Thursday, April 27, 2023

Syamala Dandakam









Dhyanam:

Manikhya veenaam upalalayanthim,
Madalasam manjula vaag vilasam,
Mahendra Neela dhyuthi komalangim,
Mathanga kanyam manasa smarami.,

ధ్యానం

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి

I meditate on the daughter of Matanga,
* Who plays the veena made of precious gems,
* Who has become lazy due to her exuberance,
* Who is blessed with very sweet words,
* Who has a pretty mien which shines like the blue gem.

మణులతో చేయబడిన వీణను మ్రోగిస్తూ, నిండుగా యుండు కారణాన
తామసముతో గూడి, కోమలమైన వాక్కుతో కూడి, నీల మణివలె మెరయచూ
ఉన్న మాతంగ పుత్రిక మీద ధ్యానం చేస్తాను

ViniyOga:

Chathurbhuje Chandra kala vathamse, Kuchonnathe kumkuma raga sone,
Pundrekshu pasangusa pushpa bana,
Hasthe namasthe jagadaika matha.,

వినియోగము

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః

My salutations to that mother of universe,
* Who has four hands,
* Who wears the crescent as an ornament,
* Who has very high breasts,
* Who is of the colour of saffron,
And who holds flower, sugar cane, rope, arrow,
The goad and pundareeka in her hands.

నాలుగు భుజములతో; నెలవంక అలంకారంగా
కలిగి, ఉన్నతమైన కుచుములతో గూడి, కుంకుమ
పువ్వు ఛాయ కలిగి; పుష్పాన్ని, చెఱకు గడని, పాశాన్ని,
బాణమును , అంకుశమును, కమలమును ధరించి యున్న విశ్వ మాతకు
ప్రణామములు

Matha marakatha shyama, Mathangi madha shalini,
Kuryath kadaksham kalyani kadambha vana vasini.,

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ

Please bless me with a side long glance,
Oh daughter of sage Mathanga,
* Who is my mother,
* Who is as green as an emerald,
* Who is exuberant,
* Who blesses with all that is good,
And who lives in the forest of Kadambha

పచ్చని మరకతము వలెనున్న మేనుతో,
అతిశయమై, శుభప్రదమైన దీవెనెలు ఇచ్చే, కదంబ
వనములో నివసించే ఓ మాతా! మాతంగ మహర్షి
పుత్రికా! నన్ను క్రీగంట చూపుతో కరుణించు

Stutih:

Jaya Mathanga thanaye, Jaya Neelolpala dhyuthe,
Jaya Sangeetha rasike, Jaya Leela shuka priye.,

స్తుతి-

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే

Victory to the daughter of Mathanga,
Victory to her who resembles Neelothphala flowers,
Victory to her who enjoys music,
Victory to her who likes the playful parrot.

మాతంగ మహర్షి పుత్రికకు జయము!
నీలోత్పల పుష్పము వలెనున్న మాతకి జయము!
సంగీత ప్రియురాలైన మాతకి జయము!
చిలుకతో క్రీడించే మాతకి జయము!
Dandakam:

Jaya janani,
sudha samudranthar udhuyanmani dheepa samrooda vilwadavi Madhya Kalpadhruma kalpa kadambha vasa priye,krithivasa priye,
sarva loka priye.
దండకము

జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ
బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవా
సప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,

* Who is interested always in living in the forest of Kadamba trees which are similar to
the wish giving
Kalapaka trees and which is in the forest of Vilwa trees and which is situated in the gem
island in the sea of nectar,
* Who is the consort of Lord Shiva,
* Who is the darling of all the world,Victory to the mother.

మకరందము వంటి సముద్రములో మణి ద్వీపము
యందు సదా కోరికలను ప్రసాదించే కల్ప
వృక్షమువలె, బిల్వ వృక్ష వనములో నుండే, కాదంబ వృక్షముల
వనములో సంచరించే శివుని ప్రియ సతికి,
సర్వులూ అభిమానించే తల్లికి జయము!

