూసుకోమంటాను. అలా చూసుకొని "నేను ఈ రోజు మంచిగా గడిపేను--రేపు ఇంకా ఓర్పుతో ఉండి, ఇంకా ఎక్కువగా ప్రేమి౦ఛాలి" అని అనుకోవాలి. మనం హృదయపూర్వకంగా ప్రేమించాలంటే ఇదే చిట్కా. ఎప్పుడూ "నాకు ప్రేమిస్తే ఏమి వస్తుంది?" అని అడగకండి. "నేను ఇతరులకు ఏమి ఇవ్వగలను?" అని అడగండి.

యోగులు చెప్పేది ఒక వ్యక్తి ఎంత మంచివాడనేది నిర్ణయించాలంటే అతను ఎంత ప్రేమిస్తున్నాడో అనే దాని బట్టి. మనము ఒకరు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలిసికోవడానికి వాని దయా గుణము, ఓర్పు రోజులు కలిసొచ్చినపుడే కాదు, కష్టాలలో ఎలా ఉంటాయి అని అడగాలి. ఒక పడవ ఒడ్డున సరిగానే ఉండవచ్చు. కానీ సముద్రంలో మునిగిపోవచ్చు. అనేక శాస్త్రజ్ఞులు, కళా కారులు, తత్త్వవేత్తలు, సైనికులు జీవితం సక్రమంగా ఉంటే బాగానే ఉంటారు. కానీ జీవితం ఎదురు తిరుగుతే ఢీలా పడిపోతారు. గాంధీ, సెయింట్ తెరెసా మొదలగువారు ఒకరు తమను వ్యతిరేకిస్తే వారి నుంచి ఎడంగా ఉండరు; దగ్గిరవ్వడానికి ప్రయత్నిస్తారు. ఒకరు వారియందు క్రోధం ప్రదర్శిస్తే వారిపై దయతో ఉంటారు.

మనకు అనుబంధాలలో సమస్యలు ఎదురవుతే అది ప్రేమ విఫలం అవ్వడం వలన కాదు; దానికి కారణం మన ప్రేమలో ఉన్న లోపాలు. ఈ రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసికోవడం ఎక్కువగా జరుగుతున్నాది. మనము చేతులెత్తేసి ప్రేమ విఫలం అవుతున్నాది, శాశ్వతమైన అనుబంధాలు ఉండవు అంటే సరికాదు.

షేక్స్ పియర్ వ్రాసిన వన్నీ చదవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. అలాంటిది మనకు ప్రేమంటే అవగాహన లేక ఒక రోజులో, లేదా సంవత్సరంలో ప్రేమ పరిపక్వమవ్వాలంటే ఎలా వీలవుతుంది? ఒక జంట ఐకమత్యంతో ఉంటేనే వారి మధ్య ప్రేమ సాధ్యం. "మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోడానికి ఇతరులతో ఎడంగా ఉండండి" అనేది దానికి పూర్తి వ్యతిరేకం. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకొని "నా పరిధిలో నేను ఉంటాను" అని అనుకోవడం ఎన్నటికీ ప్రేమకు దారి తీయదు. మన చుట్టూ ఉన్న వృత్తాలతో ఏకమైనప్పుడే ప్రేమ సాధ్యం.

నిజానికి ఉన్నది ఒకటే వృత్తం. ప్రతి ఒక్కరిదీ ఒకటే కేంద్రం. మనము భారత దేశంలో పుట్టిపెరిగి, అమెరికాలో పుట్టిపెరిగిన వారితో అనుబంధం పెట్టుకోవచ్చు. మన భాషలు, సంస్కృతి వేరైనా ఆత్మ దృష్ట్యా మనమంతా ఏకమే. ఈ విధమైన అవగాహన సమాధిలో వస్తుంది. అన్ని వృత్తాలు కలిసిపోతాయి. మనము అందరినీ, అన్ని జీవులనూ ప్రేమించాలనే అనుభవం కలుగుతుంది.

ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ కలగాలంటే అన్ని వేళలా కలసి ఉండాలి. అలగాని ఒకరిమీద ఒకరు ఆధారపడడానికే పరిమితం కాదు. ఒక నిస్వార్థ కార్యానికై కలసి పనిచేయాలి. అలా ఉంటే మనకి వంద సంవత్సరాలు కలిసి ఉన్నా తనివి తీరదు. పరిమితమైన వస్తువుతో సంతృప్తి పడితే మన ప్రేమ పూర్ణం కాదు. మన వృత్తాలు కలిసిపోతే "మన మధ్య వేర్పాటు వద్దు" అని అనగలము. 414

Eknath Gita Chapter 12 Section 14

Bhagavat Gita

12.14

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి {12.17}

శుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్య స్స మే ప్రియః

ఎవడు సంతసించడో, ద్వేషింపడో, దుఃఖి౦పడో, అభిలషి౦చడో, శుభాశుభకర్మములను విడిచినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు

మనం జీవితంలో నచ్చినదాని వెనుక పరిగెత్తి, నచ్చనిదానివైపు చూడకుండా ఉంటే మనము సంకెళ్ళు వేసుకొని ఇతరులతో స్వేచ్ఛగా ఉండనట్లే. "నాకు ధృడమైన అభిప్రాయాలు ఉన్నాయి", లేదా "నాకు ఏది కావాలో తెలుసు. నేను స్వేచ్ఛగా ఉన్నాను" అనుకునేవారు నిజంగా సంకెళ్ళు వేసికొన్నవారు.

మామూలుగా అడ్డదిడ్డంగా వెళ్ళే కొన్ని సూక్ష్మక్రిములు ఉద్దేశపూరకంగా కొన్ని పదార్థాలవైపు వెళతాయి. అది వాటికి నచ్చితే ఉంటాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. అలాగే మనలో చాలా మంది ఉంటారు. కాని మనకు ఆలోచనా శక్తి ఉండి, బుద్ధిపూర్వకంగా మన నడవడికను మార్చుకోవచ్చు.

ఇక్కడ అహంకారం యొక్క పాత్ర ప్రధానమైనది. అది "నాకిది ఇష్టం", "నాకిది అయిష్టం" అని నిర్ధారణ చేస్తుంది. అందుకే బుద్ధిని ఉపయోగించి ఏది శ్రేష్ఠమో నిర్ణయించాలి. మనం ఒక క్రొత్త వ్యక్తిని కలిసినపుడు వారి ముక్కు, మాట, నవ్వు, పళ్ళు అన్నిటి వలన ప్రభావితమై వారిని ఇష్టపడడమో లేదో నిర్ణయిస్తాం.

మన ఇష్టాయిష్టాలకు కారణం మన సంస్కారాలు. అంటే మన మనస్సులో నాటుకుపోయిన గత జన్మల వాసనలు. ఉదాహరణకు ఒకడు ఒక పని చేయడం జాప్యం చేస్తాడనుకొందాం. వాని కారణాలు: నాకు వెంటనే పూర్తి చేయవలసిన వేరొక పని ఉంది; నా ఇతర బాధ్యతలు నన్ను ఊపిరి సలపనీయకుండా చేస్తున్నాయి. నిజానికి వానికి ఆ పని చేయడం ఇష్టం లేదు. అది వాని నైజం. కాబట్టి ఒక పని చెయ్య వలసి ఉంటే, ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి వెంటనే చెయ్యాలి. అలా చేస్తే మన సంస్కారాన్ని ఎదిరించి సంకెళ్ల నుండి విడిపడతాం.

కొందరు ఎప్పుడూ చంచల మనస్కులై ఉంటారు. ఉదాహరణకి వారు ఒక కొట్టుకెళితే ఏది కొనాలో త్వరగా నిర్ణయించుకోలేరు. బియ్యం కొనాలంటే అది బాస్మతా లేదా మొలగొలకులా అని సతమతమవుతారు. ఒక వస్తువుని ఇష్టపడి దాని మీద స్థిరంగా ఉండలేరు. దాని వలన వారు దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేరు.

కొందరికి అది మనస్సు యొక్క నైజం. ఎవరైతే ఒక చిన్న విషయం మీద చంచలంగా ఉంటారో, వారు అన్ని విషయాలలోనూ అలాగే ఉంటారు. చివరకు వారు అనుబంధాలలోనూ చంచలంగా ఉంటారు. వారు ఎప్పటిలాగే "నాకిది ఇష్టమా?", "నేను అతనిని ఇష్ట పడుతున్నానా లేదా? అతని ముక్కు బాగుంటుంది. నన్ను కూడా ఇష్టపడతాడు. నడక కొంచెం తేడాగా ఉంటుంది" అని తర్జనబర్జన పడుతూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే, మనం ప్రేమించిన వ్యక్తి ఒక ఇష్టం లేని పని చేస్తే మన ప్రేమ తగ్గుతుంది. అలాగే ఆ వ్యక్తికి కూడా. అందువలన వారి మధ్యనున్న బంధం క్షీణిస్తుంది.

ఈ విధంగా సంస్కారాల ప్రభావంతో ఇష్టాయిష్టాలను ప్రేమతో ముడిపెడతాము. అందుకే నేను చిన్న చిన్న విషయాలలో ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా వెళ్ళడం ఉత్తమమని చెప్తాను. అలా చేస్తే మనం సంస్కారాన్ని ఎదిరిస్తున్నాము. మనకిష్టం లేని పదార్థాన్ని తినడం అటువంటిది.

మన అనుబంధాలు భౌతికంగా లేదా మానసికంగా మనను ఆకర్షించేవిగా ఉండడం సహజం. కాని భౌతిక ఆకర్షణ కొన్నాళ్ళకు తగ్గుతుంది. మనము దానిని పెంపొందించుకోలేము. ఒకరితో అనుబంధం గట్టి పడాలంటే "నాకు ఏది ఇష్టం?" అని అడగకుండా "నేను ఏమి ఇవ్వగలను?" అని ప్రశ్నించుకోవాలి.

భౌతికమైన ఆకర్షణ ఒక రోజు ఉంటుంది మరొక రోజు పోతుంది. కానీ ప్రేమ ఒక బంధం. అందంగా ఉన్నవారితో జీవితం గడపడం మొదట్లో సంతోషంగానే ఉంటుంది. కాలక్రమేణా వారి కోల మొహం రోతగా ఉంటుంది. అలాగే చేపల లాంటి కళ్ళు విసుగు కలిగిస్తాయి. ఇది తినడం లాంటిదే. ఒకనికి చాక్లెట్ అంటే ఇష్టం. కానీ ఒకేమారు వికారం చెందకుండా ఎన్ని తినగలడు ?

మన ఇంద్రియాలు అందించే సుఖం చిరకాలం ఉండదు. మొదట్లో కలిగిన ఆకర్షణ తగ్గిపోతే, విసుగు కలుగుతుంది. ఒకరిని మొదట్లో కలిసినప్పుడు మందహాసం మధురంగా అనిపించింది; ఇప్పుడు ఆమె చేసేది పళ్ళు ఇకిలించడం లాగా కనిపిస్తుంది. ఒక కెరటం లాగ మనోభావము ఒకప్పుడు ఉత్తేజంగా ఉండేది. ఇప్పుడు అది క్రిందకు పడింది. గట్టి అనుబంధం కలగాలంటే ఏది మార్పు చెందుతుందో దాని మీద ఆధారపడకూడదు. అప్పుడు "నాకిది ఇష్టమా?" అన్న ప్రశ్న ఉదయించదు.

కొందరు కామ౦తో అనేక వ్యక్తులతో బంధాలు పెట్టుకొంటారు. వారికి తెలియకుండానే ఒక్కొక్కప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కామాన్ని మార్చుకోవచ్చు. అంటే నిరోధించకుండా, స్వేచ్చతో కూడిన ఎన్నిక చేసికోవడం. కామం ప్రేమగా మారాలంటే నేను, నాది అనే బదులు నీవు, నీది అనడం మొదలుపెట్టాలి. క్రమంగా కామం ప్రేమగా మారి, దృష్టి మన సుఖాలపైనే కాక, ఇతరుల సంతోష౦పై ఉంటుంది.

మన భాషలో ప్రేమ ఆడా మగా మధ్యనేకాక, తల్లి బిడ్డ, అన్న చెల్లెలు మధ్యకూడా ఉండవచ్చు. అలాగే మనకు ఒక కుక్కమీద ప్రేమ ఉండవచ్చు. సినిమా పాటలు, పత్రికలు చూస్తే వారు చెప్పే "నీను నిన్ను ప్రేమిస్తున్నాను" అనేది "నన్ను నేను ప్రేమిస్తున్నాను" గా నాకు వినిపిస్తుంది.

ప్రతిరోజూ మన౦ మునుపటికన్నా ఎక్కువగా ప్రేమించ గలగాలి. లేకపోతే ప్రేమలో వృద్ధి లేక పరిస్థితి విచారకరంగా ఉంటుంది. ప్రతి రోజూ "నేను హృదయ పూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే సరిపోతుందా? ఒక యోగికి అది నచ్చదు.

అలాగే ప్రేమ యాత్రలకై మనమనేక ప్రకటనలు చూస్తాము. ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశాలకు పడవలలో తీసికువెళ్తామని ప్రకటిస్తూ ఉంటారు. యాత్రలకు, ప్రేమకు సంబంధం లేదు. ప్రేమకు భూలోక స్వర్గం అక్కరలేదు. అది వంటగది లోనో, తోట లోనో, ఎక్కడైతే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసికొని ఎదుటివారి క్షేమం కోరుతారో అక్కడ ఉంటుంది.

నిజానికి కొన్ని విషయాలలో మనం మనల్ని ఇతరులకన్నా ఎక్కువగా ప్రేమి౦చుకొంటాం. దీనిలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. కానీ దానిని మార్చుకోవచ్చు. ప్రతి అనుబంధము "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" తో మొదలవుతుంది. అక్కడక్కడ, అప్పుడప్పుడు "నేను నన్ను ప్రేమిస్తున్నాను" అనే అపశృతి ఉంటుంది. ఒక బంధం గట్టి పడాలంటే పరస్పర బలహీనతలవలన కాక వాటిని అధిగమించేలా ఉండాలి.

ఒక భార్య తన భర్త విసుగు చెందితే అతని మనస్సు కుదుటపడే వరకూ ఓపికతో ఉంటుంది. అదే ప్రేమ అంటే. ఒక తండ్రి ఆఫీసు నుండి ఎక్కడకీ వెళ్ళకుండా ఇంటికి వచ్చి, పిల్లలతో ఆడుకొని, భార్యకు వంటగదిలో చేయూత నిచ్చి, సకుటుంబంగా టివి చూస్తే అతనే గొప్ప ప్రేమికుడు.

ఇలా కొంతకాలం కలసి సంసారం సాగిస్తే ఒకరికి మరొకరు మీద ద్వేషంతో కూడిన ఆలోచన రమ్మన్నా రాదు. ఒకర్నొకరు విమర్శించుకోవచ్చు, చూపులు కలుపక పోవచ్చు, కానీ వారి విశ్వాసం ఎన్నటికీ తరగదు.

ఈవిధంగా ఉండే జంట ఇద్దరు వ్యక్తులుగా కాక ఒకే వ్యక్తిగా ఉంటుంది. పరిస్థితులు విషమించినా వారి మధ్యనున్న బంధం చెక్కు చెదరదు. "ఏదైతే మార్పు చెందదో అదే ప్రేమ" అని ఎవరో అన్నారు. ఇదే ప్రేమకు పరాకాష్ట. అదే మనల్ని సంతృప్తి పరిచేది. 404

Eknath Gita Chapter 12 Section 13

Bhagavat Gita

12.13

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః {12.16}

సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః

అపేక్షలేనివాడును, పరిశుద్ధుడును, సమర్థుడును, నిర్లిప్తుడును, బాధలుడిగినవాడును, కర్మలయందు కర్తృత్వబుద్ధిని వదలిన వాడును నైన భక్తుడు నా కిష్టుడు ఀ

పై శ్లోకంలో శ్రీకృష్ణుడు అనపేక్ష అనే పద ప్రయోగం చేస్తున్నాడు. అనపేక్ష అనగా ఎదురు చూపు లేకుండుట. దాన్నే అనుకోని విధంగా వచ్చునది అని కూడా అర్థం చెప్పవచ్చు. అంటే "నాకు మంచైనా, చెడైనా, ఆనందమైనా, దుఃఖమైనా ఇవ్వండి, సర్దుకు పోతాను" అని చెప్పడం.

అనపేక్షకు వ్యతిరేక పదం కఠినం. మనకి ఎదురు చూసే ఫలితం కలిగితే మంచిదని అనుకుంటాం. కాని దానికి వ్యతిరేకంగా ఉంటే బిగుసుకు పోతాం. కాబట్టి ఎదురు చూపు లేకుండా బ్రతకడం అంటే స్వేచ్ఛ.

