Posts

Showing posts from February, 2024

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 50-51)

Image
రెండవ ప్రకరణము 50 తజ్ణః సంస్కారో అన్య సంస్కారప్రతిబన్ధీ తత్‌ + జః = దాని నుండి పుట్టినట్టు సంస్కారః = సంస్కారము అన్యసంస్కారః =ఇతర విషయ వాసనలను ప్రతిబన్ధీ = తొలగించును దీని వలన కలుగు సంస్కారము యితర విషయ వాసనలను తొలగించును అట్లు చేయు సాధనవలన ఉత్తమ సంస్కారములు మేల్కొని, మిగిలిన విషయ వాసనలు తొలగిస్తాయి. అనగా "తాను" సత్యమందుండడం నభ్యసంచినవారికి, ఇంద్రియములు క్రమేణా అంతర్ముఖమవుతాయి. దీని వలన విషయములయొక్క అస్తిత్వము క్రమేణా నశిస్తుంది. విషయములను కూడ తనలోని భాగములుగా చూచును. ఇచ్చట విషయముల యొక్క అస్తిత్వము నశించుట అ౦టే విషయములు విస్మరించుటకాదు. నది సముద్రమున కలియుచున్నప్పుడు నది యొక్క అస్తిత్వము నశిస్తుంది, కాని నది నశింపదు. నది సముద్రములో భాగముగా ఉంటుంది. నదులన్ని వేరువేరు ప్రవాహములుగా సముద్రమును చేరుతాయి. ఇక్కడ ఒక్కొక్కనది నీటి యొక్క రంగు, రుచి మారవచ్చు. కాని సముద్రములో కలిసిని వెనుక వాటి యొక్క ప్రత్యేకత నశించి, రంగు, రుచి, విషయములన్నీ సత్యమునందుచేరిన వెనుక సత్యమై ఉంటాయి గాని విషయములుండవు.

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 44-46)

Image
రెండవ ప్రకరణము 44 ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మ విషయా వ్యాఖ్యాతా ఏతయా + ఏవ = ఈ విధముగానే సవిచారా = ఆలోచనతో కూడినది నిర్విచారాచ = ఆలోచనలేని స్థితి కూడా సూక్ష్మవిషయా = సూక్ష్మ విషయములతో కలసి వ్యాఖ్యాతా = వ్యాఖ్యానము చేయబడినది ఇప్పుడు తర్కముతో కూడినది, సూక్ష్మ విషయములతో కూడిన తర్కము అక్కరలేనిది, అను రెండు స్థితులు వ్యాఖ్యానము చేయబడుచున్నవి పై సూత్రములలో చెప్పబడిన రెండు స్థితులు మరల ఇంకొకసారి ఇక్కడ చెప్పబడుతున్నాయి. మొదటి విధానమున యోగి ఉండే స్టితి 42 వ సూత్రములో వివరింపబడి౦ది. అటువంటి యోగికి పదములు, వాటి అర్థములు, వస్తువులు మొదలైనవి అర్థములుగా ఉంటాయిగాని వాటివలన యోగికి వికల్పములేదు. యోగి ఉదాసీనుడై తాను కేవలము పరిస్టితులయందు తదను గుణముగా ప్రవర్తిస్తూ, రాగద్వేషములకు అతీతుడై ఉంటాడు. కాని ఇటువంటి స్థితిలో విషయములు, వాటి అర్థములు, వాటియందు తన ప్రవర్తన అట్లే ఉంటుంది. కాని వాటి వలన తాను రాగద్వేషములు పొందడం జరగదు. రెండవ విధానమునందు యోగికి పదములు, అర్థములు లేవు. అనగా విషయ వాసనలేదు. సర్వము అంతర్యామి యొక్క

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 47-49)

