Saturday, April 9, 2022

Eknath Gita Chapter 9 Section 18

Bhagavat Gita

9.18

యాంతి దేవ వ్రతా దేవాన్ పిత్రూన్ యాంతి పితృవ్రతాః {9.25}

భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినో అపి మామ్

దేవతలనారాధించువారు దేవతలను, పితృదేవతల నుపాసించు వారు పితృదేవతలను, భూతముల నారాధించువారు భూతములను పొందుచున్నారు. నన్ను సేవించెడివారు నన్నే పొందుచున్నారు ఀ

ఈ శ్లోకం యొక్క అంతరార్థ౦ మనము దేనిపై ధ్యానము చేస్తామో మనమదే అవుతాము. మనం ఒక భౌతికమైన సమస్యపై ధ్యానము చేస్తే, దానిని పరిష్కరించగలము. అలాగే ఒక మానసికమైన సమస్యను కూడా. కానీ మనం చిత్తశుద్ధి కలిగి, ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలి. శ్రీకృష్ణుడు "నీవు నాపై ధ్యానం చేస్తే నీ సమస్యలన్నిటినీ దాటగలవు" అని చెప్తున్నాడు.

రామాయణంలో రావణుడు స్వార్థానికి ప్రతీక. అతడు ఆసురులకు రాజు. అతని తమ్ముడు కుంభకర్ణుడు సోమరిపోతు. అతడు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతాడు. మనము చతికిలబడి, క్రింద కూర్చుంటే మనని కుంభకర్ణుడితో పోలుస్తారు. మనము స్వార్థపరులమైతే రావణుని తన రాజ్యానికి తీసికెళ్లమని ప్రార్థిస్తాము. మనము బ్రతికుండగానే ఏ రాజ్యానికి వెళ్లాలో నిర్ణయించుకోగలం. అలాగే మంచి మార్గములో జీవించి స్వర్గాన్ని పొందవచ్చు.

పితృదేవతలను పూజించేవారు గతంలో మునిగి ఉంటారు. మన ఇళ్ళలో అనేక తరాల వారి పటాలు వేలాడగట్టి వచ్చిన వాళ్ళ కందరికీ వారిని పరిచయం చేస్తాం. మనం బుద్ధిని ఉపయోగించి గత౦లో ఏది ఉపయోగకరమో దానిని ప్రస్తుతానికి అన్వయించి గ్రహించాలి.

శ్రీకృష్ణుడు చెప్పే భూతాలు మనలో యున్న క్రోధము, లోభము మొదలగునవి. మనమెంత చెడ్డ భావాలను కలిగియుంటే, అంత ఆ భూతాల ప్రపంచంలోకి వెళ్తాము. చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటే భయం వేస్తుంది. జుత్తును మరమ్మత్తు చేసే అనేక సంస్థలు కూడా వెలిసాయి. జుత్తు రాలిపోతూ ఉంటే, మన భద్రత తక్కువవుతుంది. నా జుత్తు కూడా రాలిపోతూ ఉంటే "పోనీ.. అంతా పోనీ" అనుకొన్నాను. కాలం నా జుత్తుని తగ్గించి ఉంటుందికాని, నన్ను కాదు.

చాలామంది భావోద్వేగంతో కూడి భయానకమైన ప్రపంచంలో బ్రతుకుతారు. వారు అనేకమైన మానసిక-శారీరిక సంబంధిత వ్యాధులచే బాధ పడుతూ ఉంటారు. వారు తాము ప్రేమించు కొనదలచిన వారి యందు కూడా పూర్తి నమ్మకం ఉంచుకోరు. అందువలన వారికి అనుబంధాలు ఉండవు. అట్టి వారు ధ్యానం వలన మంచి ఫలితాలను పొందుతారు. ధ్యానంలో దృష్టి మన సమస్యలనుండి మళ్లించి, ఇతరుల సేవకై వినియోగింపబడుతుంది. అలా సాధన చేస్తే మనం చక్కగా జీవించి, అపోహలకు దూరమవుతాము 183

