Posts

Showing posts from January, 2023

Master Index

Image
Here you will find links to translated (into Telugu) works of various authors on Gita, Upanishads, Ramana Maharshi and Vemana. For Vemana's work, English Translation is provided. Enjoy! సార శతకము (100 పద్యాలు) (Telugu) పతంజలి యోగ సూత్రములు -- శ్రీ పిడూరు జగన్మోహన రావు (Telugu) విదుర నీతి -- శ్రీ పురాణపండ రామ మూర్తి (Telugu) Hexfecta that one has to be aware of (అరిషడ్వర్గాలు) (English) Sri Sookatam (శ్రీ సూక్తం) (Telugu/English) Purusha Sooktam (పరుష సూక్తం) (Telugu/English) True Love (English) Syamala Dandakam (శ్యామలా దండకం) (Telugu/English) Kanka Dhara Stotram (కనక ధారా స్తోత్రం) by Adi Sankaracharya

Ramana Maharshi Index

Image
Ramana Maharshi (30 December 1879 – 14 April 1950) was an Indian Hindu sage and jivanmukta (liberated being).He was born Venkataraman Iyer, but is mostly known by the name Bhagavan Sri Ramana Maharshi. He was born in Tiruchuli, Tamil Nadu, India. In 1895, an attraction to the sacred hill Arunachala and the 63 Nayanmars was aroused in him,and in 1896, at the age of 16, he had a "death-experience" where he became aware of a "current" or "force" (avesam) which he recognized as his true "I" or "self", and which he later identified with "the personal God, or Iswara", that is, Shiva. This resulted in a state that he later described as "the state of mind of Iswara or the jnani". Six weeks later he left his uncle's home in Madurai, and journeyed to the holy mountain Arunachala, in Tiruvannamalai, where he took on the role of a sannyasin (though not formally initiated), and remained for the rest of his

Ramana Maharshi Chapt 10

Image
అష్టాంగ జ్ఞానము అష్టాంగ జ్ఞాన విధా నములో: నిస్శ్వాస అనగా నామరూపాత్మకములను, దేహమును, జగత్తును విడిచిపెట్టుట. ఉచ్ఛ్వాస అనగా నామరూపాత్మకములతో కూడిన సత్, చిత్, ఆనందములను ఆస్వాదించుట. కుంభక మనగా లోపలికి తీసికొనబడిన వాటిని జీర్ణించుకొనుట. ప్రత్యాహార మనగా విడిచి పెట్టిన నామరూపాత్మకములు మనస్సులో మళ్ళీ ప్రవేశించనీయక మెలకువగా ఉండుట. ధారణ అనగా మనస్సుని హృదయములో నిశ్చలముగా నుంచి "నేను సచ్చిదానంద స్వరూపుడను" అని భావించుట. ధ్యానమనగా అహం స్వరూపం మీద దృష్టి ఉంచి "నే నెవరిని" అనే సాధనలోని అంశమైన పంచ కోశాలతో కూడిన దేహాన్ని నిశ్చలముగా నుంచుట. ఈ పద్దతిలో ఆసనాలు లేవు. మన మెప్పుడైనా, ఎక్కడైనా వీటిని పాటించవచ్చు. దీని లక్ష్యం హృదయంలో వసించే పరమాత్మ చరణములయందు మనస్సుని లగ్నము చేసి పరమాత్మను ఎన్నటికీ మరచి పోవకుండుట. ఆత్మని మరచిపోవడం సర్వ అనార్థాలకి కారణం. మతిమరుపు వలను ముక్తి పొందక మరణమునే పొందునని పెద్దలు చెప్పెదరు. రాజ యోగమువలె శ్వాసను నియంత్రించే అవసరముందా అనే అనుమానము రావచ్చు. అది సాధన చేయున౦త కాలం అక్కరకు రావచ్చు. కానీ అష్టాంగ జ్ఞానములోని శ్