ముఖ్యంగా మనము అనుబంధాలలో మనకు అనుకూలంగా ఇతరులు ప్రవర్తించాలని ఎదురు చూస్తాం. వారు అనుకోని విధంగా ప్రవర్తిస్తే మనకు ద్వేషం, కోపం, నిరాశ, దుఃఖం మొదలగునవి కలుగుతాయి. మనము కోరే ప్రతిస్పందన మనకనుగుణంగా లేకపోతే మన స్పందన కూడా అలాగే ఉంటుంది. అంటే, ఉదాహరణకి, కోపాన్ని, కోపంతో ప్రతిఘటిస్తాము.

మనము చేసే క్రియలు ఉత్తమంగా చేసి, ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఉంటే, మనము పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తాము. పరిస్థితులు మనకు అనుగుణంగా ఉన్నా, లేకపోయినా మన ప్రయత్నం ఉత్తమంగా ఉండాలి. కొందరు ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటారు. అది ఉత్తమం కాదు.

అనుబంధాలలో, ఒక్కొకప్పుడు మనము ఇంకొకరి మీద శ్రద్ధ చూపిస్తున్నా వారు పట్టించు కోకుండా ఉండవచ్చు. మనం "ఎందుకు నన్ను పట్టించుకోవటంలేదు?" అని అడిగితే వారు "నేను పనిలో నిమగ్నమయ్యేను" అని చెప్పవచ్చు. అప్పుడు మనం "అతను నేనంటే ఇష్ట పడుతున్నాడా లేదా?" అని సతమతమవ్వ వచ్చు. అయినాసరే వాని మీద శ్రద్ధ చూపడం మానక ఉంటే ఎప్పుడో అప్పుడు అతను అది గుర్తిస్తాడు.

మన యందు ఇతరులు దురుసుగా ప్రవర్తించవచ్చు. అప్పుడు మనము ప్రతికూలంగా స్పందిస్తే పరిస్థితి విషమం అవుతుంది. కొందరు క్రీడాకారులు తమ ప్రత్యర్థి, తమకంటే తక్కువ ప్రతిభ ఉన్నవారలైనా, వాళ్ళ చేతుల్లో ఓడిపోతారు. ఎందుకంటే వారు తమ దృష్టిని క్రీడయందు ఉంచక ప్రత్యర్థిపై ఉంచేరు. అలాగే కొందరు ప్రత్యర్థి తమకన్న ఎక్కువ ప్రతిభ ఉన్నా, కష్టంతో లేదా ఏకాగ్రతతో వారిని ఓడిస్తారు.

నేను ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు సమావేశాలకు వెళ్ళినప్పుడు నా అభిప్రాయాలను చెప్పేవాడిని. కానీ కొందరు వాటిని ఖండించేవారు. మొదట్లో నాకది బాధ కలిగించేది. కానీ క్రమంగా తెలిసికొన్నదేమిటంటే వారు నేను అనుకోని విధంగా ప్రవర్తిస్తున్నారని. కాబట్టి నేను వారు ఖండిస్తారని ఎదురు చూస్తే బాధ కలుగదు. అలా మార్పు చె౦దిన తరువాత కొందరు "నీవు మంచి అంశాలు చెప్పేవు" అని పొగిడేవారు.

"ఇది ఆత్మ వంచన కాదా?" అని మీరనవచ్చు. ఇక్కడ ఆత్మ వంచన కాదు కదా, కోపం చెందడం నిజంగా కపటంతో కూడినది. ఎటువంటి కపట భావనలున్నా మనం ఆత్మ వంచన చేసికొన్నట్టే. శుద్ధంగా, నిర్లిప్తతతో, ఉండి, ప్రతి దబాయింపుకి స్పందించక, మనల్ని దేవుని చేతిలో ఒక పనిముట్టుగా తలచాలి.

ఒక నాటకంలో ఒకడు మహా తపస్వి పాత్రను పోషించేవాడు. వాడు మొదట్లో తన పాత్రను యాంత్రికంగా చేసేవాడు. కానీ ఆ నాటకం కొన్ని వందల మార్లు వేసిన తరువాత ఆ పాత్ర వాని చేతన మనస్సుతో తాదాత్మ్యం చెంది చివరకు వాడు ఆ తపస్వి లక్షణాలను అలవరుచుకున్నాడు.

మనలో ఎదురు చూసే ఆతృత మనస్సు స్వచ్ఛందంగా ప్రవర్తించడంవలన కలుగుతుంది. దాన్ని వదిలివేస్తే మనము జీవితం పరోపకారానికై గడుపుతాము. మన ఆత్మ రక్షణను వదిలివేస్తాము. ఎందుకంటే జీవితం మననుండి ఏదీ బలవంతంగా తీసికుపోలేదు. ఉపనిషత్తులలో "పూర్ణం లోంచి కొంత తీసివేస్తే అది పూర్ణంగానే ఉంటుంది; అలాగే పూర్ణానికి కొంత చేరిస్తే అది పూర్ణంగానే ఉంటుంది" అని చెప్పబడినది.

కొన్నాళ్ల క్రిందట నేను నా భార్యను, కొందరు పిల్లలను కామిలాట్ అనే సినిమాకు తీసికువెళ్ళేను. సినిమా అయిన తరువాత ఒక యుక్త వయస్కురాల్ని సినిమాలోని రాజుల గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని అడిగేను.

"వారు జీవితం ఎంతో ఉల్లాసంగా గడిపేరు. కాని వాళ్ళు కత్తి-ఢాలు పట్టుకోవడం బాగాలేదు" అని చెప్పింది.

కామిలాట్ లోనేకాదు, మనలో చాలామంది ఆత్మ రక్షణకై కత్తి-ఢాలు పట్టుకొని తిరుగుతాం. ఎందుకంటే మనం ఒకదానికై ఎదురుచూస్తున్నాము. మనకెప్పుడైనా ఒక సవాలు వస్తే కత్తి-ఢాలును మన ఆత్మ రక్షణకై పట్టుకొ౦టాము. మళ్ళీ ఇతరులు మనలను తప్పుగా అర్థం చేసికున్నారని తలుస్తాము. భార్యాభర్తలు కూడా ఒకచేత్తో కౌగలించుకొని మరొక చేత్తో ఢాలును పట్టుకొని దాన్ని అభద్రత కలిగినప్పుడల్లా తమ ఆత్మ రక్షణకై ఉపయోగిస్తారు.

కత్తి-ఢాలు పట్టుకోవడంవలన ప్రాణ శక్తి వృధా అవుతుంది. అవి మనల్ని నిజంగా రక్షించలేవు. పైపెచ్చు లేనిపోని సమస్యలు తెస్తాయి. గీత కత్తి-ఢాలుని వదిలేయి అంటుంది. అప్పుడు మన రెండు చేతులూ ఖాళీగా ఉండి, ఇతరులను ఆలింగనము చేసికొని "నాకు నీనుండి ఏమీ పొందాలని లేదు; నేను కోరేదల్లా నీకు సేవ చేయడం" అని చెప్పగలం. ఇదే మనమంతా ఎదురుచూసేది; అటువంటి ప్రేమ పొందడమే కాక, ఇతరులకు ప్రేమ పంచి ఇవ్వడం; దానివలన మన జీవితం ధన్యమవుతుంది. 397

Eknath Gita Chapter 12 Section 12

Bhagavat Gita

12.12

యస్మానో ద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః {12.15}

హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః

ఎవని వలన లోకమునకు భయము కలుగదో, లోకమువలన ఎవడు భయము నొందడో, సంతోషము, క్రోధము, భయము, ఉద్వేగము నుండి ఎవడు ముక్తుడో వాడు నాకు ప్రియుడు.

నా అమ్మమ్మ "నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒడిదొడుకులు ఉంటాయి. నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఖాతరు చెయ్యని వారు ఉంటారు" అని చెప్పేది. జీవితం సహజంగా ఎత్తుపల్లాలతో ఉంటుంది. గీత చెప్పేది మనమలా ఉండనక్కరలేదని.

ఈ మధ్య బయోరిథమ్ మీద చాలా ఎక్కువగా చదువుతున్నాను. ఈ సిద్ధాంతం ప్రకారం మనలోని భావాలు కొన్నాళ్ళు పైకి కొన్నాళ్ళు క్రిందకి వెళ్తూఉంటాయి. ఒక వారం ఆనందంగా ఉండి, మరో వారం విచారంగా గడపడమన్నమాట.

మనమీ ఒడుదొడుకులను ఒక పఠం మీద గీస్తే, మన లక్ష్యాలను ఒక ప్రణాళికతో సాధించవచ్చు. కానీ జీవితం మన ఒడుదొడుకుల మీద ఆధారపడి లేదు. గీత చెప్పినట్టు జీవిత మనకణుగుణముగా ఉంటే ఆనందపడి, మనకి వ్యతిరేకంగా ఉంటే ఇంకా ఆనందపడడం సాధ్యం కాదు. అనగా ఎత్తుపల్లాలను పట్టించుకోకుండా నిరంతరం ప్రసన్నంగా ఉండలేము.

మనలో చాలామంది ఆనందం ఒక సమస్య అని అనుకోము. కానీ నిజానికి ఆనందం క్షీణించి మనను నిరాశ కుదేలు చేస్తుంది. అంటే సమస్య నిరాశ. ఏది మీదకి వెళుతుందో, అది తప్పక క్రిందకి వస్తుంది అన్న సత్యం ఇక్కడ వర్తిస్తుంది. ఆశ, నిరాశ జోడీగా వస్తాయి. మనస్సు ఆశతో ఉంటే ఉల్లాసంగా ఉంటాము, లేకపోతే నీరసంగా ఉంటాము. ఆశానిరాశలతో మనస్సు వికలంగా ఉంటుంది.

ఈ రోజుల్లో నిరాశని (depression) ఒక మానసిక వ్యాధిగా పరిగణిస్తారు. కొన్ని కోట్లమంది ఈ వ్యాధితో బ్రతుకుతున్నారు. దానికై వైద్యులు మందులు ఇస్తారు. అవి కొన్ని లక్షణాలను ప్రభావితం చేస్తాయికాని దాన్ని పూర్తిగా వేళ్ళతో పెకళించలేవు.

నిరాశకు మన ఇంద్రియాలు దోహదం చేస్తాయి. ఇంద్రియాలు మనస్సుకు కిటికీల వంటివి. ఒకనికి సంతోషం తొందరగా కలగవచ్చు. వానిలోని కిటికీలు బార్లా తెరవబడి ఉంటాయి. ఎందుకంటే వానికి బాహ్య ప్రపంచంలోని ప్రేరణ కలిగించేవన్నీ కావాలి. వాని చూపు అంతర్గతంలో ఉండి ఏమవుతున్నాదో తెలీదు. ధ్యానం చేయకపోతే వానికి విశ్లేషణం చేసే జ్ఞానం లేదు. కొన్నాళ్ళకి వానికి ఇష్టంలేనిదేదో వస్తుంది. అప్పుడు కిటికీలు మూయబడినవై వానిని బంధీగా చేస్తాయి. ఇదే నిరాశ.

నిరాశతో ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ అంతర్ముఖంగా ఉండి, ఇంద్రియాలు పంపే సంకేతాలను విస్మరిస్తారు. వారిని సినిమాకు తీసికువెళ్తే ఆనందించరు. మాట్లాడినా వాళ్ళు అర్థం చేసికోరు. ఎందుకంటే వారి దృష్టి వారి లోపల ప్రసరిస్తున్నాది. అంటే బయట విషయాలతో వారికి ప్రమేయం లేదు. "నన్నెవరూ ప్రేమించరు. నాకు ఎవరూ ఇష్టం లేదు. నాకు నేనంటే కూడా ఇష్టం లేదు" అని అనుకొంటారు.

నిరాశ వలన అనుబంధాలు ముఖ్యంగా ప్రభావితమౌతాయి. అనుబంధాలు మన సుఖశాంతులకు మూలం. ఇతరులతో కలసిమెలసి ఉండడం వలన మిక్కిలి ఆనందం కలుగుతుంది. దానికి దృష్టిని బాహ్యంగా ప్రసరింపజేయాలి. కానీ ఇంద్రియాల కిటికీలు మూసేస్తే ఇతరులతో సంబంధం ఉండదు. ఆనందంగా వుండే సమూహం లో ఉన్నా ఇంకా నిరాశే కలుగుతుంది.

ధ్యానంలో కూడా ఇంద్రియాలను మూసేసి, మనస్సు అంతర్ముఖం చేస్తాము. కాని ఇది స్వచ్చంధ౦గా చేస్తాము. అలాగే ధ్యానం తరువాత మళ్ళీ మామూలుగా ఉంటాము.

మందులు మూసుకున్న కిటికీలను అప్రయత్న పూర్వకంగా తెరిచి ఉంచుతాయి. దీనివలన కొందరి జీవితాలు బాగుపడచ్చు. కానీ అవి మనస్సులోని చాంచల్యాన్ని అరికట్టలేవు. మనం కిటికీలను ఇష్టానుసారం మూసి, తెరవ గలగాలి.

దానికై కొన్ని చిట్కాలు ఉన్నాయి. మొదటది ఒంటరిగా కాక నలుగురితో కలసి ఉండాలి. నిరాశ కలిగినప్పుడు ఒక గదిలో ఒంటరిగా బంధించు కోవాలని ఉంటుంది. కాని అలా కాక, నలుగురితో కలిసి ఉండడమో, శారీరకంగా శ్రమ -- ఇతరుల ఉపకారం కొరకైతే మరీ మంచిది-- పడడమో చెయ్యాలి. అలా చేస్తే మన చూపు అంతర్ముఖంగా ఉండదు. ఇతరులతో ఉన్నప్పుడు వారిపై చికాకు పడక, వారు చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం నేర్చుకోవాలి. మాట్లాడకపోయినా ఒకరు చెప్తున్నది విని, మందహాసం చేయవచ్చు. మొదట్లో అది నటన అనుకున్నా, క్రమంగా అది అలవాటై పోతుంది.

నిరాశని ఉంకో కోణంలో చూడవచ్చు. అది ప్రాణ శక్తి. అది ఒక కారులోని ఇంధనం వంటిది. ఎంతో ఉల్లాసంగా ఉంటే దాని ఖర్చు ఎక్కువవుతుంది. కొంత మంది ఉల్లాసంగా మాట్లాడుతూ పోతారు. వారి మనస్సు నియంత్రింపబడక ఉంటుంది. కొందరు సహజంగా రోజులో ఎన్నో పనులు చెయ్యాలని వేగం పెంచుతారు. ఇవి అన్నీ ప్రాణ శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తాయి. అది భౌతిక పరంగానేకాక, మానసిక పరంగా కూడా. గుండె వేగం పెరుగుతుంది, నరాలు బిగువుగా ఉంటాయి, ఊపిరి వేగవంతమౌతుంది. వీటన్నిటివలనా ప్రాణ శక్తి విపరీతంగా ఖర్చవుతుంది.

ప్రాణశక్తి క్షీణిస్తూ ఉంటే, ఉల్లాసం కూడా తక్కువవుతుంది. తరచు వెళ్ళే ప్రదేశాలు, ఎప్పుడూ కలిసే బంధుమిత్రులు మనల్ని ఉత్తేజ పరచవు. ఇవన్నీ నిరాశ యొక్క లక్షణాలు.

నిరాశ ఒక విధంగా మంచిదే. ఎలాగంటే మనమెప్పుడూ ఉల్లాసంగా ఉంటే మన ప్రాణశక్తి విపరీతంగా ఖర్చయి, ఇక బ్రతకడానికి మిగలదు. అజీర్తి ఎలాగైతే మన౦ తినే ఆహారం పడకపోతే లేదా ఎక్కువ ఆహారం తినడంవలన కలుగుతుందో, నిరాశ కూడా అలాగే. నిరాశ "నీవు ఇంద్రియాలను సక్రమంగా వాడటంలేదు. నీ మనస్సును స్థిమిత పడనివ్వటం లేదు. నీ మనస్సుకి, దేహానికి విశ్రాంతి ఇవ్వకపోతే నీకు ప్రాణశక్తి లేదు" అనే సందేశం ఇస్తుంది.

నిరాశ కలిగినప్పుడు లైంగిక వాంఛలు తగ్గుతాయి. ఎందుకంటే రతికి మించిన ప్రేరణ వేరొకటి లేదు. అది భౌతికంగానే కాదు. మానసికంగా కూడా. కానీ దానివలన ప్రాణ శక్తి ఎక్కువగా వ్యయమవుతుంది. లైంగిక వాంఛ లేక పోతే, ప్రాణ శక్తిని కూడబెట్టి, భవిష్యత్తులో ఉల్లాసం కలిగినప్పుడు వెచ్చించవచ్చు.