Sadararabdha sangeetha sambhavana a sambhrama lola neepasraga badha chooli sanadathrike, Sanumath puthrike,

సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబ
ద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే,

* Who has her posterior decorated by her dancing hair which has been freed by the raising
crescendo of the soulful music,
* Who is the daughter of the mountain,

ఆ పర్వత రాజు కుమార్తె
వెన్ను, ఉత్తేజమైన ఆత్మను
పరవశింపజేసే సంగీతముతో
నాట్యం చేస్తున్నట్టుగా నుండే కేశములతో కప్పబడి ఉంది

Shekhari bhootha sheethamsu leka mayookhavalibadha susnigdha neelaalaka sreni sringarithe, Loka Sambhavithe,


శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధ
నీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే

* Who is extremely pretty with her bluish black hair curls which shine due to the light
emanating from the cold crescent
which she wears on her head,Who is respected by all the world,

నీల మేఘ రంగుతో, చుట్టు ముంగురలతో కూడిన
ఆమె కేశములు, ఆమె తలపై ధరించిన
అర్థ చంద్రని చల్లని వెలుగులో మెరయుచున్నవై
యు౦డగా, ఆ దేవిని సర్వ జగత్తు పొగడుచున్నది

Kama leela dhanusannibha brullatha pushpa sandoha sandeha krullochane,Vak sudha sechane

కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహ
కృల్లోచనే వాక్సుధాసేచనే

* Who has eye lashes which resemble the flower arrows coming from the playful bow of the
God of love,
* Who cools down the universe with nectar like words,

ఆమె కనుబొమలు మన్మథుని పూల బాణములు పోలి
యుండగా, ఆమె తీయని పలుకులు జగత్తును సమ్మోహ పరచేవి

Charu gorchana panga keli lalabhirame, surame, rame,

చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే,

* Who is very pretty with her Tilak made of musk,
* Who makes all the world happy,
* Who is Rama, the goddess Lakshmi,

కస్తూరి తిలకం ధరించుటచే అతిశయమైన
సౌందర్యముతో జగత్తును రంజింప జేసే ఆమె సాక్షాత్తూ
లక్ష్మీదేవి

Prollasad valika moukthika srenika chandrika mandalothbhasi lavanya gandasthalanyatha kasthurika pathra rekha
samudbhootha sourabhya sambhrantha brungangana geetha santhree bhavan mantra thanthreesware,Susware, Bhasware,


ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికా
మండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత
సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్ర
తంత్రీస్వరే సుస్వరే భాస్వరే,


* Who is with the charming sound of Veena mixed with appropriate beats, strengthened by
the several bees,which rush
towards the incenses of the marks of musk made on her pretty necks and the light
emanating from the ornaments she wears
in her ears made of very precious gems which put to shame the light of the universe of
the moon,
* Who has very pleasing musical voice,
* Who shines with her very pretty features,

ఆమె వీణా వాయిద్యము ఉత్కృష్టమైనది; అనేక
మధుపంబులు ఆమె కోమలమైన మెడపై యున్న
కస్తూరికై తరలి వచ్చేవి; ఆమె చెవులకు ధరించిన రత్నపు
ఆభరణాల ప్రకాశం వలన చంద్ర లోక౦ వెలవెల బోయినది;
చక్కటి గాత్రము గలదై; తన సౌందర్యముతో ప్రకాశించేది

Vallaki vadana prakriya lola thali dhala badha thadanga bhoosha viseshanwithe,
Sidha sammanithe,


వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషా
విశేషాన్వితే సిద్ధసమ్మానితే,

* Who wears the ear ornaments made of palm leaves when she plays the musical instrument called Vallaki,
* Who is recognized by great sages,

జ్ఞానులు, ఋషులుచే సేవింప బడే ఆమె
వల్లకి సంగీత వాయిద్యము చేయుచు
తాటి ఆకులతో చేయబడిన ఆభరణములు
చెవులకు ధరించెడిది

Divya halamadho dwelahelala sachakshurandholana sri samakshiptha karanaika neelothphale,
poorithasesha lokapi vanchapale, sreephale

దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలన
శ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే
పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే,

* Who wears ear studs made of neelothphala flowers, whose shine is more than the light of
her divine glances that emanate
from her very pretty eyes which are red colored because of the divine alcoholic spirits
drunk by her,
* Who grants all wishes for all people of the world,
* Who grants wealth and happiness

ఆమె చెవులకు ధరించిన నీలోత్పల పుష్పముల
ప్రకాశము, సోమ పానము చేయుటవలన ఎరుపు రంగులో
యున్న ఆమె అందమైన కన్నుల దివ్యమైన ప్రకాశమును,
అతిశయించి యున్నది. ఆమె సర్వ జనుల
అభీష్టములు తీర్చగలిగినది; కోరినవారికి
ఐశ్వర్యమును, ఆనందమును ఇవ్వగలిగినది.

