Saturday, October 17, 2026

Wendy Doniger Rig Veda Intro To Indra




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle
Soma Drinker's Self Praise
Drinking Soma
Kesini

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద
సోమ రసమును త్రాగే వాని పొగడ్తలు
సోమ రసమును సేవించుట
కేశిని

INDRA

ఇంద్రుడు

INDRA, the king of the gods, is frequently mentioned in hymns to other gods. As the great Soma-drinker, he appears often in the Soma hymns (cf. 10.119), and it is he who lures Agni away from the waters or the demons (10.51, 10.124). He is central to hymns about the Maruts (1.165, 1.170-71), Atri (5.40), Apala (8.91), and Vrsakapi (10.86), and appears as a very important bit player in many others.

ఋక్కులలో దేవతలకు రాజైన ఇంద్రుని ప్రస్తావన పలుమార్లు వస్తుంది. అతడు సోమ పానం అతిశయంగా చేస్తాడు గనుక సోమ రసము గూర్చిన ఋక్కులలో ప్రస్తావించబడతాడు. అతడు అగ్ని దేవతను జలము నుండి అసురుల వద్దకు చేర్చినవాడు. మరుత్తులు, అత్రి, అపాల, వృశకపి మొదలైన వారి గూర్చిన ఋక్కులలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు. ఇతరమైన అనేక చోట్ల చిన్నవైన పాత్రలు పోషిస్తాడు.

Indra’s family life is troubled in ways that remain unclear. His birth, like that of many great warriors and heroes, is unnatural;

ఇంద్రుని కుటుంబ చరిత్ర బహు దుష్కరమైనది. అతని జన్మ సాధారణమైనది కాదు

there are also strong hints that he may have killed his father (4.18).

అతడు తన తండ్రిని వధించాడనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి.

So, too, he is in turn challenged by his own son, whom he apparently overcomes (10.28).

అతని పుత్రుడు తండ్రిని మించిన తనయుని వలె ఇంద్రునిపై హత్యా ప్రయత్నం చేసేడు. కానీ వానిని ఇంద్రుడు ప్రతిఘటించేడు.

The incestuous implications in these relationships may have led the Vedic poet to append to one of the Indra hymns the tale of another incestuous birth and infancy, apparently that of Agni (3.31.1-3; cf. 5.2.1).

ఈ విధంగా కలుషితమైన జన్మ కారణాన, ఇంద్రుని గూర్చిన ఋక్కులలో మరొక కలుషితమైన చరిత్ర గల అగ్ని దేవత ప్రస్తావన వస్తుంది.

But the hymns return again and again to clearer and more straightforward stories: the heroic deeds of Indra.

అయినప్పటికీ అనేక ఋక్కులలో ఇంద్రుని శక్తి సామర్థ్యములు వర్ణించబడతాయి.

The killing of Vrtra(1.32) is frequently alluded to in other hymns,

ఉదాహరణకు వృత్రాసుర సంహారము అనేక ఋక్కులలో ప్రస్తావించబడింది

as is the freeing of the cows in the cave (3.31, 10.108), which shares much of the symbolism and significance of the battle with Vrtra.

అలాగే, వృత్రాసురునితో చేసిన యుద్ధము, గోవులను గుహ నుండి విడిపించుటతో సామ్యము గలదు.

Other deeds, such as the beheading of the sacrifice (10.171), are mentioned without being fully explained in the Rig Veda, though later mythological texts often expand upon them.

అలాగే వివరణ లేని యజ్ఞము యొక్క శిరశ్చేదము ఋగ్వేదములో ప్రస్తావించబడింది.

Indra’s famous generosity – particularly when he is exultant from copious draughts of Soma – and his endearing anthropomorphism embolden the poet to imagine himself in Indra’s place (8.14).

సోమ రసము మైకములో ఇంద్రుడు అనేక ఉదారమైన కార్యములు చేయుటవలన, మానవుల వలె ప్రవర్తించుట వలన ద్రష్ట తనను తాను ఇంద్రునిగా ఊహించుకుంటాడు.

These same qualities, however, may have led worshippers even in Vedic times to devalue Indra, the beginning of a process that culminates in his total loss of worship in the Hindu period;

కానీ ఆ లక్షణాలే వైదిక కాలంనుండి ఇంద్రుని భక్తులు నీచునిగా తలచేటట్టు చేసినవి. అందుకే హిందువులు ఇంద్రుని పూజించరు మరియు ఇంద్రునికి గుడులు ఉండవు.

in answer to these implicit expressions of doubt, the poet reaffirms his faith in Indra as the greatest of the Vedic warrior gods (2.12).

ఏది ఏమైనప్పటికీ ద్రష్ట ఇంద్రుని దేవతలలో కెల్ల అతి శక్తివంతమైన వీరునిగా కొలుస్తాడు.

