Sunday, April 10, 2022

Eknath Gita Chapter 11 Section 14

Bhagavat Gita

11.14

శ్రీ భగవానువాచ

{11.32}
కాలో అస్మి లోకక్షయకృత్ ప్రవృద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః

ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే యే అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః

నేను లోక సంహారమునకై విజృంభించిన కాలుడను. ప్రాణులను సంహరించుటకు ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. నీవు యుద్ధమును మానినను శత్రుసైన్యము నందలి వీరులు జీవించి యుండరు. ఀ

ఈ శ్లోకామే రాబర్ట్ అప్పెన్హైమెర్ కు అణ్వాయుధ పరీక్ష చూస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక్కడ కాల పదానికి కాలము, మరణము అను రెండర్థాలు ఉన్నాయి. కాలము అంటే మరణము; వేర్పాటు. అది మన నీడ కన్నా దగ్గరగా ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతుంది. ఏళ్లు గడుస్తున్నప్పుడు మన బంధుమిత్రులు మరణాల్ని చూసి, మన మరణం కూడా ఒకనాడు ఆసన్నమవుతుందని తెలుస్తుంది. మన సంతోషపు ఘడియలు పంచుకున్నవారలు ఇక లేకపోవచ్చు. గొప్ప గొప్ప వారు ఈ భూమి మీద నడిచి అసువులు బాసేరు. రాజ వంశాలకు, చక్రవర్తులకు నూకలు చెల్లి చరిత్ర పుటల్లో మిగిలిపోయేరు. దేవుని దయవలననే మనమి౦కా బ్రతికి ఉన్నాము. ఎవరికైతే ఈ ఎరుక ఉంటుందో వారు ఆధ్యాత్మిక సాధనకై ఉత్సాహము కలవారై, కాలమరణాలనే రక్కసిని అధిగమించాలనే కోరిక గలవారై ఉంటారు.

నేను ఈ శ్లోకాన్ని నిత్యం తలుచకుంటూ ఉంటాను. దానివలన నా లక్ష్యం స్పష్టంగా కనబడి, పూర్తి ఏకాగ్రత కలిగి, కోరికలను జయించే సామర్థ్యం వస్తుంది. నా సాధనలో నాకు అతి పెద్ద కోరిక కలిగినప్పుడు నా అమ్మమ్మ ఇచ్చిన బోధ గుర్తుకు వస్తుంది. నేను మృత్యు దేవత ప్రక్కనే ఉందని తలచి, నా కోరికను నిరోధిస్తాను. అలాగే క్రోధం, మత్సరం, మదం, నిరాశ కలిగినప్పుడు కూడా మరణాన్ని తలుచుకోవాలి. మనకి కలహించుకోడానికి, కోప్పడడానికి, విడిపోవడానికి సమయంలేదు. మొదలెట్టగానే అంతమొందే స్వార్థ పూరిత క్రియలు చేయడానికి సమయం లేదు. మనం యువకులుగా ఉన్నప్పుడు జీవితం ఇచ్చే వస్తువులను అనుభవించడానికి సమయం ఉంటుంది. కాని అవి క్షణికమైనవి. నీటి మీద వ్రాతల లాగా ఉండేవి.

ఒక భౌద్ధ గురువు "రేపటికి ఏ పనిని వాయిదా వెయ్యకు. నీవు రేపు బ్రతికి ఉంటావని నీకెలా తెలుసు?" అని అన్నాడు. బుద్ధుడు "జీవితము ఒక కల, మాయ, బుడగ, నీడ, వర్షపు చినుకు, లేదా మెరుపు వంటిది" అని చెప్పెను. మన౦ గుర్తు౦చుకోవలసినది జీవితం క్షణికము. కాబట్టి మనం సంసారమనే సముద్రాన్ని దాటడానికి ఉపేక్ష చెయ్యకూడదు. 298