ఈ రోజుల్లో ప్రతీదీ ఉల్లాసంతో ముడి పెడతారు. దూర ప్రయాణాలు, హొటేళ్ళు, సంగీతం, కార్లు, చివరకు పెదవులకు రాసుకునే లిప్ స్టిక్ కూడా. అందరూ ఉల్లాసాన్నే కోరుకుంటే, మానవాళికి ముప్పు తప్పదు. ప్రజలు అన్ని చోట్లా ఉల్లాసం కోరితే, నిరాశ కలుగక మానదు.

ఇంద్రియాలను ఎక్కువగా వాడడం సమస్య కాదు. మన స్వచ్ఛంద నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. మనమెప్పుడూ మనమీదే ధ్యాస పెట్టుకొని, గతాన్ని నెమరువేస్తూ, భవిష్యత్తు గురించి బెంగ పడుతూ ఉంటే నిరాశ ఎక్కువవుతుంది. ఇవన్నీ ప్రాణశక్తిని వృధా చేస్తాయి. సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా చెప్పేరు:

ఆమె హృదయం ప్రేమతో ఉల్లాసంగా ఉంది

ఎందుకంటే మనస్సు దేవునిపై లగ్నమై ఉంది

అన్ని స్వార్థపూరిత బంధాలను త్యజించి,

అంతర్గతంగా ఉన్న దేవుని నుండి శక్తి పొందుతుంది

ఆమె తనగురించి కాక

ఇతరులలోని ప్రేమ స్వరూపుని సేవకై ఉంటుంది

జీవితమనే సముద్ర౦లోని కెరటాలపై

ఎదురీత చేసి ఆవలి ఒడ్డుకు చేరుతుంది

391

Eknath Gita Chapter 12 Section 11

Bhagavat Gita

12.11

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ {12.13}

నిర్మమో నిరహంకారః సమ దుఃఖసుఖః క్షమీ

సంతుష్ట స్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః {12.14}

మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః

సర్వ ప్రాణులపై ద్వేషము లేనివాడును, మైత్రి గలవాడును, దయామయుడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖ దుఃఖములను సమముగ చూచువాడును, సహన శీలుడును, నిత్య తృప్తుడును, యోగియును, ఆత్మ నిగ్రహము కలవాడును, దృఢ నిశ్చయము కలవాడును, మనోబుద్ధులను నా యందే సమర్పించిన వాడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. ఀ

ఇక్కడ శ్రీకృష్ణుడు తన భక్తుల సద్గుణాలను వివరిస్తున్నాడు. ముఖ్యంగా అందరియందు దయ, కారుణ్యంతో ఉండాలి. మనమెప్పుడు క్రోధంతో ఉండకూడదు.

అలాగే నేను, నాది అనే భావనలను వదులుకోవాలి. కొందరు ఒక వాహనమును నాది అనుకుంటారు. వారి వాహనాన్ని విమర్శిస్తే దానిని వారిని విమర్శిస్తున్నట్టుగా అపార్థం చేసికొంటారు.

మనలోని స్థిరమైన భావనలను ఇతరులకై మార్చు కోవాలి. వ్యతిరేక భావాలున్నవారి దృక్పథం పూర్తిగా వినాలి. వారు చెప్పేది మనకు వేరుగా ఉంటే వారిని కించపరచ కూడదు. ఈ విషయంలో కొంత వైరాగ్యం అవసరం. మన౦ ముందే "నేను చెప్పేది సత్యం" అనుకొంటే ఎదుటి వారు చెప్పేదాన్ని వినం. ఆ పద్దతిని మార్చుకోవాలి.

శ్రీకృష్ణుడు చెప్పే సద్గుణాలు:

  • కరుణ: ఇతరులపై ప్రేమ, దయ కలిగి ఉండడం
  • క్షమి: ఇతరులమీద కనికరం ఉండి, వారు ఎవరైనా, ఏమి చేసినా క్షమించగలగాలి. వారితో కరచాలనం చేస్తే సరిపోదు. వారితో కలసిమెలసి ఉండి, వారికి పూర్తి సహకారం ఇవ్వాలి
  • మైత్ర: నిజమైన స్నేహం పరస్పర గౌరవంతో ఉంటుంది. అట్టి స్నేహంలో, పగ, ద్వేషం ఉండవు. స్నేహితులలోని సద్గుణాలను పెంపొందించే విధంగా మెలగాలి.

చివరిగా శ్రీకృష్ణుడు "యో మద్భక్తా స మే ప్రియాః" అంటాడు. అంటే మనమలా జీవించేమంటే ఇతరులకు ఉపయోగకరముగానే కాక, దేవుడు మనను ప్రేమించి, దేవుని యందు ఐక్యమవుతాం. 383

Eknath Gita Chapter 12 Section 10

Bhagavat Gita

12.10

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే {12.12}

ధ్యానాత్కర్మఫలత్యాగః త్యాగాచ్చా౦తి రనంతరమ్

అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేయోదాయకము. జ్ఞానము కంటెను ధ్యానము ఉత్తమము. ధ్యానము కంటెను కర్మ ఫలత్యాగము ఉన్నతము. కర్మఫల త్యాగముచే శాంతి కలుగును ఀ

ఎక్కడైతే జీవైక్య జ్ఞానం ఉన్నాదో అక్కడ ప్రేమ ఉంది. అలాగే ఎక్కడైతే ప్రేమ ఉందో, అక్కడ జీవైక్య భావన ఉంది. మనస్సు నిశ్చలంగా లేకపోతే ఇంద్రియాతీత జ్ఞానం లేదా ప్రేమ లేదు. సాధనలో ఇవి కలసి వస్తాయి. కాబట్టి సాధనలో వాటినన్నిటినీ కలిపి పట్టుకోవాలి.

సాధన మొదట్లో యాంత్రికంగా చేయడంలో తప్పులేదు. కొందరు అప్పుడే ధ్యాన మార్గంలో ప్రవేశించి నన్ను "మీరు మంత్రాన్ని యాంత్రికంగా జపించమని అంటున్నారా?" అని అడిగేవారు. నేను అవునని చెప్పేవాడిని. మంత్రాన్ని భక్తితో మననం చెయ్యడానికి మన స్వచ్ఛంద భావాలు తక్కువగా ఉండాలి. మనము ఉత్సాహంతో, ఎప్పుడు వీలయితే అప్పుడు, మంత్రాన్ని జపిస్తూ పోతే, క్రమంగా అది మన చేతన మనస్సు లోతులలో ప్రసరిస్తుంది.

ఈ విధంగా సాధన చేస్తే మనకు ప్రావీణ్యం వస్తుంది. మనము వేర్పాటుతో బ్రతికితే ఒంటరితనం, అనుబంధాలు క్షీణించడం, నిరాశ మొదలగునవి కలుగుతాయి. మనమెంత త్వరగా మనకై ఆనందాన్ని స్వీకరిస్తామో, అది అంత త్వరగానే పోతుంది. దానికి వ్యతిరేకం మనం ఇతరుల ఆనందానికై పాటు పడడం. ఇది జ్ఞానోదాయానికి నాంది. అప్పుడు మాయను అధిగమిస్తాం.

సిద్ధాంతాలను తెలిసికొంటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టాలి. దానికి ధ్యానం ఎంతో అవసరం. మనమిలా సాధన చేస్తే మన అహంకారం తగ్గి, ప్రేమ పెరుగుతుంది. "దీని వలన నాకేమి లాభం చేకూరుతుంది?" అని అడిగే బదులు "నేను ఇతరులకు ఏమి ఇవ్వ గలను?" అని అడగడం మొదలుపెడతాం. కొన్నేళ్ళ సాధన శ్రద్ధతో, చిత్త శుద్ధితో చేస్తే, మనము "నేను ప్రేమిస్తున్నాను" అని చెప్పగలం. అటు తరువాత అన్ని అవరోధాలు తొలగి పోతాయి. స్వార్థం తగ్గుతుంది. మన ఒక్కరికై ఏదీ కాంక్షించం. మనము అందరిలోనూ ఉంటాం. అప్పుడు హృదయంలో శాంతి చేకూరుతుంది. అహంకారం తొలగి మనస్సులో సందిగ్దత, నిరాశ ఉండవు. ఇది కొంతకాలమే ఉండేది కాదు. వ్యక్తిత్వమంతటా వేరు చేయలేని శాంతి నెలకొంటుంది. 376

Eknath Gita Chapter 12 Section 9

Bhagavat Gita

12.9

అథైటదప్యశక్తో అసి కర్తుం మద్యోగమాశ్రితః {12.11}

సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్

నా నిమిత్తమైన కర్మ నాచరించుటకు కూడా ఆశక్తుడవైనచో ఆత్మనిగ్రహము కలిగి, నన్నే ఆశ్రయించుచు, కర్మఫలాసక్తిని త్యజించి కర్మల నాచరింపుము

ఈ శ్లోకంలోని అంశాలను అనుభవంలోకి తెచ్చుకోవడం అతి దుర్లభం. అది తేలిక అనుకొంటే మనము శరణాగతి అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసికోలేదు. శరణాగతి అంటే ఏమీ చెయ్యకుండా ఉండడం కాదు. గీత ముఖ్యంగా కర్మ చెయ్యమని చెప్తుంది. కాని ఆ కర్మ నిస్వార్థమై -- అంటే ఫలాపేక్ష లేకుండా-- ఉండాలి. అనగా క్రియ లేదా ప్రయత్నాన్ని దేవునికి సమర్పించడం కాదు. మన స్వీయ ఇచ్ఛయించుట సమర్పణం చెయ్యాలి. సదా మన కర్మలను శ్రద్ధతో చెయ్యాలి. వాటి ఫలిత౦ మన చేతిలో లేదు.

శ్రీకృష్ణుడు కర్మ ఫలాన్ని ఆశించక కర్మలు చెయ్యడం మానక ఉండాలి అని బోధ చేయుచున్నాడు. శ్రీరామ చంద్రుడు రాజ్యాన్ని వదిలి వనవాసానకి వెళ్ళడానికి మూల కారణం కర్మ సిద్ధాంతం. మన౦ మనసా, వాచా, కర్మా జీవితాన్ని మలచుకొంటున్నాము. దశరథుడు ఒకప్పుడు ఒక ముని కుమారుని సంహరించేడు. ఆ ముని ఇచ్చిన శాపంవలన రాముని పట్టాభిషేకం ఆగిపోయింది.

దేవుడు ప్రతి ఒక్కరిని వారు వోర్చుకున్నదానికన్న ఎక్కువ తక్కువ లేకుండా పరీక్షిస్తాడు. మనలో చాలామందికి స్వార్థం విడనాడడానికి వేరే మార్గం లేదు.

ఇది మూఢ భక్తి కాదు. ఎన్నో ఏళ్ల సాధనద్వారా తెలిసికొనబడినది. నేను మొట్ట మొదట ధ్యానం చేయడం ఆరంభించినప్పుడు నాకు నా అమ్మమ్మ తప్ప వేరే ఆదర్శవంతులు లేరు. నా ధ్యానం కొనసాగుతున్న కొద్దీ నా జీవన శైలిపై కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసికొనవలసి వచ్చింది. నేను అలా చేయడం సంతోష౦ కలిగించకపోయినా నాకు చేతనైనది చేసేను. నేను అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలు తీసికొని వాటి బాధాకరమైన పర్యావసానాలను కూడా అనుభవించేను. కొన్నాళ్ల తరువాత తెలిసిందేమిటంటే: నేను తీసికొన్న నిర్ణయం అంత గొప్పది కాకపోయినా, దానిని ఆచి తూచి తీసుకొంటే, అటుపై శ్రద్ధతో కర్మల నాచరిస్తే, దాని వలన కలిగే బాధ ఎక్కువగా ఉండదు. అలాగ బాధలను పరిస్థితుల ప్రభావం వలన అధిగమించేను. అలాగే కొన్ని మంచి అవకాశానికి దారి తీసేయి. అప్పుడు నాకేమీ స్పష్టంగా కనిపించలేదు. కాని ఇప్పుడు సింహావలోకనం చేసికొంటే నా క్లిష్ట పరిస్థితులు నా చే కర్మ శ్రద్ధతో చేయించి, ఫలితం భగవంతునికి అప్పజెప్పే విధంగా శిక్షణ ఇచ్చేయి. 374

Eknath Gita Chapter 12 Section 8

Bhagavat Gita

12.8

అభ్యాసే అప్యసమర్ధో అసి మత్కర్మపరమోభవ {12.10}

మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్న్యసి

అభ్యాసయోగము నాచరించుట కూడా నీవు అసమర్థుడ వైనచో నా నిమిత్తమైన కర్మయందు నిరతుడవు కమ్ము. నా కొరకు కర్మ లాచరించినను నీవు సిద్ధిని పొందగలవు ఀ

మనము వేరొకరి సంతోషం కోరి వారిని మనస్సులో పెట్టుకొని ఏ పనైనా చెయ్యాలి. ఒక తల్లి, కొడుకుల అనుబంధంలో, లేదా అన్న, చెల్లెలి అనుబంధంలో ఇలా చేయడం తేలిక. కాని ఇతరులను మనకంటే ఎక్కువగా చూసుకోవడం కష్టం. ఎందుకనగా మన౦ మన సంస్కారాలు వలన మలచబడ్డా౦.

సంస్కారమంటే మన వ్యక్తిత్వంలో ఎప్పటికీ మార్పు లేకుండా, యాంత్రికంగా జరిగే స్పందన. అది ఒక ప్రక్రియ: ఒకే ఆలోచన వేల సార్లు కలిగి, ఆ ఆలోచనతో వాక్కు ప్రభావితమై, తద్వారా క్రియను ఆచరించడం. ఒక కోపిష్టికి కోపం రావడం సహజం. వానిని ఏ విధంగా పలకరించినా వానికి కోపం కలుగుతుంది. అది వాని సంస్కారం. వాని ఆలోచనలు కోపంతో కూడినవై, మాటలు నిర్దయతో కూడినవై, నడవడిక దురుసుగా ఉండి, చివరకు కోపిష్టి అయ్యాడు.

వ్యక్తిత్వమనగా సంస్కారాల పోగు. అనగా మనము మన సంస్కారాలతో చేయబడ్డాము. మనమేమి ఆలోచిస్తామో, మాట్లాడుతామో, చేస్తామో మన సంస్కారాలు నిర్ణయిస్తాయని తలచవచ్చు. అంటే మనము స్వతంత్రులము కాము. కానీ వ్యక్తిత్వము మార్పు చెందనిది కాదు ఎందుకంటే అది కూడా ఒక ప్రక్రియే. మనమెల్లప్పుడూ ఒకేలాగ ఉన్నామని అనుకోవచ్చు. నిజానికి మన శరీరంలోని కణాలు మారుతున్నట్టే మన వ్యక్తిత్వం కూడా మారుతోంది.

సంస్కారాల వలన మన స్పందన ఎప్పుడూ ఒకేలాగ ఉంటుంది. కానీ ధ్యానంతో దానిలో మార్పు చేయవచ్చు. అనగా ఎప్పుడూ ఒకే ఆలోచన, మాట, క్రియ తో కూడిన సంస్కారాన్ని దానికి విరుద్ధమైన ఆలోచన, మాట, క్రియలతో మార్చవచ్చు.

ఒక యోగికి ఒకరిపై కోపం కలిగితే, దానిని దయగా మారుస్తాడు. దయ ఒకరిపైనే కాదు, తన యందు కూడా. ఎందుకంటే ఒక కుసంస్కారము కోపంగా వ్యవహరించమంటే, దానిని దయతో సుసంస్కారంగా మార్పుచేసున్నాము.

ఒక కుసంస్కారము తలెత్తితే, మనము స్పందించకుండా ఉండాలి. అది ఏమి చెయ్యాలో నిర్దేశిస్తే, కాదు అని చెప్పాలి. మంత్ర జపం ఇక్కడ పనికి వస్తుంది. లేదా బయట షికారుకు వెళ్ళవచ్చు. లేదా ఒక లక్ష్యంతో, పరోపకారానికైతే మరీ మంచిది, పని చేయవచ్చు. మనమెప్పుడైతే సావధానతను కుసంస్కారమునుండి మంత్రానికి లేదా పరోపకార కర్మవైపు మళ్లించేమో, దాని ప్రభావం తగ్గి, మనకు దానినెదిరించే పట్టుదల కలుగుతుంది.

కుసంస్కారాలు ఇలా ప్రభావితం చేస్తాయి: మొదట మననుండి వచ్చే స్పందన తెలిసీ తెలియకో దుష్ఫలితాలకు దారి తీస్తుంది. రెండవది మన ఏకాగ్రత క్షీణిస్తుంది. దాని వలన పనులలో జాప్యం కలిగి ఇబ్బంది పడవచ్చు. ధ్యానంలో మనస్సు పరిపరి విధాల పోతుంది. చివరకు ధ్యానం చేస్తూ నిద్ర పోవచ్చు.

