Friday, May 23, 2025

Viveka Sloka 42 Tel Eng




కథం తరేయం భవసింధుమేతం
కా వా గతిర్మే కతమోఽస్త్యుపాయః ।
జానే న కించిత్కృపయాఽవ మాం ప్రభో
సంసారదుఃఖక్షతిమాతనుష్వ ॥ 42 ॥

ఏవం : ఈ, భవసిస్థుం - సంసారసముద్రమును, కథం = ఎట్లు, తరేయం - దాటగలను ?, మే = నాకు, కా - ఏమి, గతిః - గతి ?, కతమః - ఏ, ఉపాయః - ఉపాయము, అస్తి = ఉన్నది?, కించిత్ - ఏమియు, న జానే - ఎరుగను, ప్రభో -ఓస్వామీ, కృపయా = దయతో, మాం-నన్ను, అవ - రక్షింపుము, సంసారదుఃఖక్షతిం - సంసారదుఃఖము యొక్క నాశనమును, అతనుష్వ = చేయుము.

ఈ విధముగ అనేక విధములగు నివారింప శక్యము కాని దుఃఖముల సముదాయముచే వ్యాప్తమైన సంసారసముద్రమును ఎట్లు దాటుదును? ఈ విధముగనే ఉన్నచో నాకు ఏమి గతి ? నాకు ఏమి లభింపనున్నది? సర్వవిధముల దుఃఖమే అని తాత్పర్యము.

అందుచే ఈ సంసారసముద్రమును దాటుటకు ఏ ఉపాయమున్నది? నాకు మాత్రము ఏదియు కనబడుటలేదు. భీరుడనైన నన్ను రక్షింపుము. ఈ రక్షణమునే 'సాంసారదుఃఖక్షతి మాతనుష్వ ' అని చెప్పుచు స్పష్టీక రించుచున్నాడు. ఈ సాంసారిక దుఃఖమును సమూలముగ నశింప జేయుము అని యర్థము.

అప. ఇపుడు శ్లోకద్వయముచే గురువుయొక్క కర్తవ్యమును చెప్పచున్నాడు…

kathaṃ tarēyaṃ bhavasindhumētaṃ
kā vā gatirmē katamō'styupāyaḥ ।
jānē na kiñchitkṛpayā'va māṃ prabhō
saṃsāraduḥkhakṣatimātanuṣva ॥ 42॥

In our hymns we come across the phrase "Rajya Pradayini" which translates to "donor of kingdom". These days the probability of such a wish coming true is nil. So what does the rishi mean?

To answer the question we turn to Saint Tyagaraja who sang

Rama bhakti samrajyam
E manavula kabbeno manasa!

Which means, "O mind, who will obtain the kingdom called devotion to Lord Rama!". Several other references exist where devotion toward the Lord is considered as the ultimate kingdom to be had. Thus, devotees of the Lord are the Kings and Queens of their own right.

A sadhaka devoted to a Guru will, therefore, be rewarded with a kingdom of liberation where he is the king and the Lord is the emperor. Before progressing to that stage the sadhaka has to overcome samsara (bondage).

So in this sloka a neophyte is saying to the Guru, "At this juncture I see life as melancholic for the samsara awaits me. Is there a solution to overcome it? Can't you destroy the samsara which is the greatest cause of misery to me and the biggest obstacle to overcome?".

In other words the sadhaka is praying to Guru to guide him so that he can overcome his melancholy and all the vicissitudes in the path to liberation. Further he seeks the kindness and generosity of the Guru. This means Sampoorna Saranagati which is total surrender.

We see saranagati even in Bhagavad Gita in the case of Arjuna who declared his complete surrender to Lord Krishna. Similarly, Bhagavata's Gajendra (Elephant King), caught in the jaws of a crocodile, completely surrendered himself to Lord Vishnu, who until that moment allowed the Gajendra to experience pain for his past karma.