Eknath Gita Chapter 9 Section 17

Bhagavat Gita

19.17

యే అప్యన్యదేవతా భక్తా యజా౦తేశ్రద్ధయా అవ్వితాః {9.23}

తే అపి మామేవ కౌ౦తేయ యజ౦ త్యవిధిపూర్వకమ్

అర్జునా! ఎవరయితే అన్యదేవతారాధకులై శ్రద్ధతో వారిని ఉపాసించుచున్నారో వారునూ దారి తప్పి నన్నే ఉపాసించుచున్నారు

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ {9.24}

న తు మామభిజానంతి తత్త్వేనాత శ్చ్యవంతి తే

సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే. అట్టి నన్ను వారు వాస్తవముగ గ్రహించుటలేదు. అందుచేత వారు పతనమగుచున్నారు

మేము భారత దేశంలోని బ్ల్యూ మౌంటైన్ దగ్గర నివసిస్తున్నప్పుడు, నేను ఒక అమెరికన్ ని కలిసేను. అతడు క్రిస్టియన్ కుటుంబంలో పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించినవాడు. అతనికి ఆధ్యాత్మికత కలిగి, తన జీవిత లక్ష్యం ఏమిటా అని వేదుక్కోవడానికి ఒక బెంగాలీ గురువు వద్ద 12 ఏళ్లు శిక్షణ పొందేడు. అతను అత్యంత ఆశ్చర్యంతో ఇలా చెప్పెను: "నేను బోస్టన్ నుంచి బెంగాల్ కి పయనమై వచ్చి, కాళీ మాతను, పరమ శివుడిని ధ్యానించేను. నా హిందూ గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఉపాసన చేసేను. కానీ నా చేతన మనసు లోతులలో కనిపించేది కృష్ణుడు కాదు శివుడు కాదు. జీసస్ క్రైస్ట్!"

మన విషయాల్లో కూడా ఒక అవతారాన్ని ఇంకొక అవతారంతో పోల్చనక్కరలేదు. ఆ ఎన్నిక భగవంతునికే వదిలివేయడం మంచిది. ఒకరు జీసస్ మీద, మరొకరు శ్రీకృష్ణుని మీద, వేరొకరు బుద్ధుని మీద ధ్యానం చేయవచ్చు. వారిలో ఎటువంటి తేడా లేదు. మనం ప్రతి దినము చిత్త శుద్ధితో, ఏకాగ్రతతో, అహంకారాన్ని వదిలి ధ్యానం చేస్తే చివరకు ఆ భగవంతునిలో లీనమవుతాము. మనము జీసస్ ని లేదా బుద్ధుని పిలిస్తే, శ్రీకృష్ణుని కూడా పిలిచినట్లే. అలాగే మనము శ్రీకృష్ణుని పిలిస్తే, జీసస్ ని లేదా అల్లాని పిలిచినట్లే. నా విద్యార్థి ఒకని పేరు శివరామకృష్ణ. నేను వానికి చెప్పేవాడిని: "స్వర్గం ఎక్కడున్నా, నీవు దానిని చేరుకొంటావు. ఏ ఒక్క నామమైనా నిన్ను తరింపజేస్తుంది"

ధ్యానం అభ్యసించే మొదట్లో మనము ఏ దేవతనూ ధ్యానించకపోయినా, అది పరిపక్వమవుతున్న కొద్దీ ఒక ఇష్ట దేవతను ఆలంబనముగా చేసికొని దానిపై మనస్సు నిలపుతాము. మనకు ఏ అవతారాన్ని ఎంచుకోవలో తెలియకపోవచ్చు. ఒక ప్రక్క అహింసా పరుడైన జీసస్, ఇంకొక ప్రక్క సర్వ జీవులయందు కరుణామూర్తి బుద్ధుడు ఉండవచ్చు. అలాటప్పుడు ఎన్నికను దేవునికి వదిలి వేయడం ఉత్తమం. ఒక్కొక్కప్పుడు కలలో మీకు ఒక దేవత కనిపించవచ్చు లేదా దైవ నామము వినిపించవచ్చు. జీసస్ ఒక మేక పిల్లను ఎత్తుకొని ఉన్నట్లు కల రావచ్చు. లేదా ఓం మని పద్మే హం అనే బుద్ధుని మంత్రము కలలో వినపడవచ్చు. అప్పుడు మీ హృదయపు లోతులలో స్పందించి మీ సంశయాలన్నీ తీరిపోతాయి. 180