Eknath Gita Chapter 11 Section 13

Bhagavat Gita

11.13

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో

నమో అస్తు తే దేవవర! ప్రసీద {11.31}

విజ్ఞాతు మిచ్చామి భవంత మాద్య౦

న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్

దేవదేవా! నీకు నమస్కారము. ఉగ్రరూపుడగు నీవెవడవు? ఆదిపురుషుడవగు నిన్ను తెలియగోరుచున్నాను. నీ ప్రవర్తనము నాకు బోధపడుట లేదు

అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపం భయంకరంగా ఉందని తలచెను. అతని సంశయము దేవుడు సదా కరుణా మూర్తియని తలచడం వలెన కలిగినది. ఇది జీవిత సత్యం. మనము పుట్టిన దగ్గర నుంచి మరణంవైపే ప్రయాణిస్తున్నాము. ఒక చిన్న సూక్ష్మ క్రిమి నుంచి అతి పెద్దదైన నక్షత్రం వరకూ మరణము సహజము. మన శరీరంలో వేలకొద్దీ కణాలు ప్రతి ఘడియ మరణిస్తున్నాయి. బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ "జీవితం యొక్క ప్రతి దశలోనూ మరణిస్తున్నాము" అని చెప్పును. మనము మరణాన్ని తప్పించు కోవాలంటే దేహంతో తాదాత్మ్యము చెందే అవిద్యను తొలగించుకోవాలి.

శ్రీరామకృష్ణ జీవితం ఒక ఆసుపత్రి లాంటిది అంటారు. దేవుడు మనం పాటించే వేర్పాటును తొలగించుకొనడానికి, మనని సంపూర్ణులగా చేయడానికి భూమి మీదకు పంపేడు. మనకి హింస, క్రోధం ఎదురైతే, స్థిరంగా, క్షేమంగా ఉండి మన స్థితిని ఉన్నతం చేసికోవాలి. కానీ కొంతమంది తిరగబడతారు. వారు ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది. మనం ఈ విధంగా అనుభవించిన తరువాత, తిరుగుబాటు దుఃఖానికి దారి తీస్తుందని తెలిసికొ౦టాము.

బుద్ధుడు 4 సూత్రాలు చెప్పేడు.

  • మొదటిది: మనమందరమూ వ్యాధిగ్రస్తులం.
  • రెండవది: వ్యాధికి కారణం మన కోరికలు, బంధాలు. అది ప్రపంచంలోని అందరికీ వర్తిస్తుంది
  • మూడవది: మనం కోరికలు, బంధాల నుండి విముక్తులము కావాలి
  • నాల్గవది: దానికి చికిత్స ఈ 8 మార్గాలు (ఆర్య అష్టాంగ మార్గ)
    1. సుజ్ఞానము
    2. ఉన్నతమైన లక్ష్యం
    3. మంచి వాక్కు
    4. మంచి నడవడిక
    5. మంచి క్రియ
    6. తగినంత ప్రయత్నం
    7. ఏకాగ్రత
    8. ధ్యానం
మనమ౦దరమూ వీటిని ఇళ్లలోనే పాటించవచ్చు. ధ్యానం చేస్తూ, కోర్కెలను జయించి , మన చుట్టూ ఉన్నవారి మేలుకై పాటుపడుతూ ఉండడమే సరైన చికిత్స. 295

Eknath Gita Chapter 11 Section 12

Bhagavat Gita

11.12

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా స్సర్వే సహైవావనిపాలసంఘైః {11.26}

భీష్మో ద్రోణ స్సూతపుత్రస్తథా అసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః

వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని

కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్య౦తే చూర్ణిత్తైరుత్తమాంగైః {11.27}

ఈ ధృతరాష్ట్ర సుతులందరును, రాజుల సమూహమును, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడును, మన పక్షాన యున్న యుద్ధ ప్రముఖులును కోఱలతో వికారముగా, భయంకరముగా గోచరించు నీ నోళ్ళయందు త్వరితముగ ప్రవేశించుచున్నారు. కొందరి తలలు ముక్కలై, చూర్ణితమై నీ దంతముల మధ్య చిక్కుకొని కనిపించుచున్నారు.