అలా జరిగితే అప్రమత్తంగా ఉండాలి. కుసంస్కారాలను దూరం చేసికోవాలంటే ధ్యానం, మంత్ర జపం, ఏకాగ్రతతో కర్మలు చేయడం వంటి మంచి అలవాట్లను నేర్చుకోవాలి. అలాగే తీవ్రంగా మనగురించే ఆలోచించడం వలన ఒక కుసంస్కారాన్ని ఆహ్వానిస్తున్నట్టే. 370

Eknath Gita Chapter 12 Section 7

Bhagavat Gita

12.7

అథ చిత్తం సమాధాతు౦ న శక్నోషి మయి స్థిరం {12.9}

అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ

అర్జునా! ఇంకను నీ మనస్సును నా యందు స్థిరముగ నిలుపుటకు అశక్తుడవైనచో అభ్యాసయోగముచే నన్ను పొందుటకు యత్నించుము

అభ్యాసము కూసువిద్య అన్నారు పెద్దలు. ధ్యానం అభ్యాసంవలననే అలవడుతుంది. మొదట్లో మనస్సు పరిపరి విధాలా పోతుంది. అలాగే మనలోని క్రోధం, భయం మొదలైన దుర్గుణాలు మనస్సును తప్పు ద్రోవ పట్టిస్తాయి. వాటికి కారణం మన అహంకారం.

ఇలాటి సమయాలలో మంత్రజపం తప్ప వేరే మార్గం లేదు. మంత్రం ఆలోచనకి, సావధానతకి మధ్యనున్న బంధాన్ని తెంపుతుంది. ఆలోచనలు పలు రకాలుగా ఉండచ్చు. కానీ వాటిని పరిశీలించేది మన సావధానత. మనమెప్పుడైతే ఒక ఆలోచన మీద శ్రద్ధ చూపమో అది మననేమి చేయలేదు.

సావధానత ఒక దీపస్తంభం లాంటిది. సాధారణంగా అది అన్ని వైపులా తిరగగలదు. మన సావధానత తరచు భగ్నమైతే, ఆ దీపస్తంభం ఒక చోట ఆగిపోయింది. ఎన్నో ఏళ్లు గడిస్తే అది ఇక తిరగలేదు. అలాటప్పుడు ధ్యానం ద్వారా ఒక చోట చిక్కుకుపోయిన శ్రద్ధను విడిపించుకోవాలి.

అది ఎలాగంటే, మనకిష్టంలేని పనులు ఆనందంగా స్వీకరించాలి. ఏపని చేసినా శ్రద్ధతో చెయ్యాలి. అవసరమైనప్పుడు ఒక పనిని వదిలి పెట్టి, వేరొక పనికి మారాలి. ఉదాహరణకి ఆఫీస్ పని ఇంట్లో చెయ్యకూడదు. కొన్నిపనులు చేయడానికి పూర్తి శ్రద్ధ అక్కరలేదు. అలాటప్పుడు మంత్రం జపించాలి.

మన సావధానతను మనకు కావలసినట్టుగా మలచుకొంటే, మనమే పనీ నిర్బంధంతో చేయము. దీని వలన పూర్తి స్వేచ్చ కలుగుతుంది. సమస్య ఎంత తీవ్రమైనదైనా, అనుభవం ఎంత బాధాకరమైనా, వాంఛ ఎంత గాఢమైనా, రమారమి ఒక గంట ధ్యానం చేస్తే మనస్సు మీద ఒత్తిడి తగ్గి తేలిక అవుతుంది. ఇది స్వేచ్ఛకు మొదటి అడుగు. ఇంకా చేతికి సంకెళ్ళు ఉండవచ్చు. కానీ మీ అనుభవంతో కష్టపడి, ఎంతకాలమైనా ధ్యానాభ్యాసన చేసి ఆ సంకెళ్ళను విడిపించుకోవచ్చు. 363

Eknath Gita Chapter 12 Section 6

Bhagavat Gita

12.6

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ {12.8}

నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వ౦ న సంశయః

నీ మనస్సును నా యందు నిలుపుము. నీ బుద్ధిని నాయందు ప్రవేశపెట్టుము. ఆ తరువాత నీవు నా యందే వసి౦తువు. ఇందులో సంశయము లేదు

ఒక క్రీడాకారుడు ఎంతో ఆలోచించకుండా యాంత్రికంగా తన క్రీడను ఆడవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో అలాగే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనలో ఆవేదన అహంకారం వలన కలుగుతుంది. అది నిశ్చలంగా ఉంటే మనచే ఏ పనీ బలవంతంగా చేయబడదు. అలాగే మన అనుబంధాలకు అవరోధాలుండవు.

మన మాటే నెగ్గాలి, అంతా మన ఇష్టమే అనే భావనలు ఉంటే అవి మన అనుబంధాలకు అడ్డు వచ్చి ఇతరులపై ప్రేమ కలుగజేయవు. ఆ భావనలను ఎంత తగ్గించుకుంటే మన నుండి మనము అంత ఎక్కువగా వైరాగ్యము చెందుతాము. అట్టి వైరాగ్యము లేకపోతే ఇతరులయందు అసూయ, క్రోధము మొదలగు అవలక్షణాలు కలుగుతాయి.

మన మనస్సు మనకు కావాలసినట్టు జరిగితే ఉవ్విళ్ళూరుతుంది. అలా కాకపోతే క్రుంగిపోతుంది. మనకు స్వీయ వైరాగ్యం కలిగితే మనస్సులోని చలనం తగ్గుతుంది. అప్పుడు మనము జీవైక్యముతో ఉంటాము. దాని సహజ లక్షణం ఒక వ్యక్తి యందే కాక, అన్ని జీవులమీద ప్రేమ ఉండడం. ప్రేమించడానికి ఏదో గొప్ప వస్తువు అవసరం లేదు. మనమెప్పుడైతే మనమనుకున్నట్టు జరగాలనే పట్టుదలను వీడుతామో, మన వ్యక్తిత్వంలో మిగిలి ఉండేది ప్రేమ.

మన మనస్సు పరమాత్మ మీద కేంద్రీకరించాలంటే మనము అహంకారాన్ని విడనాడాలి. అంటే మీ గురించే ఎక్కువ ఆలోచించ కండి. మీకు గతంలో కలిగిన అవమానాలను గూర్చి గాని, మీయందు దుష్ప్రవర్తనను చూపినవారి గురించి గాని ఆలోచించవద్దు. కొందరికి ఊహాతీత భావనలు కలగవచ్చు. ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు వారికి ఫోన్ చేసి మాట్లాడుతారనే భ్రాంతి. ఇలా ఉంటే మన మనస్సును అహంకారం మీద కేంద్రీకరించా౦. అదే జరిగితే మంత్రోచ్చరణ తప్ప వేరే మార్గం లేదు.

కొందరి ఆలోచనా సరళిని విశ్లేషిస్తే ముఖ్యంగా తేలేది "నాకిది నచ్చదు" అనే భావన. వారికి ఒకరి ప్రవర్తన నచ్చకపోవచ్చు. అలాగే భార్య వండిన వంట నచ్చక పోవచ్చు. "నువ్వు నాకు నచ్చలేదు" అని చెప్పిన తరువాత, అది తప్పా, ఒప్పా అని ఆలోచించవద్దు. మంత్రోచ్ఛారణ చేయడమే ఉత్తమం.

గోఫర్ అనే ఉడుత భూమి ఉపరితలం క్రింద బొరియలు త్రవ్వుకొని వాటిలో నివసిసస్తుంది. గోఫర్ ల చర్యలు పరిశీలిస్తే ఆకలి వేసినప్పుడు బొరియల వెలుపకు వస్తాయి. తిరిగి లోపలకు పోతాయి. నా ఇంటి వెనకాల ఉండే గోఫర్ లకు నేనంటే భయం లేదు. నేనున్నప్పడు వాటి సహజ చర్యలు చేసికుంటూ పోతాయి. అదే నా పిల్లి వస్తే అవి భయపడి బొరియల లోకి పారి పోతాయి.

మన మంత్రము ఒక పిల్లి లాగ ఉండి, స్వార్థ పూరిత ఆలోచనలనే గోఫర్ లను అణచివేస్తుంది. మంత్రం లేకపోతే దురాలోచనలు గోఫర్ లవలె మన మనస్సుని పూర్తిగా ఆధీనంలో పెట్టుకొంటాయి. క్రమంగా ఒక దురాలోచన కలిగినప్పుడు, మంత్రం వెంటనే మనస్సులో తళుక్కుమంటుంది. ఈ విధంగా స్వార్థ పూరితమైన ఆలోచనలు లేదా దురాలోచనలు నియంత్రింప బడతాయి.

మనస్సు నిశ్చలంగా ఉంటే సరిపోదు. బుద్ధి కూడా దానికనుగుణంగా ఉండాలి. బుద్ధి యొక్క కార్యం: "నేను ఇది చేస్తే దాని పర్యావసానమేమిటి? నేను ఇది చేయకపోతే ఏమవుతుంది?" అనే ప్రశ్నలకి సమాధానాలు వెదకడం. బుద్ధి పనిచేయాలంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే బుద్ధి పనిచేసే బదులు మనస్సు పనిచేసి "నాకిది నచ్చింది" లేదా "నాకది నచ్చలేదు" అని ఇష్టానుసారంగా పని చేస్తుంది. శ్రీకృష్ణుడు "బుద్ధి నాయందు ఉంచు" అని చెప్పడానికి కారణం: జీవితాన్ని అహంకారంతో గడపవద్దు. ఆత్మతో అనుసంధానము చెయ్యి. అనగా నీ మనస్సులో కలిగే ఇష్టాయిష్టాలతో విషయాలను విచారించ వద్దు.

కొందరు "ఆత్మ ఏ దృక్పథంతో ఉంటుంది?" అని అడుగుతారు. అది మనకు కనబడదు. అది ఎక్కడుందో మనకు తెలియదు. ఆత్మ యొక్క దృక్పథం తెలిసికోవాలంటే మనము ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు "దీని వలన ఎవరికి లాభం?" అని ప్రశ్నించుకోవాలి. మన అహంకారం "ఇది పరుల గురించి చేయబడుతున్నది" అని చెప్పి మననని సంతృప్తి పరచవచ్చు. కానీ అక్కడితో ఆగికపోక బుద్ధిని ఉపయోగించి నిర్ధారణ చేసికోవాలి. చివరకు "దీని వలన ఎవ్వరికీ ఎటువంటి లాభమూ లేదు" అని కూడా తీర్మానించవచ్చు.

అలాగని మన స్వార్థాన్ని పూర్తిగా చంపుకోనక్కరలేదు. తక్కిన వాళ్ళ గురించి తీవ్రంగా ఆలోచి౦చి క్రియలు చేస్తే, వాటిలో మన కోర్కెలు కూడా కలసి వస్తాయి.

రెండవ అంశం, మనము ఆలోచన దీర్ఘంగా చెయ్యాలి. అంటే అహంకారాన్ని వీడి ఆత్మతో అనుసంధానం చేసి, పది మందికీ ఉపయోగపడే కార్యాలు చెయ్యాలి. ఎందుకంటే ఆత్మకి వైరాగ్యం సహజం. ఇది అహంకారానికి పూర్తిగా వ్యతిరేకం.

మనము వస్తువులు చూపే ఆశలు, చివరకు ఇచ్చే సుఖములలోని తారతమ్యం తెలిసికోవాలి. ఉదాహరణకు ఒక రసగుల్లా తింటే పది నిమిషాల పాటు దాని తీపిని ఆస్వాదీస్తాం. కాని అదేపనిగా రసగుల్లాలు తింటూ ఉంటే అనేక రోగాలు వస్తాయి. అది వెంటనే కాకపోవచ్చు. కాని దాని పర్యావసానము జీవితంలో ఎప్పుడోఒకప్పుడు ఉంటుంది.

మూడవ అంశం, శ్రీకృష్ణుడు మత్పరాః -- అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకో -- అంటాడు. మనమేదైనా కార్యం చేసేముందు "ఇది నా ధ్యానాన్ని, ఏకాగ్రతను, నిస్వార్థాన్ని మెరుగుపరుస్తుందా?" అని అడగగలగాలి. అవును అంటేనే అది చెయ్యాలి. ఒకదాని వలన ఏకాగ్రత చెడి, ఇతరులనుండి ఎడంగా ఉంచబడి, అతి చలనం కలిగి, పాత జ్ఞాపకాలు, కోరికలతో ఉద్రేకం కలగవచ్చు. అటువంటి దానిని విడనాడాలి. కఠోపనిషత్తు ఇలా చెప్పును: "ఏది ఆనందదాయకమో ఒకటి; ఏది జ్ఞానముతో కూడినదో వేరొకటి. మొదటి దానివలన దుఃఖం కలుగక మానదు. రెండవది, ఆరంభంలో క్లేశాన్ని కలిగించినా, శాశ్వత సుఖం ఇస్తుంది. "

ఇంకా ఒకే అంశం మీద తీవ్ర కృషి చెయ్యనక్కరలేదు. అలా చేస్తే రాగద్వేషాలు కలుగుతాయి. వైరాగ్యం రాదు. దాని వలన సమిష్ఠి నుండి విడబడతాము. ఒక గొప్ప లక్ష్యం ఉంటే తప్ప దీనిని అర్థంచేసికోవడం కష్టం.

కొందరు మరాథాన్ లలో పరిగెడతారు. దానికి చాలా శిక్షణ పొందుతారు. వారికి అదొక వ్యాపకం. అది ఒక వ్యాయామం అనడంలో నిజముంది. కానీ దాన్నే అతిగా చేస్తే ధ్యానం కుంటుబడుతుంది, శారీరక సమస్యలు -- కీళ్ల నొప్పులు మొదలగునవి- రావచ్చు.

మెహర్ బాబా "గట్టి ప్రయత్నం చెయ్యి. విచారించ వద్దు. ఆనందంగా ఉండు" అని చెప్పేరు. విచారం మనము స్వీయ వైరాగ్యం పొందకపోవడం వలన కలిగేది. ఉదాహరణకి "నేనిది చెయ్యగలనా? ఫలానా వాడు నేను అనుకున్నట్టు చెయ్యగలడా?" అనే ప్రశ్నలతో సతమతమవ్వడం. మనమెప్పుడైతే ధ్యానంలో గట్టి ప్రయత్నం చేస్తామో, మనకు విచారించడానికి సమయం దొరకదు. అప్పుడు మన సర్వస్వం పరమాత్మ మీద భారం వేసి ఉంటాం.

ఈ అంశాలన్నీ మన అనుబంధాలకు అన్వయం చేసికోవాలి. సాధారణంగా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండవు. కానీ కొందరు వివాహ బంధాన్ని ఒక ఒప్పందంగా చేసికొంటారు. "నాకు ఎంత ఇస్తావో, నీకు అంతే ఇస్తాను" అనే బేరాలకు అనుబంధాలలో తావు లేదు.

వేకువలోనే కాకుండా, సర్వ వేళ సర్వావస్థల యందు, మనస్సు నిశ్చలంగా ఉంటే శ్రీకృష్ణుడు "అనుమానం లేకుండా నువ్వు నాలోనే సదా నివసిస్తావు" అని అంటాడు. ఎందుకంటే మన భక్తి ఉండి-పోయేది కాదు. మనమెక్కడికి వెళ్ళినా ధ్యానం చేసుకొంటూ చలిస్తాము. లారెన్స్ అనే యోగి ఇలా వ్రాసేరు:

నాకు వ్యాపారం చేసే సమయానికి, ధ్యానం చేసే సమయానికి తేడా లేదు. వంటగదిలో పలువురు గుమిగూడి శబ్దాలు చేస్తున్నా, నేను క్షోభలేని స్థితిలో దేవుని పాదాలముందు మోకాళ్ళ మీద నుండి ధ్యానం చేస్తున్నట్టు ఉంటాను

ఇంకోవిధంగా చెప్పాలంటే ప్రేమ అనబడే సరస్సు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ప్రేమ మనకి సహజంగా కలుగుతుంది. ద్వేషం రమ్మన్నా రాదు. మనము వేరొకరితో ఎలా స్పందించాలో అని ఆలోచించనక్కరలేదు. మనము ఇతరుల మంచి గురించే సదా మెలగుతాము. అనుబంధాలలో స్పర్థలు, అనుమానాలు, క్రోధం మొదలగు దుర్లక్షణాలు ఉండవు. ఇతరులను ప్రేమించడం, నమ్మడం, క్షమించడం సహజంగా జరుగుతాయి. సెయింట్ బెర్నార్డ్ "ప్రేమకి తనకంటే వేరే కారణం లేదు; దానికి ఫలాపేక్ష కూడా లేదు. అదే దాని ఫలం. నేను ప్రేమించేది ప్రేమ కోసమే. నేను ప్రేమించేది ఇంకా ఎక్కువ ప్రేమించడానికి" అని చెప్పిరి. 357

Eknath Gita Chapter 12 Section 5

Bhagavat Gita

12.5

యే తు సర్వాణి కర్మాణి మయి నన్న్యస్య మత్పరాః {12.6}

అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ {12.7}

భవామి న చిరాత్పార్థ మయ్యావేశిత చేతసామ్

అర్జునా! సర్వకర్మములను నా యందే సమర్పించి, నేనే పరమగతి యని భావించి, అనన్య యోగముచే నన్నే ధ్యానించుచు సేవించుచుందురో, నా యందు చిత్తముంచిన అట్టివారలను జనన మరణ సంసార సాగరమునుండి అతి శీఘ్రకాలములోనే నే నుద్ధరి౦తును ఀ

మనం ఒకచేత్తో పరమపదాన్ని పట్టుకోదలచుతాము, రెండవ చేతితో మన వస్తువులను పట్టుకుంటాము. పరమపదం కావాలంటే వస్తువులను జార విడవాలి. దానికై శ్రీకృష్ణుడు ఇలా చెప్పుచున్నాడు: మత్పరః -- అనగా నన్నే నీ లక్ష్యంగా పెట్టుకో. ఏదీ మన ఆనందానికి లేదా ఇతరుల సంతోషానికి కాక దేవునికై, మనలోను, ఇతరులలోను ఉన్న పరమాత్మకై చెయ్యాలి.

