Thursday, November 14, 2024

Viveka Sloka 21 Tel Eng




తద్వైరాగ్యం జిహాసా యా దర్శనశ్రవణాదిభిః । (పాఠభేదః - జుగుప్సా యా)
దేహాదిబ్రహ్మపర్యంతే హ్యనిత్యే భోగవస్తుని ॥ 21॥ (పాఠభేదః - భోగ్యవస్తుని)

దర్శనశ్రవణాదిభిః = దర్శనము శ్రవణము మొదలగువాటిచే, దేహాది బ్రహ్మపర్య౦తే - దేహము మొదలు బ్రహ్మవరకును గల, అనిత్యే= అనిత్యమగు, భోగ్యవస్తుని - భోగ్యవస్తువునందు, యా = ఏ, జుగుప్సా= అసహ్యముకలదో, తత్ = అది, వైరాగ్యం - వైరాగ్యము.

ఇహలోకమునందలి దేహాది భోగ్యవస్తువులను చూచుటచేతను, పరలోకమునందలి దివ్యదేహము మొదలగు భోగ్యవస్తువులను గూర్చి వినుటచేతను, 'అది' పదమును ప్రయోగించుటచే చూచిన వాటికిని, విన్నవాటిని, సజాతీయములగు వాటిని అనుమానముద్వారా తెలిసి కొనుటచేతను, ప్రత్యక్షముగ అనుభవింపబడుచున్న శరీరము మొదలు, బ్రాహ్మమానము ప్రకారము నూరు సంవత్సరములు జీవించు నట్టిదియు, చతుర్దశభువనాధిపత్యమును ఇచ్చునదియు అగు హిరణ్యగర్భ శరీరము వరకును గల, అనిత్యములును, అసత్యములును అగు సకలభోగ్యవస్తువుల విషయమునను “ఎన్నటికి ఇట్టిపదార్థములతో సంబంధము కలుగకుండుగాక" అను ఏ జుగుప్స కలదో, కాకి రెట్ట యందు వలె ఏ అసహ్యముకలదో, అదియే వైరాగ్యము.

వైరాగ్యవిషయమున ఈ క్రింది శ్రుతి స్మృతి పురాణాది వచనములను అనుసంధానము చేసికొనవలెను.

స్వదేహాశుచిగంధేన న విరజ్యేత యః పుమాన్,

 వైరాగ్యకారణం తస్య  కిమన్యదుపదిశ్యతామ్

తనదేహమునందలి దుర్గంధముచే విరక్తి చెందని పురుషునకు వైరాగ్యము కలుగుటకు మరియేమి చూపవలసియుండునో!

సతతం ప్రవాహ్యమానైః వృషభైరవ్వైః ఖరైర్గజై ర్మహిషైః, 

హా కష్టం! క్షుత్థామైః శ్రాన్త్యైర్నో శక్యతే వక్తుమ్.

ఎల్ల వేళల భారాదులను మోయించుటచే అలసి, ఆకలితో కృశించిన వృషభములు, అశ్వములు, రాసభములు, గజములు, మహిషములు, అయ్యో! పాపము ! తమకష్టము చెప్పుకొనజాలవు కదా!

తద్యథేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవాముత్ర 

పుణ్యచితో లోకః క్షీయతే, భూమ్నో అ న్యదార్తమ్. 

-బ్రహ్మకంటే భిన్నమైనదంతయు నశ్వరము .

క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి 

-పుణ్యము క్షీణింపగనే మనుష్యలోకమును చేరుదురు.

అబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తి నోర్జున,

-ఓ అర్జునా ! బ్రహ్మలోకమువరకును గల లోకములన్నియు, మరల తిరిగి వచ్చునవే.

సూతసంహితలో యజ్ఞ వైభవఖండములోని సప్త దశాధ్యాయము సర్వ వేదాన్త సిద్ధాన్త సారసంగ్రహములో

కుక్షౌ స్వమాతుః మలమూత్రమధ్యే

- తల్లి యొక్క కుక్షిలో మలమూత్రములు మధ్య.... మొదలు

పుణ్యక్షయే పుణ్యకృతో నభసైర్నిపాత్యమానాన్, 

శిథిలీకృతాంగాన్ నక్షత్రరూపేణ దివస్స్యు తాంస్తాన్, 

విచార్య కోవా విరతిం న యాతి.

పుణ్యము క్షీణింపగనే, స్వర్గమునందున్న దేవతలు క్రిందికి పడ ద్రోయగా శిథిలమైన శరీరముకలవారై నక్షత్రరూపమున స్వర్గము నుండి పడిపోవుచున్న పుణ్యాత్ములను చూచి ఎవనికి వైరాగ్యము కలుగదు?

యత్రాస్తి లోకే గతి తారతమ్యమ్

ఏ లోకమున గతులలో తరతమభావము (అధికత్వాల్పత్వములు) ఉన్నదో,

-అనునంతవరకును ఉన్న శ్లోకములు - మనుష్యదేహాదికము రోగాదులచే బాధింపబడుచుండుటను, పశ్వాదులు ఏమియు మాటలాడలేక పరాధీనములై ఉండుటను, దేవతలు రాక్షసులచే పీడితులగుటను, కురంగాదుల విషయమున చూచినట్లు శబ్దాదివిషయములు అనేకవిధములగు అనర్ధములకు హేతువగుటను చూచుచున్న వానికి ఆత్మభిన్నమగు ప్రతిపదార్థమునందును జుగుప్స అనాయాసముగ కలుగును అని భావము.

