Posts

Showing posts from July, 2023

Osborne Chapt 1 Part A

Chapter 1 బుద్ధుడు దేవుని ప్రస్తావన చేయలేదు కదా? అవును. కొందరు అతనిని నాస్తికుడని అన్నారు. నిజానికి బుద్ధుడు ప్రజల దృష్టిని ఇప్పుడే, ఇక్కడే పొందే ఆనందం వైపు తిప్పేడు. అందువలన దేవుని గూర్చి అంతగా ఆలోచించలేదు. భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం మొదలగు శాస్త్రాల వలన ముక్తి మరియు ఆత్మ జ్ఞానము పొందడం సాధ్యమా? చాలా తక్కువ. యోగా గురించి అనేక గ్రంథాలు ఉన్నాయి. వాటిని చదివి ఎంత జ్ఞానం సంపాదించినా అనుభవం లేకపోతే అది సార్థకం కాదు. ఒక గురువుద్వారా నేర్చుకొని సాధన చెయ్యాలి. అంతర్దృష్టితో సత్యాన్ని, దాని స్వభావం మరియు ఉపయోగాన్ని తెలిసికోవాలని ఎంతో కృషి చెయ్యవచ్చు. కానీ అనుభవం, సత్సంగం లేకపోతే అది ఆలోచనలకే పరిమితమవుతుంది. ఒక్క పుస్తక జ్ఞానం ఉంటే దాని వలన లాభం లేదు. ఆత్మ జ్ఞానం పొందితే మనస్సులో మోసే తక్కినవన్ని౦టినీ తీసి పారేయవచ్చు. "మనం ఎక్కడనుంచి వచ్చేము?" అని విచారణ చెయ్యనివారికి పుస్తకాలు చదివితే ప్రయోజనం లేదు. అట్టివారు అరిగిపోయిన గ్రామొఫోన్ రికార్డ్ వలె ఉ౦టారు. ముక్తి అహంకారంతో ప్రవర్తించే చదువుకున్నవారికన్నా నిరక్షరాశ్యులకే తేలికగా వస్తుంది. న