Ramana Maharshi Chapt 9

Image
అష్టాంగ యోగ ధ్యాన రూపేణ భక్తిని సాధించుటకు అష్టాంగ యోగ లోని మొదటి రెండు: యమ, నియమలు సూచింపబడినవి. వీటిలో రెండు విభాగాలు ఉన్నవి. మొదటిది యోగము, రెండవది జ్ఞానము. శ్వాసను నియంత్రించడాన్ని యోగ అంటారు. మనస్సును అధిగమించడాన్ని జ్ఞానమందురు. ఏది మనకు సులువో మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. రెండు మార్గాల గమ్యం ఒకటే. శ్వాస నియంత్రణ వలన మనస్సు నియంత్రి౦పబడుతుంది. అలాగే మనస్సుని నియంత్రిస్తే శ్వాస నియంత్రింపబడుతుంది. వీటి లక్ష్యం మనస్సును నియంత్రించడం. యమ అనగా నైతిక విలువలను పాటించడం. అబద్ధం, దొంగతనం, లోభం మొదలగువాటిని లేకుండుట నియమ అనగా శ్రద్ధతో శాస్త్రము నిర్దేశించిన కర్మలు చెయ్యడం ఆసన అంటే శరీరాన్ని, మనస్సుని వివిధ పద్దతులలో (హఠ యోగ) స్వాధీన౦లో ఉంచుకోవడం ప్రాణాయామ అంటే శ్వాసను నియంత్రించడం ప్రత్యాహార అంటే ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొనుట ధారణ అంటే దృష్టిని ఏకీకృతం చెయ్యడం ధ్యాన అనగా నిరంతరం మంత్రం జపించడం సమాధి ఆత్మతో అనుసంధానము చేయుట ఈ విధంగా అష్టాంగ యోగము శాస్త్రములో చెప్పబడినది. వీటిలో శ్వాస నియంత్రణ ఉచ్ఛ్వాస, నిస్శ్వాస, కుంభకంలతో క

Ramana Maharshi Chapt 8

Image
ముక్తి మనస్సు ఆత్మతో తాదాత్మ్యం చెందక, బంధాలలో కూరుకుపోయి, ఒక గొర్రెల కాపరి భుజం మీద మేకపిల్లను పెట్టుకొని ఊరంతా వెదికిన చందంగా, తన స్వస్వరూపాన్ని తెలిసికోడానికి ప్రయత్నిస్తుంది. ఆత్మతో అనుసంధానము కాని అహంకారం, ఒకమారు ఆత్మ గురించి తెలిసికొన్నా, పూర్వ సంస్కారముల బంధము వలన ముక్తిని సాధించలేదు. అది దేహమే ఆత్మ అనే అపోహతో ఉంటుంది. పూర్వ సంస్కారములు దీర్ఘమైన ధ్యానంతో తొలగించుకోవచ్చు: "నేను దేహ౦ కాని, ఇంద్రియాలు కాని, మనస్సు కాని కాదు." కావున అహంకారం, ఒక విధంగా మనస్సే, దేహాన్ని ఆత్మగా భావించినపుడు, దాన్ని నియంత్రించి, ముక్తిని ప్రసాదించే ఆత్మజ్ఞానాన్ని, సర్వ దేవతల ఉనికికి కారణమైన పరమాత్మని, దీర్ఘ కాలం ధ్యానించాలి. ఇటువంటి విచారణ మనస్సును నియంత్రించి చివరకు అదికూడా అంతమొందుతుంది. ఎలాగంటే ఒక చితికి ఉపయోగించే కర్ర, చివరికి ఆ చితిలోనే దహనమవుతుంది. ఆత్మ, జ్ఞానం, చేతనము, పరమాత్మ, దేవుడూ అన్నీ ఒక్కటే. ఒక సామాన్యుడు పెద్ద వ్యాపారిని కలిసి, తాను కూడా గొప్పవాడని తలంచ వచ్చా? అతను పాటుపడి, కృషి చేస్తేగాని సాధ్యం కాదు. అదేవిధంగా అహంకారం, మనస్సుల