Eknath Gita Chapter 9 Section 16

Bhagavat Gita

9.16

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే {9.22}

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

ఎవరు అనన్య చిత్తముతో నన్నే స్మరించుచు ఉపాసించు చుందురో, నా యందే మనస్సు నిలిపియు౦డు అట్టివారల యోగక్షేమములను నేనే వహించుచుందును

కొన్ని సంవత్సరాల క్రితం, బ్లూ మౌంటేన్ ధ్యాన మందిరము బెర్క్లీ లో ప్రారంభించక ముందు, మా వద్ద ధనమూ లేదు, సహాయం చేయగలిగే మిత్రులూ లేరు. నేను ఆహారదినుసులను తెచ్చేవాడిని, తోట పనిని చేసేవాడిని. నా భార్య క్రిస్టీన్ తక్కిన పనులన్నీ చూసుకొనేది: అంటే సెక్రెటరీ, పద్దులు వ్రాయడం, పత్రిక సంపాదకం, వంట చేయడం, నన్ను కారులో తిప్పడం, మొదలైనవి. చాలా మంది మేము మూర్ఖత్వంతో ఉన్నామని చెప్పేరు. కొంతమంది మిత్రులు మాకు బ్యాంక్ లో ఎంత డబ్బు౦దని అడిగేవారు. నాకు బ్యాంక్ అకౌంటు లేదని చెపితే నిరాశపడేవారు. "మీకు తగినంత సొమ్ము౦టేకాని మీరనుకున్నట్టు ఏదీ సాధ్యము కాదు" అని చెప్పేవారు.

"అవును. మేము ఒక్కరమే దీన్ని నిర్మాణించటం లేదు"

"అలా అయితే మీకు ఒక ప్రాయోజిత (sponsor) ఉన్నారా?"

"అవును. అందరికన్నా ఉత్తముడు"

"ఎవరు ఫోర్డ్ లేదా రాకిఫెల్లర్ సంబంధితులా?"

"అంతకన్నా ఉత్తముడు, శ్రీకృష్ణ భగవానుడు"

వారికది నమ్మశక్యంగా ఉండేది కాదు. కానీ నేను హాస్యం ఆడటంలేదు. భగవంతుడిచ్చిన అభయం ఈ శ్లోకంలోనే ఉంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో సంపూర్ణమైన భక్తితో నడిస్తే భగవంతుడు "నేను నీ ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధికి బాధ్యత వహించడమే కాదు, నీకు అవసరమైన వాటికి కూడా బాధ్యత వహిస్తాను" అని అంటాడు. అదే యోగక్షేమం వహామ్యహం అనేదానికి అర్థం.

ఏ యోగీ భగవంతుని అభయం పొంది నిరాశ చెందలేదు. మా ధ్యాన మందిరంలో ఒక హుండీ ఉండేది. మా వద్ద ఉన్న డబ్బు అయిపోతే దానిని అప్పుడప్పుడు తెరిచేవారం. ఒకానొకప్పుడు పెద్ద దాత హుండీలో పెద్ద మొత్తం వేసేడు. క్రిస్టీనా అమిత౦గా ఆశ్చర్యపోయింది. కానీ నేను ఆశ్చర్యపడలేదు. నేను అప్పటికే దేవుడు తన అభయాన్ని నెరవేర్చుతున్నాడని నమ్మేను. ఇంకొకమారు హు౦డీలోని డబ్బుతో కొన్ని కుర్చీలు కొన్నాము. అవి ఇప్పటికీ మా ఆశ్రమంలో ఉన్నాయి. మా ధ్యాన మందిరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. నేను ఆ పెరుగుదల పై శ్లోకంలోని దేవుని అభయం వలననే అని నమ్ముతాను. 178