యథా నదీనాం బహవో అంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి

తథా తవామీ నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి {11.28}

నదీ ప్రవాహములు సముద్రమున కభిముఖముగ ప్రవహించెడి రీతిన ఈ రాజ శ్రేష్ఠులందరు ప్రజ్వలించుచున్న నీ ముఖమున కభిముఖులై ప్రవేశించుచున్నారు

యథా ప్రదీప్తం జ్వాలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః

తథైవ నాశాయ విశంతి లోకా స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః {11.29}

మిడుతలు ఏ విధముగ అతిరయమున మండుచున్న అగ్ని యందు ప్రవేశించి నశించుచున్నవో అలాగుననే జనులును అతిరయమున నీ నోళ్ళయందు నాశమును గోరి ప్రవేశించుచున్నారు.

లేలిహ్యసే గ్రసమాన సమంతా ల్లోకాన్ సమగ్రాన్ వ దనైర్జ్వలద్భిః

తేజోభిరాపూర్వ జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో {11.30}

ఓ విష్ణుమూర్తీ! మండుచున్న నోళ్ళతో అన్నివైపులను సమస్తమైన లోకములను మ్రి౦గుచు ఆస్వాదించుచున్నావు. నీ యొక్క ప్రచండమైన కాంతులు సమస్తమైన జగత్తును కాంతులచే నింపి తపింపజేయుచున్నవి ఀ

ఎవరైతే తమ బంధు మిత్రులను, సమాజాన్ని, చివరకు ప్రపంచాన్ని విస్మరించి స్వార్థ పూరిత జీవితం గడుపుతారో వారికి మరణం సజావుగా ఉండదు.

ఈనాడు హింసాకాండకు ముఖ్య కారణాలు మనుష్యులు వాడే తుపాకులు, యుద్ధాలకు ఉపయోగించే అస్త్రాలు మొదలగునవి. మానవులలో ఐకమత్యము లేకుండుట హింసకు దారితీస్తుంది. ప్రపంచ దేశాలు యుద్ధానికై సామగ్రిని అమ్ముతాయి మరియు కొంటాయి. వాటికై ప్రతి నిమిషం కొన్ని వందల కోట్లు వెచ్చిస్తాయి. అందువలన ప్రజలకు ఆహారము, వైద్యము సమయానికి అందవు.

ఎప్పుడైతే మనము ఆయుధాలను లాభానికై తయారుచేస్తామో గీత మనం మృత్యు దేవతతో ఆటలాడుతున్నాము అంటుంది. అది ఒక అమ్మేవాడు, కొనేవాడికే పరిమితం కాదు. వాటిని తయారుచేసేవారు, మధ్యవర్తులు, చివరకు వాటిని ఖండించని వారలకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడు.

ఈ విధంగా జరుగుతున్న హింసాకాండను పట్టించుకోకుండా ఉంటే వచ్చే తరాలు దుఃఖాన్ని అనుభవిస్తాయి. గీత దీన్నే చిమటలతో పోలుస్తుంది. చిమటలు కొన్ని గంటల పాటే బ్రతుకుతాయి. అవి మంట ఎక్కడ కనబడితే దాని వైపు వెళతాయి. అర్జునుడు పాండవ, కౌరవ సేనలు, మామలు, తాతలు, గురువులు, అసువులు బాసుటకై చిమటలవలె తీరి ఉన్నారని తలచేడు.