The Lord takes over the complete responsibility of nurturing and liberating when a devotee says anyatha saranam naasti -- "there is no one but you who can save me and to whom I completely surrender".

Saturday, May 17, 2025

Viveka Sloka 41 Tel Eng




బ్రహ్మానందరసానుభూతికలితైః పూతైః సుశీతైర్యుతై- (పాఠభేదః - సుశీతైః సితైః)
ర్యుష్మద్వాక్కలశోజ్ఝితైః శ్రుతిసుఖైర్వాక్యామృతైః సేచయ ।
సంతప్తం భవతాపదావదహనజ్వాలాభిరేనం ప్రభో
ధన్యాస్తే భవదీక్షణక్షణగతేః పాత్రీకృతాః స్వీకృతాః ॥ 41 ॥

హే ప్రభో = ఓ ప్రభూ, భవదీక్షణక్షణగతే - నీ యొక్క దృష్టి యొక్క క్షణప్రసారమునకు (ఎవరు), పాత్రీకృతాః - పాత్రగా చేయ బడినారో, స్వీకృతాః = (నీచే) స్వీకరింపబడినారో, తే - వారు, ధన్యాః - ధన్యులు, భవతాపదావదహనజ్వాలాభి - సంసారమునందలి దుఃఖము లనెడు దావాగ్నిజ్వాలలచే, సంతప్తం - ఆప్తుడై నట్టి, ఏవం - ఈ నన్ను, బ్రహ్మానన్దర సానుభూతికలితై - బ్రహ్మానంద రసము యొక్క అనుభవముతో కూడినవియు, పూతైః - పవిత్రమైనవియు, సుశీతై - చాల చల్ల వినియు, నితైః = పరిశుద్ధమైనవియు, యుష్మద్వాక్కల శోజితై - నీ యొక్క వాగింద్రియమనెడు కలశముచే పోయబడిన వియు, శ్రుతిసుఖైః = చెవులకు సుంకరమైనవియు అగు, వాక్యామృతై - వాక్యామృతములతో, సించయ = తడుపుము.

హే ప్రభో = ఓ సర్వసమర్థుడా ! భవదీక్షణక్షణగతేః - నీయొక్క దయార్ద్ర దృష్టి క్షణకాలముపాటైనను లభించుటకు, పాత్రీకృతాః - లక్ష్యముగా చేయబడినవారు లేదా మీయొక్క నేత్రముతో క్షణ కాలమైన సంయోగమునకు, పాత్రీకృతాః = ఆశ్రయముగా అయినవారు, కావుననే, స్వీకృతాః ఎవరు ఆత్మీయులుగా గ్రహింపబడినారో వారు ధన్యాః = కృతార్ధులు.

అందుచే నేను గూడ, నీ కటాక్షముచే తొలగింప బడిన అజ్ఞానము కలవాడనై అధికముగా పవిత్రీకరింప బడినవాడనై ధన్యుడనైతిని.

సాంసారికాగ్ని తాపమును అతిశీఘ్రముగ తొలగింప దలచినవాడై శాంతింప చేసికొనవలెనని కోరుచు ఈ విధముగ ప్రార్ధించుచున్నాడని సూచించుచున్నాడు.

'శ్రేయని కేన తృప్యతే'- శ్రేయస్సు కలుగుచున్నపుడు చాలునని ఎవరందురు అను లోకోక్తి ననుసరించి ఇంతను కోరుచున్నాడు.

కటాక్షపాత్రుడనై, స్వీకృతుడనగు, సంసార శోకదావాగ్ని జ్వాలలచే సంతప్తుడనగు, వీనం - ఎదుటనున్న నన్ను, బ్రహ్మానందమే ఆస్వాదింపబడును గాన రసము. దాని అనుభవముతో మిశ్రితములైన కనుకనే, పూతైః =సకల కల్మషములను హరించు నవగుటచే పవిత్రమైన "న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" - జ్ఞానముతో సమానమైన పవిత్రమగువస్తువు మరేదియు ఈ లోకమునలేదు కదా! అని స్మృతి ననుసరించి అట్టి జ్ఞానము కలవాని వాక్యములు గూడ సకల పాపహారముగు జ్ఞానమును ఉపదేశించున వగుటచే పవిత్రములు.