Eknath Gita Chapter 9 Section 15

Bhagavat Gita

9.15

త్రైవిద్యా మాం సోమపాః పూత పాపా యజ్ఞ్ఐరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే {9.20}

తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్

వేదాధ్యయనము చేసినవారు యజ్ఞములచేత నన్ను పూజించి, సోమపానము చేసి, పాప విముక్తులై స్వర్గస్థితిని అభ్యర్థి౦తురు. వారు పుణ్యప్రదమగు ఇంద్రలోకమును పొంది అచ్చట దివ్య భోగముల ననుభవించుచున్నారు

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ౦తి {9.21}

ఏవం త్రయీధర్మ మనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే

వారు విశాలమగు స్వర్గలోక భోగముల ననుభవించి పుణ్యము క్షీణించగనే తిరిగి మానవ లోకమున జన్మించుచున్నారు. ఈ రీతిగ కామ్య కర్మల ననుష్ఠి౦చెడి వారు జనన మరణములను పొందుచున్నారు ఀ

స్వార్థ పూరితమైన కర్మలుచేసి, స్వర్గలోక సుఖాలను కాంక్షించువారు మరణానంతరము దానిని పొందుచున్నారు. కానీ వారు స్వర్గలోకంలో ఎప్పటికీ ఉండిపోరు. వారి పుణ్యానుసారం, పుణ్యము క్షీణించిన తరువాత, భూలోక౦లో తిరిగి జన్మిస్తారు.

ఇంద్రియములను నియంత్రించుకోక, పరోపకారానికై కాక, స్వార్థమునకై చేసిన ధ్యానము వలన దుష్ఫలితాలు రావచ్చు. ధ్యానంలో వారి చేతనపు లోతులలోంచి ఆలోచనలు ఉద్భవించి తద్వారా కోర్కెలను తీర్చికొనవచ్చు. కానీ వారు కోర్కెలను నియంత్రించుకోలేరు. వారికి మిక్కిలి ధనము, గొప్ప పేరు ప్రతిష్ఠలు, ఆయుష్షు కలుగవచ్చు. కాని వారి జీవితమునకు ఒక దిశ లేదు.

నాకు విలాసవంతంగా జీవించేవారు కొందరు తెలుసు. వారు తమ స్వంత విమానాల్లో తాము తలచుకొన్న ప్రదేశానికి వెళ్తారు. ఖరీదైన హోటల్ లలో నివసిస్తారు. వారిని వెంబడి పత్రికా విలేఖరులు ప్రశ్నలు అడగడానికి వెళ్తారు. అయినప్పటికీ కొంత కాలం తరువాత వారికి అట్టి జీవనం మీద మోజు పోతుంది. మళ్ళీ సామాన్యులుగా బ్రతకాలని కాంక్షిస్తారు. మార్లో ఫౌస్టస్ అనే నాటకంలో తన పతనాన్ని తనే తెచ్చుకొని ఫౌస్టస్ ఇలా రోదిస్తాడు:

పర్వతాల్లారా, కొండల్లారా వచ్చి నా మీద పడండి

ఆత్మా చిన్న నీటి బిందువులుగా మారి ఎప్పటికీ కనిపించకుండా సముద్రంలో పడు

కొంతమంది గురువులు ధ్యానం నేర్చుకొని ఇతరులను వశం చేసుకోండి, మీకు కావలసిన సంపదను పొందండి, అని ప్రకటనలను చేస్తారు. అవి మనను తప్పుదారి పట్టించుటకే.

