Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 25

Bhagavat Gita

7.25

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః {7.30}

ప్రయాణకాలే అపి చ మాం విదు ర్యుక్తచేతసః

అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము నేనే అని ఎవరు గ్రహించుచున్నారో వారు మరణకాలము నందు కూడా మనస్సును నా యందుంచి నన్నెరుగుదురు ఀ

ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం అవలంబించి, ధ్యానము చేయుదురో వారికి జగతియొక్క ఏకత్వము విదితమగును. చివరగా దేవుని అన్నిటియందు చూచెదరు: ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, జంతువులు, పక్షులు, మనుష్యులు వగైరా. దేవుని ఇట్లు చూడువానికి గాలి చెట్లను కదిలించు శబ్దము దేవుని గుసగుసలుగా తలచును; సముద్ర కెరటాలు చేయు శబ్దము మంత్ర జపముగా వినును. ప్రతీదీ శ్రీ కృష్ణుని మయ౦.

ఈ విధముగా చేతన మనస్సులో భగవంతుని ధ్యానించు వానికి మరణముయందుకూడా చేతనమును విడువడు. నా అమ్మమ్మ రోజూ ఉదయాన్నే శివుని గుడికి వెళ్ళి, ఒక పుష్పాన్ని తెచ్చి నా చెవి వెనక పెట్టి "నువ్వు మార్కా౦డేయుడవంటి భక్తుడివి అవ్వు" అని దీవించేది.

మార్కా౦డేయుని తలిదండ్రులు శివభక్తుడిని తమకు బిడ్డగా ఇవ్వవలసిందిగా ఘోర తపస్సు చేసేరు. దానికి ప్రతిఫలంగా మార్కా౦డేయుడు వాళ్ళకి బిడ్డగా కలిగేడు. కాని అతడు పదహారవ ఏట మరణిస్తాడు. వారు కోరినట్టే మార్కా౦డేయుడు గొప్ప శివ భక్తుడయ్యాడు.

వాని 16 వ జన్మ దినము నాడు తలిదండ్రులు యముడు వచ్చి అతనిని తీసికివెళ్తాడని చెప్పేరు. మార్కా౦డేయుడు శివునిని ధ్యానిస్తూ ఉండగా యమధర్మరాజు రానే వచ్చేడు. అంతలోనే శివుడు ప్రత్యక్షమై "నా పాదాల మీద పడి రక్షణ కోరేవారు నీ వసులు కాలేరు" అని చెప్పి మార్కా౦డేయుడిని తలపై తన అభయహస్తం ఉంచి "మార్కా౦డేయుడు నా శక్తి వలన జరామరణ వర్జితుడైనాడు" అని దీవించెను. 87

Eknath Gita Chapter 7 Section 24

Bhagavat Gita

7.24

జరామరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే {7.29}

తే బ్రహ్మ తత్విదుః కృత్స్న మధ్యాత్మ౦ కర్మచాఖిలమ్

ఎవరు నన్ను ఆశ్రయించి జనన మరణములను పోగొట్టు కొనుటకు యత్నించుచున్నారో వారు పరబ్రహ్మ స్వరూపమును, తమ ఆత్మను , సకల కర్మమును తెలిసికొనుచున్నారు

నేను ఒకరోజు బడినుంచి ఇంటికి వచ్చినప్పుడు నా అమ్మమ్మ ఎందుకు విచారంగా ఉన్నావని అడిగింది. "నేను ఒక దుర్వార్త విన్నాను. మా భూగోళ శాస్త్రం తరగతిలో సూర్యునితో పోలిస్తే మనము అల్పాతి అల్పం అని ఉపాధ్యాయుడు చెప్పేడు" అని అన్నాను. దానికి అమ్మమ్మ నవ్వి "సూర్యుడు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోతాడు. కానీ నువ్వు నేను ఎన్నటికీ ఉండేవారమే" అని అంది.

మనము పుట్టలేదు, మరణించబోము. మన ఆత్మ శ్రీకృష్ణుడు చెప్పినట్లు, ఒక పాత శరీరాన్ని వదిలి క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి సూర్యుడు మనతో పోలిక పెడితే ఒక యుక్త వయస్కుడు. ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు 500 కోట్ల సంవత్సారల క్రింద పుట్టేడని. భవిష్యత్తులో కొన్ని వందల కోట్ల సంవత్సరాల తరువాత సూర్యుని లోని హీలియమ్ అనబడే ఇంధనం అయిపోయి సూర్యుడు ఆరిపోతాడు. ఈ సృష్టిలో పుట్టినది గిట్టుతుంది. మరణించినది మరల పుడుతుంది. కానీ ఆత్మ ఎన్నటికీ ఉంటుంది. అది అన్నిటినీ చూసే సాక్షి.