Sweda bindulla sathphala lavanya nishyandha sandhoha sandeha krunnasika moukthike,
Sarva viswathmike, Kalike,

స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య
నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే
సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే
కాలికే

* Who has nose rings, which makes one wonder whether it is made by the perspiration on
her pretty forehead which has flown down from there and crystallized on her nose,
* Who is the soul of all the world,
* Who also assumes the form of Kali,

ఆమె సున్నితమైన నుదుటపైనుండి స్వేద
బిందువులు జారి, ఆ బిందువులు ఘనీభవించి ఆమె ధరించిన
ముక్కు పుడకలగా మారెనా అన్నట్టు యున్నవి. ఆమే
విశ్వానికి ఆత్మ; కాళికా అవతారము దాల్చినది.

Mugdha mandasmithodhara vyaktha sphural pooga thamboola karpoora gandolkare,
Jnana mudhrakare,
Sarvasampathkare,
Padmabaswathkare,
Sreekare,

ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్
పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే
సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే,

* Who has a pretty face which easily showers smiles and which is made by prettier by the areca nut, Thamboola and camphor in her mouth,
* Who shows the symbol of jnana(wisdom)
* Who has all types of wealth,
* Who holds the lotus flower in her hand,
* Who grants good blessings,

ఆమె సౌ౦దర్యము మందహాసముతో వ్యక్తమైయుండగా,
నోటిలో తాంబూలము, వక్క, కర్పూరములతో
కూడి యున్నది. ఆమే సర్వ జ్ఞాన స్వరూపిణి; సర్వ సంపద ప్రదాత; కలువ పూవులు
ధరించి భక్తులను బ్రోచునది.

Kunda pushpa dhyuthi snigdha dantha vali nirmala lola kallola,
Sammelanasmera sona dhare,
Charu veena dhare,
Pakwa bimbha dhare,

కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలక
ల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే
పక్వబింబాధరే,

* Who is having the soft sweet reddish smile which comes in waves from the very pretty
set of teeth with its white shine
similar to the garland made of white jasmine buds,
* Who holds in her hand the pretty Veena,
* Who is having reddish lips like the Bimba fruits,

ఆమె ఎర్రని పెదవుల మీది చిరునవ్వు, మల్లె
మొగ్గల హారం వలె ప్రకాశ౦ గల పలువరస మీదుగా,
తరంగాల వలె వచ్చుచుండగా, ఆమె వీణను
మీటుచూ, దొండపండు వంటి ఎర్రని పెదవులతో
భాసిల్లుతున్నది

Sulalithayouanarambha chandrayodhvela lavanya dughdarnawavir bhava th kambhu bibhoka bruth kandhare,
Sathkala mandhire, Mandhare,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవా
విర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే

* Who is having the bright white conch like neck which has arisen from the ocean of milk
at the time of high tide that
too at the moonrise of the very pretty new youth,
* Who is the personification of all arts,
* Who is voluptuous,

ఆమె మెడ పడుచు పిల్లది వలె నుండి, చంద్రుని
ఆకర్షణ వలన పోటెత్తిన పాల కడలినుండి పైకి
వచ్చే తెల్లని శంఖమును బోలినది. ఆమె కళలకు
నిధి; కామము జనియింపజేసేది.