Image
రెండవ ప్రకరణము 47 నిర్విచార వై శారధ్యే ఆధ్యాత్మ ప్రసాదః నిర్విచార = చింతలేనిస్టితి (ప్రశాంతత) వైశారధ్యే = సాధించుటయందు అధ్యాత్మప్ర = ఆత్మ ప్రసన్నత సాదః (మనస్సు నందు) చింతలులేని స్టితి సాధించుట వలన ప్రసన్నత వాని ఆత్మను అధిష్టించి యుండును. ఒక విషయము గురించి ఆలోచిస్తున్నపుడు మనస్సు విషయగతమై ఉంటుంది. అ౦టే అది తన ను౦డి వేరుగా యుండినట్టి స్థితి. మనస్సు ఆలోచించు విషయములుగా పరిసరములోనికి చెదిరిపోతుంది. కనుక మనస్సు తనలోని భాగముగాక ఇతరముగా ఉంటుంది. అలా గాక ఏదయినా ఒక విషయములోనికి, దాని తత్వవిచారణ చెయ్యాలి. అది ఎలా౦టిది, ఎక్కడ పుట్టి౦ది, దేని నుండి పుట్టి౦ది ధ్యానము చేయాలి. ఒకడు ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. ఇల్లు అంటే ఏమిటి? దేనిచే కట్టబడి౦ది? దాని ప్రయోజనమేమిటి? అని ఆలోచించే వానికి ఇల్లు యున్నవాడు, లేనివాడు, ఇద్దరు సుఖముగానే జీవిస్తున్నారని తెలిస్తుంది. ఇంటని కట్టిన రాళ్ళు, సున్నము, మొదలగునవి భూమినుండే, సాధింపబడినవని, తన శరీరముగూడ అలాగే వచ్చినది అని తాను జీవించుయుండే వరకు పరిస్థితులు అనుకూలిస్తే తన యింటిలో తాను న

Vidura Neeti Index

మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుని మంత్రిగా కౌరవ-పాండవ యుద్ధాన్ని నివారించడానికై బోధ చేస్తాడు. ఈ సంభాషణని శ్రీ పురాణపండ రామమూర్తి గారు 1961 లో తెలుగులోకి అనువదించేరు.దీనిలో అనేక నీతి వాక్యాలు పొందు పరిచేరు. వాటిలో చాలామటుకు నేటికీ వర్తిస్తాయి. చదివి తరించండి. విదుర నీతి Part 1 విదుర నీతి Part 2 విదుర నీతి Part 3 విదుర నీతి Part 4 విదుర నీతి Part 5 విదుర నీతి Part 6 విదుర నీతి Part 7 కొన్ని ముఖ్యమైన విదుర నీతులు చక్కనివాక్కులు గలవాడు, తర్కమెరిగిన వాడు సమయస్పూర్తిగలవాడు అవసరమెనచోట శాస్త్రమును చెప్పగలవాడు విషయమును త్వరగా నెరుగువాడు, మేలు చేయువాడు, కీడుచేయనివాడు పండితుడనబడును. శాస్తజ్ఞానము లేక పలవరించువాడు గాలిమేడలు కట్టువాడు అధర్మపనులతో ఆభరణములను కొనువాడు, తన పనిని వదలుకొని లోకవ్యవహారమున మెప్పుకై చరించువాడు, సదా సంశయములు గలవాడు, తొందరపనులను ఆలస్యముగా చేయువాడు, పిలువకనే పోవువాడు, అడుగకప

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 42-43)

Image
రెండవ ప్రకరణము 42 తత్రశబ్ధార్థజ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః తత్ర = అక్కడ శబ్ధార్థజ్ఞాన వికల్పైః = శబ్దముల అర్థములు, జ్ఞానములు అను రెండింటి వికల్పముచేత సంకీర్ణ = కలసివున్నట్టిది సవితర్కా = వితర్కములతో కూడినట్టిది సమాపత్తిః = సామ్యమైనట్టిది అచ్చట శబ్దముల అర్హము, వికల్పము అను రెండు స్థితుల యందు నిలిచియుండును. అది కూడా యోగికి సామ్యస్టితియే. పదములు, వాని అర్థములనేవి అందరకున్నట్లే యోగికి కూడా ఉంటాయి. ఆ వస్తువులున్నా, లేకున్నా వాటి అస్తిత్వము, పరోక్షత అనేవి యోగిపై ప్రభావము కలిగింపలేవు. నూతనముగా వివాహమైన వానికి భార్య దగ్గర లేకున్నా, ఆమె ప్రసక్తి వచ్చినప్పుడు వానికి సంతోషము, పులకరింత కలుగును. ఇచ్చట భార్య అను పదము వట్టి పదమే తప్ప దానికి అస్తిత్వము లేదు. అనగా దాని అర్హములో సత్యము లేదు. ఇలాంటి వాటి యందు యోగి ప్రత్యేక భావములను యూహలను కలిగియుంటాడు. ఎవరైనా, నీకు ఆశ్రమ నిర్మాణమునకై ఒక లక్షరూపాయలు ఇస్తానంటే, యోగికి దానిపై ప్రభావము లేదు. అనగా అతడిచ్చేవాని దాతృత్వబుద్దిని మెచ్చుకొ౦టాడే గానీ ఇచ్చుటను గూర్చి