Posts

Showing posts from August, 2023

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 30)

Image
నాల్గవ ప్రకరణము 30 వ్యధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాన్తి దర్శనాలబ్ధ భూమికత్వా నవస్థితత్వాని చిత్త విక్షేపాస్తే అన్తరాయాః. వ్యాధి = వ్యాధి స్త్యాన = నిరాకరణ సంశయ = సందేహము ప్రమాద = పొరవాటు ఆలస్య = సోమరితనము అవిరతి = లోలత్వము భ్రాంతిదర్శన = లేనిది వున్నట్టు చూచుట ఆలబ్ధభూమికత్వ = పట్టుదొరక కుండుట అనవస్థితత్వాని = స్టిరత్వము లేకుండుట చిత్త విక్షేపాః = చిత్తచాంచల్యము తే = అవి అంతరాయాః = అంతరాయములు అంతరాయములు దేహగతమైన మనస్సు యొక్క చాంచల్యములు, అవి వ్యాధి, నిరాకరణ, సందేహము, పొరపాటు, సోమరితనము, విషయలోలత్వము, భ్రాంతి, పట్టులేకుండుట. దీక్ష లేకుండుట మొదలైనవిగా తెలియబడును. యోగసాధనకు అంతరాయములు సహజములు. దేహగత మైన మనస్సు అనేక శక్తులు లేక ప్రజ్ఞల యొక్క సామ్యము. ఈ సామ్యమునకు ఒక్కొక్కసొరి మనస్సునందలి వ్యతిరేక శక్తులు, అంతరాయము కలిగించుచుండును. అవి: 1) వ్యాధి వ్యాధి అంటే వ్యధ పుట్టించునది. వ్యధ అంటే బాధ. బాధ మనస్సుకే గాని శరీరమునకుగాదు. కనుక వ్యాధి కారణ ములు మనస్సునుండి పుట్టి శరీరములో పనిచేయును. వ్యాధి కారణమును తొలగింపనిదే, వ్యాధి తా

Patanjali Yoga By Pidooru Jaganmohan Rao

Image
There are many books in many languages about Sage Patanjali's yoga sutras. So what is new? The main reason I have embarked on this is there is a little known book by Sri Pidooru Jaganmohan Rao titled "పతంజలి యోగ సూత్రములు" that was last published in the 90's and apparently went out of print. Compared to Swami Vivekananda's book, this one is easy to read and doesn't require prior knowledge of Sankhya. Still the book was written in "అచ్చ తెలుగు". So some translation effort is put in to rewrite in contemporary telugu. పతంజలి యోగ సూత్రములు Part 1 (Telugu) పతంజలి యోగ సూత్రములు Part 2 (Telugu) పతంజలి యోగ సూత్రములు Part 3 (Telugu) పతంజలి యోగ సూత్రములు Part 4 (Telugu) పతంజలి యోగ సూత్రములు Part 5 (Telugu)

Patanjali Samaadhi Paada Third Prakarana (Slokas 24-26)

Image
మూడవ ప్రకరణము: ఈశ్వరుడు 24 క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః క్లేశ = చిక్కు కర్మవిపాక = కర్మసంస్కారము అపరామృష్ట్రః = బాధింపబడడు పురుషవిశేషః = విశేషుడైన పురుషుడు ఈశ్వరః = ఈశ్వరుడు ఈశ్వరుడు (మానవదేహ యం(త్రమునకు అధిపతి) క్షేశములచేత, కర్మలచేత, వాని ఫలితములచేత బాధింపబడడు. యోగసాధకుడై నవాడు (ఇంతకు ముందు శ్లోకములలో చెప్పబడిన విధానమున సాధన చేయువాడు) ఈశ్వరుని శరణాగతి పొందవలెను. ఈశ్వరుడు అంటే ఏమిటో ఈ క్రింద వివరింపబడుచున్నది. పరమాత్మ అంటే ఈ నృష్టి సమస్తమునూ తానుగా వ్యాపించియున్నవాడు. ఈ పరమాత్మ అనే నీటిపై తేలుతున్న మంచు గడ్డవంటిది జీవాత్మ. అంటే సమస్తమునందు వ్యాపించియున్న పరమాత్మ, జీవులలో నేను అను అంశముగా తెలియబడుతున్నాడు. ఎలాగంటే మనము చోటు (space) లో ఒక గది కడితే, గదిలో మరల చోటుంటుంది. నిజానికి గదిలోని చోటు, గది వల్ల కాక గది కట్టకముందే ఉంది. గది లోపల, గదిబయట అని చోటును మనము రెండుగా విభజించి నప్పటికినీ, చోటు నిజ౦గా విభజింపబడలేదు. మనము చోటులో గదిని కట్టడంవలన చోటు వేరైనట్టు కన్పించినా, చోటు మాత్రము ఒక్కటే. నీటి బుడగ లోపల, బయట, గాలి