Divya rathna prabha banduhrachaanna haaradhi bhoosha samudhyotha mananavadhyanga shobhe, Shubhe,


దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్
యోతమానానవద్యాంగశోభే శుభే,

* Who is having the total blemish less luster created by her shining parts of the body
which are decorated by several
garlands and ornaments made by holy gems,
* Who is the personification of all that is good,

ఆమె మచ్చలేని వర్చస్సుతో, అనేకమైన పూల
మాలలతో, మణి హారములతో కూడి, సర్వ శుభాలను
కలిగించేదిగా యున్నది

Rathna keyura rasmi chada pallava prollasath dhorlatha rajithe,
Yogibhi poojithe,


రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతా
రాజితే యోగిభిః పూజితే

* Who is pretty because of her two arms which shine like young tendrils decorated by the shining armlets made of umpteen rathnas(gems),
* Who is being worshipped by sages,

ఆమె సౌందర్యానికి కారణభూతమైన
రెండు చేతులూ, అనేకమైన మణులతో
చేయబడిన దండ కడియములతో అలంకరింప
బడి, లతికల బోలి యున్నవి. ఆమె
రూపం జ్ఞానులు పూజించేదిగా యున్నది

Viswa ding mandala vyapi manikhya theja spurath kankanalangruthe,Vibhramalankruthe, Sadhubhi poojithe,


విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫుర
త్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే

* Who wears bangles, the light of whose gems spread all over the world,
* Who is also very pretty because of all that she wears,
* Who is worshiped by holy people,

ఆమె ధగధగమనే గాజులయందలి రత్నములు
సర్వ జగత్తుని ప్రకాశింప జేసినవై; ఆమె
ధరించిన ప్రతీదీ ఆమె సౌందర్యాన్ని బహుళీకృతము
చేయుచున్నవి. అటువంటి ఆమెను సాధువులు
పూజించెదరు.

Vasararambha vela samjrumbhamana aravinda prathi dwandwi panidwaye, Santhothdhyaddhaye,Adwaye,

వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే
సంతతోద్యద్దయే అద్వయే

* Who has two hands which challenge in their beauty the luster of newly opened lotusr
flowers at the rise of the sun,
* Who always rains the shower of mercy,
* Who is the one in whom there is no two,

ఆమె హస్తములు భానుని ఉదయ కిరణాలచే
విచ్చుకొనిన పద్మములను బోలి; ఆమె అద్వితీయమైన
కారుణ్యము భక్తులయందు సదా వర్షిస్తోంది.

Divyarathnormika dheethithi sthoma sandhyaya mananguli pala vodhyanna khendu prabha mandale, Sannadha ghandale, Chith
prabha mandale, Prollasath khundale,

దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ
సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామం
డలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే
ప్రోల్లసత్కుండలే,

* Who has very pretty fingers which has the luster emanating from her nails and which are
decorated by several rings studded with very precious jewels which is similar to
the luster of the moon,
* Who is worshiped lord by Indra, the king being of devas,
* Who is surrounded the holy light of God emanating from the cit,
* Who wears ear studs which have great luster,

ఆమె దివ్యమైన ఆభరణములతో అలంకరింపబడిన
కోమలమైన వేళ్ళు గలిగి, వాటినుండి, వాటి
నఖముల నుండి వెలువడే దివ్య కాంతులు
చంద్రుని కాంతి బోలి యున్నది; ఆమెను ఇంద్రాది
దేవతలు పూజించగా, ఆమె చిత్తమునుండి ప్రకాశము
నలుదిశలా వ్యాపించి ఆమె కుండలాల ప్రకాశముతో
దేదీప్యమానమైయున్నది

Tharaka jala neekasa haraa valee smera charu sthana bhoga bharanamanmadhya vallee valee schedha veechi samudhyath
samullasa sandarsithakara soundarya rathna kare,
Vallevibruthkare, Kimkara sreekare,

తారకారాజినీకాశహారావలిస్మేర
చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద
వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యర
త్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే,

* Who is an ocean of beauty due to the three wave like lines which are formed in her
middle due to a slight bent caused by her very attractive and heavy breasts which are
happily pretty due to the luster of several chains that she wears
which resemble a bevy of stars,
* Who plays the sacred veena,
* Who blesses her devotees with wealth,

ఆమె నక్షత్రాల శరము వలె మెఱయు హారములను
ధరించి; ఉత్తమమైన స్తన్యముల వలన వంగి యుండి;
కడలివ౦టి సౌ౦దర్యముతో కూడి ;వీణావాద్యము
చేయుచూ భక్తులకు సంపద ప్రసాదించి దీవించుచున్నది