ధ్యాన అభ్యాసము చివరి స్థితిని సమాధి అంటారు. అ స్థితిలో మనము చేతన మనస్సుకు అతీతమై, మన శరీరము అందరి మేలుకై ఇవ్వబడిన పని ముట్టని తెలిసికొ౦టాము. నెహ్రూ మహాత్మా గాంధీ గురించి ఇలా అన్నారు: "ఆయన ఎక్కడ కూర్చొంటే అక్కడ గుడి వెలుస్తున్నట్టే. ఆయన ఎక్కడ అడుగుపెడితే అది పుణ్యక్షేత్రం అయినట్టే". మనము కూడా ఇతరుల సంక్షేమానికై పాటుబడి మనవంతు కర్మ చెయ్య వచ్చు. బుద్ధుడు దీనినే బహుజనహితాయ, బహుజనసుఖాయ --అనగా అనేక మంది సంక్షేమానికై, అనేకమంది సుఖానికై -- అని చెప్పెను. 86

Eknath Gita Chapter 7 Section 23

Bhagavat Gita

7.23

యేషాం త్వంతగతంపాపం జనానా౦ పుణ్య కర్మణాం {7.28}

తే ద్వంద్వమోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః

ఏ పుణ్యాత్ములు పాప రహితులగుచున్నారో వారు ద్వంద్వ మోహము లేనివారై, నిశ్చల భక్తులై నన్ను సేవించుచున్నారు ఀ

శ్రీకృష్ణుడు ద్వంద్వములగూర్చి ఇంకా చెబుతున్నాడు. ద్వంద్వములు -- మంచి-చెడు, దుఃఖము-సుఖము-- మాయ వలన కలుగుచున్నవి. మన అహంకారం ఈ ద్వంద్వాలతో పనిచేస్తుంది. ప్రతి దేశంలోనూ, సమాజంలోనూ ఎవడో ఒకడికి తక్కువ అహంకార ముండి ఇతరులయందు దయ కలిగి ఉంటాడు. ఒక్కొక్కప్పుడు మామిడి పండు ముట్టుకుంటేనే దానిలోని టెంక బయటకు వస్తుంది (ఉదాహరణ రసాలు). కానీ బంగినిపల్లి మామిడిపండులోని టెంక కత్తితో కోస్తే గాని తెలియబడదు. మన ఇష్టాయిష్టాలకు లోబడితే బంగినిపల్లి మామిడి పండులాగే కత్తిని ఉపయోగించాలి. శ్రీ రామకృష్ణ మనము ఒకరిపై పూర్తిగా ఆధారపడనక్కరలేదు అని చెప్పేరు. అంటే మనమే ఇతరులపై ఆధారపడడానికి నిశ్చయించుకొన్నాం.

మనమెంత ఇష్టాయిష్టాలను మార్చుకోగలమో , ఇతరులలో శుద్ధమైన, నిస్వార్థమైన ఆత్మను చూడవచ్చు. ఇది చాలా కష్టమైనది. కొందరు చీకాకుతో, అహంకారంతో ఉంటారు. అటువంటివారిని విమర్శించుటకంటే, వారిలోని మంచి గుణాలను --దయ, ఉదారత, నిస్వార్థం మొదలైనవి-- కొనియాడవచ్చు.

కొంతమంది కంట్లో నలకవంటి వారు. ఒక యోగి అట్టివారినుండి ఎంతోకొంత నేర్చుకొంటాడు: సహనం, క్షమ, ఇష్టాయిష్టాలనుండి విముక్తి. వారు అడిగేది: "మీరులేకపోతే నేను సహనం ఎలా పొందగలను? నేను ఇతరులను క్షమించడాన్ని ఎలా నేర్చుకొంటాను?" 85

Eknath Gita Chapter 7 Section 22

Bhagavat Gita

7.22

ఇచ్చా ద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత {7.27}

సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప

అర్జునా! రాగద్వేషములచే కలిగిన ద్వంద్వములచే మోహింపబడి సకల ప్రాణులు పుట్టుక తోడనే మోహమును పొందుచున్నవి

మనకు దుఃఖము రెండు విధాలుగా కలుగుతుంది: కావలసిన వస్తువు రాకపోతే, వద్దనుకునే వస్తువు వస్తే.

