Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 19

Bhagavat Gita

6.19

యంజ న్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః {6.28}

సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖ మశ్నుతే

ఈ ప్రకారము మనస్సును సదా ఆత్మయందే నిలుపుచు, కల్మష రహితుడైన యోగి బ్రహ్మ సాక్షాత్కార రూపమగు పరమ సుఖమును సులభముగ పొందుచున్నాడు

ఆత్మ శుద్ధమైనది. అనగా మన సహజ స్థితిలో అరిషడ్వర్గాలు, అహంకారం లేవు. కానీ ఈ రోజుల్లో వాటినే మన సహజ స్థితి అని నమ్ముతున్నాం. మన అభిలాషలచే, కోర్కెలచే బందీలుగా ఉన్నాము. ధ్యానం ద్వారా వాటిని అధిగమించవచ్చు.

శ్రీకృష్ణుడు మనల్ని సుఖం, లాభం, అధికారం, ప్రతిష్ఠల నుంచి విడివడి, వాటి వలన కలిగే అపజయాల్ని, బలహీనతలను, అభద్రతను అధిగమించి తనను పొందమని బోధ చేస్తున్నాడు. మన జన్మ సార్థకం చేసికోవాలంటే స్వార్థాన్ని వీడి, దేవునియందు ప్రేమతోనుండి, మన వనరులు, శక్తి సామర్థ్యాలు పరోపకారానకై ఉపయోగించాలి. అలాచేస్తే మన౦ కర్మలు చేయక, దేవుడే మన చేత కర్మలు చేయిస్తాడు.

అహంకారం, స్వార్థం, పగ, ద్వేషాలను వీడి దేవునికి దాసోహమైతే, మనము అందరి క్షేమమునకై పని చెయ్యవచ్చు. 372

No comments:

Post a Comment

Viveka Sloka 35 Tel Eng

Telugu English All శ్రోత్రియోఽవృజినోఽకామహతో యో బ్రహ్మవిత్తమః । బ్రహ్మణ్యుపరతః శాంతో నిరింధన ఇవానలః ।| 34 || అహేతుకదయాసి...