Posts

Showing posts from March, 2023

Shvetashvatara Upanishat

Image
శ్వేతాశ్వతర ఉపనిషత్ మొదటి భాగము సృష్టికి కారణమేమిటి? అది బ్రహ్మనా? మనమెక్కడనుంచి వచ్చేము? ఎలా జీవిస్తాము? శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనల్ని చుట్టుముట్టే సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు ఏ శక్తులు కారణము? కాలము, ప్రకృతి, ఆవశ్యకత, యాధృచ్చికము, భూతాలు, శక్తి, బుద్ధి మొదటి కారణము కావు. అవి ఆత్మని సుఖదుఃఖాలనుండి విముక్తము చేసే కార్యాలు మాత్రమే. గాఢ ధ్యానంలో జ్ఞానులు ప్రతి జీవి హృదయంలోనూ వసించే పరమాత్మను దర్శించేరు. హృదయ లోతుల్లో, త్రిగుణాల--సాత్విక, రాజస, తామస--తెర వెనుక పరమాత్మ వసిస్తాడు. అతడే ఏక స్వరూపుడు. దేశకాలకారణాలను పరిపాలించేవాడు అతనే. ప్రపంచం పరమాత్మ తిప్పే చక్రం. దాని అంచులలో జీవులు స్థితమై ఉన్నారు. ప్రపంచం ఒక నది వంటిది--పరమాత్మ నుండి పుట్టి, పరమాత్మలోనే లయమవుతుంది. సదా తిరిగే చక్రంలో మానవుడు తిరుగుతూ, ఒక జన్మ నుంచి మరొక జన్మను పొంది, తాను ఒక ప్రత్యేకమైన జీవినని తలచి, చివరకు పరమాత్మ స్వరూపాన్ని తెలిసికొని, అఖండమైన అమృతత్వాన్ని పొందుతాడు. అతడే మారని సనాతన సత్యం; శాస్త్రాలను వల్లించండి; మన భూమి గూర్చి పాడ౦డి. ఎవరైతే పరమాత్మని అన్ని జీవులలో

Chandogya Upanishat

Image
చాందోగ్య ఉపనిషత్ మొదటి భాగము అవినాశి అయిన ఓంకారాన్ని స్మరించి ప్రారంభిద్దాం. భూమి జలమునుండి, మొక్కలు జలమునుండి, మానవుడు మొక్కల నుండి ఆవిర్భవించేయి; మానవుడ౦టే వాక్కు; వాక్కు ఓం. వాఙ్మయములో ఋగ్ వేదము ముఖ్యము; కానీ సామ ఋగ్ యొక్క సారం మరియు సామ ఓంకార సారం, ఉద్గీత. ఇది సారానికి సారం; మిక్కిలి ఉత్కృష్ఠమైనది, ఎనిమిదవ మెట్టు, అన్నిటికన్నా పవిత్రమైనది; ఓంకారము పరమాత్మ. ధ్యానంలో ఋగ్, సామ విశిష్ఠత ఏమిటి? ఋగ్ వాక్కు; సామ రాగము; అవినాశి అయిన ఓంకారం ఉద్గీత. వాక్ మరియు శ్వాస, సామ మరియు ఋగ్ జంటలు; అవి తమ కోర్కెలను నెరవేర్చుకొనుటకు అవినాశి అయిన ఓంకారంలో లయమవుతాయి. ఇది తెలిసికొని ఎవరైతే ఓంకారాన్ని జపం చేస్తారో వారి సమస్త కోరికలు తీరుతాయి. ఓం అనే పదంతో మనము "నేను అంగీకరిస్తున్నాను" అని పలికి మన కోరికలను తీర్చుకొంటాము. ఓంకారాన్ని స్మరించి, బాహ్యంగా దానిని గౌరవించి మూడు జ్ఞానములకు ఆధారమని గానము చేస్తాము. పరమాత్మ గురించి తెలిసినవారు, తెలియనివారు చేసే కర్మలు ఒక్కటే; కానీ ఆ రెండూ ఒకటే కాదు. జ్ఞానముతో, ఎరుకతో, భక్తితో చేసే కర్మలు శక్తివంతములు. అందుకే