మన నాగరికత స్వార్థం, వేర్పాటులతో నిండి ఉంటే, మనము చిమటల లాగే అంతరిస్తాము. మనం ఆనందం, పేరు ప్రతిష్ఠలకై ప్రాకులాడితే మనకి సామాన్య మానవుల ఆర్తనాదాలు వినబడవు, వారి దుస్థితి కనబడదు. అటు పిమ్మట మన జీవితం ఒక కొండ వాగు లాగ నదిలోనో, సముద్రంలోనో అంతమవుతుందని తెలిసికోలేము. అందుకే గొప్ప గురువులు ఆధ్యాత్మిక జీవితం అవలంబించడానికి ఒక్క రోజు కూడా ఉపేక్షించవద్దని చెపుతారు. ప్రతి ఘడియ మనము మృత్యువుకు దగ్గర అవుతున్నాము అని జ్ఞప్తికి పెట్టుకుంటే, మనము మరణాన్ని దాటే ప్రణాళికను ఇప్పుడే, ఇక్కడే చేస్తాము 293

Eknath Gita Chapter 11 Section 11

Bhagavat Gita

11.11

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వే అశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ {11.22}

గంధర్వయక్షా మరసిద్ధసంఘాః వీక్ష౦తే త్వాం విస్మితా శ్చైవ సర్వే

రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, వాయుదేవతలు, పితృదేవతలు, యక్షులు, గంధర్వులు, అసురులు, సిద్ధులు మొదలగు వారందరును ఆశ్చర్యమును బొందినవారై నిన్ను గాంచుచున్నారు

రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బహూరుపాదం {11.23}

బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథిటా స్తథా అహం

కృష్ణా! అనేక ముఖములు, నేత్రములు గలిగినట్టియు, అనేకములగు బాహువులు, ఊరువులు, పాదములు గలిగినట్టియు, అనేక ఉదరములు గలిగినట్టియు, అనేక కోఱలచే భయంకరమైనట్టియు నగు నీ అద్భుత రూపమును జూచి జనులందరును భయపడుచున్నారు. నేనును అలాగే భయపడుచున్నాను

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తానన౦ దీప్తవిశాలనేత్రం {11.24}

దృష్ట్వాహి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతి౦ న విందామ శమంచ విష్ణో

కృష్ణా! నీవు గగనము నంటియున్నావు. ప్రకాశించు అనేక వర్ణములు గలవాడవు. తెరిచిన నోళ్ళు గలవాడవు. ప్రజ్వలించెడి విశాలమైన నేత్రములు గలవాడవు అగు నిన్ను జూచి నా మనస్సు భయపడినది. నేను ధైర్యమును, శాంతిని పొందలేకయున్నాను

దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవకాలానల సన్నిభాని {11.25}

దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస

కోఱలచేత భయంకరమైన ప్రళయాగ్నిని బోలిన నీ ముఖములను జూచి నేను దిగ్భ్రాంతి చెందియున్నాను. సుఖమును కూడా పొందలేక యున్నాను. దేవదేవా! జగదాశ్రయా! ప్రసన్నుడవగుము ఀ

అర్జునడు శ్రీకృష్ణుని ఒక నియంతగా ఉండి జీవులను చంపే శక్తిగా వర్ణించుచున్నాడు.

పుట్టినవి గిట్టక తప్పదు. ఒక సూక్ష్మ క్రిమి కొన్ని నిమిషాలు బ్రతకవచ్చు. వర్షాకాలంలో వచ్చే చిమటలు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాయి. వాటితో పోలిక పెడితే మనము కొన్ని వందల రెట్లు కాలం బ్రతుకుతాం. కానీ మన కన్నా సూర్యుడు కొన్ని కోట్ల రెట్లు కాలం బ్రతుకుతాడు. ఒక మారు ఇంధనం అయిపోతే సూర్యుడు వైట్ డ్వార్ఫ (white dwarf) అనే నక్షత్రంగా మారి తన ప్రకాశాన్ని కోల్పోతాడు. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వమే ఒకనాడు అంతరించి పోతుంది.