సుశీతైః = ఆధ్యాత్మికాది దైవికాధి భౌతికములగు అంతర తాపములను నశింప చేయునవగుటచే మిక్కిలి చల్లనైనవి.

సితైః- రజస్తమో మార్గములను తొలగించుట ద్వారా కేవల సత్త్వ మార్గమును మాత్రమే పొందింప చేయుటచే నిర్మలమైనవి.

నీ వాగింద్రియమునకు స్థానమగు ముఖమే కలశము ; దానినుండి బయల్వెడలినవి, కర్ణానందదాయకము లైనవి అగు వాక్యామృతములచే నన్ను తడుపుము. పవిత్రత్వము, శీతత్వము, శుద్ధత్వము, కలశోoజి తత్వము అనునవి వాక్యముల యందును, అమృతమునందును తుల్యముగ నుండుటచే వాక్యముల యందు అమృతత్వము ఆరోపింపబడినది.

'బ్రహ్మానన్దరసానుభూతి కలితైః' అనునది పవిత్రత్వమునకు కారణమును చెప్పుచున్నది. 'శ్రుతి సుభైః' అనుటచే శ్రవణకాలమునందే సుఖమును కలిగించునవి. వాటి యర్థమును బాగుగ అనుసంధానము చేసికొని అనుభవము లోనికి తెచ్చుకొన్నచో ఎంతటి ఆనందము కలుగునో చెప్పనలవికాదు అని సూచింపబడుచున్నది.

అన. (38 శ్లోకములు) వెనుక 'భీతం ప్రపన్నం' ఇత్యాది వాక్యములచే సూచితమగు భీతిని, వెంటనే తనపై అనుగ్రహము కలుగుటకై స్పష్టీకరించుచున్నాడు.

brahmānandarasānubhūtikalitaiḥ pūrtaiḥ suśītairyutaiḥ
yuṣmadvākkalaśojjhitaiḥ śrutisukhairvākyāmṛtaiḥ secaya | 
saṃtaptaṃ bhavatāpadāvadahanajvālābhirenaṃ prabho
dhanyāste bhavadīkṣaṇakṣaṇagateḥ pātrīkṛtāḥ svīkṛtāḥ || 40 ||

The Sanskrit phrase frequently seen in hymns is "sarva mrutyu nivaarini". It means the goddess will prevent all kinds of death. It can't be true because whatever is born, must die after a finite time, including stars and planets, nay the universe. So why are our rishis claiming our gods have the power to prevent death.

The proper way to interpret the phrase is "akaala mrutyu nivaarini" which means the goddess will prevent untimely death. In the olden days people wished for a life span of 100 years. Each of the four stages of life viz. childhood (baalya), youth (youvana), householder (gruhastu), renouncer (sannyasa), is meant to last for two and half decades. It is however not always possible to live through all of the stages and attain sannyasa as there are diseases, accidents and natural calamities.

Just as we buy life insurance to see that our beloved ones don't suffer because of akaala mrutyu, we seek the same from the goddess. The insurance companies give policies for ten, twenty, thirty, etc. years based on the life expectancy of the policyholder and the risks like smoking, adventurous sports, etc. In the case of the goddess we seek coverage of all risk factors.

Sankara, in this sloka, is paraphrasing a disciple beseeching a guru for liberation by tiding over the samsara(bondage) with sweet words from his mouth like holy water pouring out of the spout of kamandala(water jug) and burning the karma that causes bondage like a forest fire.

The interesting aspect of this sloka is that Sankara uses metaphors like "cool water" from the kamandala and "hot fire" in a forest. This kind of useage gives a prosaic prayer the significance of poetry for one familiar with the Sanskrit language.

