Saturday, May 10, 2025

Viveka Sloka 39-40 Tel Eng





శాంతా మహాంతో నివసంతి సంతో
వసంతవల్లోకహితం చరంతః  
తీర్ణాః స్వయం భీమభవార్ణవం జనా-
నహేతునాన్యానపి తారయంతః ॥ 39 ॥

అయం స్వభావః స్వత ఏవ యత్పర-
శ్రమాపనోదప్రవణం మహాత్మనామ్ ।
సుధాంశురేష స్వయమర్కకర్కశ-
ప్రభాభితప్తామవతి క్షితిం కిల ॥ 40॥

వసంత వత్ = వసంతఋతువువలె, లోకహితం- లోకములకు హితమును, చరంతః - చేయుచున్నట్టియు, శాన్త = శాంతులును, మహాన్తః -గొప్పవారును, స్వయం - తాము, భీమభవార్ణవం - భయంకరమైన సంసారసముద్రమును, తీర్ణాః - దాటినవారును, అహేతునా = కారణమేమియు లేకుండగనే, అన్యాన్ జనానపి-ఇతరజనులను గూడ, తారయంత = దాటింపజేయుచున్న, సన్తః - సత్పురుషులు, నివసన్తి = వినిపించుచున్నారు.

మహాత్మనాం - మహాత్ములయొక్క, యత్ - ఏ, పరశ్రమాపనోద ప్రవణం = పరులయొక్క బాధలను తొలగించుట యందలి ఆసక్తికలదో, అయం - ఇది, స్వత ఏవ = స్వతఃసిద్ధమగు, స్వభావ ఏవ = స్వభావమే, ఏషః = ఈ , సుధాంశుః = చంద్రుడు, అర్క కర్కశ ప్రభాభితప్తాం = సూర్యుని తీవ్రకరణములచే తపింపచేయబడిన, క్షితిం - భూమిని, స్వయం – తానే, అవతి కిల - రక్షించును కదా!

వర్ష కాలమున వర్షబాధ ; గ్రీష్మమున వేడి; శరదృతువు ప్రారంభమునందు మాత్రమే సుఖము; పూర్తిగ రెండు మాసములందును ఉండదు.

కార్తీకమాసపు చివరిభాగము యమదంష్ట్ర (యముని కోరలు) అని చెప్పుదురు కదా! హేమన్త శిశిరములలో చలి; కాని సుగంధి పుష్పములకు నిధియగు వసంతము పూర్తిగ లోకమునకు సుఖమును కలిగించును గాన 'వసంతమువలె' అని చెప్పబడినది.

అపుడు వర్షముగాని, తాపము గాని, చలిగాని, రోగములు గాని ఉండవు కదా! ఋతువు ఏ విధముగ సుఖమును మాత్రమే కలిగించునో అట్లే లోకమునకు సుఖమునే చేయుచు, శాన్తాః = నిర్వికారమగు మనస్సుకలవారును, కావుననే మహాన్తః - అపరిచ్ఛిన్నమగు బ్రహను సాక్షాత్కరించుకొన్న వారును, కావుననే శ్రు. 'బ్రహ్మవిద్బ్రహ్మైన భవతి' - బ్రహ్మవేత్త బ్రహ్మయే యగును అని శ్రుతిచెప్పిన విధమున సన్తః = అట్టి అపరిచ్ఛిన్న బ్రహ్మాభేదముతో నున్నవారును, తాము సంసారరహితులును, తాము అప్తకాములు - కోరికలన్నియు తీరిన వారు అగుటచే స్వప్రయోజన మేమియు లేకుండగనే సంసార సముద్ర నిమగ్నులగు ఇతరులనుగూడ దాటించుచున్నవారును, కారణము లేని ప్రవృత్తి ఉండదు కదా!

కారణము లేకుండ వీరు ఇతరుల నెందులకు తరింపచేయుదురు అని అశంకించుకొని "అయం స్వభావః” ఇత్యాది వాక్యముచే సమాధానము చెప్పుచున్నాడు.

