Thursday, September 12, 2024

Viveka Sloka 14 Tel Eng




	
అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ।
ఉపాయా దేశకాలాద్యాః సంత్యస్మిన్సహకారిణః ॥ 14॥ (పాఠభేదః - సంత్యస్యాం)
adhikāriṇamāśāstē phalasiddhirviśēṣataḥ ।
upāyā dēśakālādyāḥ santyasminsahakāriṇaḥ ॥ 14॥ (pāṭhabhēdaḥ - santyasyāṃ)

ఫలసిద్ధి - ఫలముయొక్క సిద్ధి, విశేషతః - ముఖ్యముగ, అధికారిణం – అధికారిని, ఆశాస్తే - అపేక్షించును, అస్యాం - ఈ ఫలసిద్ధి యందు, దేశకాలాద్యాః - దేశము కాలము మొదలైనవియు, ఉపాయా- ఇతరోపాయములును, సహకారిణః- సహకారులుగ, సంతి - ఉన్నవి.

At the outset the success of a sadhaka depends on his particular mental or psychological make up. This is true even with tutelage under an extremely capable and kind-hearted guru who can teach the disciple the truths he learnt from his guru, and guide the disciple. The capability of a guru matters for the success of the disciple but not in its entirety

There is no perfect time to begin sadhana. Some seek sannyasa at a young age. Some attain vairagya at an advanced age or in vanaprastha. There is no set place either. One can be a sannyasi in his own home or withdraw to a secluded place by accepting sannyasa from a guru.

It is common to see parents overly concerned about their children's "milestones". They want their children to begin kindergarten studies at a young age and graduate from college in their 20's. Then they want to perform their marriage and expect their grand children. Such plans are fine but not necessary. Some children blossom late. They may marry when they are in their 30's after completing studies in a university. Or they may remain as bachelors in their spiritual quest. They can choose to adopt children or not have any children at all, and so on.

A sadhaka has none to blame but himself if, after being taught by a capable guru, falls off the apple cart. We see some false prophets who indulge in improper behavior with children and women when left to their own devices. No competent guru can take credit for that.

కర్మల ఫలము మనకు కనుపించునది. అందుచే

'యదాహ వనీయే జుహోతి'

ఆహవనీయమునందు హోమము చేయుటవలన;

'అశ్వస్య పదే జుహోతి'

అశ్వము పాదము పెట్టినచోట హోమము చేయవలెను.

'ప్రాచీనప్రవణే వైశ్వదేవేన యజేత'

ప్రాచీన ప్రవణమున వైశ్వదేవయాగము చేయవలెను;

‘సాయం జుహోతి ప్రాతర్జుహోతి'

సాయంకాలమునందును, ప్రాతఃకాలము నందును హోమము చేయవలెను;

'వసన్తే బ్రాహ్మణో అగ్ని నాదధీత'

బ్రాహ్మణుడు వసంతమునందు అగ్న్యాధానము ఇత్యాది శాస్త్రములు పేర్కొనిన వసన్తప్రాతఃకాలాది కాలములును, అశ్వపదాది దేశములుగూడ (ఫలమునకు) అసాధారణకారణము లని అంగీకరింపవలెను.

(ఆశంక) "యథాదర్శే తథాత్మని యథాస్వప్నే తథా పితృ లోకే, యథాప్సు పరీక్ష దదృశే తథా గంధర్వలోకే ఛాయాతపయోరివబ్రహ్మలోకే".