కానీ నక్షత్రాలు, పుంతలు వలె కాక మనము మరణాన్ని తప్పించుకోవచ్చు. ఇదే మతాలు ప్రతిపాదించేది. మనమంతా మరణం సహజమని భావిస్తాము. కాని కొందరు ఆధ్యాత్మిక గురువులు మరణాన్ని జయించేరు. మహమ్మద్ "మరణించడానికి ముందే మరణించు" అని చెప్పెను. ఒక దొంగ బంగారు నగలు వేసికోనివారను ఏమీ చేయడు. అలాగే మరణం కోరికలను జయించినవారికి రాదు. కొందరు "ఈ పిండివంట తినాలి, ఆ వస్త్రం వేసికోవాలి, వేరే దేశానికి వెళ్ళాలి, ఇటువంటి కార్ కొనాలి" అనే కోర్కెలతో సతమతమవుతూ ఉంటారు. మృత్యు దేవత అటువంటివారిని చూసినప్పుడు "వీడొక ధనవంతుడు. ఎన్నో కోరికలు నేను దొంగలించ వచ్చు" అని అనుకొంటుంది. మనము ధ్యానము ద్వారా స్వార్థపూరిత కోర్కెలను నిర్మూలిస్తే, దేహంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటాము. అటు తరువాత మన దేహం పడిపోయినా చేతన మనస్సులో ఎటువంటి చీలిక ఉండదు. దాని బదులు ఎన్నటికీ మరణించని ఆత్మపై అవిచ్ఛిన్నమైన ఎరుక ఉంటుంది. 290

Eknath Gita Chapter 11 Section 10

Bhagavat Gita

11.10

త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం విధానం {11.18}

త్వమవ్యయ శ్శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వ౦ పురుషో మతో మే

నీవు అక్షరస్వరూపుడవు. పరమాత్మవు. తెలియదగినవాడవు. ఈ విశ్వమునకు పరమాశ్రయుడవు. శాశ్వత ధర్మ రక్షకుడవు. అవ్యయుడవు. సనాతనుడైన పురుషుడవు అని నా అభిప్రాయము

అనాదిమధ్యా౦త మనంతవీర్య మనంతబాహుం శశిసూర్యనేత్రం {11.19}

పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తప౦తమ్

ఆది మధ్యా౦త రహితువినిగను, అనంత వీర్యవంతుని గను, అనేక హస్తములు గలవానినిగను, చంద్ర సూర్యులు నేత్రములుగ గలవానినిగను, ప్రజ్వలించు అగ్నివంటి ముఖము గలవానినిగను, స్వప్రకాశముచే విశ్వమంతటిని దీప్తిమ౦తము చేయువానినిగను నిన్ను గాంచుచున్నాను

ద్యావాపృథివ్యో రిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః {11.20}

దృష్ట్వా అద్భుతం రూపముగ్ర౦ తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్

మహాత్మా! భూమ్యాకాశముల మధ్య ప్రదేశమును, దిక్కులన్నియు నీ చేతనే పరివ్యాప్తమై యున్నవి. అద్భుతమైనట్టి, భయంకరమైనట్టి, నీ రూపమును జూచి ముల్లోకములు మిగుల భీతిని చెంది యున్నవి

అమీ హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి {11.21}

స్వస్తీత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః

దేవతా సమూహములన్నియు నీలో ప్రవేశించుచున్నవి. కొందరు సిద్ధుల సమూహములు "స్వస్తి" పలుకుచూ అనేక స్తుతులచే నిన్ను ప్రార్థించుచున్నారు ఀ

అర్జునడు శ్రీకృష్ణుని అనంతమైన విశ్వ రూపం చూసి తాను విభ్రాంతుడైనాడని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. శాస్త్రజ్ఞులు దేవుని శక్తిని సంశయంతో చూస్తారు. ఎందుకంటే యోగులు చెప్పే దేవుడు ఎవరో వారికి తెలియదు కనుక. మనలో చాలామంది దేవుడు మనకన్నా వేరుగా ఉన్నాడని తలుస్తారు. వాళ్ళకి మనలోని ఆత్మే దేవుడని ఎంత చెప్పినా నమ్మరు. సూఫీలు అంతరిక్షంలో ఇమడలేని దేవుడు మన హృదయాల్లో ఇమిడి ఉన్నాడని చెప్పుదురు.