Saturday, October 10, 2026

Wendy Doniger Rig Veda Kesini




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle
Soma Drinker's Self Praise
Drinking Soma

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద
సోమ రసమును త్రాగే వాని పొగడ్తలు
సోమ రసమును సేవించుట

10.136   కేశిని

10.136   The Long-haired Ascetic

The long-haired ascetic (Kesin), an early precursor of the Upanisadic yogi, drinks a drug (probably some hallucinogen other than Soma) in the company of Rudra, the master of poison and a god who is excluded from the Soma sacrifice. The hallucinations described in the hymn are related to but not the same as those attributed to Soma-drinkers in 9.112, 10.119, etc.

పొడవు కేశములు గల కేశిని, ఉపనిషత్తుల కాలం నాటి యోగుల కన్నా ముందు ఉన్నవాడు. అతడు విషమును గ్రోలిన, సోమ యజ్ఞములో పాల్గొనని రుద్రునితో కలసి మారక ద్రవ్యము సేవించేవాడు. ఈ ఋక్కులో వివరింపబడిన అట్టి ద్రవ్యాలు సోమ రసమును ఆస్వాదించే వారలతో సంబంధము లేనివి.

1 Long-hair holds fire, holds the drug, holds sky and earth. Long-hair reveals everything, so that everyone can see the sun.1 Long-hair declares the light.

1.కేశిని అగ్నిని, ద్రవ్యాన్ని, భూమ్యాకాశాలను ధరించిన వాడు. ప్రతి ఒక్కరూ సూర్యుని గాంచుటకై కేశిని సమస్తాన్నీ వివరిస్తాడు1. కేశిని కాంతిని ప్రకటిస్తాడు.

2 These ascetics, swathed in wind,2 put dirty red rags on.3 When gods enter them, they ride with the rush of the wind.

2.ఈ సాధువులు, గాలిచే కప్పబడి2, మలినమైన కాషాయాన్ని ధరిస్తారు3 . ఎప్పుడైతే దేవతలు వారిలో ప్రవేసిస్తారో, వారు వాయు సమానముతో చలిస్తారు.

3 ‘Crazy with asceticism, we have mounted the wind.4 Our bodies are all you mere mortals can see.’

3.'వైరాగ్యముతో కూడినవారమై మేము వాయవును అధిరోహించేము4. మానవ మాత్రులు మా శరీరాలను మాత్రమే చూడగలరు. '

4 He sails through the air, looking down on all shapes below.5 The ascetic is friend to this god and that god, devoted to what is well done.

4.అతడు గాలిలో ఎగురుతూ నేలపైన ఆకారాలను చూస్తాడు5. శ్రద్ధతో కార్యము చేయుట యందు నిమగ్నుడైన సాధువు అన్ని దేవతలకు మిత్రుడు.

5 The stallion of the wind, friend of gales, lashed on by gods – the ascetic lives in the two seas, on the east and on the west.

5. వాయువులో శరవేగముతో కదిలే అశ్వము వలె నున్నవాడు, వాయు సమూహాలకు మిత్రుడు, దేవతలచే శిక్షింప బడేవాడు అయిన సాధువు తూర్పు పడమర దిక్కుల యందుండే సముద్రములలో నివశిస్తాడు.

6 He moves with the motion of heavenly girls 6 and youths, of wild beasts. Long-hair, reading their minds, is their sweet, their most exciting friend.

6.అతడు స్వర్గలోకములో నుండే అప్సరసల6, యువకుల, క్రూర మృగాల కదలికలతో అనుసంధానమైన వాడు. కేశిని వారి ఆలోచనలను తెలిసినవాడైన, వారి ప్రియ మిత్రుడు.

7 The wind has churned it7 up; Kunamnama8 prepared it for him. Long-hair drinks from the cup, sharing the drug 9 with Rudra.

7.వాయువు దానిని7 మదించినది. కునమ్నమ 8అతనికై తయారు చేసింది. కేశిని రుద్రునితో కూడి ఆ ద్రవ్యాన్ని9 సేవిస్తాడు.

NOTES

NOTES

1. This act is attributed to other Vedic gods, too. Cf. 1.50.5.

1.వేదాలలో చెప్పబడిన దేవతలకు కూడా ఈ కార్యము ఆపాదించబడినది.

2. That is, they are naked; but the connection with the wind is also literally important, as in verses 3, 5, and 7.

2.వారు దిగంబరులు

3. Some are naked, some wear red (later saffron) rags.

3.కొందరు దిగంబరులు; మరికొందరు కాషాయ వస్త్రాలు ధరించెడి వారు.

4. The ascetic rides the wind as if it were a horse; cf. v. 5. The ascetic controls the wind by controlling his own breath.

4.సాధువు ఒక అశ్వమునకు రౌతు వలె వాయువులో చలిస్తాడు. అనగా పానాపాన శ్వాసను నియంత్రించి వాయువును నియంత్రిస్తాడు.

5. This act is often attributed to the sun. The ecstatic ascetic takes on the characteristics of several gods. The verse also describes the sensation of flying outside of one’s own body, observed below (cf. v. 3).