Hemakumbhopamothunga vakshoja parava namre,
Trilokavanamre,

హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే
త్రిలోకావనమ్రే

* Who has a look of humility due to the slight bent caused by her very heavy golden breasts,
* Who is being worshipped by all the people of all the three worlds,

ఆమె వెన్ను బంగారు వర్ణ పాలిండ్ల భారముచే
వంగి యున్నదై, ఆమె ముల్లోక వాసులచే
కీర్తింపబడుచున్నది

Lasadvrutha gambheera nabhee sarastheera saivala sangakara syama romavalee bhooshane, Manju sambhashane,

లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే
మంజుసంభాషణే,

* Who shines due to pretty greenish black hair which appears like the thin row of water plants surrounding her lake like deep,round and attractive belly button,
* Who has a very attractive speech,

ఆ మంజు భాషిణి పచ్చని కేశములు, ఆమె
నాభివంటి కొలను చుట్టూ యున్న పొదలను బోలి
యున్నవి .

Charu sinchath kati soothra nirbarsthinanga leela dhanu sinchineedambare,Divya rathnambare,

చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్
శించినీడంబరే దివ్యరత్నాంబరే,

* Who defeats the lovely sugarcane bow of the God of love in arousing passionate love by just using the slight shake of her golden belt,
* Who wears silk studded with gems,

ఆమె బంగారు వడ్డాణము కదలిక మాత్రాన
మన్మధుని చెఱకు విల్లుని మరిపించే
కామోద్రేకమును కలిగించే శక్తి గలది; ఆమె ఆచ్ఛాదనము రత్నాలు పొదిగిన
పట్టు వస్త్రము.

Padmaraghollasanmekhala moukthi sreni shobajitha swarna bhoo bruthale.Chandrika seethale,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్త
లే చంద్రికాశీతలే

* Who by the shine of the diamond studded bells which are tied to her golden belt and which lessen the beauty of the greenish valley of the Mount Meru,
* Who is as cool as the moon light,

వజ్రముల పొదిగిన గంటలు గల్గిన వడ్డాణము
ధరించిన ఆమె శోభ పచ్చని చెట్లతో విరాజిల్లే
మేరు పర్వతమును అతిశయించి
యున్నది. ఆమె చంద్రుని కాంతి వలె శీతలముగా
నున్నది.

Vikasitha navakimsuka thara divyamsuka channa charooru shobha para bhootha sindhoora sonaya manendra matanga
hasthargale,Vaibhavan argale,Syamale,

వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న
చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ
హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే


* Who has very pretty thighs hidden by the holy cloth which is as red as the fully open flowers of palas tree and which
defeats the prettiness of the trunk of Iravatha which has the pasting of a saffron coat,
* Who has the ever flowing grace
without hindrance emanating from her,Who is a dark beauty,

ఆమె ఉరువులు విలక్షణమై, ఎర్రని పలస చెట్టు పూల
వర్ణము కలిగిన శుభ్ర వస్త్రముతో కప్పబడి, కుంకుమతో కప్పబడిన
ఐరావత తొండమును మరిపించుచున్నవి. ఆమె కటాక్షము
నిరంతరము ప్రవహించేది; ఆమె శ్యామల వర్ణముతో
శోభించుచున్నది.

Komala snighdha neelothpalothpaditha ananga thunnera sangakare dara jangalathe,Charu leela gathe,

కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార
జంఘాలతే చారులీలాగతే

* Who has very beautiful knee caps resembling the quiver of the God of love, which is shiningly pretty and made of dark flowers,
* Who has very pretty feminine gait,

ఆమె జాను ఫలకము అపూర్వమైన పూల
శోభతో కూడిన మన్మథుని అంబులపొదిని
బోలియున్నది; ఆమె మంద గమనము
వర్ణనాతీతము.