ధ్యానము వలన కలిగిన శక్తిని దురుపయోగము చేసిన మిక్కిలి అపాయము కలుగును. కాబట్టి మన ఇంద్రియ నిగ్రహమును, చుట్టూ ఉన్నవారి ఆనందమును కాంక్షించి ధ్యానము చేయుట ఉత్తమం. ఇది మన రక్షణ కొరకే. 177

Eknath Gita Chapter 9 Section 14

Bhagavat Gita

9.14 తపామ్యహమ్యహం వర్షం నిగృహ్లామ్యుత్సృజామి చ {9.19}

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున

అర్జునా! నేను తపింప జేయుచున్నాను. వర్షమును కురిపించు చున్నాను. నిలుపుచున్నాను, మృత్యువును నేనే, సత్తు, అసత్తుయు నేనే

భగవంతుడు జీవితాన్ని ఇచ్చి మళ్ళీ మరణరూపేనా వెనక్కి తీసుకొంటాడు. అతడు జీవులును ఆవిర్భవించు శక్తియే గాక, వాటిలో మార్పులు, మరణము కల్పించువాడు. చివరకు మనలను మరణానికి ఆవల తీసికెళ్ళి అమరత్వాన్ని ఇవ్వగల శక్తిమంతుడు. స్వామీ వివేకానంద "మనము మరణము గూర్చి తెలిసికోగలిగితే, జీవితంయొక్క అర్థమేమిటో తెలిసికోగలం" అనెను.

ఉపనిషత్తులు బయట ప్రపంచంలో ఏది ఉందో, అది మన చేతనములో కూడా ఉంది అని చెప్పినవి. భగవంతుడు తాను కాంతి, ఉష్ణము అని చెప్పడం సూర్యుని ఒక్కని గురించేకాదు. యోగులు ధ్యానం చివరిలో అత్యంత ప్రకాశమును చూస్తాం అని చెప్పేరు. మనము నిత్యము ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉంటే ఒకానొకప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి పుంజాన్ని చూస్తాం. అది సూర్య ప్రకాశమువలె నుండి, మనలోన దాగి ఉన్న శక్తికి చిహ్నం. మన అహంకారాన్ని, మన ఇష్టం వచ్చినట్లు చేద్దామనే భావనను విడనాడితే భగవంతుడు కోటి సూర్యుల ప్రకాశంతో మనకు దర్శనమిస్తాడు. ఎవరైతే భగవంతునితో ఏకమౌతారో వారు అత్యంత ప్రకాశవంతులై, అమితమైన ఆనందంతో ఉంటారు.

ధ్యానంలో పరిపక్వత పొందుతున్న కొద్దీ భగవంతుని రాక యొక్క సూచనలు అనేకము వస్తాయ. నేను అటువంటివాటిని పట్టించుకోవద్దంటాను. ఎపుడైతే ధ్యానంలో ఒకటి జరగాలని వేచిచూస్తే, అది మనం లోతుకు వెళ్ళడానికి అడ్డంకు కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక నల్లని మేఘమును శ్రీకృష్ణునికి చిహ్నమని తలచి, దానిని ధ్యానంలో చూడడానికై "భగవంతుడా నన్ను నీ ఉపకరణముగా తీసికో. ఏది ఆ నల్లని మేఘము?" అనుకుంటే, అది నిజమైన ధ్యానము కాదు. ధ్యానంలో అనుభవించేవన్నీ నిజ జీవితంలో చూడలేము. ఒక వేళ ఒక అనుభవం ఫలిస్తే, సాధారణంగా అదే రోజు ఫలిస్తుంది. కానీ అదే పనిగా దేవుని సంకేతానికై ఎదురు చూస్తూవుంటే నిరాశ కలిగి, ధ్యానం నిరోధింపబడుతుంది.