The gist of the sloka is "O Guru, have pity on me and enlighten me on how to overcome bondage, suffering and death".

Saturday, May 10, 2025

Viveka Sloka 39-40 Tel Eng





శాంతా మహాంతో నివసంతి సంతో
వసంతవల్లోకహితం చరంతః  
తీర్ణాః స్వయం భీమభవార్ణవం జనా-
నహేతునాన్యానపి తారయంతః ॥ 39 ॥

అయం స్వభావః స్వత ఏవ యత్పర-
శ్రమాపనోదప్రవణం మహాత్మనామ్ ।
సుధాంశురేష స్వయమర్కకర్కశ-
ప్రభాభితప్తామవతి క్షితిం కిల ॥ 40॥

వసంత వత్ = వసంతఋతువువలె, లోకహితం- లోకములకు హితమును, చరంతః - చేయుచున్నట్టియు, శాన్త = శాంతులును, మహాన్తః -గొప్పవారును, స్వయం - తాము, భీమభవార్ణవం - భయంకరమైన సంసారసముద్రమును, తీర్ణాః - దాటినవారును, అహేతునా = కారణమేమియు లేకుండగనే, అన్యాన్ జనానపి-ఇతరజనులను గూడ, తారయంత = దాటింపజేయుచున్న, సన్తః - సత్పురుషులు, నివసన్తి = వినిపించుచున్నారు.

మహాత్మనాం - మహాత్ములయొక్క, యత్ - ఏ, పరశ్రమాపనోద ప్రవణం = పరులయొక్క బాధలను తొలగించుట యందలి ఆసక్తికలదో, అయం - ఇది, స్వత ఏవ = స్వతఃసిద్ధమగు, స్వభావ ఏవ = స్వభావమే, ఏషః = ఈ , సుధాంశుః = చంద్రుడు, అర్క కర్కశ ప్రభాభితప్తాం = సూర్యుని తీవ్రకరణములచే తపింపచేయబడిన, క్షితిం - భూమిని, స్వయం – తానే, అవతి కిల - రక్షించును కదా!

వర్ష కాలమున వర్షబాధ ; గ్రీష్మమున వేడి; శరదృతువు ప్రారంభమునందు మాత్రమే సుఖము; పూర్తిగ రెండు మాసములందును ఉండదు.

కార్తీకమాసపు చివరిభాగము యమదంష్ట్ర (యముని కోరలు) అని చెప్పుదురు కదా! హేమన్త శిశిరములలో చలి; కాని సుగంధి పుష్పములకు నిధియగు వసంతము పూర్తిగ లోకమునకు సుఖమును కలిగించును గాన 'వసంతమువలె' అని చెప్పబడినది.

అపుడు వర్షముగాని, తాపము గాని, చలిగాని, రోగములు గాని ఉండవు కదా! ఋతువు ఏ విధముగ సుఖమును మాత్రమే కలిగించునో అట్లే లోకమునకు సుఖమునే చేయుచు, శాన్తాః = నిర్వికారమగు మనస్సుకలవారును, కావుననే మహాన్తః - అపరిచ్ఛిన్నమగు బ్రహను సాక్షాత్కరించుకొన్న వారును, కావుననే శ్రు. 'బ్రహ్మవిద్బ్రహ్మైన భవతి' - బ్రహ్మవేత్త బ్రహ్మయే యగును అని శ్రుతిచెప్పిన విధమున సన్తః = అట్టి అపరిచ్ఛిన్న బ్రహ్మాభేదముతో నున్నవారును, తాము సంసారరహితులును, తాము అప్తకాములు - కోరికలన్నియు తీరిన వారు అగుటచే స్వప్రయోజన మేమియు లేకుండగనే సంసార సముద్ర నిమగ్నులగు ఇతరులనుగూడ దాటించుచున్నవారును, కారణము లేని ప్రవృత్తి ఉండదు కదా!