Namradik pala seemanthini kunthalasnighdha neela prabha punja samjatha durvangurasangi saranga samyoga ringanna
khendujjwale,Projjwale,Nirmale,

నమ్రదిక్పాలసీమంతినీ
కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురా
శంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే
ప్రోజ్జ్వలే నిర్మలే


* Who has lustrous and the crescent like nails, which are bent and saluted by the wives of the eight lord of directions
* Whose flowing hair is attracted by deer who think is as the luscious grass,
* Who has a wholly lustrous mien,
* Who is holy and pure,

ఆమె శోభమానమైన, నెలవంకను బోలు నఖములను
అష్ట దిక్పాలకుల సతులు ఆరాధింపగా, ఆమె
కేశములు హరిణులకు పచ్చికయేమో అనిపించేవిగా
నుండగా, ఆమె వైఖరి పవిత్రమై, శుద్ధమై యున్నది

Prahwa devesa lakshmeesa bhoothesa thoyesa vaneesa keenasa daithyesa yakshesa vayvagni koteera manikhya sangushta bala
thapodhama lakshara sarunya tharunya Lakshmi graheethangri padme,Supadme,Ume,

ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ
కీనాశ దైత్యేశ యక్షేశ
వాయ్వగ్నికోటీరమాణిక్య
సంహృష్టబాలాతపోద్దామ
లాక్షారసారుణ్యతారుణ్య
లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

* Who has lotus like feet which shine in the light emanating from the crowns of the bent
head of Indra, Vishnu, Shiva, Varuna, Brahma, Yama Niryathi, Vaisravana(God of wealth),
Vayu, and Agni, which because they are painted red by the
plant extracts shines like the reddish rising sun and which are the treasure house of
youthful beauty,
* Who holds lotus flower in her hands,
* Who has the form of Parvathy,

ఆమె పద్మము వంటి పాదములు పారాయణతో గూడి,
ఇ౦ద్రుని, విష్ణువుని, శివుని, వరుణుని; బ్రహ్మ,
యమ నిర్యతి, వైస్రావణుడు, వాయువు,
అగ్నుల యొక్క కిరీటముల కాంతి పుంజములచే
ప్రకాశవంతమై యున్నవి; ఆమె పార్వతి రూపంలో
కలువపూవులు ధరించి యున్నది

Suruchira navarathna peeta sthithe,
Susthithe,
Rathna padmasane,
Rathna simhasane,
Sankapadmadvayopasrithe,
Vishruthe,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే
రత్నపద్మాసనే రత్నసింహాసనే
శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే

* Who sits in the seat made of the nine precious gems,
* Who sits prettily,
* Who sits on the jeweled lotus flower,
* Who sits on the jeweled throne,
* Who is being sought by the Conch and the lotus flower,
* Who is very famous,

ఆమె నవరత్నాలు పొదిగిన ఆశనముపై,
ఆభరణములతో అలంకరింపబడిన
పద్మమును అధిరోహించి,
అత్యంత రమాణీయముగా నుండి,
శంఖము, పద్మములను ధరించి
విశ్వ విఖ్యాతితో పాలించుచున్నది

Thathra vignesa durga vatu ksethra palairyuthe,
Matha mathanga kanya samoohanvithe,
Bhairavair ashtabhir veshtithe,

తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే
మత్తమాతంగ కన్యాసమూహాన్వితే
భైరవైరష్టభిర్వేష్టితే


* Who is surrounded by Ganesa, Durga, Bhairava and Kshethra pala,
* Who due to her ebbing youthful vigour shines among the girls in the house of mathanga,
* Who is surrounded by the eight Bhairavas,

ఆమె గణపతి, దుర్గా దేవి, భైరవుడు,
క్షేత్రపాలుడు, అష్ట భైరవులుచే సేవింపబడి మాతంగ ఆశ్రమములోని
పడుచుల సౌ౦దర్యమును అతిశయించి యున్నది

Manjula menakadhyanga namanithe,
Devi vamadhibhi shakthihi sevithe,
Mathurka mandalair mandithe,
Yaksha gandharwa sidhangana mandalair archithe,
Pancha banathmike,
Pancha banenarathya cha sambhavithe,
Preethibhajaa vasanthena chaanandithe,

మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః
శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే
మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా
మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే
పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన
చానందితే


* Who is being revered by the divine beauties like Manjula and Menaka,
* Who is being served by Goddess Durga and Vama deva,
* Who is with the eight divine mothers ,
* Who is being worshipped by the yakshas, gandarwas and sidhas,
* Who is the soul of the arrows of the God of love,
* Who is being worshipped by Manmatha(God of love) and his wife Rathi devi,
* Who is being worshipped in spring along with love,