శ్రీకృష్ణుడు నేను మీకు వర్షం ఇవ్వగలను, ఆపగలను అంటాడు. ఈ నేపథ్యంలో సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిల ఆత్మ తోట వలె నుండి, దానిపై ప్రతి రోజూ నీళ్ళు సరఫరా చెయ్యాలి అని చెప్పెను:

నాకైతే తోటని నీళ్ళతో తడపడానికి నాలుగు విధానాలు ఉన్నాయని అనిపిస్తుంది. మనము చేదతో ఒక బావినుంచి నీళ్ళు తోడవచ్చు. లేదా ఒక పుంపు పెట్టి నీళ్ళను తోటకు సరఫరా చేయవచ్చు. లేదా ఒక నదీ కాల్వలో నీరుని మళ్లించి తోటకు రప్పించవచ్చు. ఇలా చేయడం వలన తోట౦తటికీ నీరు సులభంగా అంది, మనకు శ్రమ తక్కువ అవుతుంది. కానీ అన్నిటికన్నా ఉత్తమం దేవుడు ఒక పెద్ద వర్షం కలిగి౦చి మనకు శ్రమలేకుండా తోటకి నీళ్ళు అందివ్వడం.

కొన్ని పల్లెటూర్లలో నూతినుండి చేదతో నీళ్ళు తోడుకొంటారు. ఆ చేదకి కన్నాలుంటే, నీరు నూతి అట్టడుగున ఉంటే, చేదలో ఉన్న నీరు కన్నాలలోంచి కారిన తరువాత మిగిలినది మనకందుతుంది. ధ్యానంలో ప్రవేశించేటప్పుడు మన చేదలో చాలా కన్నాలుంటాయి. దానిని క్షమతో కూడిన జలంతో నింపి తోడితే, అసహనం, చికాకు, క్రోధం, బద్దకం వంటి కన్నాల నుండి నీరు కారిపోతుంది. అది మన పట్టుదలను సడలిస్తుంది. ఎప్పటికైనా చేద నిండుగా నీళ్ళను తెస్తుందా అని అనుమానం కలుగుతుంది. ఒక్కొక్క రోజు ఆ చేదలో నీరే ఉండదు. అప్పుడు "నూతిలో నీరు లేదు" అని భావిస్తాము. తెరెసా "నూతిలో చాలా నీరు౦ది; చేదలోని కన్నాలను పూడ్చండి" అని అంటారు.

ఇలా కొన్నాళ్ళు సాధన చేస్తే తెరెసా చెప్పినట్లు, నీటిని పంపు ద్వారా వెలికితెస్తాము. ఈ రెండవ దశలో పరిశ్రమ ఉంది కాని అది కన్నాలున్న చేదకన్నా నయం. ఇలాగ మన తోట౦తటికీ అతి తక్కువ శ్రమతో నీరు తడపవచ్చు. ధ్యానం వలన లభించే మనశ్శాంతి ఆతృత లేదా కోపం వలన తరగిపోదు.

మూడవ దశలో, తెరెసా చెప్పేది, ఒక నది పాయను తోటవైపు మళ్ళిస్తే, చేద అవసరం లేదు. మనస్సు ధ్యానంలో నిశ్చలంగా చెయ్యడానికి శ్రమలేదు. నిస్వార్థమనబడే నీళ్ళు ఒక ధారగా వస్తాయి. సెయింట్ తెరెసా "ఈ స్థితిలో దేవుడు తోటమాలికి తానే తోటకి నీళ్ళుపోసి సహాయం చేయదలచుకొంటాడు. ఎలా అనగా భగవంతుడే అన్నీ చేస్తాడు". మన అవసరాలను మరచి జీవుల సమస్యలను పరిష్కరించడానికై పూనుకుంటే దేవుడు మనలోనుండి పనులు చేయిస్తాడు. మనము దేవున చేతిలో పనిముట్లమవుతాము. చివరికి తెరెసా చెప్పినట్లు దేవుని దయ వర్షం వలె కురిసి, మన తోట౦తటికీ నీరు అందుతుంది. 174