5. ఈ కార్యము తరచు సూర్యునికి ఆపాదించబడేది. మత్తుతో యుండే సాధువు అనేక దేవతల స్వరూపాలను ధరిస్తాడు. అతడు ఆశరీరుడై గాలిలో ఎగిరే అనుభవము క్రిందనుండి చూచుట సూచితము.

6. The Apsarases or nymphs of heaven, with their companions the Gandharvas.

6.అప్సరసలు, వారి మిత్రులైన గంధర్వులు స్వర్గ లోక వాసులు.

7. The drug.

7. మారక ద్రవ్యము

8. A female deity who appears only here; her name may indicate a witch or a hunchback.

8.ఒక దేవత. ఆమె పేరు బట్టి ఒక మంత్రగత్తె గావచ్చు.

9. Visa, a drug or poison.

9. విషము

Saturday, October 3, 2026

Wendy Doniger Rig Veda Drinking Soma




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle
Soma Drinker's Self Praise

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద
సోమ రసమును త్రాగే వాని పొగడ్తలు

8.48   We Have Drunk the Soma

8.48   సోమ రసమును త్రాగుట

This hymn celebrates the effects of Soma, particularly the feeling of being set free and released into boundless open space, and the belief that the drinker is immortal.

ఈ ఋక్కులో సోమ రసమును త్రాగిన పిదప కలిగే మార్పులు గూర్చి వివరింపబడినది. ముఖ్యముగా స్వాతంత్ర్యము, గాలిలో ఎగురుట, తాను అమరుడు అనే భావములు ఇక్కడ చెప్పబడెను.

1 I have tasted the sweet drink of life, knowing that it inspires good thoughts and joyous expansiveness to the extreme, that all the gods and mortals seek it together, calling it honey.1

1.నేను దేవతలు మరియు మానవులు మంచి ఆలోచనలు, విశ్వమును అతిక్రమించే భావనలు, ఆశించి త్రాగే మకరందమువంటి మధుర పానీయమును త్రాగితిని. 1

2 When you penetrate inside, you will know no limits,2 and you will avert the wrath of the gods. Enjoying Indra’s friendship, O drop of Soma, bring riches as a docile cow3 brings the yoke.

2.నిషా కలిగినప్పుడు హద్దులు తెలియవు 2మరియు దేవతల శాపములకు గురి కావు. ఓ సోమా, ఇంద్రుని స్నేహము వలన ఆనందించి, ఒక గోవు కాడిని తెచ్చినట్లు సంపదలను తెమ్ము. 3

3 We have drunk the Soma; we have become immortal; 4 we have gone to the light; we have found the gods. What can hatred and the malice of a mortal do to us now, O immortal one?

3.మేము సోమ రసమును త్రాగితిమి; అమరుల మయితిమి4; కాంతి మండలాన్ని చేరితిము; దేవతలను కనుగొంటిమి. ఓ అమరుడా జీవుల క్రోధము మనలను ఎలా బాధించగలదు?

4 When we have drunk you, O drop of Soma, be good to our heart, kind as a father to his son, thoughtful as a friend to a friend. Far-famed Soma, stretch out5 our life-span so that we may live.

4.ఓ సోమా , నిన్ను త్రాగినప్పుడు మా యందు దయ తలుచుము. ఎలాగైతే ఒక తండ్రి తన పుత్రుని యందు, ఒకడు తన స్నేహితుని యందు ఉండునట్లు. అతిశయమైన ఖ్యాతిని గల సోమా, మా ఆయుష్యును పొడిగించి చిరకాలము జీవించునట్లు చేయుము5 .

5 The glorious drops that I have drunk set me free in wide space. You have bound me together in my limbs as thongs bind a chariot. Let the drops protect me from the foot that stumbles 6 and keep lameness away from me.

5.నేను త్రాగిన పానీయము నన్ను విశ్వము అంచులకు తీసికొని వెళ్ళినది. గుర్రములను రథమునకు బంధించునట్లు, నా కరములను బంధించితివి. ఆ పానీయము 6 నాకు కుంటి తనము లేకుండా నన్ను అనుగ్రహించు గాక.

6 Inflame me like a fire kindled by friction; make us see far; make us richer, better. For when I am intoxicated with you, Soma, I think myself rich. Draw near and make us thrive.

6.రాపిడితో ఉత్పన్నమైన అగ్ని వలె నన్ను ప్రకాశింప జేయి; మాకు దూర దృష్టినివ్వు; మమ్ములను ధనవంతులను చేయి; అలాగే ఉన్నతులుగా. ఎందుకంటే సోమా, నాకు నిషా కలిగినప్పుడు, నేను మిక్కిలి సంపద గలిగిన వానిగా తలుస్తాను. మమ్ములను దరి చేర్చుకొని వృద్ధి చెయ్యి.

7 We would enjoy you, pressed with a fervent heart, like riches from a father. King Soma, stretch out our life- spans as the sun stretches the spring days.

