Posts

Showing posts from September, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 6-9)

Image
6 దృగ్దర్శనశక్త్యో రేకాత్మ తేవాస్మితా దృగ్దర్శనశక్త్యోః = చూపు మరియు దర్శనము అను రెండు శక్తులను ఏకాత్మతా + ఇవా = తానొక్కడనే యనునది అస్మితా = ఉనికి చూచువాడు తనచూపుతో నేకీభవించినచో దానిని అహం కారము అందురు కన్ను చూస్తున్నాదనీ, చెవి వి౦టున్నాదనీ, ముక్కు వాసన చూస్తున్నాదనీ, నాలుక రుచి చూస్తున్నాదనీ, అలాగే చర్మము స్పృశిస్తున్నాదనీ అనిపిస్తుంది. అది తప్పు. కరంటు బల్బు వెలిగిస్తే అక్కడ వెలుగు నిచ్చేది బల్బుయేనా? టెలిఫోను ఉపయోగించినపుడు నీతో మాటలాడేది టెలిఫోనుయేనా? ఇక్కడ టెలిఫోను ద్వారా నీవు మాట్టాడుట సత్యముగాని, టెలిఫోను మాట్లాడదు కదా? అట్లే బల్బు ద్వారా వెలుగునిచ్చేది విద్యుత్తే కదా! కనుక కన్ను ద్వారా చూసేది నీవుకాని కన్ను చూడదు. అలాగే మిగిలిన అవయవములు కూడా. ఆకాశము నీలముగా కనబడితే, అలా కనబడేది నీ కంటికి గాని ఆకాశము నీలముగానున్నాదని అర్థము కాదు. అసలు నీవనుకొ౦టున్న ఆకాశము అనేది లేదు. ఆ కనిపించు నీలవర్షము నీ కంటికలా కనిపిస్తుందిగాని సత్యము కాదు. కనుక పరికరముల కొలతలను, సత్యముగా తీసుకొ౦టే నీవు మోసపోతావు. పరికరము న

Saara Satakamu (1-100)

సార శతకము ఉపోద్ఘాతము పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుడట అని పోతనామాత్యుడు భాగవత అనువాదము ప్రారంభించగా నే పలికెద వినమ్రముగా భూగోళ భాషలలో ఆంధ్రము లెస్స దానిని పరభాష చెరనుండి విముక్తి చేయుట తక్షణ కర్తవ్యము 1 హాస్యముతో వ్రాయలేని పామరుడిని జంధ్యము లేని పాశ్చాత్య దేశ వాసిని సంధ్యా వందనము చేయని మందమతిని మాంద్యము ఆవహించిన ఆంగ్ల విదేశిని 2 కాయకష్టము ఎండనక వాననక పని చేయు రైతుది పరకాయ ప్రవేశము అద్వైత శంకరుని మాయది మొట్టికాయ వేదమెరుగని కవి కోవిదునికి తగినది జెల్లకాయ నా వలె మిడి మిడి జ్ఞానులకు మిగిలినది 3 జగాల్ని పాలించు పరమాత్మ లలితాదేవి గజగామిని, భక్తులు కోరిన వర ప్రసాదిని, రాగాలు అల్లు వాగ్గేయుని స్పూర్తిదాయిని పరాగాలు జల్లు మధుపంబు ఆ జనని! 4 శంకరుని అద్వైత వైభవము జూడ మనస్సు ఝల్లను ముక్కంటి కనులు కుట్ట మిగిలినది మూడవదే ఒంటికంటైన భోళా శంకరుడు అద్వైతి పాద సేవ జేయ ఒంటరిదైనది హిమగిరి తనయ నిజ శంకరుని పోల్చలేక 5 ఆంధ్రుల జన్మ హక్కు ఉత్కృష్టమైన తెలుగు భాష ప్రవాసాంధ్రులు మొక్కు ఆంధ్ర తిరుమలేశుని భాగ్యనగరము చెందు వ్యాపారము చేయువార్లకు భోగము అనుభవించెడిది