Eknath Gita Chapter 9 Section 13

Bhagavat Gita

9.13

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ {9.18}

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్

ఈ జగత్తునకు గతియు, భర్తయు, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, ఆశ్రయమును, మిత్రుడును, సృష్టిస్థితి లయ కర్తయు, నిక్షేపమును, అవ్యయ బీజమును నేనే

భగవంతుడు జీవులన్నీటికీ ఆధారము. మనము భగవంతుని మీద భక్తితో ఉంటే మన అవసరాలు, కోరికలు, తీరి స్వస్థతతో ఉంటాము. శ్రీకృష్ణుడు చెప్పేది: "నేను నీ జీవిత లక్ష్యం; నీ జీవనాధారం; నేను తప్ప వేరే యజమాని లేడు. నిన్ను అందరూ వదలి వెళ్తే నేను నీ సాక్షిని, నిజమైన గృహమును, ఆశ్రయాన్ని. నేను నీ నిజమైన మిత్రుడిని". జీసస్ "నన్ను అనుసరించు. నేనే మార్గము, జీవితము, సత్యము" అని చెప్పెను.

సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా వ్రాసెను:

ఏదీ నిన్ను కష్టపెట్ట కూడదు

ఏదీ నిన్ను భయపెట్ట కూడదు

ప్రతీదీ మారుతోంది

దేవుడొక్కడే మారనిది

సహనం గమ్యానికి చేరుస్తుంది

దేవుడ్ని నమ్మిన వానికి లేమి లేదు

దేవుడే అన్ని అవసరాలనూ తీరుస్తాడు

ఏదీ నిన్ను కష్టపెట్ట కూడదు: అంటే మనము ఎన్నటికీ చికాకు పడం. మన శక్తి వృధా కాక జీవితాంతము దేవుని సేవకై దానిని వినియోగిస్తాము

ఏదీ నిన్ను భయపెట్ట కూడదు: ప్రతి ఒక్కరి జీవితంలో విషాదం ఉంటుంది: డబ్బు, పరువు, ప్రియమైన వారిని పోగొట్టుకోవడం వంటివి. చివరకు జీవితమే అంతం అవుతుంది. మనం దుఃఖించవచ్చు, కానీ అది మనలను అణచివేయదు. ఎందుకంటే మనకు దేవునిమీద నమ్మకమున్నది.

ప్రతీదీ మారుతోంది: మనము నడి వయస్సు దాటితే, మన మిత్రుల, పెద్దల మరణ వార్తలను వింటూ ఉంటాం. కఠోపనిషత్తు "జొన్న గింజ వలె మానవుడు వృద్ధాప్యంలో రాలిపోతాడు" అని చెప్తుంది. ప్రతీదీ మార్పు చెందుతోంది. మారేది ఎప్పటికైనా మరుగున పడేదే.

దేవుడొక్కడే మారనిది: మారే ప్రపంచంలో ఒక్క భగవంతుడే మారనిది. అతనిని ఆశ్రయించి, ప్రేమించి సేవిస్తే మనము ఎప్పటికీ భద్రంగా ఉండి, ఎక్కడికి వెళ్ళినా ఆహ్లాదంగా ఉంటాము.

సహనం గమ్యానికి చేరుస్తుంది: పరిస్థితులు ఎంత విషమించినా, జీవితం ఎంత క్లిష్టమైనప్పటికీ, సహనానికి అందరూ తల వంచ వలసిందే. అది అన్ని అవరోధాలను దాటిస్తుంది. ప్రతి తుఫాను మధ్యలో మార్పులేనట్లు, మన జీవితంలో కలిగే తుఫాను వంటి క్లేశాల మధ్యలో ఎన్నటికీ మారని భగవంతుడున్నాడు. మనమెప్పుడు మనపై క్రోధము పెంచుకున్నవారియందు క్రోధము పెంచుకోకుండా వారిని నమ్మితే, వారిలో నమ్మకం పెరిగి ఆత్మ వైపు దృష్టి మరలుతుంది. మనని ఎదిరించేవారు, మనతో విభేదాలున్నవారు, మన జీవితాన్ని బరువు చేసిన వారు, ఎప్పటికైనా మనతో స్పందిస్తారు.