కఠోపనిషత్తు ప్రేయ మరియు శ్రేయ అను పద ప్రయోగము చేయును. ప్రేయ అనగా ఇప్పుడు ఆనందంగా ఉండి, భవిష్యత్తులో అభద్రత, ఇబ్బంది కలిగించేది. శ్రేయ అనగా ప్రస్తుతం ఇబ్బంది కలిగించినా, కాల క్రమేణా మంచి చేసేది. మనము జీవితమనే కళలో ఎంత వెనకబడి ఉన్నామంటే: మనకి క్షణిక సుఖమిచ్చి, శాశ్వతముగా నష్టమిచ్చే వస్తువులను పోగుచేసుకొ౦టున్నాము. అలాగే ప్రస్తుతం కొంత ఇబ్బంది కలిగించి శాశ్వతమైన సుఖమివ్వగల వస్తువులను జార విడుచుకొంటున్నాము.

మనము చాక్లెట్ తినడానికి ఇష్ట పడతాం. ఒకటి లేదా రెండు చాక్లెట్ లు తినడంవలన క్షణిక సుఖ౦ కలుగుతుంది. దానిని అదే పనిగా తింటే పళ్ళుపుచ్చుతాయి, శరీరంలో కొవ్వు పెరుగుతుంది. మనమెలాగ చాక్లెట్ ను కోరుకున్నామో, అలాగే ఆకుకూరలు, సేంద్రీయ కూరగాయలు కొంచెం ప్రయత్నించి ఇష్టమైనవిగా చేసికోవచ్చు.

ద్వంద్వములలో అన్నిటికన్నా ఇష్టాయిష్టాలు ఎక్కువ ప్రభావం కలిగి ఉంటాయి. అలాగే సుఖ-దుఃఖాలు, చలి-వేడి మొదలైనవి.

మనము ఇష్టాయిష్టాలను అధిగమించాలంటే ఇతరులకు ఆనందాన్ని కలిగించే పనులు చెయ్యాలి. ఉదాహరణకి మనమొక ఉద్యోగం ఇచ్చే జీతం లేదా హోదా కన్నా, దానివలన కలిగే పరోపకారం బట్టి ఎన్నుకోవచ్చు. అలాగే మనకయిష్టమైన వంట ప్రయోగం మన భాగస్వామి చేస్తే తినడానికి ప్రయత్నించడం, లేదా పిల్లలతో ఆడుకోవడం వంటివి మనకి ఆనందం వెంటనే ఇవ్వకపోయినా చేయడం మంచిది. 83

Eknath Gita Chapter 7 Section 21

Bhagavat Gita

7.21

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున {7.26}

భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన

అర్జునా! నేను భూత వర్తమాన భవిష్య ద్విషయములు నన్ని౦టిని తెలియుదును. కాని నన్ను మాత్ర మేవరును ఎరుగరు

ఖగోళ శాస్త్రజ్ఞులు ఒకప్పుడు పాల పు౦తే విశ్వమనుకొన్నారు. నేటి శాస్త్రజ్ఞులు అటువంటి పుంతలు, నక్షత్ర వీధులు కోట్లాను కోట్లు ఉన్నాయని గ్రహించేరు. అలాగే మన సూర్యుడు అనేక కోట్ల నక్షత్రాలలో ఒకటని గ్రహించేరు. ఇదే శాస్త్రాని కున్న లక్షణము. దానికి అంతులేదు. అది ప్రయత్నము చేసి, తక్కువ లేదా ఎక్కువ అంచనా వేసి, సరిదిద్దుకొంటుంది.

భౌతిక శాస్త్రము ప్రకృతికే పరిమితమైనది. శాస్త్రజ్ఞులు ఒక పదార్థాన్ని విభజించి దాన్ని విశ్లేషిస్తారు. కాబట్టి దాని వలన సంతృప్తి రాదు. అది కెరటాల గురించి విపులంగా చెప్తుంది కాని, వాటి క్రిందనున్న మహా సముద్రాన్ని గాంచలేదు. శ్రీకృష్ణుడు లోకాలను మెడకి పూసల దండగా వేసికొన్నాడు. శాస్త్రజ్ఞులకు తెలిసింది ఒకటి లేదా రెండు పూసల గురించి. ఒక్కక పూస మనం ఊహించలేని విశ్వమై ఉన్నది. ఇటువంటి పూసలు లెక్కపెట్టలేనన్ని. నిజంగా శ్రీకృష్ణుని పూసల దండకి ఆద్యంతాలు లేవు. యోగుల సాధన ఆ దండ వేసికొన్నవానిని పొందుటకు.

