Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 1

Bhagavat Gita

7.1

శ్రీ భగవానువాచ

{7.1}
మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజ న్మదాశ్రయః

అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు

అర్జునా! నాయందు మనసు నిలిపి, నన్నే ఆశ్రయించినవాడవై యోగము నభ్యసించుచు సంశయ రహితముగ, సంపూర్ణముగ నన్ను ఎట్లు తెలిసికొ౦దువో దానిని ఆలకింపుము ఀ

మనం మనకోసమే బ్రతుకుతూ, మన అవసరాలూ, సమస్యలూ గురించి ఆలోచిస్తూ ఉంటే మనమెన్నటికీ ఆత్మ స్వరూపాన్ని తెలిసికోలేము. మనము ఒక ముసుగు చాలా కాలం వేసుకొంటే, మనమా ముసుగే మన స్వరూపమని తలచి, మన నిజ స్వరూపాన్ని మరచి పోతాం. ధ్యానం వలన ఆ ముసుగు తొలగించి ప్రేమ, భద్రత, జ్ఞానం, ఆనంద స్వరూపమైన ఆత్మను తెలిసికోవచ్చు.

యోగ అనగా వ్యాయామం లేదా ఆసనాలు మాత్రమే కాదు. యోగమనగా మనం వేసుకున్న ముసుగును తొలగించి మన ఆత్మతో తాదాత్మ్యం చెందడం.

పతంజలి యోగమును 3 దశలగా వివరించెను: ధారణ, ధ్యాన మరియు సమాధి. అతడు వ్రాసినది ఎంతో నిష్కర్షయైనది. అది ఒక మతపరమైన సిద్ధాంతం కాదు. కానీ అది క్రోడీకరింప బడినది. ఎందుకంటే గురువులు తమ స్వీయానుభవంతో విపులంగా బోధించుటకు వీలవుతుంది.

ధారణ అనగా మనము శరీరము మాత్రమే కాదు. సహజంగా మనమడిగే ప్రశ్న "మన మెవరము?"

మన శరీరము ఒక కోటు లాంటిది. మనం కోటు కొనుక్కొని చిరకాలం వాడలేము. అది ఎప్పుడో చిరిగి లేదా పాతబడి పోతుంది. చివరకు దానిని దానం చేయడమో లేదా పారేయడమో చేస్తాం. అలాగే మన శరీరం కూడా. మరణించినపుడు పాతబడిన కోటు లాగ విడిచి పెడతాం.

మనమెలాగ శారీరం మనం కాదనుకొన్నామో, ఇతరులను కూడా అలాగే భావించవచ్చు. అనగా తెలుపు, నలుపు, ఛామన చాయ, పసుపు వగైరా శరీరాలు అన్నీ మనమేసుకొన్న కోట్లు. దాని వలన శరీర ఛాయను బట్టి జాతిని నిర్ణయించడమనేది ఒక అపోహ. అన్ని రంగుల శరీరాలు అందమైనవే.

శరీర ఛాయను ప్రక్కకు పెడితే, మనము వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూస్తాం. ప్రసార మాధ్యమాలు ఏమి చెప్పినా, పరులను భౌతికమైన వస్తువులుగా చూడడం వలన బంధాలు గట్టి పడవు. భౌతికంగా మనము వేర్వేరు జీవులం. కాలం గడుస్తున్న కొద్దీ శరీరం మీద వ్యామోహం తగ్గుతుంది. కానీ మన సహధర్మచారిణి యొక్క సంక్షేమము మనము కోరితే మన బంధాలు గట్టి పడతాయి.

ధారణ వలన భౌతికమైన సమస్యల మీద స్వాధీనం వస్తుంది. మన సమస్యలు -- వాటికి మూల కారణము మనస్సు అయినప్పటికీ--చాలామటుకు భౌతిక మైనవి. అతిగా తినడం మనస్సుకు సంబంధించిన సమస్య. కానీ మనము మన చేతిని నియంత్రించుకుంటే దాని వలన లాభం ఉంది. నా మిత్రుడొకడు "నేను ఆ కేక్ మొత్తం తినేసాన౦టే నమ్మలేక పోతున్నాను" అని చెప్తాడు. నాకు ఇటువంటి తృష్ణ అర్థమవుతుంది. కాని చేతిని ఉపయోగించి ఆ కేక్ ని ఎందుకు తినడం? మనము తినకూడదనుకొన్నప్పుడు మన చేతి మీద కూర్చొని దానిని నియంత్రించాలి. నేను నా మిత్రుడి కది చెప్పినప్పుడు "ఒక అతీతమైన శక్తి నన్ను ఆవహించి ఆ పని చేతితో చేసింది" అని చెప్తాడు. ఇటువంటి అలవాటు బలవంతమైనది. దానిలో ఆనందం లేదు. ధారణ వలన మనము ఏది తినాలో, తినకూడదో నిశ్చయించుకోగలం.

సాధనలో రెండవ అంశం ధ్యానము. దాని వలన తెలిసికొనేది మనం మనస్సు కూడా కాదు. అయితే మనస్సంటే ఏమిటని అనుమానం రావచ్చు. మన శరీరం ఒక కార్ అనుకొంటే మనస్సు ఇంజిన్ వంటిది. మనస్సు సరిగా పని చేయాలంటే మనం దానిలోని భాగమని తలచకూడదు. మనకి ధ్యానం వలన జ్ఞానం కలిగి మన మనస్సును సరి చేసుకోవడానికి వీలవుతుంది.