Patanjali Samaadhi Paada Second Prakarana (Slokas 17-20)

Image
రెండవ ప్రకరణము: అప్రజ్ఞాతము 17 సూః వితర్క విచారానందస్మితా అనుగమాత్ సంప్రజ్ఞాతః వితర్క = వస్తు విమర్శనము విచార = అనేక విషయములను గూర్చి ఆలోచించుట ఆనందా = ఆనందము అస్మితాః = తన అస్తిత్వము అనుగమాత్ = అనుసరించుట వలన సంప్రజ్ఞాతః = ప్రజ్ఞ చక్కగా వికసించిన స్థితి ప్రజ్ఞ చక్కగా వికసించుట అనే స్థితి, ప్రతీ వస్తువు గురించి విమర్శ చేసికొని, దాని నిజస్థితిని గమనించడం వలన, అన్నిటిలోనీ ఆనందం గురించి తెలియుట వలన, తానను ప్రజ్ఞ అన్నిటిలోనూ వెలుగుటను గమనించడం వలన, సాధ్యమవుతుంది. ఈ ప్రపంచంలో సమస్తము మనస్సు చేత, ఇంద్రియముల చేత గమనింపబడి గ్రహింప బడుతోంది. సరైన ప్రమాణము స్వీకరిస్తే, అన్నీ చక్కని విమర్శకు లోబడి వుంటాయి. ఇక్కడ ప్రమాణమంటే ఒక వస్తువు యొక్క విలువ లేదా ఉపయోగము. ధాన్యము నుండి బియ్యం చేసి వండితే అది ఆకలి తీరిస్తుంది. ఇదే ధాన్యము యొక్క సరైన ప్రమాణము. అలాకాక దాచితే పురుగులు పట్టి పనికిరాకుండా పోతుంది. అంటే ధాన్యమును వెంటనే ఉపయోగించాలి, దాచడానికి పనికిరాదు అని తెలుస్తోంది. ఇదే సరైన ప్రమాణము. అంటే వెంటనే

Patanjali Samaadhi Paada First Prakarana (Slokas 1-11)

Image
మొదటి ప్రకరణము: ఐదు మూల ప్రవృత్తులు 1 అథ యోగానుశాసనమ్ By స్వామీ వివేకానంద ఇక ఏకాగ్రత లక్షణాల గురించి చెప్పుకుందాం 2 యోగశ్చిత్తవృత్తి నిరోధః చిత్తవృత్తులను నిగ్రహించటమే యోగం (చిత్తం = అంతఃకరణం) నాకు కన్నులున్నాయి. కాని, అవి తమంత తామే చూడలేవు. మెదడులో నేత్ర నాడీ కేంద్రము౦టుంది; దాన్ని తీసివేయండి. కన్నులు మామూలుగానే ఉంటాయి. రెటీనా (నేత్రా౦తఃపటలం) కూడా చక్కగానే ఉంటుంది. దానిపై ప్రతిబింబాలు పడుతూనే ఉంటాయి. అయినా సరే, కన్నులు రూపాలను చూడలేవు. కాబట్టి కన్నులు అప్రధాన సాధనాలు; అవి చూసే ఇంద్రియాలు కావని తేలుతోంది కదా! మెదడులోని ఒక నాడీ కేంద్రంలో ఈ చూసే ఇంద్రియము౦టుంది. కన్నులున్నంత మాత్రాన చూపు౦టుందని చెప్పలేం. ఒక వ్యక్తి కన్నులు తెరచుకొని నిద్రిస్తున్నాడు. చుట్టూత మంచి వెలుతురుంది. వెలుపలి వస్తువుల నుండి ప్రతిబింబాలు కూడా ఏర్పడుతున్నాయి. అయినా వస్తువు కనిపించదు. కారణమేమిటంటే వీటికి తోడుగా మరొకటి ఉండాలి. అదే మనస్సు. ఇంద్రియంతో మనస్సు సంయోగం చెందాలి. అప్పుడే వస్తువు కనిపిస్తుంది. కన్న