కారణము లేకుండ వీరు ఇతరుల నెందులకు తరింపచేయుదురు అని అశంకించుకొని "అయం స్వభావః” ఇత్యాది వాక్యముచే సమాధానము చెప్పుచున్నాడు.

స్వభావమునకు కారణ మేమి అని అన్వేషించుట యుక్తముకాదు. పంచదారలో మాధుర్యము స్వాభావికము, ఈ మాధుర్యమునకు కారణమేమి అని ప్రశ్నించుటలో అర్థము లేదుకదా ? పరశ్రమాపనోద ప్రవణం - పరుల యొక్క ఏ శ్రమ యున్నదో దానిని నివారించుటలోని అత్యాసక్తి: 'ప్రవణ' శబ్ధము ఇచట భావప్రధానముగ 'ప్రవణత్వము' అను నర్థమున ప్రయుక్త మైనది. ఇది మహాత్ములకు స్వాభావికమేగాన ఈ విషయమున పర ప్రేరణాపేక్షలేదు అని భావము. ఇందులకు 'సుధాంశు' ఇత్యాదికము దృష్టాంతము .

అవ. ఈ విధముగ వినీతవేషమును, దానికి అనుగుణమగు వాక్కును, దానిచే వ్యంజితమగు భక్తి నిచూచి ‘ఇతరమేదియు లేక అర్హుడైయున్న ఈతనిని సర్వవిధముల రక్షింపవలెను' అను నభిప్రాయముచే తనకు అభిముఖుడైనట్టియు, దయామృతమును వర్షించు సానుగ్రహ కటాక్షములచే తనను పవిత్రుని చేయుచున్న దేశికోత్తముని, ఇపుడు తనకు బంధమోచనోపాయమును ఉపదేశింపుమని, ధైర్యముతో ప్రార్థించుచున్నాడు.

āntā mahāntō nivasanti santō
vasantavallōkahitaṃ charantaḥ ।
tīrṇāḥ svayaṃ bhīmabhavārṇavaṃ janā-
nahētunānyānapi tārayantaḥ ॥ 39॥

ayaṃ svabhāvaḥ svata ēva yatpara-
śramāpanōdapravaṇaṃ mahātmanām ।
sudhāṃśurēṣa svayamarkakarkaśa-
prabhābhitaptāmavati kṣitiṃ kila ॥ 40॥

Why do we worship trees? Because they provide us shade, fruits and oxygen. They do so unasked and they don't care if the one standing in their shade is a friend or foe, animal or bird. Similarly Sankara says a guru bestows on a sadhaka his upadesa out of his kindness and camaraderie.

A guru's capability is based on guruparampara or the succession of his guru, guru's guru and so on. Just as lineage (gotra) is traced to the sapta rishis , a guru's parampara indicates his roots.

Sankara's Guruparampara

  • Lord Vishnu
  • Lord Brahma
  • Vashishta
  • Sakthi
  • Parasara
  • Veda Vyasa
  • Sukha Brahmam
  • Gaudapadha
  • Govinda Bhagavatpada
  • Adi Sankara

However, the gurus before Sankara didn't attain the same fame and acceptance. Hence it is believed that Sankara is in avatar. Some Saivaites believe the parampara shown originates with Lord Siva instead of Lord Vishnu. Whatever it may be, he is an avatar who took birth to reform the hindu religion and weed out other faiths that create confusion and disharmony.

Sankara is also called jagat guru implying his reach goes far beyond the boundaries of bharata varsha. Obviously he is the most qualified to comment on gurus and give guidance to his four disciples: Suresvara, Padmapada, Hastamalaka and Totaka.

In this sloka Sankara is laying out the motivations of a guru and the minds of those who doubt his intentions. He compares a guru to the season vasanta(spring) that subdues the earth baked under hot summer sun and soaked in rain.