Ramana Maharshi Chapt 7

Image
భగవంతుని ధ్యానము నిర్గుణ పరమాత్మను ప్రార్ధించుటకు కారణము "అహం బ్రహ్మోస్మి" అనే సత్యాన్ని తెలిసికోవడానికి. "నేను బ్రహ్మన్" అనుకునే ధ్యానం త్యాగం, కామం, నియమనిష్ఠలు, యోగ, పూజ మొదలగువాటితో కూడినది. ధ్యానం నిర్విఘ్నంగా సాగాలంటే మనస్సుని బాహ్య విషయాల నుండి మరల్చి ఆత్మ వైపు తిప్పాలి. దానివల్ల బాహ్య విషయాలకు తటస్థంగా ఉంటాము. ఇది తప్ప వేరే మార్గం లేదు. ఒక్క రెప్పపాటు కాలంలో కూడా ఆత్మను మరువకూడదు. మనస్సుని ఆత్మ లేదా హృదయము నందు నిశ్చలంగా ఉంచడం యోగ, ధ్యానం, జ్ఞానం, భక్తి, పూజల యొక్క పరాకాష్ఠ. పరమాత్మ ఆత్మ రూపేణా మన హృదయంలో వసిస్తాడు కనుక, సదా ఆత్మయందు శరణాగతి కలిగివుంటే అది అన్ని పూజలకన్నా మిన్న. మనస్సు జీవ చైతన్యం. అజ్ఞానులు అది ఒక సర్పంలా చుట్లు చుట్టుకొని వెన్నెముక క్రిందన ఉంటుందని అంటారు. అదే కుండలిని. ఆరు చక్రాలు యోగాలో పరిపక్వం లేనివారి గురించి చెప్పబడినవి. మనం బాహ్యంగా విగ్రహారాధన ఎందుకు చేస్తామంటే మన అంతర్గతంలో పూజ చెయ్యడం తెలియదు కనుక. ఆత్మ జ్ఞానము వలన సర్వము తెలియబడి, జ్ఞానము పూర్ణమవుతుంది. ఆత్మ విచారణ, అంటే దైవము యొ

Ramana Maharshi Chapt 6

Image
పరమాత్మ జ్ఞానము మనస్సు అహంకారం దాల్చి, శరీరాన్ని ఆత్మగా భావించి, బాహ్య౦గా ప్రసరించి నప్పుడు, దానిని హృదయ౦ను౦చి సమూలంగా తీసివేసి, నేను అనే భావనను నియంత్రించి, విచారణ చేస్తే, "నేను-నేను" అనే ఒక సున్నితమైన అనుభవము వస్తుంది. అదే హృదయ కమలంలో, పట్టణమనే శరీరంలో విరాజిల్లే ఆత్మ. అదే పరమాత్మ కూడా. అప్పుడు మనము మనస్సు నిశ్చలం చేసి, ఆత్మను అన్నిటిలోనూ-- బాహ్యంలో లేదా అంతరంగ౦లో -- ప్రసరింపజేసి, సర్వవ్యాపకమైనదిగా, అన్నిటినీ అధిగమించే పదార్థమైనదిగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. దీన్నే "శివోహం" అనబడే ధ్యానం అంటారు. నేను శివుడను అనే భావనను నాల్గవ స్థితిగా భావించాలి. ఇటువంటి సున్నితమైన భావనే అనేక రీతులుగా తెలియబడే భగవంతుడు: నాల్గవ స్థితికి అతీతం; సర్వాంతర్యామి; హృదయంలో దీపంగా విరాజిల్లే పరమాత్మ; ఏకాగ్రత మరియు ధ్యానంలో తెలిసికొనబడేవాడు; అష్టాంగ పథంలో ఆరు మరియు ఏడవ మెట్టు; హృదయాకాశంలో ప్రతిష్ఠి౦పబడినవాడు; పరిశుద్ధమైన చైతన్యం; ఆత్మ స్వరూపం; పరిపూర్ణమైన ఆనందం; సమస్త జ్ఞానం గలవాడు. "నేను పరమాత్మను" అనే భావనతో దీర్ఘమైన కాలం, సదా ధ్యానం చ