ఇంకా శ్రీకృష్ణుడు సర్వ కర్మాణి అన్నాడు. అంటే మనం చేసే ప్రతి కర్మ దైవార్పణ చెయ్యాలి. ఇందులో వెసులుబాటు లేదు. మనమిది చేతన మనస్సు ఉపరితలంలో కాక, స్వార్థ పూరిత కోర్కెలతో నిండి ఉాన్న లోతుకు వెళ్తేనే సాధ్యం. దీనికి ధ్యానం ఒక్కటే సరిపోదు. ఒకమారు చేతన మనస్సు ఉపరితలం దాటితే ముందుకీ, వెనక్కీ వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక చేత్తో మనది అనుకునే వస్తువు౦ది. దాన్ని మనం వదలక పోతే మనము ముందుకు సాగలేము.

ఆగస్టీన్ అనే వ్యక్తి కన్ఫెషన్స్ లో ఇలా వ్రాసేరు:

నేను ఇతరులవలన కాక, నా అహంకారంచే బంధింపబడ్డాను. నా కోర్కెలు ఒక గొలుసులా ఉండి, అది నా శత్రువు చేతిలో ఉంది. ఒక బలమైన స్వార్థపూరితమైన కోరిక, అలవాటుగా మారుతుంది. దానిని నివారించక పోతే అది నిర్భంధ౦గా మారుతుంది. ఈ విధంగా నేను బానిస నయ్యాను. నాలో ఉదయించిన క్రొత్త పట్టుదల, పాత పట్టును అతిక్రమించ లేక పోతున్నది. ఈ విధంగా క్రొత్తదైన ఆధ్యాత్మికత, భౌతికమైన పాత పట్టుదలల మధ్య పోరుసాగుతోంది. దాని వలన నా ఆత్మ ప్రభావితమౌతోంది.

ఆయన ఇంకా ఇలా వ్రాసేడు:

నేను రెండు వర్గాలలోనూ ఉన్నాను. ఒకటి నేను సమ్మతించినది. మరొకటి నేను ఇష్టపడనిది. ఇప్పుడు నా పరిస్థితి ఇష్టం లేకున్నా కోరికలను తీర్చుకొని, నేను సమ్మతించిన దాని వైపు వెళ్ళలేకున్నాను. అంటే నేనే రెండు వర్గాలలోనూ ఉన్నాను: నేను పూర్తిగా సమ్మతించినది మరియు పూర్తిగా ఇష్టపడలేనిది. ఇలా జీవిత పయనం సాగిస్తున్నాను

ఇది రెండు ఆత్మల మధ్య పోరాటం కాదు. ఒకే ఆత్మ కొంతసేపు మొదటి వర్గంలో ఉంటుంది, మరి కొంతసేపు రెండవ వర్గంలో ఉంటుంది. ఇప్పుడు విజయం కావాలంటే నిస్వార్థంగా కర్మ జేయగలిగే వర్గంలో ఉండాలి. అంటే చీకటినుండి కాంతివైపు ప్రయాణించాలి.

అలా చేయాలంటే చాలా కష్టం. చాలా కాలం మనకి దేన్ని ఎన్నుకోవాలో తెలియదు. మనం దేన్ని పట్టుకోవాలో తెలియదు. అది పండిపోయిన యోగులకూ కష్టసాధ్యమే. అగస్టీన్ చెప్పేది అది మంచి కలలోంచి మెలకువ తెచ్చుకొన్నట్టు; కానీ కళ్ళు విప్పడం ఇష్టంలేదు. మన కలలను పరిశీలిస్తే, అచేతన మనస్సులో స్వేచ్చ లేదని, కలలు మనని నిర్భంధిస్తాయని తెలుసుకొంటాం. అగస్టీన్ వేకువలో కూడా అలాగే ఉంటామని చెప్పేరు.

నాకు నా తుచ్చ కోర్కెలు తీర్చుకోవడం కన్నా దైవార్పణ౦ కావడమే మంచిదని తెలుసు. కానీ నా కోరికలు నన్ను బంధీగా చేసేయి. "లే, బద్దకస్తుడా, మరణం నుంచి లేచి, నేను ఇచ్చే వెలుగుని చూడు" అనే దేవునికి సమాధానం ఇవ్వలేకపోతున్నాను.

కానీ మనం గాఢ నిద్రలో, అచేతన మనస్సుతో తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడు మెలకువ తెచ్చుకోవడం ఎలా సాధ్యం? ఇక్కడ జ్ఞానం ఒకటే సరిపోదు. మనకు కావలసినది ఇంద్రియాలను జయించి, మనం గాఢంగా కోరుకొనే దాన్ని పరిత్యజించడం. ఇదే దేవుని అవతారాల్లోని పరమార్థం.

ఒక ఫ్రెంచ్ యోగి బ్లైస్ పాస్కల్ ఇలా వ్రాసెను:

దేవుడా నన్ను అనాధను చేస్తావా ? నువ్వు వచ్చి నా మనస్సుని ఆనందంతో నింపి మాయమయ్యేవు. ఇది క్రూరత్వం కాదా? మనమెప్పటికీ ఇలా వేరేగా ఉంటామా? నాకు నీతో కలసి ఉండడం అంటే ఏమిటో తెలిసింది. అందువలన నీకంటే వేరుగా ఉండడం బాధగా ఉంది. ఈ ఆనందాన్ని ఎలా శాశ్వతంగా ఉంచుకునేది?

అటు తరువాత తన ప్రశ్నలకి తనే సమాధానం ఇచ్చుకొ౦టారు:

మనం దేవుని పొందాలంటే మనవి అనుకొన్న వస్తువులను, బంధాలను ఆనందంగా వదులుకోవాలి. దానిలో కొంత బాధ లేక పోలేదు. కానీ మనం పొందే ప్రేమకై వాటిని పరిత్యజించాలి.

ఒక సూఫీ "హృదయం పోయిన దాని గురించి ఏడుస్తూ ఉంటే, ఆత్మ పొందిన దాని గురించి సంతసిస్తుంది" అని చెప్పెను.

నేను పుట్టుకతోనే శ్రీకృష్ణుని పై ప్రేమతో పుట్టలేదు. అది నా స్వార్థ పూరిత కోరికలను శ్రీకృష్ణుని వైపు ప్రేమగా మళ్లించి అలవరుచుకున్నాను. అగాస్టీన్ "గొప్ప యోగులు చేసినది మనమెందుకు చేయలేము? వారు దేవుని సహాయం లేకుండానే చేయగలిగేరా? దేవుని నమ్మాలి. భయమును వీడాలి. ఆయన మననెన్నటికీ విడిచిపెట్టడు" అని చెప్పేరు.

ఇది ఒక మూఢ భక్తి కాదు. శ్రీ రామకృష్ణ, ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి, తెరెసా ఆఫ్ ఆవిలా వంటి గొప్పవారు తమ ఇష్ట దైవం అన్నిటికన్నా సత్యమని నమ్మేరు. భౌతిక ప్రపంచం సదా మార్పు చెందేది. యోగులు చెప్పేది: ఏదైతే మార్పు చెందదో అదే సత్యం. దేహం పడిపోతుంది. సృష్టి అంతమౌతుంది. కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది.

మనము ప్రపంచ సుఖాలలోంచి విముక్తి చెందనంతకాలం బాధలు పడవలసిందే. యవ్వనంలో వెసులుబాటు ఉంటుంది. ఒక సుఖాన్నిచ్చేదానివలన నిజంగా సుఖం వచ్చిందా అని అడిగి తెలిసికొనే వయస్సది. కానీ వృద్ధాప్యంలోకి వెళితే, పూర్తిగా జ్ఞానం లేకపోతే, జీవితం వస్తువులను, బంధాలను విడిచిపెట్టవచ్చా అని అడగదు. మననుంచి వాటిని లాక్కుపోతుంది.

నా అమ్మమ్మ ఇలా చెప్పేది: "నీకు ఆత్మ గౌరవం లేదా? నువ్వు ఆనందంగా ఇవ్వగలదానిని, ఒకరు బలవంతంగా లాక్కుని ఎందుకు తీసికోవాలి? జీవితాన్ని నిన్నొక మూలకి తోసి, నీది అనేదాన్ని లాక్కుపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. నీవు బలంగా ఉన్నప్పుడే వాటిని త్యజించి పూర్తి స్వేచ్ఛను అనుభవించు". సాధన మార్గంలో మన స్వార్థాననికై ఏది ఉంచుకోక క్రమంగా ఇష్టమైనవి వదిలి పెడతాం. అలాగ చేస్తే మనము ఎవరి మీదా ఆధారపడనక్కరలేని స్థితి వస్తుంది. బలవంతంగా ఒకరు లాక్కొంటే బాధ కలుగుతుంది. కానీ మనం ప్రేమించే వారలకై వదిలేస్తే దానిలో బాధ లేదు.

మన మనస్సులో దేవునితో సంపూర్ణమైన ఐక్యం పొందితే, మన మారే ప్రపంచం నుండి, మరణం నుండి, విడుదల చేయబడతాం. అదే శాశ్వతం, కైవల్యం, నిర్వాణం, మోక్షం. 350

Eknath Gita Chapter 12 Section 4

Bhagavat Gita

12.4

క్లేశో అధికతరస్తేషా౦ అవ్యక్తాసక్త చేతసా౦ {12.5}

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భి రవాస్యతే

అక్షరపరబ్రహ్మ చింతనము బహు కష్టసాధ్యము. దేహాభిమానులచే అవ్యక్తోపాసన అతి కష్టముగ పొందబడుచున్నది ఀ

కొన్ని శతాబ్దాల క్రిందట ఒక యోగి "ఎవరి ఇంద్రియాలైతే స్వాధీనంలో ఉంటాయో వారికి మాత్రమే జ్ఞాన యోగ మార్గం తేలిక" అని చెప్పెను. అంటే ఇంద్రియాలు మన ఆధీనంలో లేకపోతే జ్ఞాన యోగం పనికిరాదు. మనకు ఇంద్రియ నిగ్రహం చాలా కష్టంతో కూడిన పని. కాబట్టి జ్ఞాన యోగం ఆది శంకరులు, మైస్టర్ ఎక్హార్ట్, ఆనందమయిమా వంటి వారికే సాధ్యం. ఇది జ్ఞాన యోగ౦పై విమర్శ కాదు. ఇది మనలో ఇంద్రియ నిగ్రహం లేక పోవడమనే బలహీనత వలన. మనము ఎంత ఇంద్రియాలకు లోబడి ఉంటే అంత ఎడంగా ఉంటాము. అలాగే అనిశ్చిత, నిరాశ, అసూయ మొదలగునవి కలుగుతాయి. ఈ సమస్యలను అధిగమించవచ్చు. కాని అది భౌతికంగా కాదు. ధ్యానంలో చేతన మనస్సును విశ్లేషించ తద్వారా పరిష్కారం పొందవచ్చు.

అబ్రహం మాస్లో "మన దగ్గర సుత్తి తప్ప వేరే పనిముట్టు లేకపోతే, మనకి ప్రతి సమస్య మేకులా కనిపిస్తుంది" అని చెప్పెను. మనమిలాగే సమస్యలను భౌతిక పరంగా పరిష్కరించాలని చూస్తాం. అది మంచిది కాదు. ఎందుకంటే సమస్య ఉన్నది మన చేతన మనస్సులో.

శాస్త్రజ్ఞులు దేహాన్ని ఒక రసాయనిక సముదాయంగా వివరిస్తారు. అనగా కొన్ని రసాయనాలను మందుల ద్వారా శరీరంలోకి పంపితే అవి చేతన మనస్సును కావలసినట్టుగా మార్చుతాయి అని చెప్తారు. ఇది చాలా పెద్ద ప్రక్రియ. అంతరిక్షంలో కోట్ల కొలది నక్షత్రాలు ఎలా ఉన్నాయో, మన శరీరంలో కూడా కొన్ని కోట్ల జీవ కణాలు ఉన్నాయి. మన శరీర కణాలను నియంత్రించేది నాడీ వ్యవస్థ. అందులో శాస్త్రజ్ఞులు కనుక్కొన్న కొన్ని రసాయనాలు: సెరటోనిన్ , డోపమిన్, వగైరా. వారు చెప్పేది మన వ్యక్తిత్వం ఆ రసాయనాల పాళ్ళను మార్చి తగిన రీతి వ్యక్తం చెయ్యవచ్చని. కానీ మన నాడీ వ్యవస్థను నియంత్రించేది మెదడు. తనంతట తాను మెదడు చేతనము కాదు. అది చేతన మనస్సుకు ఆధారం మాత్రమే. కాబట్టి రసాయనాలవలన మనస్సులో మార్పులు వస్తాయి అన్నది పూర్తిగా నిజం కాదు.

అలాగే అతిగా తినేవారి అలవాట్లను మార్చటానికి వైద్యులు అనేక చికిత్సలు చేస్తారు. అవి రసాయనాల ప్రయోగం కావచ్చు లేదా శస్త్ర చికిత్స కావచ్చు. కానీ ధ్యానం అవలంబిస్తే ఈ సమస్యను అతి తేలికగా అధిగమించవచ్చు.

కొందరు వైద్యులు ఎక్కువ అల్లరి చేసే పిల్లలకు మందులు ఇస్తారు. ఇది పూర్తిగా వ్యర్థం. దానివలన వారి అల్లరి తగ్గవచ్చేమో గాని, వారి సృజనాత్మక శక్తి క్షీణిస్తుంది. వారి ప్రాణ శక్తిని ధ్యానం ద్వారా మంచి కార్యాలకు -- అనగా చదువు, క్రీడలు మొదలగునవి--మళ్లించవచ్చు. మందుల వలన తల మందమయ్యి, వారిలోని అసలైన సామర్థ్యం వ్యక్తం కాదు.

వ్యక్తిత్వాన్ని రసాయనాల ద్వారా మార్పు చేసే చికిత్సలు ఒకరి పురోగమనానికి అడ్డుగా ఉంటాయి. అవి భౌతికమైన సమస్యలనే పరిష్కరించగలవు. ముఖ్యంగా మనకు పట్టుదల ఉంటే ఏమైనా సాధించ వచ్చు. రసాయనాలు మన పట్టుదలను సడలించి మన పెరుగుదలను తగ్గించి, ఇతరులపై ప్రేమను అరికట్టి, మనకెటువంటి ఎన్నిక లేకుండా చేస్తాయి. అదే ధ్యానంలో చేతన మనస్సును విశ్లేషిస్తే మన పట్టుదల పెరిగి, మన పురోభివృద్ధికి అనుగుణంగా ఎన్నిక చేసికోవచ్చు 344

Eknath Gita Chapter 12 Section 3

Bhagavat Gita

12.3

యే త్వక్షర మనిర్దేశ్య౦ అవ్యక్తం పర్యుపాసతే {12.3}

సర్వత్రగ మచింత్యంచ కూటస్థ మచలం ధృవమ్

సంనియమ్యే౦ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః {12.4}

తే ప్రాప్నునంతి మామేవ సర్వభూతహితే రతాః

ఎవరయితే ఇంద్రియములను నిగ్రహించి, అంతటను సమబుద్ధి కలిగి, సర్వ ప్రాణులకు మేలు చేయుటయందు పరమాసక్తి గలవారై అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తమును, సర్వత్రగము, చింతించుటకు వీలు కానిదియు, కూటస్థము, అచలము, ధృవము నైన బ్రహ్మమును ఉపాసించుచున్నారో వారే నన్ను పొందుచున్నారు. ఀ

నిర్గుణ దైవాన్ని ఊహించలేం. కానీ దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులలో అట్టి దైవాన్ని బ్రహ్మన్ అని అంటారు. ఈ రోజుల్లో గుణములతో కూడిన దైవాన్ని పూజించడం మూఢ నమ్మకం లేదా మేధ యొక్క బలహీనత అని తలిచేవారు చాలా మంది ఉన్నారు. జ్ఞాన యోగం మేధకి సంబంధించినది కాదు. మేధ ద్వంద్వాలని -- ఉదాహరణకు తెలిసికొనేవాడు, తెలిసికోబడేది -- విశ్లేషిస్తుంది. నిర్గుణ దైవాన్ని తెలిసికోవాలంటే ద్వంద్వాలను అధిగమించాలి. అంటే తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది ఏకమై ఒకే అఖండమైన బ్రహ్మన్ ఉన్నాడనే జ్ఞానము కలుగుతుంది. దీనినే నిర్వికల్ప సమాధి అని అంటారు. శ్రీ రామకృష్ణ ఉప్పుతో చేయబడిన బొమ్మ దృష్టాంతం ఇచ్చేవారు. ఒక ఉప్పుతో చేయబడ్డ బొమ్మ సముద్రంలో ప్రవేశించిన వెంటనే కరిగిపోతుంది. మరి సముద్రం యొక్క విస్తీర్ణం చెప్పేది ఎవ్వరు?