దేవుడ్ని నమ్మిన వానికి లేమి లేదు : భగవంతుని నమ్మిన వాని దగ్గర అందరూ నిర్భయంగా ప్రవర్తిస్తారు. వారికి లేమి ఏమీ లేదు, కాబట్టి ఇతరుల వద్దనుంచి ఏమీ ఆశించరు. వారు పరోపకారానికై బ్రతుకుతారు. మనము వారి దగ్గరనుంచి ఏమి తీసుకొన్నా వారిలో వెలితి లేదు. వారు ఇతరులకు ఏమిచ్చినా సంపూర్ణంగా ఉంటారు. వారికి ఎటువంటి కష్టం కలిగించినా వారు నిండుగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు వారి అవసరాలను తీరుస్తాడు. 170

Eknath Gita Chapter 9 Section 12

Bhagavat Gita

9.12

పితా అహమస్య జగతో మాతా ధాతా పితామహః {9.17}

వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ

ఈ జగత్తునకు తండ్రిని తల్లిని నేనే, తాతయు నేనే. నేనే ఓంకారమును, ఋక్సామ యజుర్వేదములును నేనే.

మన పిల్లలు ఎదిగి మన బంధువున్న వూరులో కాలేజీలో ప్రవేశము లభిస్తే, వారు ఆ బంధువు ఇంట్లో ఉండి చదువుకుంటారు. దీనిని బంధువులు బరువుగా చూడరు. ఎందుకంటే మన పిల్లలు కాలేజీనుంచి ఉత్తీర్ణులై, ఉద్యోగాలు చేసి, సంసారం మొదలుపెడితే వారూ అలాగే చేస్తారు. ఈ విధంగా డబ్బు ఆదా కన్నా ముఖ్యాంశం మన పిల్లలు కుటుంబ వ్యవస్థలో పెరుగుతారు. మన బంధువులు వారి బాధ్యతను తీసుకొంటారు.

ఈ శ్లోకంలో భగవంతుడు మన బాధ్యతను వహిస్తున్నానని చెప్పుచున్నాడు. మనం ఎంత వయస్సున్నవారమైనా, ఎన్ని తప్పులు చేసినా, ఆయన మనని కాపాడుతాడు. చెప్పక చెపుతున్నదేమిటంటే మనము స్వార్థముతో, తప్పుడు పనులు చేస్తే, అతడు మనము నిస్వార్థముగా మారనంతవరకూ, పశ్చాత్తాపము పడనంతవరకూ జన్మరాహిత్యము ఇవ్వడు.

నేటి శాస్త్రజ్ఞులు చెప్పే విషయమేమిటంటే విశ్వంలోని అన్ని శక్తులూ ఒకే చోట కేంద్రీకరింపబడినవి అని. ఆ కేంద్రాన్ని మనము భగవంతుడంటాము. విశ్వమంతా ఒకే సిద్ధాంతముతో నడుస్తోంది. భూమి మీది కణాలు, శక్తి విశ్వమంతా కనిపిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు "నేను సంపూర్ణమైన జ్ఞానాన్ని. నన్ను తెలుసుకొంటే, జీవులకు ఆధారమైన శక్తిని తెలిసికొన్నట్టే" అని చెప్పెను. ఛాందోగ్య ఉపనిషత్తులో ఇట్లు చెప్పబడినది: "ఎలాగైతే మట్టి గూర్చి తెలిసికొంటే, దానిలోంచి ఆవిర్భవించిన నామ రూపాత్మకమైన ప్రతి వస్తువు -- కుండ, ముంత మొదలగునవి-- తెలియబడతాయో, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవులన్నీ ఒకటే నని తెలిసికొంటాము". 169

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...