Ramana Maharshi Chapt 5

Image
పరమాత్మ సర్వత్రా సత్యమైన సిద్ధాంతం: మనలోని ఆలోచనలు, ప్రపంచంలోని వస్తువులతో అనుసంధానమై ఉంటాయి. ఆ ఆలోచనా సమూహాలనే మనస్సు అంటారు. కనుక, దేహం, బాహ్య ప్రపంచం నిజానికి మనస్సులోని ఆలోచనలు. హృదయమే అన్ని వస్తువుల ఆవిర్భావమునకు ముఖ్య కారణం. అటువంటి హృదయ మధ్యలో, అనగా మనస్సు విస్తీర్ణంలో, "నేను" అనే దివ్య చైతన్యం వశిస్తోంది. అది అన్ని జీవులలోనూ అంతర్గతమై సర్వమునకు సాక్షియై ఉంది. అదే వేకువ, కల, సుషుప్తి లకు ఆవల ఉండే నాల్గవ అవస్థ అపరిమితమైన సృష్టిలో ఆత్మ సత్యమై, నిత్యమై, అన్ని జీవులలోనూ "నేను" అనే స్ఫురణను, చైతన్యమును కలిగిస్తుంది. నాల్గవ అవస్థకి ఆవల ఉండేది పరమాత్మ చైతన్యము. అదే నాల్గవ స్థితిని వెలుగుతో నింపుతోంది. అది ఒక దీపం లోనీ నీలి మంటనుండి, విస్తారమైన ప్రపంచం వరకు వ్యాపించే కాంతి వలె ఉంది. సత్యమైన అవస్థ అనగా సర్వత్రా కాంతితో నింపే దీపం యొక్క సర్వ వ్యాపాకత్వము. కాంతిని విస్మరిస్తే, అహంకారంలేని అవస్థే సత్యమైనది. ప్రతిఒక్కరు "నేను" అని చెప్పినపుడు తమ ఛాతీపై చెయ్యివేసి చెప్తారు. ఇదే పరమాత్మ మన హృదయంలో ఉన్నాడనే నిజానికి ప్

Ramana Maharshi Chapt 3-4

Image
సృష్టి స్మృతులు, శ్రుతుల ముఖ్య ఉద్దేశం ప్రపంచం మిథ్య, బ్రహ్మన్ సత్యం అని చెప్పడం. అందుకే సృష్టి క్రమం చెప్పబడినది. దానిలో త్రిగుణములతో కలిసి పంచభూత సృష్టి ఎలా జరగబడినదో తెలపబడింది. సృష్టి ఒక కలలా ఉండి, ఆ కలలో ఆత్మను కప్పిపుచ్చి లేనిపోని ఆలోచనలు కలుగుతాయి. సత్యం తెలపడానికి సృష్టి మిథ్య అని చెప్పబడుతుంది. అది జ్ఞానులకు బాగా ఎరుక. ఆత్మ శుద్ధ చైతన్యం; అన్నిటినీ గ్రహిస్తుంది; సర్వ ద్రష్ట. అహంకారం, మనస్సు మొదలగునవి ఆత్మ సాధనాలు. ఆత్మ వేరొకరికి దృశ్యము కాలేదు. వేరొకరు దానిని గ్రహించలేరు. అహంకారం మనస్సు అంటే "నేను" అనే భావన. మనస్సు, అహంకారం ఒకటే. బుద్ధి, అహంకారం, చిత్తం, మొదలగునవి కూడా మనస్సే. ఒక వ్యక్తి తండ్రి, తమ్ముడు, అన్న, ఉద్యోగి అని ఎలా పిలువబడుచున్నాడో అలాగే మనస్సుని వేర్వేరు రకాలుగా చిత్రీకరిస్తారు. మనస్సు ఆత్మానుభవము పొందితే కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప కడ్డీలా ఉంటుంది. ఆత్మకు వేరే సాక్షి లేరు గనుక అహంకారమే ఆ పని చేస్తుంది. ఎందుకంటే మనస్సు ప్రజ్వలమైన చైతన్యానుభవము పొందినది కనుక. ఆత్మ హృదయంలో ఎర్రగా కాలిన కడ్డీ లోని అగ్నిలా అసం