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 1-3)

Image
ఈ గ్రంధ౦లో రెండవ ప్రకరణలో యోగసాధన గురించి వివరింపబడి౦ది. నిజానికి యోగసాధన మిక్కిలి సులభము, మరియు సూటియైనది. ప్రజ్ఞలోని వివిధపొరలను లేక కోశములను అంతర్యామి యందు లయము చేయటమే యోగము. ఇక్కడ అంత్యరామి అంటే తనకు ఆధారమయియున్న చోటులోని "నేను" అను ప్రజ్ఞ. కాని క్రొత్తగా యోగసాధన ప్రారంభించువానికి జన్మాంతర సంస్కారములనేకములుంటాయి. అలాంటి స్టితిలో వానికి యోగసాధన అంటే మొదట కొంత ప్రాధమిక శిక్షణ గురించి, దానిలోని దశలను గురించి ప్రస్తుత ప్రకరణములో వివరింపబడుతున్నాయి. సాధకునిలో కొన్ని కర్మవాసనలు మిగలి ఉంటాయి. ఏదో యొకటి క్రొత్తది చెయ్యాలి అనే అభిలాషగా జీవిలో కర్మకు వాసనలుంటాయి. అవే వాని కర్తవ్యములుగా వానికి అనిపిస్తాయి. అట్టి కర్మవాసనలు తొలగిపోవాలంటే, ప్రాధమిక శిక్షణ కొంత ఆవశ్యకము కనుక ఇట్టి ప్రాధమిక శిక్షణ "క్రియా యోగము" అను పేరున పిలువబడినది. తీవ్రనిష్ట లేక శ్రద్ధ దీనిలోని ప్రధాన విషయము. అట్టి నిష్ట వలన పురాణములు, ఇతర గ్రంథ ముల పఠనముతో ప్రారంభమై, క్రమముగా జీవుడు ఆంతర్యామికి సమర్పణమై వాని సేవగా జీవితము గడుపుతాడు. 2 సమాధి భావనార్థ

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 4-5)

Image
4 అవిద్వా క్షేత్రముత్తరేషాం ప్రసుప్త తనువిచ్చిన్నోదారాణామ్‌! అవిద్య = జ్లానము పొందు మార్గము తెలియకుండుట క్షేత్రం=క్షేత్రము ఉత్తరేషాం = తరువాత వానికి ప్రసుప్త =నిద్ర తను = క్షీణించుట విచ్ఛిన్న = ముక్కలగుట ఉదారాణామ్ = ప్రేరణ జ్ఞానము పొందుటను గూర్చి తెలియని స్థితి వలన నిద్ర, క్షీణించుట, భిన్నమగుట, ప్రేరణ యను నాలుగు స్థితులకు ఇది క్షేత్రము (కారణము) అగుచున్నది. అహంకారమ౦టే ఏమిటో తెలియకపోవుట వలన మనలో అహంకారము పనిచేస్తుంది. అది మనలో మనమేయన్న భావముగా పనిచేస్తుంది. తానువేరు, అహంకారము వేరు అని తెలియనంతవరకు అహంకారము మనలో పనిచేస్తూ ఉంటుంది. అలాగే రాగద్వేషములు, ఆసక్తి మొదలైనవి. వీటిని పరిహరించాలంటే అవి మనయందు ఎలా పనిచేస్తున్నాయో తెలియాలి. అది తెలియనంతవరకు వాటి ప్రభావము కొనసాగుతూఉంటుంది. ఒక సామాన్యుడు ఒక యంత్రాగారములో ప్రవేశించి అందులోని యంత్రములను గాని వస్తువులనుగాని కదిలిస్తే దానివలన వానికి ప్రమాదము కలుగవచ్చును. వాటిని ఎలా ఉపయోగించాలో వానికి తెలియకపోవుటయే దీనికి కారణము. అలాంటి మానవుడు తనజీవితమును కూడ పరిష్కరింపరా