సృష్టిని తెలిసికోవాలంటే సృష్టి కర్తను తెలిసికోవాలి. ఎందుకంటే అతడే అన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించేడు. అతడు శాస్త్రజ్ఞులు కనుక్కొ౦టున్న సూత్రాలకి మూలము. ఉపనిషత్తులు అడుగుతున్నాయి "ఎవరిని తెలిసికొ౦టే తక్కిన వన్నీ తెలియబడతాయి?" అదే జ్ఞానము. దాని సూత్రాలను మార్పు చేయ నవసరము లేదు. ఖగోళ శాస్త్రమునకు సంబంధించిన పుస్తకాలను కాల క్రమేనా మార్పులు చెయ్యాలి. కాని భగవద్గీత వంటి శాస్త్రము మార్పు చేయ నవసరములేదు. ఈ శాస్త్రము చెప్పే విలువలు--ఉదాహరణకు సహనం-- చిరకాలం ఉన్నవి, ఉండేవి. ఐదు వేల సంవత్సరాల తరువాత మనము ఇంకొక సౌర్య కుటుంబానికి వెళ్ళి, అక్కడ సముద్ర గర్భంలో నున్న హోటల్ లో భోజనం చేయవచ్చేమో. శాంతి కావాలంటే సహనం ఉండాలి. 81

Eknath Gita Chapter 7 Section 20

Bhagavat Gita

7.20

నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః {7.25}

మూఢో అయం నాభిజానాతి లోకో మా మాజమవ్యయమ్

యోగమాయచే కప్పబడి యుండుట చేత నేను అందరికి గోచరించువాడను కాను. అజ్ఞానులగు ఈ మానవులు నన్ను పుట్టుక లేని వానినిగ, నాశము లేని వానినిగ ఎరుగరు

మనమొక ప్రత్యక్ష సినిమా షూటింగ్ కి వెళ్ళేమనుకోండి. అక్కడ తారలందరూ మొహానికి రంగు పూసుకొని, వింత వింత వేషధారణాలతో చాలా అందంగా ఉండి మనను మైమరిపిస్తారనుకోండి. షూటింగ్ తరువాత వారు తమ రంగు తుడుచుకొని, తమ స్వంత దుస్తులు వేసికొని వస్తే మనము వాళ్ళను గుర్తించలేము.

మనము అ షూటింగ్ కొన్ని రోజులుగా కదలకుండా చూస్తే బయట ప్రపంచం గుర్తుకు రాదు. సమయమంతా సినిమాలు ఎలా తీస్తారో అన్న అంశం మీద వెచ్చించి వారి కేమెరాలు, దుస్తులు, రంగులు మొదలైన వాటిని అవగాహన చేస్తాం. ఎవరైనా బయటకెళదాం అంటే మనం ఇంతకన్నా వేరే ప్రపంచమేముంది అంటాం.

మన శాస్త్రాలు పెద్ద పాలపుంత నుంచి మన దేహం వరకు, సదా మారుతూ ఉన్న శక్తి మాయ అంటాయి. దాని వలన ప్రకృతి అంతా మాయ. అంటే అన్ని పదార్థాలు, మనస్సు, అహంకారం మారుతూ ఉంటాయి. కాలగమనం కూడా నిజంకాక మన మనస్సు వలనే జరిగి మాయకు లోబడి ఉంది. మనకి కనిపించే విశ్వం సంపూర్ణంలో ఒక చిన్న భాగము మాత్రమే. అది కలగానే వాడికి కల ఎంత నిజమో, అంత నిజము. కాని అది కలలాగే ఉండి, దాని నుంచి మేల్కొనవచ్చు.

మనము జీవితమనే కలనుంచి మేల్కొనడానికి ఇష్టపడం. నిజానికి మేల్కొనడం అంటే ఏమిటో తెలీదు. యోగులు చెప్పేది: మనకి ఆధ్యాత్మిక ఆనందం పొందాలనే అభిలాష ఎక్కువవుతున్న కొలదీ, మన కల పాతబడి, మనం ఆనందమయ స్థితిలో మేల్కొంటాం. శ్రీ రామకృష్ణ దేవత క్రీగంట చూపుతో మనవైపు చూస్తే మాయ పఠాపంచలవుతుందని చెప్పేరు.