యోగులు నిర్వికల్ప సమాధిలో అన్ని భేదాలను అధిగమించి బ్రహ్మన్ లో రమిస్తారు. కానీ దాన్ని వివరించేది ఎలాగ అన్న ప్రశ్న మిగిలిపోతుంది. 13 వ శతాబ్ది మైస్టర్ ఎక్ హార్ట్, 8 వ శతాబ్ది ఆది శంకరులు ఈ విషయాన్ని విశ్లేషించారు. 5 వ శతాబ్ధి డై ఓనిసియస్ ది అరియో పెగైట్ ఇలా వ్రాసెను:

తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది మధ్య గల భేదాన్ని దాటితే సాధకుడు పేరులేని, రూపంలేని వాస్తవ౦తో ఏకమై పదార్థాల కంటే విలక్షణమైన స్థితి పొందుతాడు. తన మేధను, మనస్సును నిశ్చలం చేసి తెలుసుకోవడానికి అతీతమైన స్థితిలో ఉంటాడు

జ్ఞాన యోగం, కర్మ యోగం, భక్తి, రాజ యోగం మొదలైన మార్గాలు నిజానికి వేర్వేరు కావు. అవి అన్నీ ఒకే ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే మార్గాలు.

దాన్ని అర్థం చేసికోవడానికి జ్ఞాన మార్గా౦లో వెళ్ళిన వ్యక్తుల జీవిత చరిత్రలను పరిశోధించాలి. ఆది శంకరుడు నిర్గుణ బ్రహ్మన్ ని ఏకం అద్వితీయం -- అనగా రెండవది లేదు--అని తన స్వీయానుభవంతో వర్ణించేరు. ఆయన అద్వైతాన్ని స్థాపించినా శివుడు, పార్వతి మొదలైన సగుణ దేవతలయందు భక్తితో అనేక స్తోత్రాలు వ్రాసేరు. ఉదాహరణకు:

నీవు జగన్మాతవు

నా యందు నీకున్న ప్రేమ గురించి అనుమాన మెందుకు?

ఒకని లెక్కలేనన్ని తప్పులు చేసినా

వాని తల్లి వానిని ఎప్పటికీ విడిచి పెట్టదు

శంకరులు 32 వ ఏట కైవల్యం పొందేరు. అంతకు ముందు ఆయన భారత దేశంలోని శకలాలుగా ఉన్న మతాలను ఏకం చెయ్యడానికై, అనేక మఠాలు స్థాపించుటకై, ఉపనిషత్తులకు భాష్యం వ్రాయడానికై తన సమయాన్ని అర్పించేరు.

శంకరులు అద్వైత ప్రతిపాదనలో నిర్గుణ బ్రహ్మ ఉపాసన గురించి అనేక విధాలుగా వివరించేరు. అది వర్ణింప శక్యము కానిది ఎందుకంటే అది అంతటా ఉంది. దానికి ద్వితీయం లేదు. దానిని భాషతో, ఆలోచనలతో పట్టుకోలేము. అది అక్షరం--అనగా ఎప్పటికీ తరిగి పోయేదికాదు, ఆద్య౦తాలు లేనిది, ఎప్పటికీ నాశము కానిది. అది అనిర్దేశ్య౦ -- దాన్ని చూపలేము; దాన్ని నిర్వచించ లేము; అది బయట, లోపల ఉండేది. అవ్యక్తం -- అనగా వ్యక్తము కానిది, చూడబడనిది ఎందుకంటే చూసేవారు వేరుగా లేరు కనుక. సర్వత్రగం -- అది అన్ని చోట్లా ఉండి, ప్రతిదానికి ఉనికి నిచ్చేది. అచలం-- అనగా మార్పు లేనిది.

ఉపనిషత్తులు "తత్ త్వం అసి" అనగా నీవు దానిగా ఉన్నావు అంటాయి. ఇది మన సహజ స్థితి. ఆత్మ రూపేణ మనమెప్పుడూ పుట్టలేదు, ఎప్పటికీ చనిపోము. నేతి, నేతి ప్రక్రియతో నేను దేహాన్ని కాదు, మనస్సును కాదు అని చెప్పుకుంటూ పోవచ్చు. కానీ దానివలన మన చేతన మనస్సు ఎంతవరకు ప్రభావితమౌతుందో చెప్పలేము. మనకి కోపం, అనుమానం, సందిగ్దం మొదలైన మానవ లక్షణాలు ఎప్పటికీ ఉండేవే. కాబట్టి ఇవి జ్ఞాన సముపార్జనకి ఉపయోగపడవు. కొందరిలో అవి అహంకారాన్ని పెంచి తమపై అనురాగాన్ని పెంచుతాయి.

అలాగే జ్ఞాన యోగానికి సంబంధించిన విషయాలు శ్రీకృష్ణుడు చెప్పిన పై శ్లోకాల్లో ఉన్నాయి. సమ్నియమి ఇన్ద్రియగ్రామం -- అనగా దేహం మన స్వాధీనంలో ఉండడం. ఇంద్రియాలను నియంత్రించడం. సర్వత్ర సమబుద్ధయ --అనగా ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండుట; ఇంద్రియాలతోనూ, వస్తువులతోనూ తాదాత్మ్యం లేకుండుట; శత్రువులు, మిత్రులు లేకుండుట. సర్వభూతహితే రతాః -- అనగా ఇతరులను సేవించి ఆనందం పొందుట; స్వార్థమే ఎప్పుడూ చూసికోకుండుట. నా ఉద్దేశంలో "జ్ఞాన యోగం ఆచరణలో పెట్టగలిగితే, దానితో అవసరం లేదు; అవసరమైతే దానిని ఆచరణలో పెట్టలేము".

ఈ నేపథ్యంలో శ్రీ రామకృష్ణ బృందావనంలోని గోపికల కథ చెప్తారు. మనము శ్రీకృష్ణునిపై భక్తి ఉంటే ఆ గోపికల లాంటివారలమే. ఒక రోజు ఒక జ్ఞాన యోగి బృందావనానికి వచ్చేడు. అక్కడ గోపీకలందరూ ఒక అవతారపురుషుడ్ని ఆరాధిస్తున్నారని చూసి, వాళ్ళకు బ్రహ్మన్ గురించి వివరించేడు. వాళ్ళు చివరకు "మాకు ఇదేమీ అర్థం కాలేదు. మాకు తెలిసిందల్లా చూసి, ఆనందించి, ప్రేమించ గలిగిన శ్రీకృష్ణుడు" అని చెప్పేరు.

శ్రీకృష్ణుడు చెప్పేది మన మేధమీద మనకి ఎంతో నమ్మకమున్నా అది నిర్గుణ బ్రహ్మన్ ని చూడలేదు. మనమున్న స్థితిలో దేహ రహితమైన చేతనాన్ని ఎలా పట్టుకోగలం? ఆత్మ శాశ్వతమైనది, మార్పులేనిది కావచ్చు. కాని దానికి ఒక ఉపాధి అవసరం. ఇదే అవతారాల యొక్క రహస్యం. దేవుడు మానవ రూపాల్లో అవతారాలు ఎత్తి మన ఊహకు అందేలా చేసికోబడి, మనను ఐకమత్యంతో నడిపించగలిగే శక్తి. సెయింట్ బెర్నార్డ్ "కనిపించని దైవము భౌతికమైన మానవ రూపాముతో అవతారమెత్తడానికి కారణం పరస్పర ప్రేమతో బ్రతుకుతున్న మనల్ని తన వైపు త్రిప్పుకొని, క్రమంగా ఆధ్యాత్మికమైన ప్రేమను పెంపొందించడానికి". 340

Eknath Gita Chapter 12 Section 2

Bhagavat Gita

12.2

శ్రీ భగవానువాచ:

{12.2}
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే

శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః

నాయందే మనస్సు నిలిపి, నిత్యయుక్తులై, ఉత్తమమైన శ్రద్ధతో కూడి నన్నే ఉపాసించుచున్నారో వారు యోగి శ్రేష్ఠులని నా అభిప్రాయము

ఒక గ్రామస్తుడు ధ్యానం నేర్చుకోవడానికి ఒక గురువు దగ్గరకు వెళ్ళేడు. గురువు అతన్ని ఓంకారం జపించమని చెప్పేడు. ఆ గ్రామస్తుడు కొన్నాళ్ల తరువాత గురువు దగ్గరకు వచ్చి, తనకు ఓంకారం పనిచెయ్యటం లేదని చెప్పేడు. అప్పుడు గురువు నీకిష్టమైనది ఏమిటి అని అడిగేడు. ఆవు అని గ్రామస్తుడు చెప్పేడు. అయితే ఆవు మీద ధ్యానం చెయ్యమని గురువు చెప్పేడు. కొన్ని రోజులు తరువాత గురువు గ్రామస్తుడు ఎలా ఉన్నాడో చూద్దామని వాని ఇంటికి వెళ్ళేడు. ఇంటివాళ్ళు అతను మూడు రోజులపాటు ధ్యానంలో ఉన్నాడని చెప్పేరు. అది విని గురువు ఆశ్చర్యం చె౦ది, గది తలపును కొట్టి బయటకు రమ్మన్నాడు.

"నేను ధ్యానం చేస్తున్నాను" అని గ్రామస్తుడు చెప్పేడు.

"వెంటనే వెలుపలకు రా. నీతో మాట్లాడాలి" అని గురువు అన్నాడు.

"నేను బయటకు వద్దామంటే నా కొమ్ములు అడ్డుతున్నాయి" అని గ్రామస్తుడు బదులు చెప్పేడు.

ధ్యానంలో మనం దేని మీద ఏకాగ్రత చూపిస్తామో అదే అవుతాం. మన కోర్కెలు, నిర్ణయాలు, విధి మన చేతిలోనే ఉంటాయి. మనము దేనినైతే ప్రేమిస్తామో అదే అవుతాం.

ఈ నేపథ్యంలో మనమంతా చాలా కాలంనుంచి ధ్యానం చేస్తున్నాము. కానీ సమస్య ఏమిటంటే మనం దేనిమీదైతే ధ్యానం చేస్తున్నామన్నది నియంత్రించలేము. దానికి విరుద్ధ ఉదాహరణ: ఒకడు డబ్బుకై ఏదైనా చేస్తాడు. అలా ఎన్నో వ్యాపారాలు డబ్బుకై చేసి అది తప్ప వేరే ధ్యాస లేకున్నాడు. వాడు సిగరెట్ లేదా మారణాయుధాలు చేసే సంస్థలతో వ్యాపారం చేయడానికి వెనుకాడడు. వాడికి డబ్బు తప్ప వేరే మార్గం తెలీదు. ఇదే మన ఆలోచనలో ఉన్న శక్తి.

మనము స్వప్రయోజనానికి ఎలాగైతే ఏకాగ్రతతో ఉంటామో, మనం ప్రేమతో మానవాళికి ఉపయోగపడే ఒక ఆదర్శాన్ని ఎన్నుకొని దానిపై ధ్యానం చేయవచ్చును.

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టేడు. అతను పెరుగుతున్నప్పుడు సాహిత్యం, సంగీతం మొదలైన కళళయందు పూర్తిగా మునిగి తేలేడు. కానీ ఒకమారు జీసస్ క్రైస్ట్ గురించి చదివిన తరువాత అతడు పూర్తిగా మారిపోయి, జీసస్ లాగే తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొన్నాడు. జి కె చెస్టర్ టన్ "మీకు జీసస్ కి చేరువ కాలేరని తలుస్తే, ఆయన ఇచ్చిన బోధలు నమ్మ శక్యం కాకపోతే, ఆయన సంపూర్ణమైన శిష్యుడు ఫ్రాన్సిస్ ని చూడండి" అని చెప్పెను.

మనలో చాలామందికి నిజమైన ప్రేమ మీద పూర్తి అవగాహన లేదు. ప్రసార మాధ్యమాలు ఇద్దరు కౌగలించుకుంటే అదే ప్రేమ అని అనుకునేలాగా మనల్ని మార్చేయి. అదే ఒకనిపై మరొకడు క్రోధం ప్రదర్శిస్తే, వాడు ఓర్పుతో సహిస్తే, వాడు ప్రేమతో ఉన్నాడు అంటే అందరూ మనల్ని పరిహాసం చేస్తారు. యోగులకు ప్రేమ భౌతికమైన ఆకర్షణకే పరిమితం కాదని తెలుసు.

సెయింట్ పాల్ ప్రేమ గురించి ఇలా చెప్పేరు:

ప్రేమ బాధను అనుభవిస్తుంది; ప్రేమకి దేనిపై అసూయ ఉండదు; ప్రేమ తప్పు నడవడికతో ఉండదు; దానికి స్వార్థం లేదు, అసహనం లేదు; చెడును కోరదు; తారతమ్యాలు చూడదు; కానీ సత్యాన్ని కోరుతుంది; ప్రతీదీ నమ్ముతుంది; దేన్నీ కప్పి పుచ్చదు; ఆశతో ఉంటుంది; ప్రతీదీ సహిస్తుంది; ఎప్పటికీ అపజయం పొందదు

గీత శ్రీకృష్ణుని ప్రేమించమని చెప్తుందని అనుకోవచ్చు. నిజానికి గీత ప్రతి ఒక్కరినీ ప్రేమించమని చెప్తున్నాది. ఎందుకంటే ఒకరిని ప్రేమించడానికి మన చేతన మనస్సులను ఐక్యం చేసికోవాలి.

ఆది శంకరుడు దేవునికి, సృష్టికి మధ్య భేదం లేదని తన అద్వైత సిద్ధాంతం గురించి బోధ చేసెను. సెయింట్ పాల్ "నేనుకాదు; క్రైస్ట్ నాలో నివసిస్తున్నాడు" అని చెప్పెను. అంటే ప్రేమించేవాడు, ప్రేమించబడేవాడు ఏకమై ఉన్నారు. కొందరు దంపతులు వేర్వేరుగా ఉంటారు. "ఇది నాది; అది నీది; నీ పరిధిలో నీవు ఉండాలి; నా పరిధిలో నేనుంటాను" అని తమ ధర్మాన్ని ప్రకటించుకొంటారు. వారి మధ్యలో ప్రేమలేదు. వారి మధ్యలో ఉన్నది ఒక ఒప్పందం. ప్రేమకి ఎటువంటి విభేదాలు ఉండకూడదు.

నేనిలా ప్రసంగిస్తే కొందరు "మేము ఒక్క రోజు కూడా అలాగ ఉండలేదు. ఇక జీవితాంతం అంటే వీలవ్వదు. బహుశా మీ ఉద్దేశంలో నేను నిజంగా ప్రేమించలేను" అని అనేవారు. మనమందరమూ ప్రేమించడం నేర్చుకోవచ్చు. మొదట్లో అవకతవకలతో ఉంటుంది. మనలో స్థిరాభిప్రాయాలు, అపోహలు ఉంటాయి. అలాగని "మనము వేరుగా ఉండి ప్రేమించుకుందాము" అనడం నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కలగాలంటే చాలా శ్రమ, ఏళ్లు పట్టవచ్చు. మనం సంపూర్ణమైన ప్రేమకై వేచి ఉండనక్కరలేదు. కొంత ప్రయత్నంతో అందరూ లబ్ది పొందవచ్చు.

ఇదే గీత చెప్పే ప్రేమ. దీన్ని మన బంధాలన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఒక దంపతులు ఏకమవ్వటానికై ముందే నిర్ణయించుకు౦టారు. దాన్ని పెంపొందించుకోవాలి.

