Saturday, January 13, 2024

Bhagavata Origin Melancholy Of Vyasa






upanishad

వ్యాసుని నెరాశ్యము

ద్వాపర యుగము ముగియు సమయ మాసన్నమాయెను. సత్యవతీ నందనుడగు వ్యాసుడు ఒకనాడు సరస్వతీ నదీజలములలో స్నానాది కర్మములను ముగించి, నిర్మలమై పవిత్రమై నొప్పారు బదరికాశ్రమమున ధ్యానచిత్తముతో కూర్చొని యుండెను.

వ్యాసుడు వేదములను సంస్కరించిన మహనీయుడు. అష్టాదశపురాణములకు కర్తయైనవాడు. (బహ్మసూత్రములను రచించినవాడు. వేదవ్యాసుడని క్రీర్తింపబడెను.

వ్యాసుడు అశ్రుపూర్ణవదనుడై విచారముతో గూర్చొని యుండెను. ఆ దారిన అదే సమయానికి వెడుచుండిన నారదమహర్షి వ్యాసుని గాంచెను. వ్యాసుని ముఖారవిందమున గోచరమయ్యే బాధను గ్రహించెను. వ్యాసుని ప్రశ్నించెను. “పరాశరాత్మజా! మీ వదనమున విషాదఛాయలు అలుము కొనుటకు కారణమేమి? సర్వశాస్త్ర పారంగతులెన మీకు అశాంతి ఎలా ఏర్పడినది?"

ఉ|| ధాతవు భారతశృతి విధాతవు వేదపదార్థజాల వి

జ్ఞాతవు కామ ముఖ్యరిపు షట్క విజేతవు (బహ్మ తత్త్వ ని

ర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చలించి చెల్లరే

కాతరు కైవడిన్‌ వగవ గారణవేమి పరాశరాత్మ జా

నారదుని మాటల నాలకించిన వ్యాసుడు ఇలా పలికెను.“నారదమునీంద్రా! అదియే నాకును అవగత మగుటలేదు. నీవు త్రిలోక సంచారివి. జ్ఞానివి. నీకు తెలియని విషయము లేదు. నీవు మూడులోకముల యందు చరించుచుందువు. వాయుదేవుని వలె నిఖిల లోకముల మెలగుచుందువు. బ్రహ్మశరీరము నుండి పుట్టినవాడవు. పురాణపురుషుడైన విష్ణుమూర్తిని కీర్తించుచుందువు. అన్ని దిక్కులయందు నీ పవిత్ర పాదముల నుంచితివి. గొప్ప జ్ఞానవంతుడవై తరించితివి .

క || పుట్టితి వజు తనువున జేపట్టితివి పురాణపురుషు భజనము పదముల్

మెట్టితివి దిక్కులం దుది ముట్టితివి మహాప్రబోధ మున మునినాథా

“మునీంద్రా! నీకు తొలియని ధర్మము ఏ లోకమునను లేదు. సమస్తమును దర్శించినవాడవు. ఈ నా నైరాశ్యమునకు కారణమేదియో నీకు తెలియును. దయతో నాకు వివరింపుము"

క||నీ కెఱుగరాని ధర్మము లోకములను లేదు బహువిలోకివి నీ వీ

నా కొఱత యెట్టి దంతయు నాకున్‌ వివరింపవయ్య నారద కరుణన్‌

నారదుడు క్షణకాల మాలోచించి వ్యాసునితో ఇలా పలికెను. “మహాత్మా! నీవు ధర్మార్థ కామములను తెలిపెడి (తివర్గములను గూర్చి మహాభారతాది గ్రంథములలో రచించితివి. శ్రీ మహా విమ్హవు యొక్క దివ్యగాథలను కీర్తించు మోక్షప్రదాయకమగు గ్రంథమును రచింపకుంటివి. హరినామ స్తుతికి నోచుకోని కావ్యము విచిత్రార్థములతో గూడి యుండినను కాకుల గర్తమువలె యుండును.

మహాత్మా! వ్యాసా! జటిలమైన వేదాంత శాస్త్రమును ప్రవచించిన నీవు భగవద్భక్తిని గూర్చి ( పత్యేకముగా (పవచించవైతివి. ఎంతటి జ్ఞానము కలిగినను భక్తిలేనిదే ముక్తిరాదు. భగవానుని అనంత కళ్యాణ గుణములను కీర్తి౦చకపోవుటయే నీ ఆవేదనకు ముఖ్యకారణము. వారిభక్తిని విరివిగ పంచెడి భాగవత కావ్యమును రచించి మీ హృదిలోని ఆవేదనను పోగొట్టుకొనుడు" యని తెలియజేసెను.

ఉ|| అచింత్యమైన ధర్గచయ మంతయు జెప్పితి వందులోన నిం ఆ కణము నిం

చించుక గొని విష్ణుకథ లేర్పడి జెప్పవు ధర్మముల్‌ (పవం

చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నిన గాక నీకు నీ

కొంచెము వచ్చుటెల్ల వారి గోరి నుతింవుమి నార్యవూజితా ‌ నిర్గతకర్మము, నిరుపాధికమునగు జ్ఞానము హరిభక్తి లేకుండా సిద్దించదు. ఈశ్వరార్పణ బుద్దితో చేయబడని కర్మము ఈశ్వరప్రియము గాబోదు. భక్తిరహిత కర్మ జ్ఞానములు నిరర్ధకములు. కనుక భవబంధములను తొలగించు వాసుదేవుని లీలా విశేషములను వర్తింపుమని నారదుడు వ్యాసునికి చెప్పెను. భక్తియుతుడు సంసారమున చిక్కడు. భక్తిరస వశీకృతుండై హరిచరణ సేవను సదా చేయుచుండు ననెను.

ఓం నమో భగవతో వానుదేవాయ ధీమహి

(పద్యుమ్నాయా నిరుద్దాయ నమ స్స౦కర్షణాయ చ

అని నారదుడు కీర్తించి కృష్ణనామ వైభవమును వివరించుచు తన పూర్వజన్మ వృత్తాంతమును

At the denouement of dwapara yuga Vyasa, the son of Satyavati, was in deep meditation on the banks of Saraswati river. He had restructured Vedas, wrote eighteen puranas and authored Brahma Sutras. He was called Veda Vyasa.

Vyasa was in melancholy and shedding tears as the Narada muni was passing by. Narada was stunned and said "O son of Parasa, your face looks very sad. Being an omniscient what is the reason for this melancholy?"

Vyasa replied: "O Narada, I don't know why I am depressed. You tour all the worlds. You are well versed with all the lokas. You are born to Brahma Deva and praise Lord Krishna. You accomplished a lot and made your life fruitful.

Narada interjected: "O sage, you described dharma, artha (wealth) and kama (desire) in various ways in Maha Bharata and puranas. But you have not dwelled on the devotion to Sri Hari. No matter how much knowledge you gain from reading books, without devotion such knowledge won't bear fruits. Why don't you write Bhagavata describing the greatness of Sri Hari? This will certainly end the depression. The nirguna (devoid of qualities) and nirupadhika (devoid of body) knowledge cannot be gained without devotion. The karma done without offering the fruits to the Lord, won't please the Lord. In a nutshell, knowledge without devotion is useless. Why don't you write about the lila of Sri Hari that will offer salvation to the devotees? With devotion one will not be caught in the unending samsara and attain Sri Hari."

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...