స్వభావమునకు కారణ మేమి అని అన్వేషించుట యుక్తముకాదు. పంచదారలో మాధుర్యము స్వాభావికము, ఈ మాధుర్యమునకు కారణమేమి అని ప్రశ్నించుటలో అర్థము లేదుకదా ? పరశ్రమాపనోద ప్రవణం - పరుల యొక్క ఏ శ్రమ యున్నదో దానిని నివారించుటలోని అత్యాసక్తి: 'ప్రవణ' శబ్ధము ఇచట భావప్రధానముగ 'ప్రవణత్వము' అను నర్థమున ప్రయుక్త మైనది. ఇది మహాత్ములకు స్వాభావికమేగాన ఈ విషయమున పర ప్రేరణాపేక్షలేదు అని భావము. ఇందులకు 'సుధాంశు' ఇత్యాదికము దృష్టాంతము .

అవ. ఈ విధముగ వినీతవేషమును, దానికి అనుగుణమగు వాక్కును, దానిచే వ్యంజితమగు భక్తి నిచూచి ‘ఇతరమేదియు లేక అర్హుడైయున్న ఈతనిని సర్వవిధముల రక్షింపవలెను' అను నభిప్రాయముచే తనకు అభిముఖుడైనట్టియు, దయామృతమును వర్షించు సానుగ్రహ కటాక్షములచే తనను పవిత్రుని చేయుచున్న దేశికోత్తముని, ఇపుడు తనకు బంధమోచనోపాయమును ఉపదేశింపుమని, ధైర్యముతో ప్రార్థించుచున్నాడు.

āntā mahāntō nivasanti santō
vasantavallōkahitaṃ charantaḥ ।
tīrṇāḥ svayaṃ bhīmabhavārṇavaṃ janā-
nahētunānyānapi tārayantaḥ ॥ 39॥

ayaṃ svabhāvaḥ svata ēva yatpara-
śramāpanōdapravaṇaṃ mahātmanām ।
sudhāṃśurēṣa svayamarkakarkaśa-
prabhābhitaptāmavati kṣitiṃ kila ॥ 40॥

Why do we worship trees? Because they provide us shade, fruits and oxygen. They do so unasked and they don't care if the one standing in their shade is a friend or foe, animal or bird. Similarly Sankara says a guru bestows on a sadhaka his upadesa out of his kindness and camaraderie.

A guru's capability is based on guruparampara or the succession of his guru, guru's guru and so on. Just as lineage (gotra) is traced to the sapta rishis , a guru's parampara indicates his roots.

Sankara's Guruparampara

  • Lord Vishnu
  • Lord Brahma
  • Vashishta
  • Sakthi
  • Parasara
  • Veda Vyasa
  • Sukha Brahmam
  • Gaudapadha
  • Govinda Bhagavatpada
  • Adi Sankara

However, the gurus before Sankara didn't attain the same fame and acceptance. Hence it is believed that Sankara is in avatar. Some Saivaites believe the parampara shown originates with Lord Siva instead of Lord Vishnu. Whatever it may be, he is an avatar who took birth to reform the hindu religion and weed out other faiths that create confusion and disharmony.

Sankara is also called jagat guru implying his reach goes far beyond the boundaries of bharata varsha. Obviously he is the most qualified to comment on gurus and give guidance to his four disciples: Suresvara, Padmapada, Hastamalaka and Totaka.

In this sloka Sankara is laying out the motivations of a guru and the minds of those who doubt his intentions. He compares a guru to the season vasanta(spring) that subdues the earth baked under hot summer sun and soaked in rain.

A guru, says Sankara, is like the moon reflecting cool rays after absorbing the scorching heat of sun's light. Moon doesn't distinguish and discriminate on whom it shines. Similarly a jagat guru operates to relieve mankind of suffering and ignorance.

No comments:

Post a Comment

Viveka Sloka 41 Tel Eng

Telugu English All బ్రహ్మానందరసానుభూతికలితైః పూతైః సుశీతైర్యుతై- (పాఠభేదః - సుశీతైః సితైః) ర్యుష్మద్వాక్కలశోజ్ఝితైః శ్రుత...