7.ఒక తండ్రి యొక్క సంపదను పొందు విధంగా, శ్రద్ధతో తయారు చేసిన నిన్ను సంతోషముగా గ్రోలెదము. రాజైన సోమా, సూర్యుడు వసంతములో దినమును పొడిగించునట్లు, మా ఆయుష్యును పెంచుము.

8 King Soma, have mercy on us for our well-being. Know that we are devoted to your laws. Passion and fury are stirred up.7 O drop of Soma, do not hand us over to the pleasure of the enemy.

9.ఓ సోమా, మా శ్రేయస్సుకై, మా యందు దయ తలుచు. మేము నీ చట్టమునకు బద్దులమని తెలుసుకో. తృష్ణ మరియు తపన వృద్ధి నొందినవి7 . మా శత్రువుల ఆనందమునకై మమ్ములను వారిచే చెరబడనీయకు.

9 For you, Soma, are the guardian of our body; watching over men, you have settled down in every limb. If we break your laws, O god, have mercy on us like a good friend, to make us better.

9.ఓ సోమా, మా శరీర రక్షకుడవు నీవు. మనుజులను కాపాడుటకై వారి ప్రతి అవయవమందును వ్యాపించితివి. ఓ దేవా, ఒక మంచి స్నేహితుని వలె, మమ్ములను వృద్ధి చేయుటకై, దయ గలిగి నుండుము.

10 Let me join closely with my compassionate friend8 so that he will not injure me when I have drunk him. O lord of bay horses,9 for the Soma that is lodged in us I approach Indra to stretch out our life-span.

20.నేను నా దయగల స్నేహితుని దరి జేరెదను8 . ఎందుకంటే వానిని గ్రోలిన పిదప నాకు కీడు చేయడు. ఓ అశ్వములకు అధిపతీ9, సోమ పానము మహిమతో ఇంద్రుని మా ఆయుష్యును వృద్ధి చేయమని కోరెదను.

11 Weaknesses and diseases have gone; the forces of darkness10 have fled in terror. Soma has climbed up in us, expanding. We have come to the place where they stretch out life-spans.

11.దౌర్బల్యము, రోగము మాయమైనవి. చీకటి శక్తులు 10భీకరిల్లి చెల్లా చెదురైనవి. సోమ మాలో ప్రవేశించి వ్యాపించినది. మా ఆయుష్యును పెంపొందించే స్థలమునకు వచ్చితిమి.

12 The drop that we have drunk has entered our hearts, an immortal inside mortals. O fathers,11 let us serve that Soma with the oblations and abide in his mercy and kindness.

12.ఒక అమరుడు జీవునిలో ప్రవేశించినట్లు, మేము త్రాగిన సోమ రసము మా హృదయములో ప్రవేశించెను. ఓ పితృలారా11, మేము సోమకు ఆహుతులు అర్పించి వాని దయతో నుండెదము.

13 Uniting in agreement with the fathers, O drop of Soma, you have extended yourself through sky and earth. Let us serve him with an oblation; let us be masters of riches.

13. పితృలతో అంగీకరించి, ఓ సోమా, నీవు భూమ్యాకాశములలో వ్యాప్తి చెందితివి. మనము వానికి ఆహుతుని ఇచ్చి సేవించెదము. మనము సంపదలకు అధిపతులుగా నుండెదము.

14 You protecting gods, speak out for us. Do not let sleep or harmful speech12 seize us. Let us, always dear to Soma, speak as men of power in the sacrificial gathering.

14. దేవతలను రక్షించే నీవు మా గురించి వారితో మంచి మాటలను చెప్పుము. మమ్ములను నిద్ర, దూషణమైన పలుకులు 12 ఆవహించక నుండు గాక. శక్తి మంతులు యజ్ఞ వాటికలో ప్రసంగము చేయు విధముగా, సదా సోమ యందు ప్రేమ కలిగి, మేము ప్రసంగించెదము గాక.

15 Soma, you give us the force of life on every side. Enter into us, finding the sunlight, watching over men. O drop of Soma, summon your helpers and protect us before and after.13

15.సోమా మాకు జీవ శక్తి అన్ని వైపులా నిచ్చితివి. సూర్యకాంతిని తెలిసికొనుచు, జీవులను కాపాడుచూ మాలోనికి ప్రవేశించుము.

NOTES

వివరణ

1. Here, as elsewhere in the hymns to Soma, honey is not a reference to the product of bees or the Indo-European mead made from it, but refers to the essence and sweetness of the ambrosia.

1.ఇచ్చట సోమ అనగా తేనెటీగలు సేకరించే తేనెతో పోల్చుట లేదు. అమృతము యొక్క సారము, మాధుర్యముతో పోల్చబడినది.

2. Inside the human body, the Soma becomes ‘boundless’ in the sense of producing a feeling of infinite expansion, a sensation char acteristic of psychedelic drugs. But the word (aditi) may also be taken as the proper name of the goddess Aditi, for Soma is called the youngest son of Aditi and Aditi’s function of liberating from sin might be relevant here : Soma, Aditi’s son, purifies from within and pacifies the angry gods.