ఆమె మిక్కిలి అందమైన మంజుల, మేనకలచే
పూజింపబడి; దుర్గాదేవి, వామ దేవులు పరిచర్యలు
చేయుచుండగా; అష్ట మాతలతో కూడి; యక్ష, గంధర్వ, సిద్ధులచే
పూజింపడి; మన్మథ బాణాల శక్తికి మూలమై;
మన్మథుడు వాని పత్ని రతీ దేవిచే ఆరాధింపబడి; తొలకరిలో
ప్రేమతో అర్చించబడి యున్నది

Bhakthi baajam param sreyase,
kalpase yoginaam manase dhyothase,
Geetha vidhya vinodhati trushnena krishnena sampoojyase,
Bhakthimaschedasa vedhasa sthooyase,
Viswa hrudhyena vadhyena vidhyadharair gheeyase,

భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే
ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా
వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే
భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన
వాద్యేన విద్యాధరైర్గీయసే,

* Who grants great fame to her devotees,
* Who from the beginning of the world is being meditated upon by sages,
* Who is being worshipped by Lord Krishna a great expert in music,
* Who becomes pleased by the power of Vedic chants,
* Who is being worshipped by Lord Brahma with devotion,
* Who is being worshipped by Vidhyadharas by soulful music made of pretty words,

ఆమె భక్తులకు ఘనకీర్తిని ప్రసాదించగల
సామర్థ్యము గలదియై; సృష్ట్యారంభమునుండి
మునులచే ఆరాధింపబడినదై; సంగీత ప్రావిణ్యముతో
శ్రీ కృష్ణునిచే పూజింపబడినదై; వేద మంత్రాలు వల్లెతో
సంతుష్టమైనదై; బ్రహ్మాది దేవతలచే భక్తితో అర్చించబడినదై;
శ్రేష్ఠమైన పదములతో విద్యాధరులు గానము చేయుచుండగా భాసిల్లు
చున్నది

Sravana harana dakshinakwanaya veenaya kinnarair gheeyase,
Yaksha gandarwa sidhangana mandalair archyase,
Sarva soubhagya vanchavahirvadhudhir suranam samaradhyase,

శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా
కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా
మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్
వధూభిస్సురాణాం సమారాధ్యసే

* Who is being praised by Kinaaras accompanied by soulful music of the Veena,
* Who is being worshipped by the women of Yaksha, Gandharwa and Sidha clan,
* Who is also being worshipped by all devas with a deep wish to grant them all their desires,

ఆమె వీణా వాద్యముతో కిన్నెరలచే
స్తుతింపబడినదై; యక్ష, గంధర్వ, సిద్ధ యువతులు ప్రస్తుతింపగా;
తమ కోర్కెలు తీర్చుకొనుటకై దేవతలందరిచే
పూజింపబడుచున్నది

Sarva Vidhya viseshathmakam, chadu gatha samuchaaranam,
Kanda mulolla sadwarna raji thrayam,
Komala syamalo dhara paksha dwayam,
Thunda shobhathi dhoori bhavath kisukam tham shukam,
Lalayanthi parikreedase,

సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా
సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం
కోమలశ్యామలోదారపక్షద్వయం
తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ
పరిక్రీడసే,

* Who pets and plays with that parrot which is the personification of all knowledge,
which keeps on singing pretty songs,
which has the shining three lines on its neck in three different colours, which shines
with two wings of green colour,
which has shining beaks which are more pretty than the Kimsuka flowers,

మెడపై వివిధ రంగులతో కూడియున్న
చారలు గల; పచ్చని రెక్కలతో,
మోదుగు పువ్వులకన్న అందమైన ముక్కుతో
ప్రకాశి౦చే; జ్ఞానమునకు ప్రతీకయైన
ఆమె చిలుక మధురమైన గానము చేయగా
ఆమె దానితో క్రీడించుచున్నది

Pani padmadwaye nakshamalamapi sphatikeem jnanasarathmakam pustakangusam pasa bibrathiyena sanchinthyse,tasya
vakthrantharal gadya padyathmika bharathi nissareth,
Yena vaa yavaka bhakruitheer bavyase tasya vasya bhavanthi sthriya purusha yena vaa sathakumbhadyuthir bhavyase sopi
Lakshmi sahasarair parikreedathe,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం
జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ
తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్
గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన
వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా
భవంతిస్తియః పూరుషాః యేన వా
శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః
పరిక్రీడతే,

