Posts

Showing posts from December, 2022

Upanishat Index

Image
The following upanishat's have been translated by me based on the Prof.Eknath Easwaran's book on Upanishat's. Seven other upanishat's have also been translated but pending review. I will post them in the near future. At a time when Telugu language is getting side-lined it is extremely important to keep it alive. With the translation of Vemana's, Prof.Eknath Easwaran's Gita, and Prof.Eknath Easwaran's Upanishat's some of my life's goals are met. However there is more to do. As poet laureate Robert Frost said "And miles to go before I sleep", I am on a mission. Please wish me luck. Your patronage is gratefully acknowledged. ఈ క్రింది ఉపనిషత్తులు ప్రొఫెసర్ ఏకనాథ్ ఈశ్వరన్ సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువాద౦ ఆధారంతో తెలుగులోకి నాచే  అనువాదము చేయబడినవి.  ఇంకా కొన్ని, అంటే ఏడు ఉపనిషత్తులు, కూడా నాచే అనువదింపబడినవి. ఉపేక్ష ఎందుకంటే వాటిలో ఎటువంటి తప్పులు ఉండకూడదని నా ప్రయత్నం. కొద్ది కాలంలోనే వాటిని కూడా వల/వెబ్ లో  పెట్టడం జరుగుతుంది. మ

Paramahamsa Upanishat

Image
పరమహంస ఉపనిషత్ పరమహంస ఉపనిషత్ భక్తుడు లేదా భిక్షువు ధరించే వస్తువులు సాధకునికి అవసరంలేదని చెపుతుంది. యజ్ఞయాగాదులు చేసే సంసారికుల వలె, అవి వాని స్వతంత్రకు, ప్రేమకు, జ్ఞానానికి ఊతనిచ్చే సాధనములై అంతర్ముఖుడ్ని చేస్తాయి. ఈ విధంగా ఉపనిషత్ చెప్పే ఆధ్యాత్మిక విషయాలు భౌద్ధులు చెప్పినట్లు లేదా కబీర్ దాస్ చెప్పిన గీతాలవలె ఉంటాయి. Sloka#1 ఒకసారి నారద మహర్షి బ్రహ్మాన్ని ఇలా సంభోదించెను: "తమరి పరిస్థితి ఎలా ఉన్నది?" బ్రహ్మన్ ఇలా జవాబిచ్చెను: నన్ను చేరడం అతి దుర్లభం. కోటికొక్కరు నన్ను చేరుతారు. కానీ ఒక్కడైనా చాలు. ఎందుకంటే అతడు పురాణాల్లో చెప్పబడే శుద్ధమైన పరమాత్మ. అతడు నిజానికి మహోత్కృష్టుడు. ఎందుకంటే అతడు సదా నన్నే తలచి సేవ చేస్తాడు. కాబట్టి నేను అతని ద్వారా తెలియబడతాను. Sloka#2 అతడు అన్ని బంధాలను విడనాడి, ఎటువంటి యజ్ఞాలు, యాగాలు ఆచరించడు. అతని స్వీయ వస్తువులు అతి తక్కువగా ఉంటాయి. మరియు పరోపకారనికై జీవిస్తాడు. Sloka#3 అతనికి దండము, శిరోముండనము, జంధ్యములు లేవు. అతడు మిక్కిలి చలి లేదా మిక్కిలి ఉష్ణాన్ని, సుఖదుఃఖాలను, మానావమానాలను శాంతంగా అనుభవిస

Katha Upanishat

Image
కఠ ఉపనిషత్ మొదటి భాగము ఒకానొకప్పుడు వాజస్రవసుడు తన ఆస్తినంతటిని ఉత్తమ గతులకై దానము చేయుచుండెను. అతనికి నచికేతుడనబడే కొడుకు గలడు. నచికేతుడు శాస్త్రముల మీద అపారమైన శ్రద్ధ గలవాడు. తన తండ్రి ఇస్తున్న దానాలను చూసి నచికేతుడు "పాలు ఇవ్వలేని గొడ్డు ఆవులను దానమిస్తే ఏమి పుణ్యం ?" అని తలచెను. తన తండ్రిని "నన్ను ఎవరికి దానం చేస్తావు?" అని పదే పదే అడిగెను. కృద్ధుడైన తండ్రి "నిన్ను యమునికి ఇస్తాను" అని పలికెను. నచికేతుడు ఇలా ఆలోచించెను: "నేను ప్రప్రథముడుగా -- ఎంతో మంది పూర్వము మరణించినప్పటికీ--యమలోకానికి వెళ్ళి యముని చూస్తాను" "నా పూర్వీకులు ఎలా ఉన్నారో, ప్రస్తుతం ఉన్నవారి గతి ఏమిటో తెలిసికొంటాను. జొన్న గింజ పరిపక్వము చెంది నేల మీద పడి మొక్కగా మొలుస్తున్నట్లు" నచికేతుడు యమలోకానికి వెళ్ళెను. కానీ యముడు అక్కడ లేడు. మూడు రోజులు తరువాత యముడు తిరిగివచ్చి ఇలా పలికెను: "ఒక ఆధ్యాత్మిక అతిథి ఇంటికి వచ్చినపుడు, ఒక ప్రకాశవంతమైన జ్యోతిలా అతనిని ఆహ్వానించి, కాళ్ళు కడుక్కోవటానికి జలమివ్వాలి. అలా చే

Tejobindu Upanishat

Image
తేజోబిందు ఉపనిషత్ తేజోబి౦దు ఉపనిషత్ అన్ని ఉపనిషత్తులకన్నా చిన్నది. దీనికి ఆది శంకరులు భాష్యం వ్రాయలేదు. అలాగని దీనిని చిన్న చూపు చూడడానికి అవసరం లేదు. ఇది ప్రపంచానికి అతీతంగా ఉండే దానిని మనకు రామాయణ, భారతాది గ్రంధాదులను చదివే అవసరం లేకుండా సాధన ద్వారా పొందే మార్గాన్ని చెపుతుంది. Sloka#1 ప్రజ్వలమైన బ్రహ్మం గూర్చి ధ్యానం చేద్దా౦. అది సదా మారే సృష్టిలో మార్పులేనిది; సమాధిలో హృదయంలో తెలిసికోబడేది sloka#2 జీవితంలో ఉత్కృష్టమైన లక్ష్యం సాధించడానికి సాధన అవసరం. దానిని వివరించడం మిక్కిలి కష్టం, మరియు సాధన అంతకన్నా కష్టం Sloka#3 ఎవరైతే తమ ఇంద్రియాలను కట్టడి చేస్తారో, కోపతాపాలు లేకుండా ఉంటారో, అహంకారంలేకుండా ఉంటారో, ఇష్టాయిష్టాలకు అతీతులో, బంధుమిత్రులతో స్వార్థ పూరిత బంధాలు లేకుండా ఉంటారో వారే సమాధిని పొందగలరు Sloka#4 ఎవరైతేధ్యానంలోని మూడు అవస్థలలో సవాలు తరువాత సవాలును ఎదుర్కొంటారో వారికి సమాధి పొందడం సాధ్యం. వారు ఒక గురువు వద్ద నుంచి బోధ పొంది బ్రహ్మంతో ఐక్య మవుతారు. అట్టి బ్రహ్మమే సర్వాంతర్యామి అయిన విష్ణువు. Sloka#5 త్రిగుణాలు అతని నుండి ఆవిర్భ