Ramana Maharshi Chapt 2

Image
మనస్సు మన స్మృతి, శృతులలో మనస్సు గురించి ఈ విధంగా చెప్పబడినది: తినే పదార్థాలలో సూక్ష్మమైనది మనస్సును పోషించేది ప్రేమ, క్రోధం, కామం, మదం మొదలగునవి దాని గుణాలు ఆలోచన, బుద్ధి, కోరిక, అహంకారంలతో నిండినది దానికి అనేక కార్యాలు చేసే శక్తి ఉన్నప్పటికీ, మనం చూసే జడపదార్థముల వంటిదే అది జడమైనప్పటికీ, చైతన్యముతో అనుసంధానమైన కారణాన చైతన్యమువలె అనిపిస్తుంది; ఎలాగంటే ఒక కొలిమిలో ఇనుప కడ్డీని కాల్చడం వల్ల ఆ కడ్డీ ఎర్రగా రంగు మారడానికి కారణం అగ్నే; కానీ అగ్ని ఆ ఇనుప కడ్డీ యొక్క సహజ గుణం కాదు. అది విచక్షణా జ్ఞానం కలిగి ఉన్నది అది చంచలము; లక్క, బంగారముల వలె దాని రూపము సునాయాసంగా మారేది అన్ని తత్వాలకు మూలమైనది దృష్టి కంటిలో, వినికిడి చెవిలో ఉన్నట్టే అది హృదయంలో వశిస్తుంది. అది జీవికి ప్రత్యేకతను ఇచ్చి బాహ్య వస్తువుల కనుగుణంగా ఆలోచనలు కలిగిస్తుంది అది మెదడుతో నడపబడే పంచేంద్రియాలతో అనుసంధానమై "నేను ఫలానా దానిని అర్థం చేసికొన్నాను" అనే స్ఫురణను కలిగించేది ఒక పదార్థాన్ని తినవచ్చా అనే ఆలోచన మనస్సులో ఆవిర్భవిస్తుంది: "ఇది మంచిది. ఇది మంచిది కాదు. ద

Ramana Maharshi Chapt 1

Image
నే నెవరిని ? "నేను" వచనం అందరికీ సహజం. "నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను చేసాను" అనే మాటాలు తరచు వింటాము. దాన్ని తరచి చూస్తే, కదలికలు మొదలగు పనులు దేహానికి సంబంధించినవి. "నేను" అనే ఎరుక దేహానికి సంబంధించినదా? దేహం పుట్టుక ముందు లేనిది; పంచ భూతాత్మకం; నిద్రలో ఎరుక ఉండనిది; చివరకు బూడిదలో కలిసి పోయేది. "నేను" అనే భావనను అహంకారం, అజ్ఞానం, భ్రమ, అశుద్ధం లేదా ఆత్మ అనవచ్చు. మన స్మృతులు, శృతులు దాని మీదే విచారణ చేసేయి. అవి చెప్పింది: అహంకారం పోతేనే ముక్తి సాధ్యం. కాబట్టి ఎవరు దీనిని తప్పు పట్టేది? ఎండు కర్రవలె జడమైన శరీరం "నేను" అని భాసించగలదా? కాలేదు. శరీరాన్ని అందుకే ప్రక్కన పెట్టి విచారణ చేద్దాం. నిరంతరం సాగే ఆలోచనా ప్రవాహంలో, అఖండమైన, నిశ్చలమైన, సహజమైన "నేను,నేను" అనే ఎరుక హృదయంలో కలుగుతుంది. దాన్ని పట్టుకొని, నిశ్చలంగా ఉంటే, అది శరీరంలో "నేను" అనే భావనను అంతం చేసి, చివరకు అదీ కర్పూర హారతిలాగ కరిగిపోతుంది. ఋషులు, గ్రంథాలు దీన్నే ముక్తి అంటారు. అజ్ఞానమనే తెర ఎప్పటికీ ఆత్మను క