2.శరీరములో ప్రవేశించిన తరువాత సోమ, మారక ద్రవ్యములవలె సర్వ మును వ్యాపించునట్లు భావనలు కలిగించును. అలాగే సోమ అదితి యొక్క కనిష్ట పుత్రునిగా భావించెదరు. అదితి దేవత కావున పాపముల నుండి విముక్తి చేయును. అనగా అదితి పుత్రుడైన సోమ అంతరంగమును శుద్ధి చేసి, దేవతలను ప్రసన్నము చేయును.

3. The term denotes an obedient female animal, probably a draught animal; it could be a mare or a cow. Cf. Dawn harnessing docile cows to her chariot in order to bring treasure to the singer (1.92.2). These animals, though naturally fierce in the Indo- European world, were also capable of being tamed.

3.అనగా సాధు జంతువు. ఆవు లేదా గుర్రము కావచ్చు. ఉషస్సు సాధు గోవులను రథమునకు పూన్చి ద్రష్ట కొరకై సంపదలను తెచ్చును. (1.92.2).

4. The poet has a vision of what life in heaven would be like, a kind of vague, temporary immortality, lasting ‘a long time’.

4. ద్రష్టకి స్వర్గము గూర్చి పూర్తి అవగాహన లేక తాత్కాలికమైన అమరత్వమును కోరెను.

5. The verb means to cross in a forward direction, as one would cross a river, to push the farther bank of the life-span farther away. Cf. SB 11.1.6.6, in which Prajapati sees the end of his life as one would see the farther bank of a river. The metaphor is repeated in vv. 7 and 10-11, and the idea of prolonging life (or of obtaining the limited immortality which consists in a full life-span) is central to the hymn. Cf. also the recurrent Vedic themes of ‘stretching the thread’ of the sacrifice and expanding in space.

5. ఆవలి ఒడ్డుకు చేరుటకై నదికి అడ్డముగా ఈదుట, జీవితము యొక్క చివరి దశతో పోల్చబడినది. Cf. SB 11.1.6.6 ప్రజాపతి జీవితము యొక్క చరమ దశను నదికి ఆవలి ఒడ్డును వలె చూడ గలవాడ నిజముగా చూచిన వాడు అనెను.

6. The releasing effect of the drug described in the first part of this verse is immediately contrasted with a binding, perhaps by Soma, perhaps by someone else, and then with some sort of stumbling; this stumbling may involve actual injury, prefigured in the ‘binding with thongs’ and followed by the ‘lameness’ of the next phrase. The verse may also imply more metaphysical mistakes, but the literal meaning might refer to stumbling and falling in physical clumsiness as a result of the ecstasy induced by Soma.

6. సోమ రసము వలన కలిగే నిషాలో తప్పటడుగులు వేయుట.

7. Soma stirs not only the emotions of the drinkers but also the unpredictable emotions of the enemy mentioned in the next phrase.

7.సోమ త్రాగిన వానిలో అలజడి చేయడమే గాక, శత్రువులోనూ అదే చేయును.

8. Soma.

8.సోమ

9. Indra, here as elsewhere identified with Soma. The singer approaches Indra to come ‘for’ Soma in the sense of ‘in order to enjoy’ Soma or ‘in return for being given’ Soma, but in any case to act, like Soma, to prolong life, or even to allow Soma to remain in the belly for a long time.

9.ఇంద్రుడు సోమతో పోల్చబడెను. ద్రష్ట ఇంద్రుని సోమ రసమునకై కోరుట లేదా కలిసి సోమ రసమును గ్రోలుట సూచితము. అలాగే ఆయుష్యును పెంచుట లేదా సోమ రసము శరీరములో చిరకాలము నుండుట.

10. Personified as females.

10. స్త్రీ లింగము సూచితము

11. The fathers, as drinkers of Soma, are called to witness.

11. సోమ రసమును త్రాగిన పితరులను సాక్షులుగా రమ్మనుట.

12. ‘Harmful speech’ may mean injurious slander or may refer to the violation of the vows of remaining awake and silent in the rite of initiation into the Soma sacrifice. Cf. 10.18.14.

12. సోమ యజ్ఞములో మెలకువగా, మౌనముతో ఉండవలసినప్పుడు దూషణతో గూడిన వాక్కు అప్రస్తుతము.

13. The worshipper asks to be surrounded and protected now and forever in his drug- induced vulnerability.

13.ద్రష్ట తన నిషాతో కలిగిని దౌర్బల్యము వలన తన చుట్టూ రక్షణ కవచముగా నుండమని కోరుట

Friday, September 25, 2026

Wendy Doniger Rig Veda Soma Drinker's Ecstacy




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle
Soma Drinker's Self Praise

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద
సోమ రసమును త్రాగే వాని పొగడ్తలు

9.113   The Ecstasy of Soma

9.113   సోమ యొక్క నిషా

The poet begins by inviting Indra to drink Soma with him and then invokes Soma for himself, praising him. He then asks Soma to make him immortal, as he becomes inspired under the hallucinogenic in infuence of the drug (v. 6).

