Friday, January 24, 2025

Viveka Sloka 27 Tel Eng





సర్వదా స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా । (పాఠభేదః - సమ్యగాస్థాపనం)
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనమ్ ॥ 27 ॥

శుద్ధే - పరిశుద్ధమగు, బ్రహ్మణి = బ్రహ్మయందు, సర్వదా - ఎల్లప్పుడును, బుద్ధేః = బుద్ధియొక్క ఆస్థాపనం - నిలుపుట, తత్ = ఆ, సమాధానం – సమాధానము, ఇతి= అని, ఉక్తం - చెప్పబడినది, తు - కాని, చిత్తస్య = చిత్తముయొక్క, లాలనం = లాలనము, న = కాదు.

స్వలక్ష్యమునందు స్థిరముగ నుండుట యనునది శమము. అట్టి శమమునకును ఈ సమాధానమునకు ఎక్కువ భేద మున్నట్లు కనబడుటలేదు.

అయినను - మాటిమాటికిని దోషములను చూచుచు విషయములనుండి విరక్తమై మనస్సు తన లక్ష్యమునందు స్థిరముగ నుండుట యనునది శమము. దీనిని సంపాదించుటకు, సంకల్ప వికల్పాత్మకమగు మనస్సును స్థిరముగ నుంచుకొనుటకు,

యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్,

తతన్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్,

చపలము, అస్థిరము అగు మనస్సు ఏ యే మార్గములద్వారా బయటకు పోవుటకు ప్రయత్నించుచుండునో ఆ యా మార్గములనుండి అడ్డు పెట్టి దీనిని ఆత్మయందే (తనయందే) వశమగునట్లు చేయవలెను అని భగవద్గీతలో చెప్పిన విధమున ప్రయత్న విశేషము అపేక్షిత మగుచున్నది.

కావుననే ఇచట (సమాధానమున) "నిశ్చయాత్మకమగు బుద్ధిని ఎల్ల వేళల శుద్ధబ్రహ్మయందు స్థిరముగ నిలుపవలెను" అని చెప్పుటచే, ప్రకృతమున అంతఃకరణము సంకల్ప వికల్ప విముక్తము కావలెనని చెప్పుట జరిగినది.

కావుననే సంకల్ప వికల్పాత్మ కాంతః కరణార్థకమగు 'మనః' శబ్దమును ప్రయోగింపక నిర్ణయాత్మకాంతఃకరణ మను అర్థముగల “బుద్ధి”' శబ్దము ప్రయోగింపబడినది. మరియు 'శుద్ధే బ్రహ్మణి' అని సర్వోపాధివినిర్ముక్త మగు నిర్గుణబ్రహ్మమునందు నిలుప వలెనని చెప్పబడినది.

శమమును గూర్చి చెప్పునపుడు 'స్వలక్ష్యే నియతావస్థా' అనుటచే సగుణవస్తువుపై స్థిరముగనున్నను మనస్సు శాంతమని చెప్పుటకు అవకాశమున్నది.

శమము సాధనము, సమాధానము దాని ఫలము. అనగా శమమే పరిపక్వమైనచో సమాధాన మగును.

లోకములో పిల్లలు ఎక్కువగ ఏడ్చినపుడు వారికి కావలసిన దానిని ఇచ్చి ఊరడింతురు. ఆ విధముగ మనస్సునకు యథేష్టముగ విషయమార్గమున ప్రవర్తించు అవకాశ మిచ్చినచో అది సమాధానము కాజాలదని బోధించుటకై “న తు చిత్తస్య లాలనమ్ " అని వ్రాయు చున్నాడు లేదా…

శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహన్తీ వాసనాసరిత్,

పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి. 

శుభాశుభమార్గములలో ప్రవహించుచున్న వాసనానదిని పురుష ప్రయత్నముచే శుభమార్గమున ప్రవహించునట్లు చేయవలెను.

అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్, 

స్వమనః పురుషార్థన బలేన బలినాం వర

ఓ బలవంతులలో శ్రేష్ఠుడా! అశుభమార్గములందు ప్రవర్తించుచున్న తన మనస్సును, పురుషప్రయత్నముచే, బలాత్కారముగ శుభ మార్గములందే ప్రవర్తించునట్లు చేయవలెను.

అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదసీతరత్, 

జన్తోశ్చిత్తం తు శిశువత్  తస్మాత్త చ్బాలయేద్బలాత్.

అశుభమార్గమునుండి చలింపచేయబడిన మానవుని చిత్తము శుభ మార్గమువైపు పోవును. శుభమార్గము నుండి దరింపబడినచో అశుభ మార్గము వైపు పోవును. కావున దానిని శిశువునువలె, బలాత్కారముగ (శుభమార్గము వైపు) చలింపచేయవలెను.

సమతా సాన్త్వనేనాశు న ద్రాగితి శనైః శనైః,

పౌరు షేణ ప్రయత్నేన లాలయే చ్చిత్త బాలకమ్.

ఈ విధముగ చిత్తమనెడు బాలుని, సమతయనెడు సాంత్వనము (ఊరడింపుచే) తొందరపడకుండ మెల్లమెల్లగ పురుష ప్రయత్నముతో లాలింపవలెను అని వాసిష్టోక్త ప్రకారమున చాలనము లేదా లాలనము శమాది సాధనముగ పూర్వము (ప్రారంభమున) అపేక్షిత మైనది. ఫలమైన సమాధానావస్థలో దాని ఆవశ్యకతలేదు.

అట్టి లాలనము లేకున్నను, శమాదులను సంపాదించుకొనెడు సమయమున చేసిన ప్రయత్నము చేతనే మనస్సునందలి బాహ్యవాసనలన్నియు క్షీణించును. ఇక ఆ మనస్సును సగుణమునుండి తప్పించి నిర్గుణ స్వరూపము పై నిల్పుట అనునది ఒక్కటియే కావలసినది,

అవ. ఇట్టి సాధన సామగ్రి ఉన్న వానికి మాత్రమే ముముక్షుత్వము లభించునుగాని ఇతరులకు లభించదని చెప్పుచున్నాడు..

sarvadā sthāpanaṃ buddhēḥ śuddhē brahmaṇi sarvadā । (pāṭhabhēdaḥ - samyagāsthāpanaṃ)
tatsamādhānamityuktaṃ na tu chittasya lālanam ॥ 27॥

Just as Gita is the science of religion espoused by Lord Krishna, the science of liberation enunciated by Adi Sankara is Chudamani. The non-believers of Gita are considered as atheists by some. Some hold the view that mumukshus are also atheists. The world is not just in the dichotomy of believers and non-believers. There are several agnostics and skeptics who don't fall into these two camps. Many modern scientists are in these categories. They understand the limitations of their observations and pursuits, and accept that there is a higher power that controls and regulates from the vast universe to the lowest atom.

There are others who are essentially conformists and won't challenge the atheists. They submit to destiny and consider themselves to be incapable of doing anything except follow the religious guidelines. A mumuskhu by staying away from religious rites is not a coward but one who exercises free will. Like Sankara, when situation demands he will either praise the deities, argue with the non-believers, or criticize the atheists.

In this sloka Sankara is shunning all extremes and goading us to adopt an equanimous state of mind called samadhana to qualify as a mumukshu. The atheists and believers can argue forever about God. For example, the communists consider religion as the opium of masses and shun the believers taking advantage of the internal conflcts between saivaites and vishnuvaites, sunnis and shias, catholics and protestants.

The Acharya is asking us to adopt samadhana or a tranquil state of mind that lends itself to cool contemplation about the Supreme and Divine. It is the stepping stone to become a sthitapragna as Lord Krishna stated in Gita (2.55). Like a sthitapragna a mumukshu should transcend likes and dislikes, criticism and praise, honor and insults. He should not hold the extreme views of believers and atheists, and rise above the fray, just as one flying in a spacecraft doesn't see the boundaries between the nations but sees earth holistically.

Viveka Sloka 32 Tel Eng

Telugu English All మోక్షకారణసామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ । స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ॥ 32 ॥ మోక్షకారణసామగ్ర్యా...