ఈ విధంగా ఒక యోగి దృష్టి, శాస్త్రజ్ఞుని దృష్టి మధ్య ఎటువంటి తేడా లేదు. అబ్బే జార్జెస్ లెమైటెర్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు విశ్వమంతా మొదట్లో ఒక గ్రుడ్డు రూపంలో, దేశకాలాలు లేక, అసంఖ్యాకమైన సాంద్రతతో ఉండేదని చెప్పెను. ఇది ఎలాగంటే ఒక న్యూట్రాన్ నక్షత్రం ఎంతో సాంద్రత కలిగి విస్పోటనము చెంది దేశకాలాలు లేని ఒక కృష్ణ బిలంగా మారినట్టు. మన స్మృతులలో దీనినే హిరణ్యగర్భ లేదా బ్రహ్మాండం అంటారు. లెమైటెర్ విస్పోటనము చెందిన గ్రుడ్డు విశ్వంగా వృద్ధి చెంది సర్వవ్యాప్త మైనదని చెప్పెను.

మనం అడిగే ప్రశ్న "విశ్వం నిక్షిప్తమైన గ్రుడ్డులో ఎందుకు విస్పోటనము జరిగినది?" ఒక శాస్త్రజ్ఞుడు బయటనుంచి ఏదో దానిని బలంగా కొట్టిందని భావిస్తాడు. యోగి భగవంతుడు ఒక ఉదజని అణువులో, సూర్యుని కేంద్రంలో, ఒక చెట్టుగా మొలకెత్తే బీజంలో ఉన్నట్టే ఆ గ్రుడ్డులో కూడా ఉన్నాడని భావిస్తాడు. నేను జీవ శాస్త్రజ్ఞుడను కాకపోయినా, దేవుని శక్తి ఒక బీజంలో ఉందని నమ్ముతాను. ఆ శక్తి ఒక చెట్టును ఎక్కడ నుంచో కాక, ఆ బీజం నుంచి ఉద్భవి౦పచేస్తుంది. ఆ చెట్టు ప్రతి కొమ్మలోనూ, ఆకులోనూ దేవుని శక్తి ఉంది. అందువలనే ఆకులు సూర్యరశ్మితో ఆహారం తయారు చేస్తాయి; కొమ్మల్లో రసం ప్రవహిస్తుంది.

గాంధీ దేవుడు ధర్మమని చెప్పెను. అంటే ధర్మకర్త్రి -- సిద్ధాంతాలను చేసేవాడు. బుద్ధుడు ఒక మారని సిద్ధాంతం విశ్వ౦లో అంతర్లీనమై ఉన్నదని చెప్పెను. ఇది మనలో చాలామందికి సమ్మతము. కానీ ధర్మకర్త్రి విషయం కొస్తే మనకు అపనమ్మకం ఉండవచ్చు. శ్రీ రామకృష్ణ దేవుడు వ్యక్తిగతము, నిరాకారము అని భావించెను. సిద్ధాంతము, దాని కర్త ఒకే దేవుని నుండి ఆవిర్భవించేయి. అన్ని సిద్ధాంతాలు జీవైకమత్యం కొరకే వచ్చేయి. భౌతిక, రసాయన శాస్త్రాల సిద్ధాంతాలు ఆ జీవైకమత్యం యొక్క వివిధ అంశాలు. అలాగే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు భౌతిక లేదా రసాయన శాస్త్ర సిద్ధాంతాలు జీవైకమత్యం గురించే ఉన్నాయి.