ద్రష్ట తనతో సోమ రసమును త్రాగుటకై ఇంద్రుని ఆహ్వానించెను. ఆ క్రమంలో ఇంద్రుని కీర్తించును. సోమను తనకు అమరత్వమును ఇమ్మని కోరుకొనును.

1 Let Indra the killer of Vrtra drink Soma in Saryanavat,1 gathering his strength within himself, to do a great heroic deed. O drop of Soma, flow for Indra.

1.వృత్రాసురిని సంహరించిన ఇంద్రుడు పెద్ద కార్యమును తలపెట్టుటకై కావలిసిన స్వశక్తిని కూడబెట్టుకొని శర్యనవత్ 1 వద్ద సోమ రసమును త్రాగు గాక. ఓ సోమా, ఇంద్రుని కొరకై ప్రవహించు

2 Purify yourself, generous Soma from Arjika,1 master of the quarters of the sky. Pressed with sacred words, with truth and faith and ardour,2 O drop of Soma, flow for Indra.

2.ఉదారమైన సోమా, ఆకాశానికి అధిపతి యైన ఆర్జిక1 కొరకై శుద్ధముగా నుండు. మంత్రాలతో, సత్యముతో, శ్రద్ధతో2 పిండబడిన సోమా, ఇంద్రుని కొరకై ప్రవహించు.

3 The daughter of the sun has brought the buffalo raised by Parjanya.3 The divine youths have received him and placed the juice in Soma. O drop of Soma, flow for Indra.

3.సూర్యుని కుమార్తె పర్జన్య3 పెంచిన గోవును తెచ్చెను. దేవతలు దానిని ఆహ్వానించి, సోమ రసములో నుంచిరి. ఓ సోమా, ఇంద్రుని కొరకై ప్రవహించు.

4 You speak of the sacred, as your brightness is sacred; you speak the truth, as your deeds are true.4 You speak of faith, King Soma, as you are carefully prepared by the sacrificial priest. O drop of Soma, flow for Indra.

4.నీ తేజస్సు పవిత్రము గాన నీవు పవిత్రమైన వారలను గూర్చి పలికెదవు . నీ కర్మలు సత్యమైనవి గాన, నీవు సత్యమును పలికెదవు.4 హోత నిన్ను అతి శ్రద్ధతో తయారు చేయడము వలన, రాజైన సోమా నీవు నమ్మకము గూర్చి పలికెదవు. ఓ సోమా ఇంద్రుని కొరకై ప్రవహించు.

5 The floods of the high one, the truly awesome one, flow together. The juices of him so full of juice mingle together as you, the tawny one, purify yourself with prayer. O drop of Soma, flow for Indra.

5.అతిశయమైన వాని వరదలు కలసి ప్రవహిస్తాయి. వాని రసములు బంగారు వర్ణములో నున్న నీతో మిళితమైన దానా ప్రార్థనచేసి నువ్వు శుద్ధి చేసుకొనుము. ఓ సోమా, ఇంద్రునికై ప్రవహించు.

6 Where the high priest speaks rhythmic words, O Purifier, holding the pressing-stone, feeling that he has become great with the Soma, giving birth to joy through the Soma, O drop of Soma, flow for Indra.

6.ఓ శుద్ధిపరచే దానా, హోత రుబ్బు రాళ్ళను పట్టుకొని, సోమ వలన ఖ్యాతి పొందితినని భావించి వరుస క్రమములో మంత్రములను ఉచ్ఛరించును. తద్వారా సోమ వలను ఆనందమును కలుగజేయును. ఓ సోమా, ఇంద్రునికై ప్రవహించు.

7 Where the inextinguishable light shines, the world where the sun was placed, in that immortal, unfading world, O Purifier, place me. O drop of Soma, flow for Indra.

7.ఓ శుద్ధిపరచే దానా, సూర్యుడు ఉంచిన ప్రదేశములో నిరతము ప్రకాశించే కాంతితో గూడిన అమరమైఎన్నటికీ అంతరించని ప్రపంచములో నన్ను ఉంచుము. ఓ సోమా, ఇంద్రునికై ప్రవహించు.

8 Where Vivasvan’s son is king,5 where heaven is enclosed, where those young waters are6 – there make me immortal. O drop of Soma, flow for Indra.

8.ఎక్కడైతే వివస్వుని పుత్రుడు రాజో5 , ఎక్కడైతే స్వర్గము గలదో, ఎక్కడైతే చల్లని జలము గలదో6 , అక్కడ నన్ను అమరుని జేయుము. ఓ సోమా, ఇంద్రునికై ప్రవహించు.

9 Where they move as they will, in the triple dome, in the third heaven of heaven, where the worlds are made of light, there make me immortal. O drop of Soma, flow for Indra.