A guru, says Sankara, is like the moon reflecting cool rays after absorbing the scorching heat of sun's light. Moon doesn't distinguish and discriminate on whom it shines. Similarly a jagat guru operates to relieve mankind of suffering and ignorance.

Saturday, May 3, 2025

Viveka Sloka 38 Tel Eng




దుర్వారసంసారదవాగ్నితప్తం
దోధూయమానం దురదృష్టవాతైః ।
భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః
శరణ్యమన్యద్యదహం న జానే ॥ 38 ॥ (పాఠభేదః - అన్యం)

దుర్వార సంసారదావాగ్ని తప్తం - వారింప కష్టమైన సంసారదావాగ్నిచే తపింపచేయబడినవాడను, దురదృష్టవాతైః - పాపములనెడు వాయువులచేత, దోధూయమానం - ఇటునటు ఎగురగొట్టబడనున్నట్టి వాడను, భీతం - భీతుడను, ప్రపన్నం - శరణుజొచ్చినవాడను అగు నన్ను. మృత్యోః = మృత్యువునుండి, పరిపాహి - రక్షింపుము, యత్ = ఎందు వలన అనగా, ద్యదహం - నీ కంటె అన్యుడైన, శరణ్యం = రక్షకుని, అహం-నేను, నజానే - ఎరుగను.

సంసారమే, దవాగ్నిః = నలుమూలల వ్యాపించి తాపమును కలిగించుటచే, వనమునందలి అగ్ని : అది నీ సదుపదేశమువలన కలుగు జ్ఞానము లేనిచో నాచే స్వయముగ వారించుకొనుటకు శక్యము కానిది.

దుర్వారమగు అట్టి సంసారదవాగ్నిచే, తప్తం = కాల్చబడినవాడను; దావాగ్నికి గాలికూడ తోడైనచో అది అంతట వ్యాపించి కాల్చుట ప్రసిద్ధము.

అట్లే, దురదృష్టము లనగా పాపములు. అవే ప్రతికూల వాయువులు; వాటిచే, దోధూయమానం - మాటిమాటికిని కంపింపబడుచున్న వాడను. వాయువు అనుకూల మైనచో మరియొక ప్రక్క తీసికొని పోవచ్చును. కాని ప్రతికూల మైనచో ఈతనిని అగ్నిలో పడవేయును, లేదా అగ్నిని ఈతనిపై ప్రసరింపచేయును.

ఈ విధముగ దావాగ్ని తప్తుడైన వానిపై అమృత వృష్టి కురిపించినచో తాపము తొలగును అను అభిప్రాయముతో పూర్వశ్లోకములో ' దృష్ట్యా' అనుదానికి 'అతికారుణ్యసుధాభివృష్ట్యా’ అను విశేషణము ప్రయుక్త మైనది.

ఈ పదమున బహువ్రీహిసమాన మును అంగీకరించి వెనుక అర్థము చూపబడినది. బ్రహువ్రీహి చేయక దృష్ట్యా = దృష్టితో, అతికారుణ్యసుధాభివృష్ట్యా - కారుణ్య సుధావర్షముచే అనికూడ అర్థము చెప్పవచ్చును. వర్షణముచే దావాగ్ని తప్తుడనైన నన్ను మృత్యువునుండి రక్షింపుము అని అన్వ యము. 'ఋజువైన కటాక్షదృష్టిచే నన్ను ఉద్దరింపుము' అని పూర్వమునందును, దృష్టిచేతనే సుధావర్షమును కురిపించి సుసారదావాగ్ని తప్తుడనైన నన్ను మృత్యువునుండి కాపాడుము అని ఈ శ్లోకమునందును అన్వయము.

మృత్యువునుండి భయపడిన వాడను, శరణాగతుడను అగు నన్ను మృత్యువునుండి రక్షింపుము అని ఉభయస్థలములందును అన్వయము.