కాబట్టి విశ్వం ఒక్కటే. వివిధ సిద్ధాంతాలు ఒకదాని కొకటి సంబంధంలేక కలగూర గంపగా లేవు. అలా ఉంటే సృష్టి అంతా గందరగోళంగా ఉంటుంది. జీవైకమత్యం లేకపోతే ఒక పద్దతి లేక, మనకు దేనికై ఎదురుచూడాలో తెలియదు. ఉదాహరణకి ఒక వంకాయ విత్తనం నాటితే, గోంగూర చెట్టు మొలవదు; ఒక బంతిని మీదకి విసిరితే అది అంతరిక్షంలోకి పోదు. ఉనికి కలిగిన అన్ని విషయాలలోనూ, సిద్ధాంతాలు ఉన్నాయి. గురుత్వాకర్షణ గూర్చి సిద్ధాంతం, ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం ఒకే యోనిలో౦చి వచ్చేయి. ఐన్స్టీన్ పదార్థమును, శక్తిని అనుసంధానము చేసిన తరువాత, వాటిని ఆ విధంగా సృష్టించిన సిద్ధాంతాన్ని కనుగొనుటకు చాలా ప్రయత్నించి విఫలుడైనారు. "ఏది తెలుసుకొంటే అన్ని విషయాలు అవగతం అవుతాయి?" అనే దృక్పథంతో మన స్మృతులు అన్వేషించాయి. సమాధి స్థితిలో దీని సమాధానం మనకు దొరుకుతుంది. అలాగే అన్ని సిద్ధాంతాలను సృష్టి చేసిన ధర్మకర్త్రిని పట్టుకొంటాం. 287

Eknath Gita Chapter 11 Section 9

Bhagavat Gita

11.9

కిరీటినం గదినం చక్రిణం చ

తేజోరాశి౦ సర్వతో దీప్తిమంతం {11.17}

పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతా

ద్దీప్తానలార్క ద్యుతి మప్రమేయమ్

కిరీటము, గద, చక్రము గల వానిని గను, అంతటను ప్రకాశించు వానిని గను, తేజోమయుని గను, ప్రజ్వలించెడి అగ్ని సూర్యుల ప్రకాశము గల వానిని గను, అప్రమేయుని గను నిన్ను సకల ప్రదేశములందు గాంచుచున్నాను

తరతరాలుగా సూర్యనమస్కారాలు చేసి మనను క్రియలకై ప్రేరేపించే సూర్యునికి వందనములు సమర్పిస్తున్నాం. ఆయన మరోపేరు దినకరుడు. మనం కాంతిని, ఉష్ణాన్ని, ఆహారాన్ని ఆయనవలననే పొందుతున్నాము. సమస్త జీవులు సూర్యుని మీదే ఆధారపడి ఉన్నాడనడంలో అతిశయోక్తి లేదు.

ఈ మహాద్భుతాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు ఇలా వివరిస్తారు. 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. 65.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఉదజననిని 65.25 కోట్ల హీలియ౦ గా మార్చి శక్తిని విడుదల చేస్తాడు. ఆ రెండు సంఖ్యల మద్ద తేడా ఆ శక్తి ఘనీభవిస్తే ఉండే బరువు.

జీవితంలో ఏదీ అకారణంగా లేదు. ప్రతీదీ పదార్థము లేదా శక్తి అయ్యి సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉన్నది. ముఖ్యంగా మన భూగోళంలో అది సమంగా ఉంది. సూర్యుని కేంద్రంలో ఉండే శక్తి ఉపరితలం మీద కొస్తే మన సౌర కుటుంబంలోని జీవులన్నీ మాడి మసై పోతాయి. సర్ జేమ్స్ జీన్స్ అనే ఆంగ్ల ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పెను: "ఒక గుండు సూది అంత సూర్యుని పదార్థాన్ని మన భూగోళం మీదకి తీసికువస్తే దాని వేడి వలన 100 మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కాలిపోతాడు. " సూర్య కిరణాలు మన దేహాలని తాకే ముందు మన వాతావరణాన్ని చొచ్చుకొని రావాలి. అంతకు ముందు సూర్యుని ఉపరితలంలోని అణువులను చొచ్చుకొని రావాలి. ఈ విధంగా సూర్యుని ప్రతాపము తగ్గి మనకి సరైన ఉష్ణోగ్రతతో అందుతుంది.