ఆత్మ నిర్మలమగు బుద్ధియందు అద్దములో కనబడి నట్లు స్పష్టముగ కనబడును. పితృలోకమునందు స్వప్నమునందువలె అస్పష్టముగ కనబడును, గంధర్వలోకమున నీటియందువలె ఇంకను అస్పష్టముగ కనబడును; బ్రహ్మలోకమున ఎండనీడలువలె వివిక్తముగ అతిస్పష్టముగ కనబడును;

"ఇహ చేద వేదీదథ సత్యమస్తి, న చేది హా వేది దథ మహతీ వినష్టః”

ఈ లోకమునందు బ్రహ్మ సాక్షాత్కా రమును పొందగలిగినచో ఈ మనుష్య జన్మకు సార్థకత్వమున్నది: పొందజాలకపోయినచో గొప్పవినాశనము కలుగును- ఇత్యాదిశ్రుతులు మనుష్యలోక బ్రహ్మలోకములే బ్రహ్మజ్ఞానమునకు తగు దేశములని చెప్పుచున్నవి.

ఋణత్రయమపాకృత్య మనో మోక్షే నివేశయేత్,

అనపాకృత్య మోక్షం రు సేవమానో ప్రజత్యధః.

మూడు ఋణములను చెల్లించినపిదప మనస్సును మోక్షమార్గమున నిలుపవలెను; వాటిని చెల్లింపకయే మోక్షమార్గమున ప్రవర్తించువాడు అధోగతిని పొందును.

బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహా ద్వసీ భూత్వా ప్రవ్రజేత్ -

బ్రహ్మచర్యమును పూర్తి చేసికొని గృహస్థుడు కావలెను. తరువాత వానప్రస్థుడై, అటుపిమ్మట సంన్యాసమును స్వీకరించవలెను. ఇత్యాది ప్రమాణముల ననుసరించి బ్రహ్మజ్ఞానమున కంతరంగమగు సంన్యాసమునకు కూడ విహితమగు కాలమున్నది. కావున బ్రహ్మజ్ఞానమునకు గూడ దేశకాలాద్య పేక్ష ఉన్నదిగదా?

(సమాధానము) ఇట్టి వాక్యము లున్నమాట సత్యమే. అయినను, చిత్తశుద్ధిలేని రాక్షసరాజగు విరోచనుడు బ్రహ్మలోకమునకు వెళ్లినను, పరమగురువగు బ్రహ్మనుండి ఉపదేశము పొందినను ఆత్మ జ్ఞానమును పొందజాలక పోయెను. మరియు

It was said that atma would be visible in the budhi (intellect) like a reflection from a mirror; in pitru loka, it would be blurry; in gandharva loka, it would be like the reflection from water with waves; in Brahma loka it would be clear as a shadow. This was illustrated in the Chandogya upanishad as an allegory.

Once the King of Asuras, Virochana, and the King of Devas, Indra, went to the ashram of Prajapati to receive atma gnana or self-discovery. At the end of their studies, after mistaking his body, his reflection in the water, and the agent in the deep sleep (sushupti), when there is no perception of any kind, as atma, Indra attained the correct knowledge. Whereas Virochana with self-aggrandizement declared that his body was atma forcing the Asuras to live in servitude to him. Thus Indra and Virochana came with different conclusions about atma when all else was the same. However, only Indra was triumphant.

This is true in the modern context as well. Some students will pass with higher grades and honors than others despite being taught by the same teacher and in the same curriculum. Indeed it is common to grade the students with alphabet soup. So even if the entire class deserves a high grade, still the teacher awards them variegated grades.

Though high grades from eminent professors open doors to better jobs, ultimately the performance of the graduate in the job matters. One can't rest on his academic laurels forever and must constantly retrain himself to achieve the ultimate success. Similarly sadhana is never ending, despite attaining enlightenment, requiring constant sravana (listening), manana (repetition) and nidhidhyasana (reminiscing) until it becomes second nature.

It is common to blame the teachers and curricula when a student fails to reach his goal. Still one can't dispute the value of education. Similarly to attain moksha, the marthya loka, which is despised because of the karma, is the most suitable launch pad. It is here only that we can receive the fruit of karma and the pathway to moksha is clearly laid out. Tapas (meditation), vairagya (renunciation) and sadhana are considered as possible only here.