ఈ విషయమును 'శబ్దాదిభిః ' ఇత్యాది శ్లోకములలో మున్ముందు స్వయముగనే స్పష్టీకరింపగలడు..

(అశంక) శ్రు. "అపామ సోమమమృతా అభూమ " - సోమ పానము చేసితిమి; అమరుల మైతిమి,

శ్రు. "అక్షయ్యం హ వై చాతుర్మాస్యయాజినః సుకృతం భవతి" - చాతుర్మాస్య యాగము చేసినవాని సుకృతము అక్షయ్యముగ నుండును, ఇత్యాది శ్రుతులను బట్టి కర్మఫలము కూడ అనిత్యమని తెలియుచున్నది కదా?

(సమాధానము) ఐనను "కర్మచే సాధింపబడిన దెల్ల అనిత్యము" అను న్యాయముచే ఉపోద్బలితమగు - శ్రు.

"తద్యదేహ కర్మ చితో లోకః..” ఇత్యాది శ్రుతస్తరము ననుసరించి 'అమృత ' ‘అక్షయ్య' పదముల అర్థమును తప్పక సంకుచితము చేయవలసి యుండుటచే దోషము లేదు. కావుననే

"అభోత సంప్లవం స్థానమమృతత్వం హి భాష్యతే" - మహాభూతప్రళయమువరకు ఉండుటకు అమృతత్వమని పేరు అని చెప్పుదురు.

అవ. శనస్వరూపమును విశదీకరించుచున్నారు.

tadvairāgyaṃ jihāsā yā darśanaśravaṇādibhiḥ । (pāṭhabhēdaḥ - jugupsā yā)
dēhādibrahmaparyantē hyanityē bhōgavastuni ॥ 21॥ (pāṭhabhēdaḥ - bhōgyavastuni)

Kapila Gita in Bhagavata (skandha 3) delineates the process of human birth. Lord Kapila says a fetus suffers in the womb while situated amidst excretory organs and subjected to the pain caused by astringent food ingested by the mother. It makes one repugnant of rebirth. Coming to know how ephemeral (anitya) are the things in the phenomenal world, one might think a deva loka will give unlimited pleasure forever. As Lord Krishna stated in Bhagavad Gita (9.21), even the heavenly pleasures last for as long as punya is there.

Knowing the finitude of all the things and events in creation is called vairagya. Sankara in essence is telling a sadhaka to be detached from all things going as far up as Brahma. Only moksha is to be desired. If moksha is finite, everyone will be born again after kalpantakam or devolution of the universe. A sadhaka has to seek immunity from all future births and stay merged with brahman forever.

A mumukshu is an impersonalist or a worshiper of the unmanifest, inconceivable, holistic nirguna (without attributes) brahman. The other group is made of personalists who pray to saguna (with attributes) deities. In an era of multiplicity of religions and deities within each, the task of finding a suitable deity to worship itself is like shopping for clothes. If they see their favorite deity's form on paper being trampled in a street corner, they writhe in pain as though their personalized deity was harmed. The search for bliss by going from one deity to another is never ending and may be considered a waste of time by a mumukshu.

Therefore, is renouncing the idol worship also vairagya? An internet guru, while teaching about advaita, advised his listeners to refrain from visiting temples and performing archana, abhishekha, etc. It makes theoretical sense but is not practical. When a marauding army of an enemy destroys idols and temples of the land, a mumukshu is not overly concerned because the nirguna brahman transcends all of them. Whereas devotees express anguish or may seethe with anger. The result is the bloodshed. All because some people are so strongly attached to the saguna brahman and have followed the path of bhakti yoga.

So what can a mumukshu do when everything on the material plane is renounced? Will the objective of the brahman to grow the universe through evolution be met when everyone chooses sannyasa ashram? In nature, we see plants under the canopy of tall trees competing for sunlight which is a limited resource in rain forests. Similarly, there will be fewer mumukshus than those having deep conviction of bhakti yoga. The saguna bhakti is easy to initiate even though it may, from time to time, engender disillusionment causing the bhakta to switch his allegiance from one deity to another.

One thing a mumukshu will find hard to renounce is the comparison with devotees worshiping saguna brahman. Some believe that life long devotion to Lord Krishna would relieve one from transmigration by earning them a place in vaikuntha, the Lord's abode. This could be based on the Lord's assurance in Gita (9.34). If all of us become Lord Krishna's devotees, vaikuntha will be inundated so much so that the Lord has to find for himself another Loka or put stricter standards of devotion for qualifying to enter his abode.

But a mumukshu shouldn't ridicule the devotees following bhakti yoga. He could see himself as going against the tide with firm faith and belief in nirguna brahman. Indeed the devotees may ridicule him as an atheist. Even Sankara had to endure it in his times. So he went on to compose several hymns for the worship of vedic deities. It is apparent that he believed the vedic gods are endowed with powers that would make him overcome the obstacles to his path. In one of his stotras he wrote deenasya deva krupaya sarana gatasya meaning "I am in a decrepit state...I surrender completely to you... please save me". Such humility is hard to find in hymns written by others. A firm belief in advaita or non-duality will help the mumukshu overcome obstacles.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...