ఒకమారు నారదుడు, శ్రీకృష్ణుడు వనంలో నడుస్తున్నారు. శ్రీకృష్ణుడు నారదుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి సమాధానంగా నారదుడు సృష్టి రహస్యం చెప్పమన్నాడు. సరేనని శ్రీకృష్ణుడు నారదుడిని పొరుగున్న గ్రామం కెళ్ళి త్రాగటానికి నీళ్ళు తెమ్మన్నాడు. నారదుడు వెళ్ళి ఒక ఇంటి తలుపు కొట్టేడు. ఒక అందమైన యువతి తలుపు తెరిచింది. నారదుడు మోహితుడై తనను పెళ్లి చేసికోమని కోరేడు. ఆమె అందుకు అంగీకరించింది. క్రమంగా నారదుడు సంసారి అయి పిల్లలను కని, మనమలు, మునిమనవులతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామానికి ఒక పెద్ద వరద వచ్చి నారదుని కుటుంబాన్నినీట ముంచేసింది. నారదుడు ఎంతో దుఃఖపడి శ్రీకృష్ణుని సహాయం కోరేడు. అంతలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై "నారదా నేను అడిగిన నీళ్ళు ఎక్కడ?" అని ప్రశ్నించేడు.

వెంటనే నారదునికి జ్ఞానోదమయి శ్రీకృష్ణుని కాళ్ళపై పడ్డాడు. ఈ విధంగా నారదుడు శ్రీకృష్ణుని మాయను తెలిసికొన్నాడు. 80

Eknath Gita Chapter 7 Section 19

Bhagavat Gita

7.19

అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్య౦తే మా మబుద్ధయః {7.24}

పరం భావ మజానంతో మమావ్యయ మనుత్తమమ్

అవ్యయమైనట్టియు, శ్రేష్ఠమైనట్టియు, సర్వోత్కృష్టమై నట్టియు నా యొక్క స్వభావమును తెలియని మూఢులు అవ్యక్త రూపుడనైన నన్ను వ్యక్త స్వరూపునిగ భావించుచున్నారు ఀ

బ్రహ్మన్ అనగా సర్వ సృష్టికి మూల కారణం. అది అవ్యక్తమై, లక్షణములు లేనిదై, శుద్ధమై ఉండేది. ఒకమారు ఆది శంకరులు గౌడపాద అనబడే యోగిని నర్మదా నది ఒడ్డున కలిసి, తనకు బ్రహ్మన్ గురించి చెప్పమని అడిగెను. ఆయన, నిర్గుణ బ్రహ్మన్ ఉపాసికుడైనందున, తన శిష్యుడైన గోవిందపాద వద్దకు వెళ్ళమని సూచించెను. గోవిందపాదుడు సగుణ బ్రహ్మను ఉపాసించినవాడై ఆది శంకరులకు గురువైనాడు.

నిర్వికల్ప సమాధి అనగా నిర్గుణ బ్రహ్మన్ యందు సంపూర్ణమైన, అఖండమైన చేతనముతో కూడిన తపస్సు. అది అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలామంది సవికల్ప సమాధి లేదా సగుణ దేవతను పూజిస్తారు. భక్తుడు తన ఇష్ట దేవతకై ధ్యానము చేసి, ద్వంద్వ ప్రపంచంతో సంబంధమును వీడక యుండును. వానికి జ్ఞానము, జ్ఞేయము మధ్య తేడా ఉంది.

మనలో చాలామందికి సగుణ దేవతోపాసన మాత్రమే సాధ్యం. మనకి నిర్గుణ దేవతపైన ఆసక్తి ఉండవచ్చు. కానీ అది సరిపోదు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం ప్రేమించగలిగే, మనకు ఆదర్శప్రాయంగా ఉండే దేవత ఉండాలి. శ్రీ రామకృష్ణ ఇట్లు చెప్పెను: పరమాత్మ సగుణ మరియు నిర్గుణుడై యున్నాడు; రూపరహితుడైన నిర్గుణ బ్రహ్మన్, భక్తునికి సగుణ రూపమున కనబడుచున్నాడు.

శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ధర్మమునకు హాని కలుగుచున్నదో తాను అవతారమును దాల్చుచున్నానని చెప్పెను. అతనికి సర్వ మానవ లక్షణాలు: నవ్వుట, ఏడ్చుట, మాట్లాడుట, తినుట మొదలగునవి ఉంటాయి. అవతార పురుషుడై పుట్టుక, మరణము పొందియున్నను అతడు నిజముగా అపరిమితుడు, అవ్యక్తుడు.

మనము దేవతలను మానవ రూపంలో ఊహించినట్టే, తక్కిన జంతువులు దేవుని తమ రూపములలో చూసుకొనవచ్చును. కాబట్టి దేవునికి ఒక స్వరూపానికే పరిమితము కాదు. మన ఇష్ట దైవము అందరికన్నా మిన్నని భావించుట వ్యర్థము. ఎందుకంటే అపరిమితమైన బ్రహ్మన్ ను, పరిమితమైన అవతారంలో బంధిస్తున్నాము. మాటలతో నిర్గుణ బ్రహ్మన్ ను పూజించడం సాధ్యం కాదు. 77

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...