9.ఎక్కడైతే తమ ఇచ్చానుసారము మూడవ స్వర్గమైన త్రిపురములో చలించెదరో, ఎక్కడైతే ప్రపంచములలో కాంతి గలదో, అచ్చట నన్ను అమరుని జేయుము. ఓ సోమా, ఇంద్రునికై ప్రవహించు.

10 Where there are desires and longings, at the sun’s zenith, where the dead are fed and satisfied,6 there make me immortal. O drop of Soma, flow for Indra.

10.సూర్యుని ఉచ్చ దశలో ఎచ్చట కోరికలు గలవో, ఎచ్చట మరణించిన వారికి ఆహారమును ఇచ్చి సంతృప్తి పరచెదరో6 , అచ్చట నన్ను అమరుని జేయుము. ఓ సోమా, ఇంద్రునికై ప్రవహించు.

11 Where there are joys and pleasures, gladness and delight, where the desires of desire are fulfilled, there make me immortal. O drop of Soma, flow for Indra.

11.ఎచ్చటైతే ఆనందము గలదో, కోరికలు తీర్చబడునో, అచ్చట నన్ను అమరుని జేయుము. ఓ సోమా ఇంద్రునికై ప్రవహించు.

NOTES

వివరణ

1 The mountains where Soma is found.

1.సోమ వృక్షములుండే పర్వతాలు.

2 Tapas, the heat generated by sacrificial activity (and, later, by asceticism).

2.తపస్సు నుండి ఉద్భవించే వేడి.

3 The daughter of the sun is the wife of Soma; Soma is some times called a buffalo (or a bull or stallion) ; Parjanya, god of fructifying rain, makes Soma and other plants grow (cf. 5.83.1, 5.83.5, 5.83.10; 7.101.2, 7.101.6).

3.సూర్యుని పుత్రిక సోమ భార్య; సోమను కొన్ని చోట్ల గోవు లేదా వృషభము లేదా మగ గుర్రముతో పోల్చిరి.

4 That is, the deeds done under the influence of Soma are true (cf. in vino Veritas).

4.సోమ నిషాలో చేసే కార్యములు సత్యములు.

5 Yama, the son of Vivasvan, is king in the world of the dead, here (and elsewhere in the Rig Veda) thought of as being in heaven, where the dead are nourished by the offerings made to them by their descendants.

5. వివస్వుని పుత్రుడైన యముడు మరణించిన వారుండే లోకమునకు అధిపతి. ఆ లోకము స్వర్గము కావచ్చు. అచ్చట మరణించిన వారికి వారి సంతతి ఆహారమును పంపెదరు .

6 The cosmic waters born in heaven.

6.స్వర్గములో ఉద్భవించిన ప్రళయ జలములు.

Friday, September 18, 2026

Wendy Doniger Rig Veda Soma Drinker Self Praise




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద

10.119   The Soma-Drinker Praises Himself

10.119   సోమ రసము త్రాగిన వాని పొగడ్త

Under the influence of the drug Soma, a sage or god praises himself.1

సోమ రసము త్రాగిన నిషాలో, ఒక ఋషి లేదా దేవత తనను తాను పొగుడుకుంటాడు. 1

The god may be Indra or Agni, though the former is more likely and is supported by the Indian commentarial tradition;

అతడు ఇంద్రుడు లేదా అగ్ని దేవత కావచ్చు

either god may be incarnate in the worshipper speaking the hymn. As he drinks, his boasts become progressively more Gargantuan.

1 This, yes, this is my thought: I will win2 a cow and a horse. Have I not drunk Soma?

1.అవును, ఇది నా ఆలోచనే. నేను ఒక గోవుని మరియు ఆశ్వాన్ని గెలుచుకుంటాను2. నేను సోమ రసమును త్రాగలేదా?

2 Like impetuous winds, the drinks have lifted me up. Have I not drunk Soma?

2.ఈదురు గాలి వలె, ఈ పానీయము నన్ను ఎత్తి పట్టింది. నేను సోమ రసమును త్రాగలేదా?

3 The drinks have lifted me up, like swift horses bolting with a chariot. Have I not drunk Soma?

3.రథానికి పూన్చిన వేగ వంతమైన ఆశ్వాల వలె, ఈ పానీయము నన్ను ఎత్తి పట్టింది. నేను సోమ రసమును త్రాగలేదా?

4 The prayer has come to me 3 as a lowing cow comes to her beloved son. Have I not drunk Soma?

4.ఒక గోవు అంబా అంటున్న దూడని చేరినట్లు, నాకీ 3ప్రార్థన దరిచేరింది. నేను సోమ రసమును త్రాగలేదా?

5 I turn the prayer around in my3 heart, as a wheelwright turns a chariot seat. Have I not drunk Soma?

5.ఒక కంసాలి రథ చక్రమును తయారు చేయు రీతి, నా హృదయంలో3 ఈ ప్రార్థన అంకురించింది. నేను సోమ రసమును త్రాగలేదా?