Atma Upanishat

Image
ఆత్మ ఉపనిషత్ ఆత్మ ఉపనిషత్ పురుషుని మూడు విధములుగా వర్ణిస్తుంది. మానవుడు బాహ్య ప్రపంచంలోనూ, అంతరంగంలోనూ మెలగుతాడు. అనగా శరీరంలోనూ, మనస్సులోనూ చలిస్తాడు. తక్కిన ఉపనిషత్తులు లాగే ఆత్మ ఉపనిషత్ అంతరంగం గురించి చెప్పినపుడు: ఎరుకను సూక్ష్మంగా, లోతుగా మరియు కొంచెం హాస్యంగా వివరిస్తుంది. కనిపించే సృష్టికి ఆవలనున్న దాని గురించి ఎవ్వరికీ వర్ణింప శక్యము కాదు. కానీ దాని గురించి తెలిసికొనే ప్రయత్నము మిక్కిలి ఉత్కృష్టమైనది. అంగిరశ ఉవాచ: Sloka#1 పురుషుడు మూడు విధములుగా విరాజిల్లుతాడు: బయట, లోపల మరియు బ్రహ్మంగా. చర్మము, మాంసము, వెన్నెముక, జుట్టు, చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, చీల మండ, గోళ్ళు, కడుపు, బొడ్డు, తుంటి ఎముకలు, తొడలు, బుగ్గలు, కనుబొమలు, నుదురు, తల, కళ్ళు, చెవులు, చేతులు, రక్త నాళాలు, నాడులు మున్నగునవి బాహ్యము. Sloka#2 అంతరాత్మ బయట ప్రపంచాన్ని విశ్లేషిస్తుంది. అది భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో చేయబడినది. అది ఇష్టాయిష్టాలకు, కష్టసుఖాలకు, భ్రమ మరియు అనుమానాలకు లోబడి ఉంటుంది. దానికి భాష జ్ఞానము తెలుసు; నాట్యం, సంగీతం మరియు లలిత కళలు అంటే ఇష్టం; ఇంద్రియాలు

Taittireya Upanishat

Image
తైత్తిరీయ ఉపనిషత్ మొదటి భాగము శ్లోకం 1 పగలు యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక! రాత్రి యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక! దృష్టి యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక! బలం యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక! వాక్ యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక! ఆకాశం యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక! సర్వ శక్తులకు ఆధారమైన బ్రహ్మన్ కు వంగి నమస్కరిస్తున్నాను నేను సత్యమే పలుకుతాను; నీతినియమాలను పాటిస్తాను నన్ను, నా గురువును చెడు నించి రక్షించు నన్ను, నా గురువును చెడు నించి రక్షించు శ్లోకం 2 మనము చదవడమనే కళని పరిశీలిద్దాం; దానికై అక్షరాలు, వాటిని పలికే విధానము, ఉఛ్చారణ తెలియాలి; అలాగే కాల పరిమాణము, ఒత్తులు, అనుక్రమము, లయ తెలియాలి. శ్లోకం 3 జ్ఞానమనే కాంతి మాపై ప్రసరించుగాక. మేము పరమాత్మతో ఏకమగుగాక. ఈ అయిదు విషయాల గూర్చి ఆలోచిద్దాం: ప్రపంచం, తేజోమయమైన ఊర్ధ్వ లోకాలు, విద్య, సంతతి, మరియు వాక్కు. ఈ ప్రపంచం ఏమిటి? క్రింద భూమి, మీద ఆకాశము, రెంటికీ మధ్య గాలి, వాటినన్నిటిని కలిపే అంతరిక్షం.