ఈ విషయాలు ఖగోళ శాస్త్రజ్ఞులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కానీ ఎక్కడైతే శాస్త్రజ్ఞులు థెర్మోడైనమిక్స్ సిద్ధాంతాలను చూస్తారో , అక్కడ యోగులు దేవుని ప్రేమను, వైభవాన్ని చూస్తారు. విలియం బ్లేక్ అనబడే కవి "నేను నా కళ్ళలోంచి చూస్తాను. అంటే కళ్ళతో కాదు. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే నేను ఒక ప్రకాశవంతమైన వృత్తాకారము చూడను. నేను చూసేది పవిత్రమైన అంతరిక్ష దేవతను"

సూర్యునివంటి అద్భుతమునకు భగవంతుని ప్రేమే కారణము. ఆయన ప్రతి అణువులోనూ ఉన్నాడు. పదార్థమును, శక్తిని కలిపి చెప్పే సిద్ధాంతాలు జీవుల ఐకమత్యానికి సూచిక. ఒక నక్షత్రం మాట్లాడగలిగితే అది ఒక పద్యం చదవక, గురుత్వాకర్షణను పొగుడుతుంది. చిన్న వయస్సు గల నక్షత్రాలు కృష్ణ బిలాలతో ప్రేమ బంధానికై అర్రులుచాస్తాయి. వాటికి జీవైకమత్యం శక్తి వలన సాధ్యం; మనకు అదే ప్రేమ వలన సాధ్యం. వివరించే పదాలు వేరైనా, వాటి భావం ఒక్కటే. 283

Eknath Gita Chapter 11 Section 8

Bhagavat Gita

11.8

అనేక బాహూదరవక్త్ర నేత్రం

పశ్యామిత్వాం సర్వతో అనంతరూపం {11.16}

నాంతం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప !

విశ్వేశ్వరా ! విశ్వరూపా! అన్ని చోట్లను అనేకమైన బాహువులును, ఉదరుములును, ముఖములును, నేత్రములును, కలిగిన అనంతరూపునిగ నిన్ను గాంచుచున్నాను. నీ రూపమునకు మొదలుగాని, మధ్యముగాని, అంతము గాని గోచరించకున్నవి

శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. విష్ణు సహస్ర నామములు ఆయనకీ వర్తిస్తాయి. ఒకమారు భూమాత పాప భారం భరించలేక శ్రీ మహావిష్ణువుని రక్షింపమని వేడుకొంది. అప్పుడు ఆయన శ్రీకృష్ణ అవతారం దాల్చేడు. దేవకీ, వసుదేవులకు జన్మించి, కంసుని దురాగతములను తప్పించుకొనుటకై, యశోద, నందులకు దత్త పుత్రుడైనాడు. ఆ పసికందు నామకరణం చేయడానికి గార్గ ఋషుని కోరేరు. ఆయన పసికందుని చూసి "సహస్ర నామములుండగా నేనే నామాన్ని పెట్టేది?" అని వాపోయేడు.

దేవుడు మనందరిలోనూ ఉన్నాడు. మన పేర్లన్నీ ఆయనకే చెందుతాయి. అంటే ఆయన సహస్ర నామములకే పరిమితం కాదు. కోట్ల ప్రపంచ జనాభా పేర్లన్నీ ఆయనవే. ఎందుకంటే వారి హృదయాల్లో ఆయన నివసిస్తున్నాడు. అర్జునుడు చూస్తున్న అసంఖ్యాకమైన ముఖములు, చేతులు ఊహా జనితం కాదు. రామదాసు ఇలా చెప్పెను:

మనము ఏ జీవిని చూసిన దాని బాహ్య రూపమే కాక అంతరంలో ఉన్న ఆత్మను చూడాలి. ఈ విధంగా చూడడం నిజమైన ప్రక్రియ. దానివలన మన౦ భిన్నత్వాన్ని అతిక్రమించి జీవుల ఐకమత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఋషులు చెప్పేది. అలా ఉండడం పుణ్య క్షేత్రాలకే పరిమితం కాదు. మన దినచర్యలో, బజార్లో, అన్ని చోట్లా, భిన్నత్వాన్ని చూడక సమానతను పాటించాలి. అందరిలోని దైవత్వాన్ని దర్శించాలి. 281

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...