A less stressed aspect of vedanta is that a mumukshu must repay the debt (runa) to parents, rishis and devas to attain moksha. It is because of our parents that we are here. So we are indebted to them foremost. The rishis offered us knowledge by passing on scripture through generations. The devas gave us everything else. Hence we are indebted to all of them.

Before accepting sannyasa, Sankara gave word to his mother that he would be on her bed side when the time came for her to die and perform the last rites. As he came to his mother's death bed to fulfill his promise, the neighbors thought as a sannyasi, who was expected to have transcended samsara, he was flouting his order in life by performing last rites for his mother. When he needed fire to light the pyre, no one came forward to offer nor for assistance. Somehow with divine intervention Sankara completed the rites and moved on. So it is clear that until the three runas are paid back, there would be no salvation even for the jagat guru.

'సంసారమేవ నిస్సారందృష్ట్వా సారదిదృక్షయా,

ప్రత్యజన్త్యకృతోద్వాహాః పరం వైరాగ్యమాశ్రితాః,'

సంసారము నిస్సారమని గ్రహించి కొందరు, సారమును (పరతత్వము) చూడవలెనను అభిలాషతో, వివాహము చేసికొనక, పరమవైరాగ్య వంతులై సంన్యసించుచున్నారు.

"యది వేతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా

వనాద్వా; యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ "

లేదా బ్రహ్మచర్యా శ్రమమునుండియే సంన్యసించవచ్చును; గృహస్థాశ్రమమునుండి లేదా వానప్రస్థాశ్రమమునుండి సంన్యసింపవచ్చును; ఏ దినమున వైరాగ్యము కలుగునో ఆ దినమునందే సంన్యసింపవచ్చును- ఇత్యాది ప్రమాణములననుసరించి, మున్ముందు చెప్పనున్న వైరాగ్యాది సాధన చతుష్టయ సంపత్తికలవానికి దేశకాలముల అపేక్ష లేదు అను అభిప్రాయముతో, దేశకాలములు కేవలము సహకారులు ప్రక్కనుండి ఉపకరించునవి మాత్రమే అని చెప్పబడినది.

కావుననే

'విద్వాన్ సంన్యస్త బాహ్యార్ధసుఖస్పృహః సన్'

అనువాక్యము శ్లో. 8 బ్రహ్మస్వరూపమున ఉండుట అనెడు మోక్షమునకు ప్రత్యక్షసాధనమగు సమ్యగ్దర్శన నిష్ఠ కొరకు, మోక్షసాధనమును ఉపదేశించు గురువును ఆశ్రయించి అతడు ఉపదేశించిన విషయముపై మానసమును నిలుపుటకై వివేక వైరాగ్యములు హేతువులని చెప్పినది.

ఇట్టి మనః స్థైర్యము శమ, దమ, ఉపరతి, తితిక్షా, శ్రద్ధలు లేనిచో లభింపదు. మోక్షేచ్ఛలేనిచో మోక్ష ప్రయత్నము సంభవింపదు. కావున “అతో విముక్త్యా" అను 8వ శ్లోకమున, బ్రహ్మజిజ్ఞాసకు సాధారణ హేతువులగు వివేక-వైరాగ్య- శమాది షట్క ముముక్షుత్వములు సూచితము లైనవి.

"తరతి శోక మాత్మవిత్ "

ఆత్మజ్ఞానవంతుడు శోకమును దాటును;

"తద్వి జ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ "

ఇత్యాది శ్రుత్యనుసారముగ 'శోకము' అను నామాంతరముగల బంధమును నశింపచేయగల్గిన సమ్యగ్ జ్ఞానము లభింపవలెనన్నచో సద్గురువు ఉపదేశించిన విషయమును మననము చేయుట తప్ప మరియే సాధనమును లేదను విషయము గూడ ఈ శ్లోకమున సూచితమైనది. 'అస్యాం' అనగా 'సిద్ధియందు' అని యర్థము.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...