ముస్లిం యువతులు బురఖా వేసుకొని మనలో వారి ముఖం చూడాలనే ఆశక్తిని కలిగిస్తారు. అదే విధంగా మనకి దైవానికి మధ్య ఒక తెర ఉంది. దాన్ని తొలగించుకోవడానికి ధ్యానంతో ప్రయత్నిస్తాము. కొన్నేళ్ళ తరువాత ఆ తెర తొలగింపబడి దైవ సాక్షాత్కారాన్ని పొందవచ్చు.

చాలామంది ప్రేమ అంటే ఇద్దరి మధ్యలో ఉ౦డేదని తలుస్తారు. అది భౌతిక పరంగా నిజం కావచ్చు. కాని మన ప్రేమకి పరిమితి లేదు. మనం ఒకరినే ప్రేమించడంతో సంతృప్తి పొందలేము. మనకు కావలసినది సంపూర్ణమైన ప్రేమ. మనమే ప్రేమకి ప్రతిరూపం అవ్వాలి. డోస్టోవ్స్కీ ది బ్రదర్స్ కారమజోవ్ అనే పుస్తకంలో ఇలా వ్రాసేరు:

దేవునిచే సృజింపబడిన సృష్టినంతా ప్రేమించు. ప్రతీ ఇసుక రేణువును ప్రేమించు. ప్రతి ఆకును, కాంతి పు౦జాన్ని ప్రేమించు. జంతువులను, పక్షులను ప్రేమించు. చెట్లను ప్రేమించు. ప్రతీ శకలాన్నీ ప్రేమించు; శకలాన్ని ప్రేమిస్తే సర్వం దేవునిమీద ఆధారపడి ఉన్నదనే రహస్యం తెలుసుకొంటావు. ఈ విధ౦గా ఆ రహస్యం యొక్క అవగాహన దినదినాభివృద్ధి చెందితే దేన్నీ విడిచిపెట్టక సమస్త ప్రపంచాన్ని ప్రేమిస్తావు.

ఇదే నిజమైన ఐకమత్యం అంటే. ఈ రోజుల్లో మన సమాజంలో గందరగోళం పేరుకుపోయింది. అది మన ఇళ్ళలోకీ, హృదయాలలోకీ చొచ్చుకు పోయింది. కాబట్టి మనము సంపూర్ణమైన ప్రేమను అలవరుచుకోవాలి. ఒక హసిడిక్ యోగి ఇలా అన్నారు: సమాజం దేవుని బండి. పరస్పర ప్రేమ తక్కువగా ఉంటే ఆ బండి గాడి తప్పుతుంది. అలాటప్పుడు ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. ఎప్పుడైతే పరస్పర ప్రేమ తక్కువగా ఉంటుందో ప్రేమకై ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి.

ఒక వ్యక్తి రబ్బీ ఇస్రేల్ బాల్ షెం వద్దకు వచ్చి "నా కొడుకు దేవుడికి దూరమవుతున్నాడు. నేనేమి చెయ్యాలి?" అని అడిగేడు. దానికి రబ్బీ ఇచ్చిన సమాధానం: "వానిని ఇంకా ఎక్కువ ప్రేమించు". ఇదే నా అమ్మమ్మ చెప్పేది. ఐకమత్యానికి దీనికన్నా ఉపయుక్తమైన, కళాత్మకమైన, సంతృప్తికరమైన మార్గం లేదు. దీనివలన మన జీవితమనే పూవులు వికసిస్తాయి; కాయలు కాస్తాయి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ప్రతీదీ సరిగా ఉంటుంది. ప్రేమ అంటే జ్ఞానం, క్రియ; దానివలన దేవుని చేరడానికి ఉన్న మార్గాలన్నీ ఏకమై ఉంటాయి. 336

Eknath Gita Chapter 12 Section 1

Bhagavat Gita

12.1

అర్జున ఉవాచ:

{12.1}
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్యా౦ పర్యుపాసతే

యే చాప్యక్షర మవ్యక్త౦ తేషాం కే యోగవిత్తమాః

కొందరు భక్తులు వారి మనస్సును సదా నీయందే నిలిపి నిన్ను ఉపాసించుచున్నారు. మరికొందరు అవ్యక్తమైన అక్షర పర బ్రహ్మమును ధ్యానించు చున్నారు. వీరిలో ఉత్తమ యోగులెవరు?

అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వ రూపమును చూసి అతనితో శాశ్వతముగా ఐక్యమవ్వాలని కాంక్షి౦చెను. ఈ విధంగా చాలామంది యోగులు కాంక్షిస్తారు. భగవంతుడు తనపై ప్రేమను పెంపొంది౦టకు కనీకనబడనట్టు ఉంటాడు. మనమా ఆనందాన్ని పొందుతే, మనమాశించేది శాశ్వతంగా ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి చోటా, ప్రతి నిమిషం, ఆయన ఎరుక కలిగి ఉండాలని.

ఈ శ్లోకంలో అర్జునుడు దేవునితో ఐక్యము పొందడం ప్రేమ వలననా లేదా జ్ఞానం వలననా అని అడుగుతున్నాడు. ఇది చాలా పర్యావసానాలకి దారి తీస్తుంది. ఎందుకంటే దానివలన ఒక ప్రశ్న కలుగుతుంది: మనము ఎవరము మరియు మనము ఏ విధముగ మార్పు చెందగలము?

ఇది ఒక తత్త్వ సంబంధితమైన అంశం కాదు. దీనిని మన జీవిత౦లో ప్రతి విషయంలోనూ అన్వయించవచ్చును. పరిసరాలు, భౌతిక, మానసిక స్థితులు మన భౌతిక పరమైన వ్యక్తిత్వము మీద ఆధారపడి ఉన్నవని తలుస్తాము. శాస్త్రజ్ఞులు మన వ్యక్తిత్వము జన్యువుల, పరిసరాల మీద ఆధారపడి ఉన్నదని చెప్తారు. కాబట్టి మన చేతన మనస్సులో ఒక నిర్ణయానికి వస్తాం: మన స్వభావము ముందే నిర్ణయించబడినది. మనము దాన్ని మార్చలేము.

ఈ విధంగా ఆలోచించడం విచార కరం. విలియమ్స్ జేమ్స్ ఇలా చెప్పెను: జీవితం మన భౌతిక దేహాన్ని పూర్తిగా ఉపయోగించక చిటికిన వేలుతో సాగించడం వంటిది. మనకు పూర్తి దేహం లేదని, చిటికిన వేలొక్కటే ఉందని నమ్ముతా౦.

ఐన్స్టీన్ ని ఒకరు "మీరు ప్రతిపాదించిన రిలేటివిటీ సిద్ధాంతాన్ని ఎలా కనుగొన్నారు?" అని అడిగేరు. ఆయన "నేను తరతరాలుగా పాతుకుపోయిన సిద్ధాంతాలను ప్రశ్నించేను" అని సమాధానమిచ్చేరు. అలాగే గీత వ్యక్తిత్వానికి సంబంధించిన పాత సిద్ధాంతాలను ప్రశ్నిస్తుంది. దీనిని మానవాళికి అన్వయించుకోవాలి.

మనము జన్యువులము కాము. మనం ఆలోచనల సముదాయం. నడవడిక జన్యువులచే నిర్ణయింపబడవచ్చు. కానీ మన ఆలోచనా సరళిని విశ్లేషిస్తే పురాతన పద్ధతులను దాటి, మన వ్యక్తిత్వాన్ని మలచుకోవచ్చు.

ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, శాస్త్రజ్ఞులు చెప్పే సిద్ధాంతాల మధ్య తేడా లేదు. ఎందుకంటే ప్రకృతిని పరిశీలించడమ౦టే మన జీవితాలను పరిశీలించడమే. సి పి స్నో ఐన్స్టీన్ సిద్ధాంతాల గురించి ఇలా అన్నారు: ఆయన దేశకాల పదార్థాలను మేళవించేరు. కానీ శాస్త్రజ్ఞులు ఎంత ప్రయత్నించినా పరిమితమైన భౌతిక ప్రపంచాన్ని దాటి వెళ్లలేరు. స్పినోజా "పరిమితమైనది అపరిమితమైన దానిపై ఆధారపడి ఉన్నదని" చెప్పేరు.

ఇది దేశ కాల, పదార్థ, శక్తి కి మాత్రమే పరిమితంకాక మన వ్యక్తిత్వానికి సంబంధించినది కూడా. జీవితంలోని సమస్యలు -- అనగా ఆరోగ్యము, ఆనందము, బంధాల లేమి--భౌతిక పరంగా పరిష్కరించలేము. ఇంకా భౌతికమైన పరిష్కారం చేస్తే ఆ సమస్యలు ముదురుతాయి. ఎందుకంటే కారణాన్ని వెదకకుండా లక్షణాలనే చూస్తున్నాము కనుక.

నేను వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా అతిగా తినడాన్ని నివారించగలరని చదివేను. అంటే అది తప్ప వేరే మార్గం లేదని చెప్పక చెప్పడం. అదే ఒక యోగి చేతన మనస్సు లోతులను పరిశీలించి ఆ వ్యాధికి కారణమును కనుగొంటాడు. స్పినోజా దేహంలోని జీవ రసాయన వ్యవస్థ వ్యక్తిత్వాని పై పొర మాత్రమే అని చెప్పెను. మన ఆత్మ చేతన మనస్సు కేంద్రంలో ఉంది. చేతన మనస్సు లోతుకు వెళితే మన వ్యక్తిత్వాన్ని మన ఇష్టానుసారం మలచుకోవచ్చు.

నేను జన్యు వ్యవస్థ ఒక చలన చిత్రంలాగా ఉంటుందని చదివేను. అది ఎలా అంటే మన జీవితంలోని అన్ని ముఖ్యాంశాలు ముందే నిర్ణయింపబడినవని. మెదడు, నాడీ వ్యవస్థ మన జన్యువులు మీద ఆధారపడి ఉన్నవని శాస్త్రజ్ఞులు చెప్తారు. అంటే మనకు కలిగే ఆలోచనలు, మన వ్యక్తిత్వం పుట్టుకతోనే నిర్ణయింపబడినవి. మనం దేహం, దాని జీవ వ్యవస్థకే పరిమితమని తలుస్తే అది నిజమవ్వచ్చు. కానీ మనము జన్యు పరమైన డి ఎన్ ఏ కాము. జన్యువులు మన వొడ్డూ, పొడుగూ నిర్ణయించవచ్చు. మన ఆధ్యాత్మిక పెరుగుదలను నిర్ణయింపలేవు. మన ఆలోచనలను సవ్యంగా నడిపిస్తే మెదడును నియంత్రింపవచ్చు. అనగా నడవడికను నిర్దేశించే నాడీ వ్యవస్త, జన్యువుల ప్రభావము మన ఆధీనంలో పెట్టుకోవచ్చు. ధ్యానంతో జన్యువుల పరమైన డి ఎన్ ఏ ను మార్చుకోవచ్చు.

మన జీవితం ఒక చలన చిత్ర మనుకొంటే, జన్యువులు దాని నిర్మాణ౦లో సహాయకులు మాత్రమే. మన మనస్సు, ఇంద్రియాలు వివిధ పాత్రలు ధరించేవారు. వివిధములైన అన్యమనస్కత తక్కిన పాత్రధారులు. దీనికొక భూమిక లేదు. ఇది సినిమాలో మొదటి రీలు. దానిని పూర్తిగా విశ్లేషిస్తే మనము తక్కిన చిత్రం చూడం.

కానీ ధ్యానంలో చలన చిత్ర నిర్మాణంలో ఉపయోగించే పరికరాలను ఆత్మ వైపు మళ్లించగలం. చిత్ర నిర్మాణ౦లో సహాయకులు మారరు. కానీ మనకు క్రొత్త భూమిక వస్తుంది; క్రొత్త నాయకీనాయకులు వస్తారు. అంటే మనము ఒక క్రొత్త వ్యక్తిగా మార్పు చెందుతాము. దానినే యోగులు మనము ఈ జన్మలోనే పునర్జన్మ పొందేము అని చెప్తారు. ఎక్ హార్ట్ చెప్పినట్లు: "వృద్ధుడు మరణించేడు; క్రొత్త వ్యక్తి జన్మించేడు; బికారి మరణించేడు; రాజ కుమారుడు పుట్టేడు". 331

Eknath Gita Chapter 11 Section 26

Bhagavat Gita

11.26

మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్స౦గ వర్జితః {11.55}

నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ

పాండు తనయా! ఎవడు నా కొరకే కర్మలాచరించుచు, నేనే పరమగతి యని భావించి, నాకు భక్తుడై సంగరహితుడై సకల భూతముల యందును వైర బుద్ధి లేక యుండునో వాడు నన్నే పొందుచున్నాడు ఀ

కొందరు గాఢమైన భక్తి గలవారు దేవుడ్ని ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ, శ్రీ రామకృష్ణ వారలు అట్టివారు. దేవుని ప్రత్యక్షంగా చూడడం, దేవదూతల వాక్కు వినడం మనని ఆశ్చర్య పరచినా, నేను ఒక సాధారణమైన విషయం చెప్తాను. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పేది: ఎవరైతే తమ సర్వ కర్మలు దేవునికి నిస్వార్థంగా, దురాలోచన లేకుండా అర్పిస్తారో, వారు దేవుని సదా స్మరిస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ అటువంటి మనీషి. ఆయనకు దేవుడు ప్రత్యక్షము కాలేదు; దేవదూతలు ఆయనతో మాట్లాడలేదు. కానీ ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అమితమైనది. ఆయన తన మిత్రుల, --శత్రువులకై కూడా-- క్షేమానికై తన లాభం చూసుకోకుండా చాలా పాటు పడ్డారు. ఆయన తన ప్రత్యర్థులను బలంతో కాక, ప్రేమతో చూసేవారు.

ఇటువంటి దైవ భక్తి మనం ఎప్పుడైనా అలవరచుకోవచ్చు. ఎప్పుడైతే మనము నిస్వార్థ౦తో కుటుంబము, సమాజము, ప్రపంచము యొక్క క్షేమానికై పాటు పడతామో మనము దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. మనను నొప్పించే పరుష మాటలు ఇతరులను కూడా నొప్పిస్తాయని తలచి, మనసా వాచా కర్మా మంచినే చేస్తే మనము దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. ఎవరైతే మనపై క్రోధం చూపిస్తారో వారియందు దయతో ప్రవర్తిస్తే కూడా మనం దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పే భక్తి, దేవునికి భక్తునికి మధ్యనున్న సంబంధమే కాక, సకల ప్రాణులను కలుపుకొని.

మనం జీవైక్య౦ గురించి ఎరుక గలిగి ఉంటే, దేవుని అన్ని జీవులలోనూ చూస్తాము. బుద్ధుడు మనం ప్రతి మనిషిని, జంతువుని ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్టు ప్రేమించాలని చెప్పెను.

9 వ అధ్యాయం చివర్లో మనం ఆయన మీద గాఢమైన భక్తితో ఉంటే ఆయనతో ఐక్యమవుతామని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు.

ఈ ఉత్తమ లక్ష్యం మనం కలిగి ఉంటే మన జీవితం అర్థవంతమై, మనం చేసే ప్రతి నిర్ణయం సమిష్ఠి క్షేమానికై ఉంటుంది. ప్రతి ఉదయం మనం మన గురించేకాక, ఇతరుల క్షేమానికై బ్రతకాలని అనుకుంటే, మనం ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా ఉత్తమ పౌరులుగా బ్రతకవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఒకే పాలు చేయరు. కొందరు వైద్యులు, మరికొందరు ఉపాధ్యాయులు, ఇంకొందరు తలిదండ్రులు. మనమే ఉపాధి అవలంబించినా మన వంతు మంచి మనం కాక ఇతరులు చెయ్యలేరు. మనం నిస్వార్థంగా ఉండి, దేవుడు అందరి అంతర్గతములలో ఉన్నాడు కనుక, మనము ప్రపంచ క్షేమానికై పాటుపడవచ్చు.

దీనికి ఒక కథ చెప్తారు. సూర్యుడు సృష్టింపబడిన రోజున సూర్యోదయం చూసి ప్రజలందరూ చాలా సంతోషించేరట. కానీ సూర్యాస్తమైన తరువాత ఏమి చెయ్యాలో పాలు పోక వారు నిరాశ చెందారట. అప్పుడు ఒక పిల్లవాడు క్రొవ్వొత్తి వెలిగిస్తానని చెప్పేడట. అందరూ దానికి సమ్మతించి క్రొవ్వొత్తులు వెలిగించి ప్రపంచాన్ని వెలుగుతో నింపేరట.