6 The five tribes 4 are no more to me than a mote in the eye.5 Have I not drunk Soma?

6.ఆ ఐదు జాతులు4, కళ్ళలో నలుసు వంటివి5. నేను సోమ రసమును త్రాగలేదా?

7 The two world halves 6 cannot be set against7 a single wing of mine.8 Have I not drunk Soma?

7.జగత్తు యొక్క రెండు భాగములు 6 నా 7ఒక్క రెక్కకు సరిపోవు.8 నేను సోమ రసమును త్రాగలేదా?

8 In my vastness, I surpassed the sky and this vast earth. Have I not drunk Soma?

8.నా వ్యాప్తి, ఆకాశము మరియు భూములను అధిగమించింది. నేను సోమ రసమును త్రాగలేదా?

9 Yes ! I will place the earth here, or perhaps there. Have I not drunk Soma?

9. అవును, నేను భూమిని ఇక్కడ లేదా అక్కడ పెడతాను. నేను సోమ రసము త్రాగలేదా?

10 I will thrash the earth soundly, here, or perhaps there. Have I not drunk Soma?

10.నేను భూమిని ఇక్కడ లేదా అక్కడ తొక్కి పారేస్తాను. నేను సోమ రసమును త్రాగలేదా?

11 One of my wings is in the sky; I have trailed the other below.9 Have I not drunk Soma?

11.నా ఒక రెక్క ఆకాశంలో ఉన్నది. రెండవది క్రింద నున్నది9 . నేను సోమ రసమును త్రాగలేదా?

12 I am huge, huge! flying to the cloud. Have I not drunk Soma?

12.నేను అతిశయమైన పరిమాణము కలిగి ఆకాశంలో ఎగురుతున్నాను. నేను సోమ రసమును త్రాగలేదా?

13 I am going10 – a well-stocked house, carrying the oblation to the gods.11 Have I not drunk Soma?

13.నేను అన్ని వసతులు గల ఇంటికి10, దేవతలకు ఇచ్చే ఆహుతులతో పోవుచున్నాను111. నేను సోమ రసమును త్రాగలేదా?

NOTES

వివరణ

1. Cf. 4.26.1-3, 4.27.1.

1. Cf. 4.26.1-3, 4.27.1.

2. The verb can mean to win for oneself or for someone else. If Indra is speaking, he wants them for himself; if Agni, to transmit to the other gods or to give to the poet; if the poet, to give to the gods. Since the poet imagines that he has become a god, all of these meanings are simultaneously present.

2.ఇంద్రుడు అయితే తనకొరకై గెలుచుట. అగ్ని అయితే దేవతల కొరకై లేదా ద్రష్ట కొరకై గెలుచుట. ద్రష్ట అయితే దేవతల కొరకై గెలుచుట.

3. As a god, he receives the prayer and ‘turns it around’ to decide whether or not to accept it; as a poet, he receives the inspiration of the prayer and ‘turns it around’ to perfect it.

3. దేవత కావున అతడు ప్రార్థనను స్వీకరించుట లేదా స్వీకరించ కుండుట చేయును. అతడు ప్రార్థన లోని ఉత్సాహాన్ని అతిశయము చేయుట.

4. The whole of the Vedic tribal world.

4 .వైదిక జాతులన్నియు.

5. Alternatively, worth no more than a glance.

5.ఒక చూపు కన్న మిన్న కానిది.

6. Sky and earth.

6. భూమ్యాకాశములు.

7. ‘Set against’ both in the sense of set in opposition to and set up as equal to.

7.పరస్పర వైరుధ్యముతో లేదా సరి సమానతతో ఉంచుట.

8. Agni takes the form of a bird or a winged horse, but the poet may simply feel that he is flying, a frequent symptom of drug-induced ecstasy. Cf. 10.136.2-4.

8.అగ్ని ఒక పక్షి లేదా ఎగిరే అశ్వము రూపము దాల్చుట. లేదా ద్రష్ట మైకములో ఎగురుచున్నా ననే భావన.

9. He imagines himself to have grown so large that he touches heaven and earth at the same time.

9.అతడు అతిశయమైన రూపము దాల్చి నింగిని, భూమిని ఒకేమారు తాకు తున్నాననే భ్రమ

10. A salutation of farewell, as he heads for heaven and the gods.

10.స్వర్గానికి, దేవ లోకాలకీ వెళ్తూ స్వస్తి పలుకుట

11. A compound image, of a house full of Soma (his stomach being the larder), a flying palace (common in later Indian mythology), and the god Agni carrying the oblation – the Soma – to the gods.

11.సోమ రసముతో నిండి యున్న ఇల్లు (జీర్ణ కోశము వలె), ఎగిరే కోట, అగ్ని దేవతలకు ఆహుతులు తీసుకు వెళ్ళుట.

Wendy Doniger Rig Veda Intro To Indra

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...