నీ అనుగ్రహమువలన ఆత్మజ్ఞానము కలిగినచో నాకు శరీరమునుండి బయటకు పోవుట అను మరణము కలుగదని భావము.

శ్రు. "న తన్య ప్రాణాఉత్క్రా మన్తి అతైవ సమవలీయన్తే " - బ్రహ్మవేత్త యగు వాని ప్రాణములు పైకి ఎగిరిపోవు; ఇచటనే లీనమై పోవును అని శ్రుతి చెప్పుచున్నది.

‘ధ్రువం జన్మ మృతస్య చ’ మరణించినవానికి మరలజన్మ సత్యము అని చెప్పిన విధమున మరణము లేకున్నచో జన్మయే యుండదు గాన, నీ అనుగ్రహము లభించినచో జన్మమరణ ప్రవాహరూపమగు సంసారమునుండి ముక్తుడనగుదునని భావము.

గురువును అభిముఖునిగ చేసికొనుటకై నీవు తప్ప మరియొక్క శరణమేదియు లేదు, అని చెప్పుచున్నాడు. నాకు మరియొక రక్షకు లెవరును లేకుండుటచే నన్ను ఉపేక్షింపరాదు అని భావము.

అవ. నీవంటి సత్పురుషులకు మావంటి వారివిషయమున అవ్యాజమగు కరుణ ఉండును అని రెండు శ్లోకములలో చెప్పుచున్నాడు.

durvārasaṃsāradavāgnitaptaṃ
dodhūyamānaṃ duradṛṣṭavātaiḥ | 
bhītaṃ prapannaṃ paripāhi mṛtyoḥ
śaraṇyamanyadyadahaṃ na jāne || 38 ||

To be mortal means to live, play and die. Several philosophers dealt with this subject and science constantly struggles to explain what awaits after death. Our scripture says just as we change a pair of old clothes for a new one, the atma(soul) transfers from one body to another.

To be clear, the physical body is like a machine. The bones and joints have to wear out after a period of time just as iron rusts or pillars made of mortar crack. Even if there were no disease, the bodily cells constantly die and new cells are created. Sometimes nerve cells and neurons never regenerate resulting in various mental afflictions. The atma, however, with the support of antahkarana will be attached to the body until five-fold prana (pana, apana, vyana, udaana, samaana) is present in the body.

This all makes sense for one advanced in the scripture. Here Sankara is projecting the mind of a sadhaka who just entered a station in life that is still to be considered as a childhood or at best a teenage. Unlike the present day children, who are barely aware of the sacrifices their parents have to make to see that they are fed and clothed, in ancient times they were fully engaged in the household duties, for there were no distractions like television or the internet.

For an ancient teenager the biggest concern was how to get over the fear of samsara (bondage) and eventual death. It was not clear to him what Lord Krishna meant when he said "death is certain, but so is rebirth". Or what Lord meant when he guaranteed the rebirth would take place such that the sadhana in the previous life was brought forward; rather reinvested.

Furthermore, our culture inculcates early on the notion of papa which is in contrast to punya or good deed. Sin is not same as papa but a transgression of god's commandment. Papa implies the effect on others' well being while performing a karma. There are those like Jains who consider breathing in a microbe is papa. Jada Bharata in Bhagavata, while carrying the palanquin of King Rahoogana, avoided stepping on worms and insects on his path, even though the King threatened to punish him as his journey was made uncomfortable. He was worried that even if he accidentally killed a jeevi he would have to be reborn or not attain moksha.

The person who can clear such fears and apprehensions deep in the mind and heart is a guru. No amount of pep talk by the relatives and friends will be as effective as a kind hearted guru's upadesa.

Viveka Sloka 42 Tel Eng

Telugu English All కథం తరేయం భవసింధుమేతం కా వా గతిర్మే కతమోఽస్త్యుపాయః । జానే న కించిత్కృపయాఽవ మాం ప్రభో సంసారదుఃఖక్షతిమా...