దీనివలన తెలిసేది ప్రతి మానవుడు, గొప్పవాడు కానప్పటికీ, విలువగలవాడు. మనము బహిర్గతంగా సాధారణమైనప్పటికీ, అంతర్గతంలో ప్రేమ, సేవా గుణాలు కలిగి ఉంటాము. మనం మన చూపుని సదా దేవునిపై పెడితే, ప్రపంచంలోని ఏ సమస్యా మన చేత పరిష్కరింపబడలేనిది కాదు. 326

Eknath Gita Chapter 11 Section 25

Bhagavat Gita

11.25

శ్రీ భగవానువాచ:

సుదుర్ధర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ {11.52}

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః

నీవు చూసిన ఈ విశ్వరూపము చూడ శక్యము గానిది. దేవతలు సైతము సదా ఈ రూపమును దర్శింప గోరు చుందురు.

నాహం వేదైర్న తపసా న దానేన స చేజ్యయా శక్య ఏవంవిధో ద్రష్టు౦ దృష్టవానసి మాం యథా {11.53}

నీవు దర్శించిన ఈ రూపము వేదముల చేత గాని, యజ్ఞదాన తపస్సుల చేత గాని దర్శింప శక్యము గాదు.

భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవ౦విధో అర్జున

జ్ఞాతుం ద్రష్టు౦ చ తత్త్వేన ప్రవేష్టు౦ చ పరంతప {11.54}

పరంతపా! విశ్వరూపుడనైన నన్ను వాస్తవముగ గ్రహించుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు అనన్య భక్తియే సాధనము.

చిత్తశుద్ధితో ఉన్నవారే భగవంతుని చూడగలరని జీసస్ చెప్పెను. ఎందుకంటే అట్టి వారలకే దేవుని మీద పూర్తి నమ్మకం ఉండి, సృష్టి అంతటా దేవుడ్ని చూస్తారు.

హరిదాసు అనబడే ఒక బాలుని తల్లి గొప్ప కృష్ణ భక్తురాలు. ఆ బాలుడు పాఠశాలకు ఒక కీకారణ్యం లోంచి వెళ్ళాలి. దానిలో అనేక కృూర మృగాలు ఉండి హరిదాసుకి మిక్కిలి భయం కలిగించేవి. అతడు అమ్మని సాయం రమ్మంటే, ఆమె హరిదాసు అన్న గోపాలుడు అరణ్యంలోనే ఉంటాడు, వానిని పిలువు అని చెప్పింది. హరిదాసు తన అమ్మ చెప్పినట్టే పలుమార్లు గోపాలా, గోపాలా అని పిలిచేడు. అప్పుడు పింఛ౦, పట్టువస్త్రాలు ధరించిన బాలుడు వచ్చి హరిదాసుకు అడవి చివర వరకు సాయం వచ్చేడు. ఇలాగ కొన్నాళ్ళు గడిచేయి. ఒకమారు హరిదాసు పాఠశాలలో విందుకై అందరినీ ఏదో ఒక తినుబండారాన్ని తీసికొని రమ్మన్నారు. హరిదాసు తన అమ్మను అడిగితే, మనం బీదవాళ్ళం, నీ అన్న గోపాలునే ఏదో ఒకటి అడుగు అని చెప్పెను. హరిదాసు గోపాలునితో ఆ విషయం చెప్పగా, గోపాలుడు వానికి ఒక గిన్నెలో పెరుగు ఇచ్చేడు. విందులో ఆ గిన్నెలోనుంచి ఎంత పెరుగు తీసినా ఇంకా మిగిలి ఉంది. దానిని చూసి ఒక ఉపాధ్యాయుడు ఆశ్చర్యపడి హరిదాసుని ఆ గిన్నె ఎక్కడినుంచి వచ్చిందని అడిగేడు. తరువాత అతను హరిదాసుతో కలిసి గోపాలుడ్ని చూడడానికి అడవికి వెళ్ళేడు. హరిదాసు పిలవగానే గోపాలుడు వచ్చేడు. హరిదాసు గోపాలుడితో తన ఉపాధ్యాయునితో మాట్లాడమని చెప్పి ఇంటికి పరిగెత్తేడు. కాని ఆ ఉపాధ్యానికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.

ఇది ఒక కథ. ఇక్కడ తెలిసికోవలసినది ఏమిటంటే దేవునిమీద పూర్తి నమ్మకం కలిగి, నిస్వార్థంగా ఉంటే మన జీవితం సజావుగా ఉంటుంది.

మనలో చాలామంది ఆధ్యాత్మిక జీవితం అనన్యమైన భక్తితో మొదలుపెట్టం. దేవనిమీద భక్తి ఎక్కడినుంచో వచ్చి పడిపోదు. దాన్ని అలవరచుకోవాలి. మన భక్తి ప్రస్తుతం అనేక విషయాల మీద నుండి, దేవుని మీద కొంత ఉండవచ్చు. మన చైతన్యం ఇతర విషయాల మీద ఉంటే దానిని కట్టడి చేసి దేవునివైపు త్రిప్పడం, ఒక లోయను నింపడానికి చిన్న చిన్న రాళ్ళు వేసినంత కష్టం.

అలాగని మనము నిరుత్సాహ పడనక్కరలేదు. రాళ్ళను వేస్తూనే వుంటే అవి కొన్నాళ్ళకు ఒక పోగు అవుతాయి. ఉదాహరణకి అప్పుడప్పుడు జీడిపప్పు తినడం ఆరోగ్యానికి హానికరం కాదు. మనకు జీడిపప్పు తినాలనే కోరిక బలంగా ఉంటే, దాన్ని నియంత్రించుకోవడం లోయలో రాళ్ళు వేసినట్టు. కొంతకాలానికి ఒక కొండ చరియలు విరిగి పడితే ఆ లోయ పూడుకుపోవచ్చు. అనగా మన జీడిపప్పు కోరిక పూర్తిగా సమసిపోయినట్టు.

మన ప్రాణ శక్తి ఇతర విషయాల మీద వెచ్చించబడుతుంటే, ఒక నదికి ఆనకట్ట లాగా, వాటిని నియంత్రించవచ్చు. కాని ప్రాణ శక్తి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటి అది ఆనకట్టపై నది పొంగి ప్రవహించినట్టు. దానికి పరిష్కారం, ఒక కాలువ నిర్మించి, నీటి ప్రవాహాన్ని మళ్లించడం. అలాగే మనం కొంత ప్రాణ శక్తిని భగవంతుని వైపు మళ్లించాలి. మొదట్లో అది చాలా తక్కువ ప్రవాహం కలిగి ఉండవచ్చు. కాల క్రమేణా దానిలో ప్రవాహం పెరిగి, మన ప్రాణ శక్తి అంతా దేవునివైపు ప్రవహిస్తుంది. ఈ విధంగా మన కోరికలన్నీ ఏకమై దేవుని వైపు ఒక వరాదలా పొంగి పొరలుతాయి. 324

Eknath Gita Chapter 11 Section 24

Bhagavat Gita

11.24

సంజయ ఉవాచ:

ఇత్యర్జున౦ వాసుదేవ స్తథోక్త్వా స్వక౦ రూపం దర్శయామాస భూయః {11.50}

ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా

మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధముగ పలికి సౌమ్యరూపుడై తన పూర్వ రూపమును మఱల చూపెను. అర్జునుని ఓదార్చెను.

అర్జున ఉవాచ:

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్య జనార్దన! {11.51}

ఇదానీమస్మి సంవృత్త స్స చేతాః ప్రకృతి౦ గతః

కృష్ణా! నీ యొక్క ప్రసన్న మానవ రూపమును గాంచి నేను ప్రశాంత చిత్తుడనైతిని. నిర్భయుడనైతిని. ప్రసన్నతను బొందితిని.

శ్రీకృష్ణుడు విశ్వరూపమును చాలించి తన సహజ స్వరూపము దాల్చగా, అర్జునుడు మిక్కిలి సంతసించినవాడై శ్రీకృష్ణుని జనార్ధన -- అనగా ప్రజలని మత్తెక్కించు వాడు -- అని పిలిచెను. మత్తు అనగా మద్యము వలనని కాదు. ఇది దేవునిలో అంతర్లీనమైతే కలిగే ఆనందం.

జాన్ వూల్ మ్యాన్ అనబడే అమెరికా కు చెందిన క్వేకర్ ఇలా అన్నారు:

ఉత్తరానికి, తూర్పుకి మధ్య ఒక కాంతి విహీనమైన పదార్థాన్ని చూసేను. అది అతి దీన స్థితిలో ఉన్న సజీవమైన మానవాళి అని ఒకరు చెప్పేరు. నేను దానిలో ఒక్కడైన౦దున నేను వేర్పాటుతో ఉండలేను.

వూల్ మ్యాన్ చెప్పింది ఏమిటంటే మనము దేవుడి దయవలన జ్ఞానోదయము పొందితే కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. దేవుడు తాను కరుణించిన వారికి అతి క్లిష్టమైన కర్మని అప్పజెప్తాడు. అదేమిటంటే ఇతరులకు తాను పొందిన జ్ఞానాన్ని పంచిపెట్టడం. జ్ఞానోదయమైన యోగులు హిమాలయాల్లోనే ఉండి, క్రింద ఉన్న వారిపై చిన్న చూపు చూడవచ్చు. కానీ వారు ధ్యానంలో ఉంటే "మానవాళి దుఃఖాలతో బాధలను అనుభవిస్తూ ఉంటే, నేనిక్కడ ఉండి చేస్తున్నదేమిటి?" అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి వారు మరల జనుల మధ్యకు వచ్చి తమ జ్ఞాన మకరందాన్ని అందరికీ పంచి పెడతారు.

బుద్ధునికి నిర్వాణము పొందిన ముందు రోజున దుఃఖపూరితమైన మానవాళినుండి దూరంగా పోవాలనే భావన కలిగింది. మారా అనబడే దుర్భోదకుడు, బుద్ధుని నిర్వాణం లోకి వెళ్ళకుండా అనేక ప్రయత్నాలు చేసేడు. బుద్ధుని ఇంద్రియాలను ఐహిక సుఖాలవైపు త్రిప్పలేనని తెలిసికొని చివరగా ఇలా పలికెను: "మీరు నిర్వాణంలో సంపూర్ణమైన ఆనందం పొందేరు. ఈ స్థితిలోనే చిరకాలం ఉండిపోతే తిరిగి ప్రపంచానికి వెళ్ళనక్కరలేదు. ఒకవేళ వెళ్ళినా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకొంటారు? మీలాగా ఎవరు ప్రయత్నం చేస్తారు?" ఇది ఒక విచారకరమైన ప్రశ్న. ప్రతి జ్ఞానోదయమైన యోగికి ఈ ప్రశ్న కలుగుతుంది. బుద్ధుడు దానికి బదులుగా "బహుశా కొందరు నా బోధ విని, నన్ను నమ్మి, నేను చెప్పిన దాన్ని పాటిస్తారు" అని సమాధానమిచ్చెను.

ఇదే యోగులు కోరేది. వారు ధ్యానం గురించై సమస్త మానవాళి ఉత్సాహం చూపిస్తుందని తలచరు. ఎలాగైతే ఒక పద్మం వికసించినపుడు తుమ్మెదలు దాని వైపు వెళతాయో, శాశ్వతమైన సుఖాన్ని, భద్రతని కోరి, జనులు జ్ఞానోదయమైన యోగి పొందు కోరుతారు.

ఇలా జనుల మధ్యకు రావడం చాలా క్లిష్టమైన క్రియ. ప్రజల హృదయాలను తట్టి లేపాలంటే వారితో సహజీవనం చేసి, వారి వలె నిత్య కర్మలు చేసి, సదా దైవ చింతనలో ఉండాలి. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంత కష్టం. బయట ప్రపంచం హింసాకాండతో, దుఃఖంతో నిండి ఉన్నా, దేహం లోపల కొలువై యున్న పరమాత్మ నిత్య ప్రకాశవంతంగా ఉంటాడు. 320

Eknath Gita Chapter 11 Section 23

Bhagavat Gita

11.23

మా తే వ్యథా మా చ విమూఢభావో

దృష్ట్వా రూపం ఘోర మీదృజ్ఞ్మమేదం {11.49}

వ్యపేతభీః ప్రీతమనాః పున స్త్వ౦

తదేవ మే రూపమిదం ప్రపశ్య

భయంకరమైన నా ఈ విశ్వరూపామును గాంచి నీవు భయమును, చిత్త సంక్షోభమును పొందవలదు. నీవు భయమును విడచి సంతుష్టా౦తరంగుడవై నా పూర్వ రూపమును దర్శి౦చుము ఀ

దేవుడు ప్రేమించేవాడూ, శిక్షి౦చేవాడూ కూడా. కర్మ సిద్ధాంతం దాని పర్యావసానము. మనము ఏ విత్తు నాటేమో, దాని మొక్కే మొలుస్తుంది. ఆపిల్ విత్తు నుండి బొత్తాయి చెట్టు రాదు. ప్రపంచ యుద్ధాలు ఎక్కడో దైవ శక్తితో జరగలేదు. మానవాళే దానికి కారణము. హింసాత్మక ఆలోచనలు ఇతరులలోనే కాదు, మన అంతర్గతంలో కూడా ఉన్నాయి. ప్రపంచం వెళ్ళే దిశకు మనము కూడా బాధ్యులము. జీవించడమంటే మనం చేసే క్రియలకే కాక, మనం చెయ్యని క్రియలకు కూడా బాధ్యత వహించడం.

పెళ్లికి ఇద్దరు, జగడానికి ఇద్దర ఉండాలి. అలాగే మారణాయుధాలు అమ్మడానికి, కొనడానికి ఇద్దరు ఉంటారు. ధనిక దేశాలు వర్థమాన దేశాలకు కొన్ని కోట్ల విలువచేసే మారణాయుధాలను ఎగుమతి చేస్తున్నారు. దానికి బాధ్యులు: తయారు చేసేవారు, మంతనాలు జరిపేవారు, రవాణా చేసేవారు, నిల్వ చేసేవారు, వాటిని ఉపయోగించేవారు. వాటికి పౌరులందరూ బాధ్యులు. మనము ప్రపంచ పౌరులమని అనుకొంటే, వీటి పర్యావసానం ఎంత దూరం పోయిందో గ్రహించవచ్చు. మనము మారణాయుధాల తయారీని ఖండించకపోతే, అవి ఉపయోగింప బడినప్పుడల్లా మనము ఇతరులను హింసించేవారితో సమానం.

కాని ఇందులో ఒక వెసులుబాటు ఉంది. మనము మంచి కర్మలు చేసుకుంటూ పోతే అవి చెడు కర్మల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు దుష్ట శక్తులచే క్రుంగి పోక, తన వద్ద ఆశ్రయం పొందమని అర్జునునికి చెప్తున్నాడు.

దీనికై మనం గొప్ప పనులే చెయ్యనక్కరలేదు. మనకు వీలయినంతమటుకు సత్కర్మలు చేస్తూ ఉండాలి. మనము ప్రపంచ శాంతికై పోరాడాలంటే గొప్ప పేరుప్రతిష్ఠలు ఉన్నమారలమే కానక్కరలేదు. నా ఉద్దేశంలో ఐకమత్యంతో పౌరుల౦దరూ నిరశన వ్యక్తంచేస్తే అది రాష్ట్రపతులు, చట్ట సభల కన్న ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

మొదట మనోభావాలను ఇతరులకు ప్రకటించాలి. ఎంత మంది వింటారో అని విచారించనక్కరలేదు. మన భావాలలో సత్యము౦టే, అవి ఎప్పుడో అప్పుడు సరియైన పర్యావసానము చూపిస్తాయి. లింకన్ ప్రభుత్వము ప్రజల వలన, ప్రజల కొరకు అని చెప్పలేదా? అది ఇప్పటికీ సత్యం. మనము దినపత్రికలకు, నాయకులకు ఉత్తరాలు వ్రాయవచ్చు. మన తోటివారలను కూడా అలా చెయ్యమని ప్రోత్సాహించ వచ్చు. వాక్చాతుర్యము ఉన్నవారు సమావేశాలను ఏర్పాటు చేసి తమ భావాలను వివరించచ్చు. మిత్రులతో సమయం వెచ్చించి నప్పుడు, కొంత సమయం పత్రికలకు, నాయకులకు ఉత్తరాలు వ్రాయడానికై కేటాయించవచ్చు.

అటు తరువాత మనము హింసను ఎట్టి పరిస్థితులలోనూ, అంటే మనమంతట మనమే చెయ్యకపోయినా, సమర్థించకూడదు. మారణాయుధాలు చేసే సంస్థలలో, వాటిని సరఫరా చేసే మధ్యవర్తులతో, పని చెయ్యకూడదు. మనలో కొంచెం శాతమైనా ఈ విధంగా చేస్తే, మారణాయుధాలను నివారించవచ్చు. 318

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...