ఒక్కొక్కప్పుడు భావోద్వేగం వలన మనకు నిరాశ లేదా భయం కలగవచ్చు. ఇవి మన ఇంజిన్ కు సంబంధించిన స్థితి. అంటే ఆ సమస్యలను పరిష్కరించే మార్గం ఉంది. మనము మన పూర్వ స్థితి కన్న వేరు కామని తలచవచ్చు. అలాగే మన పుట్టుకతోనో, ఆ తరువాతో వచ్చిన నడవడిక మార్చలేమని తలచవచ్చు. మన స్వరూపం శరీరం మరియు మనస్సు అనుకున్నంత కాలం అది నిజం. ధ్యానంతో మన భావోద్వేగం మార్చుకోవచ్చు. దానివలన మనం ధృడత్వాన్ని వశ్యత గాను, భయాన్ని ధైర్యంగానూ, క్రోధాన్ని ప్రేమ గాను మార్చుకోవచ్చు.

పూర్వం ఒక శిల్పి చేసిన శిలా విగ్రహాలు అత్యంత సుందరంగా ఉండేవి. కొందరు అతను చేసిన ఏనుగు విగ్రహాలను విభ్రాంతితో చూసి, అతని రహస్యమేమని అడిగేరు. అతని సమాధానం: "నేను ఒక శిలను తీసికొని ఏనుగు కాని పదార్థాన్ని చెక్కేస్తాను". అలాగే మనం మన వ్యక్తిత్వాన్ని ధ్యానం ద్వారా మలచుకొంటాం.

మన నిజస్వరూపం ఆత్మ. దానిని తెలిసికోవాలంటే ఆత్మ కాని పదార్థాన్ని శిల్పి ఏనుగు కాని శిలని ఎలా చెక్కేడో అలా చెక్కేయాలి. దీనినే వేదాలలో "నేతి నేతి" అంటారు.

ధ్యానం ద్వారా మన నిజస్వరూపాన్ని తెలిసికొని మనను ఆదర్శ వంతులుగా తీర్చిదిద్దు కోవచ్చు. మన చేతనం లోని క్రోధం, భయం, లోభం తొలగించుకోవచ్చు. ఇది మూడవ దశ సమాధికి నాంది. దానివలన మన చేతన, అచేతన మనస్సులోని తేడాలు తొలగిపోతాయి. మనకు ఇతరుల మధ్య గల భేదం కూడా చెరిగిపోతుంది.

మనం సాధన చేస్తే గాని అవి మనకి అవగాహనకి రావు. యోగులు చెప్పేది ఆత్మ జ్ఞానమును పొందటం అతి క్లిష్టమైనదని. భౌద్ధులు చెప్పే పతిసోతగామి అనగా ఎదురీత. మనసా, వాచా, కర్మ కు ఎదురీత.

నేను చిన్నప్పుడు నా మిత్రులతో నదిలో ఈత కొట్టడానికి వానాకాలంలో వెళ్ళేవాడ్ని. అప్పుడు నది నిండుగా ప్రవహించేది. మేము ఎదురీత చేసి ఆవలి గట్టుకు చేరేవారం. మాలో గజ ఈతగాళ్లు నదీ ప్రవాహంలో క్రిందకు వెళ్ళక సమాంతరంగా ఆవలి గట్టుకు చేరుకొనేవారు.

ధ్యానానికి ఇటువంటి ప్రేరణ కావాలి. క్రోధం వరదలా ఉంటే దానికి ఎదురీది దాన్ని వశం చేసికోవాలి. ఎదురీత వలన చేతులు విరిగిపోతాయనిపిస్తుంది. ఊపిరి తిత్తులు తీవ్రమైన ఒత్తిడిని పొందుతాయి. కాని వాటిని సహించి ఆవలి గట్టుకు చేరడంవలన చాలా సాధించేమన్న భావన కలుగుతుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితం చిన్న వయస్కులను, సాహసోపేతులను ఆకర్షిస్తుంది. సెయింట్ తెరెసా, శ్రీ రామకృష్ణ వంటి వారు ఆధ్యాత్మికంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కి చుట్టూ ఉన్న ప్రపంచం దేవుని రూపమని గ్రహించేరు.

శ్రీకృష్ణుడు "నా మీద పూర్తిగా ఆధారపడు" అని ఎందుకు చెప్పేడు? దేవుడి మీద భారం వేసినవారు ఇతరుల మీద ఆధారపడరు. యోగులు చెప్పే భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు. అది మన ఆత్మ. సమాధిలో అన్ని రకాల ఎడబాట్లు పోయి, మన౦ ఆత్మలో రమిస్తాము. దానివలన జీవితం గూర్చి అన్ని అనుమాలూ, ఊగిసలాట, భయం పోతాయి. మనము సంపూర్ణమైన ప్రేమ శక్తిలో ఒక భాగం అవుతాం. దేవుని దయ మనయందు ప్రవేశించి, పరోపకారానికై ఉపయోగిస్తాం. 28

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...