* Who when meditated upon as the one who holds the crystal chain in one hand, the
knowledge filled book in another, and
the goad and rope in other hands, makes knowledge flow from the devotee’s mouth in the
form of prose and poems,
* Who when meditated upon as the one who has he reddish colour of dawn similar to the
juice of red cotton, makes the
devotee attractive to all males and females,
* Who when meditated upon as the one who has a golden coloured body grants the devotee
all sort of wealth and makes him live happily,

మణిహారములు ఒక చేతితో, పుస్తకమును రెండవ
చేతితో, అంకుశము, పాశము తక్కిన చేతులలో
ధరించి; భక్తులకు గద్యపద్యాదులు ధారావాహకంగా
వచ్చేటట్లు చేయు శక్తిగలదై; పత్తి రసము
వర్ణము గల సూర్యోదయము యొక్క ఎర్రని తేజస్సుతో
ప్రకాశించుచూ;తన భక్తులు సర్వుల ప్రీతికి పాత్రులయేటట్లు
కరుణించుచూ; బంగారు వన్నెతో
భక్తులకు సంపద, ఆనందము కలిగించుచూ
ఆమె భాసించుచున్నది.

Kinna sidhyedwapu shyamalam komalam Chandra choodanwitham thavakam dhyatha thasya kelivanam nandanam thasya bhadrasanam
bhoothalam, thasya gheer devatha kimkari thasya chajnakari sree swayam,

కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం
చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా
సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం
భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ
శ్రీ స్వయం,

* Who when meditated upon as prettily greenish lustrous form wearing a crescent on her
head, would grant all occult powers to the devotee and make him feel that the ocean is
his pool for playing, great gardens are his kitchen gardens,
the entire earth appears as his seat, Goddess Saraswathi appears as his servant and
Goddess Lakshmi as the one obeys all his orders,

ఈ విధంగా ధ్యానించిన, పచ్చని వర్ణముతో
నెలవంకను శిరముపై ధరించి యున్న ఆమె; భక్తులకు
నిఘూడమైన శక్తినొసగి; సముద్రము
వారి క్రీడా స్థలముగా; ఓషదులతో
కూడిన వనములు తమవిగా; సమస్త భూమండలము వారి
ఆసనముగా; సరస్వతీ దేవి,
లక్ష్మీ దేవి వారి ఆనతానుసారము
ప్రవర్తించునట్లుగా చేయగల
సామర్థ్యము గలది.

Sarva Theerthathmike,
Sarva mantrathmike,
Srava yantrathmike,
Sarva shakthyathmike,
Sarva peedathmike,
Sarva thathwathmike,
Sarva vidhyathmike,
Sarva yogathmike,
Sarva nadathmike,
Sarva shabdathmike,
Sarva viswathmike,
Sarva vargathmike,
Sarva sarvathmike,
Sarvage, Sarva roope, Jagan mathruke,
Pahi maam, Pahi Maam, Pahi maam,
Devi thubhyam nama, Devi Thubhyam nama. Devi thubhyam nama.

సర్వతీర్థాత్మికే,
సర్వ మంత్రాత్మికే,
సర్వ యంత్రాత్మికే,
సర్వ తంత్రాత్మికే,
సర్వ చక్రాత్మికే
సర్వ శక్త్యాత్మికే,
సర్వ పీఠాత్మికే
సర్వ వేదాత్మికే, సర్వ
సర్వ విద్యాత్మికే
సర్వ యోగాత్మికే,
సర్వ వర్ణాత్మికే,
సర్వగీతాత్మికే,
సర్వ నాదాత్మికే ,
సర్వ శబ్దాత్మికే,
సర్వ విశ్వాత్మికే,
సర్వ వర్గాత్మికే,
సర్వ సర్వాత్మికే,
సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే
పాహి మాం పాహి మాం పాహి మాం దేవి
తుభ్యం నమో దేవి
తుభ్యం నమో దేవి
తుభ్యం నమో దేవి
తుభ్యం నమః

1 comment:

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...